తప్పుడు పత్రాలతో రుణం
తప్పుడు పత్రాలతో రుణం
Published Tue, Nov 8 2016 10:21 PM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
సెంటు వ్యవసాయ భూమి లేకున్నా రెండెకరాలు కాగితాల్లో కట్టబెట్టి రెవెన్యూ అధికారులు సదరు అధికార పార్టీ నేతపై అభిమానాన్ని చాటుకున్నారు. తొండంగి మండల టీడీపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి పార్టీ నేతల అండదండలతో తప్పుడు పాట్టాదారు పాసుపుస్తకంతో ఆ¯ŒSలైన్లో రెవెన్యూ వ¯ŒSబీ అడంగళ్ పత్రాలు సృష్టించి వాటితో సొసైటీ ద్వారా రూ.3.60 లక్షల రుణం పొందారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
– తొండంగి
ఇదీ సంగతి
తొండంగికి చెందిన మురాలశెట్టి సత్యనారాయణ అలియాస్(సత్తిబాబు)కు తొండంగి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 809లో రెండు ఎకరాలు ఉన్నట్టు 309187 (పాసుపుస్తకం నంబరు) ఖాతా నంబర్ 3239 పట్టాదారు పాసుపుస్తకం సృష్టించారు. దీని ఆధారంగా గ్రామ రెవెన్యూ అధికారి వ¯ŒSబీ, అండంగళ్ పత్రాలను కూడా మంజూరు చేసి తహసీల్దార్‌కు ప్రతిపాదించగా మంజూరుకావడంతో కంప్యూటర్ సిబ్బంది ఆ¯ŒSలైన్లో ఎక్కించారు. తహసీల్దార్ సంతకాలతో ఈ పత్రాలను అన్నవరం మీసేవా ద్వారా 2015లో నవంబర్ 14న ఆ¯ŒSలై¯ŒS ద్వారా 97630621(సర్టిఫికెట్ నంబర్), వ¯ŒSబీ నమూన, 97630653(సర్టిఫికెట్ నంబర్) అడంగళ్ ధ్రువపత్రాలు పొందిన సదరు టీడీపీ నేత తొండంగి సొసైటీలో అధికారులను బరుడి కొట్టించి అదే ఏడాది డిసెంబర్‌లో తొండంగి పీఏసీఎస్‌లో రూ.3.60 లక్షలు రుణం పొందాడు. మొదటి దఫాలో రూ.1.60 లక్షలు, రెండో దఫాలో రూ.రెండు లక్షలు భూమిని అభివృద్ధి చేసుకోవడం కోసం ఎల్టీలోనూ పొందాడు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేవని తొండంగి గ్రామస్తులు కొందరు సొసైటీ అధికారులకు తెలపడంతో రికార్డులు తనిఖీ చేసుకున్నారు. అయితే అప్పటికే ఈ సంగతి రెవెన్యూ అధికారులకు తెలియడంతో ఆ¯ŒSలైన్లో సదరు నేత రికార్డులు తొలగించారు. సొసైటీ అధికారుల తనిఖీలో ఆ¯ŒSలైన్లో రికార్డులు లేకపోవడంతో అవాక్కయ్యారు. సదరు వ్యక్తి నుంచి పొందిన రుణాన్ని తిరిగి కట్టించి, అధికారులను తప్పుదారిపట్టించిన సదరు అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో తొండంగి రెవెన్యూ కార్యాలయంలో నకిలీ పాసుపుస్తకాలు వ్యవహారం జరిగినప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నేతలు, అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ ఇప్పుడు అదే నాయకులు అధికార మదంతో తప్పుడు పాసుపుస్తకాలతో పత్రాలు సృష్టించి రుణం పొందడం చర్చనీయాంశమైంది.
క్రిమినల్ చర్యలు తప్పవు
రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సదరు వ్యక్తికి రుణమిచ్చాం. రికార్డులు సరిౖయెనవి కాదని నిర్ధారణ అయితే అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకుని రుణం సొమ్ము కట్టిస్తాం.
– వెల్నాటి ఏసుబాబు, సీఈవో, తొండంగి పీఏసీఎస్
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు పొందడానికి కారకులపైనా, సహకరించిన రెవెన్యూ అధికారులపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– వనపర్తి సూర్యనాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు, తొండంగి పీఏసీఎస్
Advertisement
Advertisement