reserve bank report
-
3–4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు: మోదీ
ముంబై: రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం గడిచిన మూడు నాలుగేళ్లలో దేశంలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిరుద్యోగితపై బూటకపు ప్రచారాలు చేస్తున్న వారి నోళ్లను ఆర్బీఐ నివేదిక మూయించిందన్నారు. ముంబై శివారులోని గోరేగావ్‌లో మోదీ శనివారం రూ, 29 వేల కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు పెట్టుబడిదారులు ఎంతో ఉత్సాహంగా స్వాగతించారన్నారు. ఎన్డీయే సర్కారు మాత్రమే సుస్థిరతను అందించగలదని ప్రజలకు తెలుసన్నారు. ‘ఉపాధిపై ఆర్బీఐ ఇటీవలే సవివర నివేదికను ప్రచురించింది. గడిచిన మూడు– నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఉద్యోగాలపై అబద్ధాలను ప్రచారం చేసే వారి నోళ్లను ఆర్బీఐ గణాంకాలు మూయించాయి’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు నిరుద్యోగాన్ని ప్రధానంగా ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ ఇలా చురకలు అంటించారు. -
బ్యాంకుల్లో జనం దాచుకుంది కోటీ 35 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తలసరి అప్పు గురించి విన్నాం.. తలసరి ఆదాయం గురించి తెలుసుకున్నాం.. దేశం, రాష్ట్రాల అప్పుల చర్చలూ చూశాం.. మరి మన దేశంలో ప్రజలు బ్యాంకుల్లో వివిధ రూపాల్లో దాచుకున్న సొమ్ము ఎంతో తెలుసా..? రూ.1,35,59,212 కోట్లు.. అక్షరాల్లో చెప్పాలంటే.. కోటీ 35 లక్షల కోట్ల పైచిలుకే. దీనిని మన దేశ జనాభాతో సగటున లెక్కిస్తే ఒక్కొక్కరి సొమ్ము సుమారు లక్ష రూపాయలు అని చెప్పొచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ లెక్కలను వెల్లడించింది. ఇండియన్ ఎకానమీ స్టాటిస్టిక్స్ (2021–22) పేరిట రిజర్వు బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. అందులో 1983వ సంవత్సరం నుంచీ 2021–22 వరకు బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసిన సొమ్ము లెక్కలను వెల్లడించింది. సేవింగ్స్ భారీగా పెరుగుతూ.. 1983–84 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు దాచుకున్న సేవింగ్స్ డిపాజిట్ల విలువ రూ.17,811 కోట్లు. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.17,430 కోట్లు ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.381 కోట్లు దాచుకున్నారు. పదేళ్ల తర్వాత అంటే 1993–94లో సేవింగ్స్ డిపాజిట్లలో సొమ్ము రూ.71,151 కోట్లకు చేరింది. విదేశీ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు రూ.1,718 కోట్లుగా ఉన్నాయి. మరో పదేళ్ల తర్వాత అంటే.. 2003–04 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.3.85 లక్షల కోట్లు దాటాయి. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు చేసిన డిపాజిట్లు రూ.12,232 కోట్లకు చేరాయి. ఇక 2013–14 నాటికి సేవింగ్స్ రూ.20 లక్షల కోట్లు దాటాయి. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.19.6 లక్షల కోట్లకుపైగా ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.40,390 కోట్లకు చేరాయి. 2014 నుంచి సేవింగ్స్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) ఏడాది భారత బ్యాంకుల్లో విదేశీ బ్యాంకుల్లో మొత్తం 2014–15 21,78,847 41,046 22,19,893 2015–16 24,92,846 43,698 25,36,544 2016–17 33,40,707 52,876 33,93,583 2017–18 35,99,341 55,896 36,55,237 2018–19 39,72,547 58,630 40,31,177 2019–20 42,85,362 65,384 43,50,746 2020–21 49,74,715 81,092 50,55,807 2021–22 55,94,034 87,284 56,81,318 2014 నుంచి వివిధ టర్మ్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) ఏడాది 90 రోజుల్లోపు 6 నెలలు–ఏడాది 5 ఏళ్లపైన 2014 3,64,909 7,34,703 7,73,620 2015 4,27,722 7,19,993 7,91,137 2016 4,35,318 5,55,536 8,47,659 2017 4,47,000 8,40,158 9,45,980 2018 4,25,420 8,05,586 10,00,865 2019 5,16,651 6,19,998 9,25,059 2020 10,84,623 4,58,797 9,93,286 2021 13,02,760 7,96,325 7,47,654 (ఆరు నెలల లోపు, ఏడాది నుంచి రెండేళ్ల మధ్య, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య, మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య.. ఇలా అన్నిరకాల టర్మ్ డిపాజిట్లు కలిపి 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము రూ.78,77,894 కోట్లు అని రిజర్వుబ్యాంకు నివేదికలో పేర్కొంది) అయితే తక్కువ.. లేకుంటే సుదీర్ఘంగా.. టర్మ్ (ఫిక్స్డ్) డిపాజిట్ల విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా అయితే 90 రోజుల్లోపు లేదా ఐదేళ్ల కన్నా ఎక్కువకాలం ఉండే టర్మ్ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1998లో 90 రోజుల్లోపు టర్మ్ డిపాజిట్ల విలువ రూ.41,365 కోట్లుకాగా.. 2008 నాటికి 1.51 లక్షల కోట్లకు, 2018నాటికి 4.25 లక్షల కోట్ల కు, 2021–22 నాటికి 13,02,760 కోట్లకు చేరాయి. ఇక ఐదేళ్లకన్నా ఎక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లు 1998లో రూ. 46,231 కోట్లు ఉంటే, 2008 నాటికి రూ.1.65 లక్షల కోట్లకు, 2018 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. అయితే 2021 నాటికి ఇవి రూ.7.47 లక్షల కోట్లకు తగ్గాయి. ఆర్బీఐ రాష్ట్రాల వారీగా లెక్కలేమీ వెల్లడించలేదు. అయితే ఆదాయ స్థాయిని బట్టి పొదుపు ఉంటుందనే ఆర్థిక సూత్రం ప్రకారం.. తెలంగాణలో సేవింగ్స్ ఎక్కువే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ తలసరి కంటే రాష్ట్ర తలసరి ఆదాయమూ ఎక్కువేనంటున్నారు. ఈ లెక్కన మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో సేవింగ్స్ సొమ్ము ఎక్కువే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
పైసలు, పంటలు జోర్దార్.. ఆదాయం, అప్పులు రెండూ భారీగానే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో వేగంగా దూసుకెళుతోంది. వివిధ రంగాల్లో మంచి వృద్ధిరేటుతో దూకుడు కొనసాగిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఏడేళ్లలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. పలు అంశాల్లో జాతీయ సగటుకు రెండింతలకుపైగా వృద్ధిని సాధించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ధరల ప్రాతిపదికన.. 2013–14లో రూ.4,51,580.4 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ విలువ.. 2020–21 నాటికి రూ.9,80,407 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు రాష్ట్ర వృద్ధికి అండగా నిలిచినట్టు రిజర్వు బ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకింగ్, బీమా, తయారీ, నిర్మాణ రంగాలు కూడా వృద్ధికి ఊతమిస్తున్నాయి. పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. మరోవైపు గత ఏడేళ్లలో రాష్ట్రం సొంత పన్నులు, పన్నేతర ఆదాయాన్ని సైతం భారీగా పెంచుకుంది. కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం భారీగా రుణాలు తీసుకుంటుండటంతో ఏటేటా అప్పులు కూడా పెరిగిపోయాయి. వాటిపై చెల్లిస్తున్న వడ్డీలు భారంగా మారుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ మిగులును చూపుతున్నా.. భారీ ఆర్థికలోటు కొనసాగుతుండటం గమనార్హం. ఏడేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలు గణనీయంగా వృద్ధిని నమోదు చేయడంతో.. రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటితో పోలిస్తే మూడింతలకుపైగా రాబడి వృద్ధి నమో దైంది. పన్నుల రాబడితోపాటు పన్నేతర ఆదాయాన్నీ ప్రభుత్వం పెంచుకోగలిగింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు కూడా మూడింతలు పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు ప్రదర్శించింది. వరి, పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశ సగటుకన్నా 3, 4 రెట్లకుపైగా వృద్ధి నమోదవడం గమనార్హం. సొంత పన్నులు, పన్నేతర ఆదాయంలో భారీ వృద్ధి తెలంగాణ రాష్ట్రం గత ఏడేళ్లలో సొంత పన్నులు, పన్నేతర ఆదాయంలో భారీ వృద్ధిని నమోదు చేసినట్టు రిజర్వుబ్యాంకు నివేదిక పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ, తయారీ, పారిశ్రామిక, వ్యవసాయ, మైనింగ్ రంగాలు గణనీయ వృద్ధి సాధించడంతో ఖజానాకు రాబడి పెరిగిందని తెలిపింది. 2014–15తో పోల్చితే.. 2020–21 నాటికి పన్నేతర ఆదాయం 474 శాతం, పన్నుల ఆదాయం 291 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు పేర్కొంది. రాష్ట్ర సొంత ఆదాయం, ఆర్థిక–రెవెన్యూ లోటు లెక్కలివీ.. (రూ.కోట్లలో) ఏడాది పన్నేతర పన్నుల ఆర్థిక లోటు రెవెన్యూ ఆదాయం ఆదాయం లోటు 2014–15 6,447 29,288 9,410 –369 2015–16 14,414 39,975 18,498 –238 2016–17 9,782 48,408 35,231 –1386 2017–18 7,825 58,177 26,514 –3459 2018–19 10,007 65,040 26,944 –4337 2019–20 12,275 71,328 21,913 –104 2020–21 30,600 85,300 33,191 –4482 (రెవెన్యూ లోటు (–)లో చూపారు. అంటే మిగులు ఆదాయం ఉన్నట్టు చూపారు) ఏడేళ్లలో రంగాల వారీగా రాష్ట్రంలో నమోదైన వృద్ధి.. (రూ.కోట్లలో) అంశం 2013–14 2020–21 వృద్ధిరేటు మొత్తం జీఎస్డీపీ విలువ 4,51,580.40 9,80,407.01 117 వ్యవసాయ రంగంలో.. 47,092.85 80,574.00 71 తయారీ రంగంలో.. 57,148.39 94,020.80 64.5 నిర్మాణ రంగంలో.. 24,582.42 37,029.76 50.6 పారిశ్రామిక రంగంలో.. 1,02,825.74 1,79,884.62 74.9 సేవల రంగంలో.. 2,42,272.96 5,33,230.87 120 బ్యాంకింగ్, బీమా రంగంలో 26,595.53 53,145.22 99.8 (ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం/రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ/జీఎస్డీపీ) అంటారు. సదరు దేశ/రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటన్నది దీనితో అంచనా వేయవచ్చు) రాష్ట్రంపై అప్పులు, వడ్డీల భారం.. ఏటేటా రాష్ట్ర అప్పులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015 మార్చి నాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు.. 2021 మార్చి నాటికి రూ.2,52,325 కోట్లకు చేరాయి. అంటే ఆరేళ్లలో మూడింతల అప్పులు పెరిగిపోయినట్టు రిజర్వుబ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రుణాలపై వార్షిక వడ్డీల చెల్లింపులు సైతం రూ.5,227 కోట్ల నుంచి రూ.14,615 కోట్లకు పెరిగాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతోపాటు రైతుబంధు, పంట రుణాల మాఫీ, ఆసరా పెన్షన్లు, ఇతర సం క్షేమ పథకాల కోసం రాష్ట్రం భారీగా అప్పులు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆర్బీఐ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ పప్పుధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి దేశ సగటు 34.2 శాతంకాగా.. రాష్ట్రం 108.8 శాతం వృద్ధిని సాధించింది. వరి ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా సగటున 12.7 శాతం, రాష్ట్రం 67.3 శాతం వృద్ధి నమోదైంది. పత్తిసాగులో దేశవ్యాప్తంగా సగటున 3.6 శాతం, రాష్ట్రం 79.8 శాతం వృద్ధి సాధించాయి. మాంసం ఉత్పత్తిలో దేశ సగటు వృద్ధి 28.5 శాతంకాగా.. రాష్ట్రం 67.9 శాతం వృద్ధి నమోదు చేసింది. సాగునీటి సౌకర్యాలలో రాష్ట్రం 34.2 శాతం వృద్ధి సాధించగా.. దేశవ్యాప్తంగా సగటు వృద్ధి –11.1గా ఉంది. మొత్తంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సగటున 2.2 శాతం, రాష్ట్రం 22.2% వృద్ధిని నమోదు చేశాయి. జీఎస్డీపీ విలువ (రూ.కోట్లలో) 2013–14లో 4,51,580.40 2020–21లో 9,80,407.01 రాష్ట్ర అప్పులు.. (రూ.కోట్లలో) 2015లో 72,658 2021 నాటికి 2,52,325 రాష్ట్ర సొంత ఆదాయం తీరు (రూ. కోట్లలో) పన్నుల ఆదాయం 2014–15లో 29,288 2020–21లో 85,300 రాష్ట్ర ప్రగతికి ఆర్బీఐ నివేదికే సాక్ష్యం రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతోసహా అన్ని రంగాల్లో గణనీయ ప్రగతి సాధించిందని ఆర్బీఐ తాజా నివేదిక స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని, ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వారిని కోరారు. చౌకబారు విమర్శలు, ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు. ఆర్బీఐ నివేదికపై గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, దేశ సగటు కన్నా రాష్ట్రం చాలా రంగాల్లో మెరుగైన ప్రగతి సాధించిందని నివేదిక తేటతెల్లం చేసిందన్నారు. మాంసం, వరి, పప్పు దినుసుల ఉత్పత్తిలో రాష్ట్ర వృద్ధిరేటు దేశ సగటును మించిపోయిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. -
డిఫాల్టర్ల నుంచి బ్యాంకుల వసూళ్లు రూ. 40,400 కోట్లు
ముంబై: వివిధ కొత్త చట్టాల ఆసరాతో 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు...డిఫాల్టర్ల నుంచి రూ. 40,400 కోట్లు వసూలు చేయగలిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు రూ.38,500 కోట్లుకాగా, గత ఆర్థిక సంవత్సరం అంతకుమించిన మొండి బకాయిల్ని వసూలు చేయడం గమనార్హం. ఇన్సాల్వెన్సీ బాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) అమలులోకి రావడం, సెక్యూరిటైజేషన్, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అసెట్స్ (ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ) చట్ట సవరణలు జరగడంతో భారీగా మొండి బకాయిల్ని ఈ చట్ట ప్రయోగాల ద్వారా, డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు, లోక్ అదాలత్‌ల ద్వారా బ్యాంకులు వసూలు చేసినట్లు తాజాగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన నివేదికలో వివరించారు. ఐబీసీ ద్వారా రూ. 4,900 కోట్లు, (ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐని ప్రయోగించి రూ. 26,500 కోట్లు వసూలుచేసినట్లు ఈ వారాంతంలో విడుదలైన ఆర్బీఐ నివేదిక తెలిపింది. -
రోజుకు 232 పరిశ్రమలు.. బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చిన్న పరిశ్రమల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్‌బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. 2013-14 చివరి త్రైమాసికానికి సంబంధించి ఆర్బీఐ కొద్దిరోజుల క్రితం నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం డిసెంబర్ 2013 నాటికి ఖాయిలాపడిన పరిశ్రమల సంఖ్య 14,964 ఉండగా.. మార్చి 2014 నాటికి వీటి సంఖ్య ఏకంగా 35,876కు చేరుకుంది. కేవలం 3 నెలల కాలంలోనే ఏకంగా 20,912 పరిశ్రమలు ఖాయిలాపడ్డాయి. అంటే రోజుకు 232 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పరిశ్రమలశాఖ నివేదిక ప్రకారం ఒక సూక్ష్మ లేదా చిన్నతరహా పరిశ్రమలో సగటున కనీసం 25 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే 232 పరిశ్రమలు రోజుకు మూతపడ్డాయంటే.. రోజుకు 5,800 మంది కార్మికులు వీధి పాలవుతున్నారన్నమాట. అదేవిధంగా ఈ పరిశ్రమలకు చెందిన రూ. కోట్ల పెట్టుబడి నిరర్ధకంగా మారుతోంది. ఇందుకు కారణం నాలుగేళ్లుగా ఎడతెరపి లేకుండా సాగుతున్న విద్యుత్ కోతలు-వాతలే కారణమని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కోతలు- వాతల వల్లే దుస్థితి నాలుగేళ్ల నుంచి పరిశ్రమల పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. వారంలో సగం రోజులు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ప్రస్తుతం కూడా పరిశ్రమలకు వారంలో ఒక రోజుపాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ కోతలతో పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం రోజురోజుకీ తగ్గిపోతోంది. ఫలితంగా వచ్చిన ఆర్డర్లను పరిశ్రమలు పూర్తిచేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఆర్డర్లన్నీ వెనక్కి వెళుతున్నాయి. దీంతో పరిశ్రమలు నిధుల రాక నిలిచిపోయింది. ఈ పరిణామాల వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పరిశ్రమలు సకాలంలో చెల్లించలేకపోతున్నాయి. వరుసగా మూడు నెలలు రుణం చెల్లించకపోతే సంబంధిత పరిశ్రమ రుణాలను నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా పరిగణిస్తున్నారు. బ్యాంకులకు రుణాలను సకాలంలో చెల్లించలేకపోతున్న పరిశ్రమల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రాధాన్యత ఇవ్వకపోతే శాశ్విత అంధకారమే ఎఫ్‌ఎస్‌ఎంఈ అధ్యక్షుడు ఏపీకె రెడ్డి విద్యుత్ సరఫరాలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే శాశ్వతంగా పారిశ్రామికవేత్తలకు అంధకారం తప్పదు. ఆర్బీఐది అధికారిక నివేదిక. అనేక మంది పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమ ఖాయిలా పడకూడదని వ్యక్తిగతంగా అప్పులు చేసి మరీ బ్యాంకులకు రుణాలు తీరుస్తున్నారు. వీటితో కలుపుకుంటే ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఇరు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏపీ, తెలంగాణలో రోజుకు 232 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఈ లెక్కన రోజుకు సుమారు 5,800 మంది కార్మికులు రోడ్డుపాలవుతున్నారు. -ఆర్బీఐ నివేదిక