క్లాస్‌లో ‘ట్రాఫిక్’ సిలబస్
► ఒకటో తరగతి నుంచే పాఠ్యాంశంగా అమలు
► పరీక్షల్లోనూ సంబంధిత ప్రశ్నలకు మార్కులు
► ఈ ఏడాదికి బుక్లెట్స్ రూపంలో..
► వచ్చే ఏడాది నుంచి టెక్ట్స్ బుక్స్‌లో..
సాక్షి, సిటీబ్యూరో: చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఉదంతంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏటా వేల మందిని పొట్టనపెట్టుకుంటూ, అంతకు రెట్టింపు క్షతగాత్రులుగా మారుస్తున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం వివిధ చర్యలు ప్రారంభించడంతో సరిపెట్టకుండా, వాటి అమలు తీరునూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చనున్నాం. బడి ఈడు నుంచే బాధ్యతలను పెంచితే సత్ఫలితాలు ఉంటాయి.
– ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ