
నివేథా పెతురాజ్.. పక్కన వైరల్ అయిన బికినీ ఫోటో
సాక్షి, చెన్నై: హీరోయిన్ నివేథా పెతురాజ్(26) లీగల్ చర్యలకు సిద్ధమైపోయారు. కొన్ని ఛానెళ్లు, వెబ్‌సైట్లు ఈ మధ్య ఆమె బికినీ ఫోటోలంటూ కొన్నింటిని వైరల్ చేశాయి. అయితే ఫేక్ ఫోటోలని ఆమె వివరణ ఇచ్చుకున్నారు.
అవి నావి కావు... ‘నిజానికి ఆ ఫోటోలు నావి కావు. అయినప్పటికీ కొన్ని వెబ్ సంస్థలు అతితో వాటిని నా పేరు మీద ప్రచురించాయి. నా పరువుకు భంగం కలిగించిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నా. ఇప్పటికే లీగల్ నోటీసులు సిద్ధం చేశా’ అని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆ ఫోటోలు వర్షిణి పాకల్ అనే మోడల్‌వి అని ఫోటోగ్రాఫర్ ప్రసూన్ ప్రశాంత్ ప్రకటించారు.
కాగా, నివేథా పెతురాజ్ మెంటల్ మదిలో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్థురాలే. జయం రవితో ఆమె నటించిన స్పేస్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ రిలీజ్‌కు రెడీగా ఉండగా, విజయ్ ఆంటోనీతో ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment