సమావేశంలో మాట్లాడుతున్న ప్రత్యేక అధికారులు
- మిరప మొక్క లక్షణాల ఆధారంగా ప్రాథమికంగా గుర్తింపు
- డీఎ¯ŒSఏ పరీక్షలకు
- మొక్కల భాగాలు, ఆకులు
- నేడు, రేపు వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిశీలన
- ప్రభుత్వానికి త్వరలో
- సమగ్ర నివేదిక
- ప్రభుత్వ ప్రత్యేక బృందం వెల్లడి
ఖమ్మం వ్యవసాయం: మిర్చి కంపెనీలు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టాయని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం ధ్రువీకరించింది. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయామంటూ మిర్చి రైతులు రోడ్డెక్కడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పరిశీలన కోసం ప్రత్యేక బృందాన్ని జిల్లాకు శుక్రవారం పంపింది. ఇందులో ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు మధుసూధ¯ŒS, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు టి.రాజవర్ధ¯ŒS, శాస్త్రవేత్త డాక్టర్ పి.సైదయ్య, వ్యవసాయాధికారి ఆర్.శివానందయ్య ఉన్నారు. వీరి వెంట జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు ఎ.ఝాన్సీలకీ‡్ష్మకుమారి, ఉప సంచాలకురాలు విజయనిర్మల, ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు ఆర్.శ్రీనివాస్‌రావు, సహాయ సంచాలకుడు కె.సూర్యనారాయణ ఉన్నారు. కూసుమంచి మండలం లోని తురకగూడెం; తిరుమలాయపాలెం మండలంలోని జింకలగూడెం, తిరుమలాయపాలెం; కొణిజర్ల మండలంలోని పల్లిపాడు గ్రామాల్లోగల మిరప తోటలను ప్రత్యేక బృందంలోని అధికారులు నిశితంగా పరిశీలించారు. అసలైనవి, నకిలీవిగా భావిస్తున్న మొక్కలను (పైరు ఎదుగుదల, పూత, కాత, ఆకు కణుపులు) నిశితంగా పోల్చి చూశారు. తేడాలు ఉన్నట్టుగా గుర్తించారు. నకిలీవిగా భావిస్తున్న మొక్కల నుంచి దిగుబడి ఉండదని అక్కడికక్కడే నిర్థారణకు వచ్చారు. గ్రీ¯ŒS ఎరా సీఎస్–333 రకం, జేసీహెచ్–801 రకం విత్తనాలు విత్తినట్టు రైతులు చెప్పారు. ఇతర విత్తన రకాల మొక్కలు బాగున్నాయంటూ వాటిని చూపించారు.