స్పీకర్ పరామర్శ | speaker visit ramya house | Sakshi

స్పీకర్ పరామర్శ

Published Tue, Jul 19 2016 10:45 PM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM

రాధికను పరామర్శిస్తున్న స్పీకర్‌ మధుసూనాచారి - Sakshi

రాధికను పరామర్శిస్తున్న స్పీకర్‌ మధుసూనాచారి

అంబర్‌పేట: బంజారాహిల్స్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య కుటుంబసభ్యులను తెలంగాణ శాసన సభా స్పీకర్‌ మధుసూదనాచారి మంగళవారం పరామర్శించారు. డీడీ కాలనీ ఉన్న రమ్య అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆయన.. ఇదే ప్రమాదం తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమై చిన్నారి తల్లి రాధిక ఆరోగ్య పరిస్థితిని ఆమె తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా మీ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రమాదానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్‌ పద్మవతిరెడ్డి ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement