నకిలీ పాసు పుస్తకాలపై పోలీసుల ఆరా | Police check on fake pass books | Sakshi
Sakshi News home page

నకిలీ పాసు పుస్తకాలపై పోలీసుల ఆరా

Published Tue, Aug 8 2017 11:06 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Police check on fake pass books

బ్రహ్మసముద్రం: అనంతపురంలో జూలై 17న ఇద్దరు వ్యక్తుల వద్ద పట్టుబడిన నకిలీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలపై పోలీసులు మంగళవారం బ్రహ్మసముద్రం తహసీల్దార్‌ కార్యాలయానికి తరలి వచ్చి ఆరాతీశారు. తీటకల్లు రెవెన్యూ గ్రామంలోని సర్వేనంబర్లు  13–1, 325లో కళ్యాణదుర్గం మండలం హులికల్లుకు చెందిన వారి పేరిట గల నకిలీ పాసుపుస్తకాలను ఆన్‌లైన్‌లో పరిశీలించగా నకిలీవని తేలింది. అయితే తమ కార్యాలయంలో ఈ పుస్తకాలను ఇవ్వలేదని, గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి పాసుపుస్తకాలు తయారు చేసినట్లు తహసీల్దార్‌ వెంకటశేషు తెలిపారు. అనంతరం కంబదూరు మండలం పాళ్లూరు రెవెన్యూగ్రామంలోని నకిలీపుస్తకాలపై విచారణకు పోలీసులు బయల్దేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement