కొరఢా ఝుళిపిచిన విజిలెన్స్
కొరఢా ఝుళిపిచిన విజిలెన్స్
Published Tue, Jan 24 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
నకిలీ కాఫీ ఉత్పత్తులు సీజ్
– రూ. 25 లక్షల విలువైన సరుకు సీజ్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకానికి ఉంచిన రూ. 25 లక్షల విలువ చేసే కాఫీ పొడుల నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి సీజ్ చేశారు. నగరంలోని మణికంఠ ట్రేడర్స్, లక్ష్మీకాఫీ పొడర్, రాఘవేంద్ర ట్రేడర్స్‌లలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆరు రకాల కాఫీ పొడులు, వివిధ కంపెనీల బ్రాండ్ ప్యాకెట్ల ఉన్నట్లు విజిలెన్స్ ఎస్పీ బాబురావుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్ అధికారుల బృందం సభ్యుడు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్ డైరక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మణికంఠ ట్రేడర్స్‌లో 7219 కేజీలు, లక్ష్మీకాఫీ ఫౌడర్‌లో 2840 కేజీలు, రాఘవేంద్ర ట్రేడర్స్‌లో 3265 కేజీల కాఫీ పౌడర్, ప్యాకెట్లను సీజ్ చేసినట్లు చెప్పారు. వీటికి ఫుడ్ సేఫ్టీ ఆథారిటీ, బ్రాండెండ్ లైసెన్స్‌లు లేవన్నారు. షాపులను కూడా సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ అధికారులు రామకృష్ణారెడ్డి, శంకర్, రామకృష్ణాచారి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement