న కిలీ ‘బయో’
న కిలీ ‘బయో’
Published Wed, Aug 31 2016 9:03 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
– పురుగు మందుల తయారీ కేంద్రంపై ‘విజిలెన్స్’ దాడులు
– రూ.48 లక్షలు విలువ చేసే నకిలీ మందులు సీజ్
కర్నూలు: కర్నూలు శివారులోని కారై్బడ్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఆర్టీసీ కాలనీలో ఉన్న నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భాస్కర్‌సింగ్ ఆర్టీసీ కాలనీలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని బయో ఫెస్టిసైడ్స్ ముసుగులో నకిలీ పురుగు మందులను తయారు చేస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు, సీఐ జగన్మోçßæన్‌రెడ్డి, ఎస్‌ఐ సుబ్బరాయుడు, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు మునిస్వామి, ఈశ్వర్ తదితరులతో కూడిన బందం బుధవారం దాడులు నిర్వహించింది. సుమారు రూ.48 లక్షలు విలువ చేసే నకిలీ మందులతో పాటు తయారీ కేంద్రం, కల్లూరులోని గోడౌన్‌ను సీజ్ చేశారు.
ఏజెంట్ల ద్వారా వ్యాపారం:
ఏఎస్‌ఎన్ ఆగ్రో ప్రొడక్ట్స్, అనిల్ అగ్రో ప్రొడక్ట్స్, విట్రో అగ్రో కెమికల్స్ కంపెనీల పేరుతో తయారు చేసిన నకిలీ పురుగు మందులను ఏజెంట్ల ద్వారా జిల్లాలోని రైతాంగానికి అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్‌లోని ప్రధాన కంపెనీల పేర్లతో పురుగుల మందును తయారు చేసి జిల్లా అంతటా సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెలుగు చూసింది.
తయారీ దారుడిపై క్రిమినల్ కేసు నమోదు:
ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భాస్కర్ సింగ్ కర్నూలులో నివాసం ఏర్పాటు చేసుకుని బయో ఉత్పత్తుల పేరుతో నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం అందింది. దాడులు నిర్వహించి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసిన పురుగు మందులు మాత్రమే వాడాలని విజ్ఞప్తి చేశారు. మందులు కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement