
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డి గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. ఎలుగుబంటి దారితప్పి జనావాసాల్లో రావడంతో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగుబంటి ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడ్డారు. తర్వాత గ్రామస్తులు మూకుమ్మడిగా ఎలుగుబంటిపై దాడికి దిగారు. దీంతో ఎలుగుబంటి సమీపంలోని కొండల్లోకి పరుగులు తీసింది. అనంతరం గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.