in khammam
-
గుట్కా గుట్టురట్టు
రూ.50 లక్షల విలువైన గుట్కా, సామగ్రి పట్టివేత - బల్లేపల్లి సమీపంలోని మామిడి తోటలో విజిలెన్స్ దాడులు - నిర్వాహకులతో సహా 13 మంది కూలీల అరెస్ట్ - వాహనాలు, యంత్రాలు స్వాధీనం - రెండు రాష్ట్రాలకు సరఫరా: విజిలెన్స్ విభాగం అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి ఖమ్మం అర్బన్/ఖమ్మం రూరల్: జిల్లా కేంద్రంలో అంతర్భాగంగా ఉన్న బల్లేపల్లి సమీపంలోని మామిడి తోటలో రూ.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకు, యంత్రాలను మంగళవారం అర్ధరాత్రి వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆశాఖ అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బల్లేపల్లికి చెందిన మలీదు జగన్ మామిడి తోటలో పాత కోళ్ల ఫారం షెడ్ ఉంది. దీనిలో విజయవాడకు చెందిన బంటి అలియాస్ కుల్దీప్శర్మ, అతని మిత్రుడు జమలాపురం శ్రీనివాస్, ఎస్డీ ఆరిప్, దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గుట్కా తయారీ యూనిట్‌ను నెలకొల్పారు. జగన్‌కు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని షెడ్‌ను అద్దెకు తీసుకొని సుమారు నెలరోజులుగా ఈ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 9 మంది కూలీలను తీసుకొచ్చి గుట్కా ప్యాకెట్లు తయారు చేయిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ముడిసరుకు, దానిలో కలిపే లిక్విడ్‌ను తీసుకొచ్చి షెడ్లో ఉన్న మిషన్ ద్వారా మిక్సింగ్ చేస్తున్నారు. గుట్కా తయారు అయ్యాక ప్యాకింగ్ చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంగళవారం సాయంత్రం నుంచి మామిడితోట సమీపంలో మాటు వేసి అర్ధరాత్రి దాడులు చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. అప్పుడే అక్కడికి తెచ్చిన గుట్కా తయారీకి ఉపయోగించే లిక్విడ్‌ను, ఒక సఫారీ కారు, ట్ర్యాలీ వ్యాన్, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వాహనాల ద్వారా నిత్యం ముడి సరుకు తీసుకొచ్చి.. తయారైన ప్యాకెట్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. షెడ్డులో 5 ప్యాకింగ్ యంత్రాలతో పాటు సీఎం 1000 బ్రాండ్ పేరుతో తయారు చేస్తున్న సుమారు 5 లక్షల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ప్యాకెట్లను చిన్నచిన్న బస్తాలలో నింపి రెండు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు లక్షల గుట్కా ప్యాకెట్ల విలువ రూ.25,29,800 ఉంటుందని వివరించారు. యంత్రాలు, వాహనాలు, ముడిసరుకు మొత్తం కలిసి రూ.50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో అదనపు ఎస్పీతో పాటు వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఎన్.వెంకారెడ్డి, సీఐ ఎన్. వెంకటేష్, ఏఓ జి. సారయ్య, కానిస్టేబుల్ పి.సురేష్ పాల్గొన్నారు. -
ఖమ్మంలో మహాత్మ
- నేడు జాతిపిత జయంతి - ఆయన పేరు మీదే గాంధీచౌక్ - నేటికీ ఆయన బాటలో గాంధేయవాదులు ఖమ్మం గాంధీచౌక్: స్వాతంత్ర్య ఉద్యమకాలంలో దక్షణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చిన గాంధీ అక్కడి నుంచి రైలులో వెళ్తూ ఖమ్మం స్టేషన్లో ఆగారు. 1946 ఫిబ్రవరి 5వ తేదీన ఖమ్మంమెట్టులోని పెద్ద గేటు (వెంకటగిరి గేటు)వద్ద రైలు దిగారు. స్వాతంత్ర్య ఉద్యమకారులతో మాట్లాడారు. గాంధీ రాక సందర్భంగా జిల్లాలోని ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఖమ్మం చేరుకొని ప్రసంగాన్ని విన్నారు. కొద్ది క్షణాలపాటే సాగిన ఆ ప్రసంగం నాటి యువతలో ఎనలేని స్ఫూర్తినింపింది. మహాత్ముని 147వ జయంతి సందర్భంగా ‘సండే స్పెషల్’గా ఆ నాటి స్మృతులు.. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ అహింసే ఆయుధంగా స్వాతంత్రోద్యమం నడిపారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించారు. మహాత్ముడిగా వెలుగొందిన గాంధీ 1948 జనవరి 30న ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనకు వెళ్తుండగా గాడ్సే చేత చంపబడ్డారు. జాతిపిత మహాత్మగాంధీ 147వ జయంతిని ఆదివారం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీకి ఖమ్మంతో ఉన్న అనుబంధాన్ని ఓసారి మననం చేసుకుందాం.. ఖమ్మంతో అనుబంధం స్వాతంత్ర్య ఉద్యమకాలంలో దక్షణాది రాష్ట్రాల పర్యటనకు వచ్చిన మహాత్ముడు విజయవాడ నుంచి రైలులో వెళ్తూ ఖమ్మం స్టేషన్లో ఆగారు. 1946 ఫిబ్రవరి 5వ తేదీన ఖమ్మంమెట్టులోని పెద్ద గేటు (వెంకటగిరి గేటు, ప్రస్తుతం ఇక్కడ వంతెన నిర్మించారు)వద్ద రైలు దిగారు. స్వాతంత్ర్య ఉద్యమకారులతో మాట్లాడారు. గాంధీ రాక సందర్భంగా జిల్లాలోని ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఖమ్మం చేరుకొని ప్రసంగాన్ని విన్నారు. ఆయన పేరుమీదే ఖమ్మంలోని గాంధీచౌక్‌ను ఏర్పాటు చేశారు. ఆయన మాటలు విన్న, ఆయనను చూసిన కొందరు ఆయన విధానాలను నేటికీ పాటిస్తున్నారు. వారిలో ఖమ్మానికి చెందిన ఇద్దరు గాంధేయవాదులు ఏమంటున్నారో తెలుసుకుందాం... అహింసే ఆయుధంగా..: శిరం వినాయక హన్మంతరావు మహాత్ముడు గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన అహింస, సత్యాగ్రహాలను ఆయుధాలుగా వాడుకున్నారు. ఆ విధానం దేశం యావత్తు గర్వించదగినది. బారిస్టరు చదివిన గాంధీజీ ఎంతో నీతి నిజాయితీగా ఉండటంతోనే ఉద్యమంలో రాణించారు. యావత్తు దేశం ఆయనను గర్వంగా మహాత్మునిగా పిలుచుకోవడం మరువ లేనిది. ఆయన మార్గదర్శకత్వంలో జీవనం సాగిస్తున్నాం. ‘దేశంలో మార్పు కోరుకుంటే మొదట నీ నుంచే ప్రారంభం కావాలి..’ అనే మహాత్ముని సూత్రం నాకే కాదు యావత్ జాతికి స్ఫూర్తినిచ్చింది. ‘నాదగ్గర ప్రేమ తప్ప మరొక ఆయుధం లేదు. ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే నాగమ్యం’ అన్న ఆయన మరో నినాదం దేశవిదేశాలతో స్నేహసంబంధాలను నెరపేందుకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. ఇలాంటివెన్నో విషయాలు మహాత్ముని నుంచి మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుత సమాజానికి ఇవి ఎంతో అవసరం కూడా. గాంధీ సంఘ సంస్కర్త కూడా: పెనుగొండ రామ్మోహన్రావు మహాత్మాగాంధీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధుడే కాదు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త కూడా. నేడు స్వచ్ఛ భారత్‌గా చెప్పుకునే విధానం ఆయనదే. ఆయన గొప్ప చదువులు చదివినా మురికి వాడల్లో తిరుగుతూ చీపిరి పట్టుకొని వీధులు ఊడ్చి సంఘంలో ఆదర్శంగా నిలిచారు. అంటరానితనం నిర్మూలనకు నడుం బిగించారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవిస్తున్నాం. ‘వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి, తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే..’ అన్న గాంధీ సూత్రం వ్యక్తిత్వం అనేది మనిషికి ఎంత అవసరమో తెలియజెబుతోంది. ‘విధి నిర్వహణకు మించిన దేశ సేవలేదు’ అన్న గాంధీ మరో నినాదం మన విద్యుక్త ధర్మాన్ని గుర్తు చేస్తుంది. ‘ఔన్నత్యం సంపద వలన రాదు.. సద్గుణాల వలన వస్తుంది’ అనే నినాదం ధనం చుట్టూ పరుగులు పెడుతున్న నేటి మానవాళికి ఓ చెంపపెట్టు. -
ఔను.. అవి నకిలీ విత్తనాలే!
మిరప మొక్క లక్షణాల ఆధారంగా ప్రాథమికంగా గుర్తింపు డీఎ¯ŒSఏ పరీక్షలకు మొక్కల భాగాలు, ఆకులు నేడు, రేపు వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిశీలన ప్రభుత్వానికి త్వరలో సమగ్ర నివేదిక ప్రభుత్వ ప్రత్యేక బృందం వెల్లడి ఖమ్మం వ్యవసాయం: మిర్చి కంపెనీలు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టాయని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం ధ్రువీకరించింది. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయామంటూ మిర్చి రైతులు రోడ్డెక్కడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పరిశీలన కోసం ప్రత్యేక బృందాన్ని జిల్లాకు శుక్రవారం పంపింది. ఇందులో ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు మధుసూధ¯ŒS, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు టి.రాజవర్ధ¯ŒS, శాస్త్రవేత్త డాక్టర్ పి.సైదయ్య, వ్యవసాయాధికారి ఆర్.శివానందయ్య ఉన్నారు. వీరి వెంట జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు ఎ.ఝాన్సీలకీ‡్ష్మకుమారి, ఉప సంచాలకురాలు విజయనిర్మల, ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు ఆర్.శ్రీనివాస్‌రావు, సహాయ సంచాలకుడు కె.సూర్యనారాయణ ఉన్నారు. కూసుమంచి మండలం లోని తురకగూడెం; తిరుమలాయపాలెం మండలంలోని జింకలగూడెం, తిరుమలాయపాలెం; కొణిజర్ల మండలంలోని పల్లిపాడు గ్రామాల్లోగల మిరప తోటలను ప్రత్యేక బృందంలోని అధికారులు నిశితంగా పరిశీలించారు. అసలైనవి, నకిలీవిగా భావిస్తున్న మొక్కలను (పైరు ఎదుగుదల, పూత, కాత, ఆకు కణుపులు) నిశితంగా పోల్చి చూశారు. తేడాలు ఉన్నట్టుగా గుర్తించారు. నకిలీవిగా భావిస్తున్న మొక్కల నుంచి దిగుబడి ఉండదని అక్కడికక్కడే నిర్థారణకు వచ్చారు. గ్రీ¯ŒS ఎరా సీఎస్–333 రకం, జేసీహెచ్–801 రకం విత్తనాలు విత్తినట్టు రైతులు చెప్పారు. ఇతర విత్తన రకాల మొక్కలు బాగున్నాయంటూ వాటిని చూపించారు. -
ఔను.. అవి నకిలీ విత్తనాలే!
మిరప మొక్క లక్షణాల ఆధారంగా ప్రాథమికంగా గుర్తింపు డీఎ¯ŒSఏ పరీక్షలకు మొక్కల భాగాలు, ఆకులు నేడు, రేపు వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిశీలన ప్రభుత్వానికి త్వరలో సమగ్ర నివేదిక ప్రభుత్వ ప్రత్యేక బృందం వెల్లడి ఖమ్మం వ్యవసాయం: మిర్చి కంపెనీలు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టాయని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం ధ్రువీకరించింది. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయామంటూ మిర్చి రైతులు రోడ్డెక్కడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పరిశీలన కోసం ప్రత్యేక బృందాన్ని జిల్లాకు శుక్రవారం పంపింది. ఇందులో ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు మధుసూధ¯ŒS, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు టి.రాజవర్ధ¯ŒS, శాస్త్రవేత్త డాక్టర్ పి.సైదయ్య, వ్యవసాయాధికారి ఆర్.శివానందయ్య ఉన్నారు. వీరి వెంట జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు ఎ.ఝాన్సీలకీ‡్ష్మకుమారి, ఉప సంచాలకురాలు విజయనిర్మల, ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు ఆర్.శ్రీనివాస్‌రావు, సహాయ సంచాలకుడు కె.సూర్యనారాయణ ఉన్నారు. కూసుమంచి మండలం లోని తురకగూడెం; తిరుమలాయపాలెం మండలంలోని జింకలగూడెం, తిరుమలాయపాలెం; కొణిజర్ల మండలంలోని పల్లిపాడు గ్రామాల్లోగల మిరప తోటలను ప్రత్యేక బృందంలోని అధికారులు నిశితంగా పరిశీలించారు. అసలైనవి, నకిలీవిగా భావిస్తున్న మొక్కలను (పైరు ఎదుగుదల, పూత, కాత, ఆకు కణుపులు) నిశితంగా పోల్చి చూశారు. తేడాలు ఉన్నట్టుగా గుర్తించారు. నకిలీవిగా భావిస్తున్న మొక్కల నుంచి దిగుబడి ఉండదని అక్కడికక్కడే నిర్థారణకు వచ్చారు. గ్రీ¯ŒS ఎరా సీఎస్–333 రకం, జేసీహెచ్–801 రకం విత్తనాలు విత్తినట్టు రైతులు చెప్పారు. ఇతర విత్తన రకాల మొక్కలు బాగున్నాయంటూ వాటిని చూపించారు. -
‘ఆన్ డ్యూటీ’లో వీరంగం
ప్రభుత్వ వాహనంతో బైక్‌ను ఢీకొట్టిన అటవీశాఖ డ్రైవర్ మద్యం మత్తులో క్షతగాత్రులతో వాగ్వాదం పోలీసులకు అప్పగించిన స్థానికులు ఖమ్మం క్రైం: విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ జీపు డ్రైవర్ గురువారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఖమ్మంలో వాహనాన్ని ఇష్టారీతిన నడుపుతూ బైక్‌ను ఢీకొట్టడంతో తండ్రీ కూతుళ్లకు గాయాలయ్యాయి. అంతకుముందే ఓ బాలిక సైకిల్‌పై వెళ్తుండగా ఢీకొనడంతో..అదృష్టవశాత్తూ ఆమె సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అటవీశాఖ రేంజర్ వాహనాన్ని నడిపే డ్రైవర్ శంకర్ మద్యం సేవించి ఇష్టారీతిగా వాహనం నడుపుతూ వస్తూ త్రీటౌన్ పరిధిలోని జమలాపురం కేశవరావు పార్క్ వద్ద వెనుక నుంచి ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనంపై ఉన్న ఖమ్మం రూరల్ మండలం బారుగూడేనికి చెందిన కూలి సెల్వరాజు, అతని మూడెళ్ల కూతురు జపన్యకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడు సెల్వరాజు జీపును అడ్డుకోవడంతో..మద్యం మత్తులో తూలుతూ వాహనం దిగిన డ్రైవర్ శంకర్..తాను ఫారెస్ట్ ఉద్యోగినని, ఏం చేస్తావంటూ బెదిరించసాగాడు. ఈ ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు అక్కడికి చేరుకొని..గాయాలపాలైన చిన్నారిని చూసి చలించారు. మద్యం మత్తులో బైక్‌ను ఢీకొంది కాక..బెదిరిస్తుండడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పారిబోయిన అతడిని పట్టుకొని త్రీటౌన్, ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అటవీశాఖ జీపులోనే జిల్లా ఆస్పత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ చూడడంతో సీరియస్.. గొడవ జరుగుతున్నప్పుడు ఎస్పీ షానవాజ్‌ఖాసీం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి క్యాంప్ ఆఫీస్‌కు వెళుతున్నారు. కేశవరావు పార్క్ వద్ద గొడవ జరుగుతుండడాన్ని తన వాహనంలో గమనించిన ఆయన..త్రీటౌన్ సీఐ మొగిలి, ట్రాఫిక్ సీఐ నరేష్‌రెడ్డికి ఫోన్ చేసి..పరిశీలించినట్లుగా సమాచారం. సాక్షాత్తూ ఎస్పీనే సూచించడంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకొని విచారిస్తున్నారు. -
విస్తారంగా వర్షాలు
పొంగుతున్న వాగులు నిండిన చెరువులు, ప్రాజెక్టులు పంటలు దెబ్బతింటాయేమోనని రైతుల ఆందోళన గుండాల మండలంలో అత్యధికంగా 9.22 సెం.మీ. వర్షపాతం ఖమ్మం వ్యవసాయం: జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గడిచిన నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులు నిండటంతో వరద నీటిని కిందకు వదులుతున్నారు. పాలేరు రిజర్వాయర్‌లోకి కూడా నీరు చేరుతోంది. బయ్యారం పెద్ద చెరువులోకి ఇల్లెందు, వరంగల్ జిల్లా కొత్తగూడ ప్రాంతాల నుంచి మసివాగు, పందిపంపుల వాగుల ద్వారా నీరు వస్తోంది. శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో శనివారం సగటున 2.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో భారీగా, నాలుగు మండలాల్లో సాధారణానికి మించి, 18 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 13 మండలాల్లో చిన్నపాటి వర్షం కురిసింది. అత్యధికంగా గుండాల మండలంలో 9.22 సెం.మీల వర్షపాతం నమోదైంది. సాధారణాన్ని మించిన వర్షపాతం సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 164 మి.మీ.లు. 24వ తేదీ నాటికి 131.0 మి.మీ. వర్షపాతం నమోదు కా వాలి. ఇప్పటికే 240.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే, సాధారణానికన్నా అధికంగా 83.3 శాతం నమో దైంది. జిల్లా వర్షపాతాన్ని పరిశీలిస్తే.. రెండు మండలాల్లో వర్షపాతం వెనకబడింది. 27 మండలాల్లో సాధారణ, 12 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. రైతుల్లో ఆందోâýæన ప్రస్తుత వర్షాలతో నీరు నిల్వ ఉన్నట్టయితే పంటలు దెబ్బతింటాయేమోనని రైతులు ఆందోâýæన చెందుతున్నారు. భద్రాచలం ప్రాంతంలో ముందుగా సాగు చేసిన పత్తి చేలల్లో నీటి నిల్వ కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదమేర్పడింది. కొన్నిచోట్ల ఇప్పటికే బాగా పెరిగిన పత్తి, మొక్కజొ కూడా నేలవాలింది. నల్ల భూముల్లో వేసిన పత్తి, మిర్చికి అధిక తేమతో ప్రమాదముంది. మరిన్ని వర్షాలు పడితే నష్టం ఎక్కువగా ఉంటుందేమోనని రైతులు భయపడుతున్నారు. ఈ వర్షాలతో వరికి మాత్రం ఎలాంటి ఢోకా లేదు. అంతేకాదు, రబీ సాగుకు అనుకూలంగా కూడా. -
రెండో రోజు కొనసాగిన ఐటీ దాడులు
ఖమ్మం గాంధీచౌక్ : ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ సెంటర్లో ఉన్న జ్యూయలరీ దుకాణాల్లో రెండో రోజు బుధవారం ఆదా య పన్ను శాఖ దాడులు నిర్వహించింది. గాంధీచౌక్ సెంటర్లోని మూడు ప్రముఖ జ్యూయలరీ దుకాణాల్లో మంగâýæవారం ఆదా య పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో దాడులకు దిగారు. నలుగురు బృందంతో కూడిన అధికారులు మూడు దుకాణాల్లో ఆస్తులు తదితర ఆదాయ వివరాలను తనిఖీ లు చేశారు. ఈ దుకాణాలు అధిక ఆదాయాన్ని పొందుతూ అందుకు సబందించి ఆదాయ పన్నులను చెల్లించడం లేదని, అక్ర మ ఆస్తులను కలిగి ఉన్నాయని బావించిన ఐటీ శాఖ ఈ దాడులకు పూనుకుంది. మంగ ళవారం మధ్యాహ్నం నుంచి ఆయా దుకాణాల్లోనే ఉండి తనిఖీలు చేశారు. మంగ ళవారం రాత్రి, బుధవారం ఉదయం వరకు కూడా తనిఖీలు చేశారు. అయి తే దాడుల అంశాలను ఆదాయపన్ను శాఖ అధికారులు బయటకు పొక్కనివ్వలేదు. జ్యూయలరీ దుకాణాల్లో జరిగిన దాడులతో జిల్లాలోని వ్యాపార, వాణిజ్య, పరిశ్రమ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆదాయ పన్నుల వ్యవహారంలో ఖమ్మం జిల్లా వెనకబడి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. వ్యాపార, వాణి జ్య వర్గాలు ఆదాయాలకు సంబందించి పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించటం లేదని ఆ శాఖ గుర్తించింది. దీంతో ఆ శాఖ దాడు లు నిర్వహిస్తుందని, దాడులు ముమ్మరం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వ్యా పార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఖమ్మం నగరంలోని జ్యూయలరీ దుకా ణాలపై ఐటీ దాడులు జరగటం వివిధ వర్గాల ప్రజల్లో ఆందోâýæన కలిగిస్తోంది. -
కన్నకొడుకే కాలయముడు
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి దారుణహత్య బయ్యారంలో కిడ్నాప్, ఖమ్మంలో హతమార్చిన పెద్ద కొడుకు మొదటి భార్య, మరో తనయుడిపై ఆరోపణలు తండ్రి అనే కనికరం కూడా లేకుండా కన్నకొడుకే పాశవికంగా ప్రవర్తించాడు. ఆస్తిపై ఆశనో, ఉద్యోగంపై మోజో కానీ..కిడ్నాప్ చేసి మరీ అంతమొందించాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. జిల్లాకేంద్రంలోని బుర్హాన్‌పురంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి హత్యతో ఆ ప్రాంతవాసులు భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఆరోపణలెదుర్కొంటున్న వారిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఖమ్మం క్రైం: బయ్యారంలో బీఎస్ఎన్ఎల్ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న పెసర రంగýయ్య(53)ను మొదటి భార్య పెద్ద కొడుకు విజయ్ మంగళవారం మెడకు చీర బిగించి హత్య చేశాడు. బయ్యారంలో సోమవారం తండ్రిని కిడ్నాప్ చేసి ఖమ్మం బుర్హాన్‌పురంలోని తన ఇంటికి తరలించి..ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి భార్య కొడుకే.. వరంగల్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురంనకు చెందిన పెసర రంగýన్నకు ఖమ్మం బుర్హాన్‌పురంలో నివసిస్తున్న పుష్పతో మొదటి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు విజయ్, అజయ్. కాపురంలో కలతలతో 18 ఏళ్ల క్రితమే వీరు విడిపోయారు. అప్పటి నుంచి రంగయ్య మహబూబాబాద్‌లో ఉంటూ..బయ్యారంలో లైన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నల్లగొండ జిల్లా సూర్యపేట ఎలకారంనకు చెందిన శ్రీదేవి భర్త చనిపోవడంతో 8 ఏళ్ల క్రితం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి తేజశ్రీ అనే కూతురుంది. మొదటి భార్యకు, రంగయ్యకు మధ్య గొడవలతో మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో పెద్ద కొడుకు విజయ్ గతంలో నాలుగుసార్లు హత్యాయత్నం చేశాడు. గతంలో ఇతడిపై, మొదటి భార్య పుష్ప, ఆమె తండ్రి గోపిశెట్టి పెద్దమల్లయ్య, సోదరుడు శ్రీనివాస్‌లపై కేసులు నమోదయ్యాయి. =========================== స్నేహితులతో కలిసి ఘాతుకం.. సోమవారం విజయ్ ఖమ్మానికి చెందిన ఇద్దరు స్నేహితులు జమీల్, సతీష్‌లను తీసుకొని ఇన్నోవా వాహనంలో బయ్యారం వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న రంగయ్యను బలవంతంగా వాహనంలో ఎక్కించుకోని ఖమ్మంలోని విజయ్ ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఇంట్లో తండ్రిని విజయ్ దారుణంగా కొట్టాడు. తనను కొట్టొద్దని ఎంత ప్రాథేయపడ్డా కనికరించకుండా..చీరతో మెడకు ఉరివేసి హత్య చేశాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో టూటౌన్ పోలీస్ స్టేష్‌న్‌కు వెళ్లి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మిం చేప్రయత్నం చేశాడు. అప్పటికే బయ్యారంలో కిడ్నాప్ అయినట్లు రెండో భార్య శ్రీదేÐవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అనుమానంతో విజయ్ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్యచేసినట్లు ఒప్పుకొని..వివరాలు కక్కాడు. టూటౌన్ సీఐ రాజిరెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక బృందం కిడ్నాప్‌కు సహకరించిన జమీల్, సతీష్‌లను అదపులోకి తీసుకొని, కిడ్నాప్‌కు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బయ్యారంలో కిడ్నాప్ కేసు నమోదుకావడంతో గుండాల సీఐ, గార్ల-బయ్యారం ఇన్చార్జ్ సీఐ రవికుమార్ మంగళవారం ఖమ్మం వచ్చి..హత్య జరిగిన ఇంటిని పరిశీలించారు. మొదటి భార్య, చిన్న కొడుకు పరారీ.. మృతుడి మొదటి భార్య పుష్ప. ఆమె చిన్న కుమారుడు అజయ్ పరారీలో ఉన్నారు. ఈ హత్యలో వారి పాత్రపైనా అనుమానంతో విచారణ చేస్తున్నట్లు గార్లబయ్యారం సీఐ రవికుమార్, టూటౌన్ సీఐ రాజిరెడ్డి తెలిపారు. ఈ హత్య వెనుక వీరి కుటుంబంతో అనుబంధం ఉన్న ఒకరి హస్తం ఉందని రెండో భార్య శ్రీదేవి, మృతుని సోదరుడు మధుసూదన్ ఆరోపించారు. మొదటి భార్య పుష్పకు ఖమ్మంలో రూ.కోటి విలువ గల భవనాన్ని తన భర్త ఇచ్చాడని, జీతంలో సగం చెల్లిస్తున్నాడని అయినా..ఈ ఘోరానికి ఒడిగట్టారని తెలిపారు. పెద్ద కుమారుడు విజయ్, భార్య పుష్ప, చిన్న కుమారుడు అజయ్, పుష్ప తండ్రి పెద్దమల్లయ్య, సోదరుడు శ్రీనివాస్‌లు కలిసి ఈ హత్య చేశారని వీరు ఆరోపించారు. బయ్యారంలో కలకలం.. బయ్యారం: ఇక్కడ బీఎస్ఎన్ఎల్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న పి.రంగయ్యను సోమవారం బయ్యారంలో కిడ్నాప్ చేయడంతో స్థానికంగా కలకలం నెలకొంది. విధులు ముగించుకుంటున్న క్రమంలో వాహనంలో వెంబడించి..కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తెలియడంతో స్థానికంగా చర్చ జరిగింది. బయ్యారంలోనే కేసు కూడా నమోదు కావడంతో..ఉద్యోగి ఆచూకీపై ఉత్కంఠ నెలకొన్న క్రమంలో హతమయ్యాడని తెలిసి ఇక్కడి వారు భయాందోళన చెందారు. -
అడవిలో అలజడి
రేపు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకలు ∙సరిహద్దు ప్రాంతాలకు తరలిన పోలీసు బలగాలు చర్ల: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తామని ఆ పార్టీ బాధ్యులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెంకటాపురం సర్కిల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చర్ల మండలంలోని పలు ప్రాంతాల్లో మావోల పోస్టర్లు వెలవడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలను రంగంలోకి దించుతున్నారు. గ్రామాల్లో పోలీసు బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో ప్రత్యేక నిఘాను పెంచారు. సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి వెళ్లే మార్గాల్లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తున్నారు. మాజీ మిలిటెంట్లు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుంటున్నారు. మావోయిస్టుల కదలికలను పోలీసులు తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేష¯ŒS చేపట్టేందుకు సంసిద్ధులవుతున్నారు. మావోయిస్టులు విధ్వంసకర ఘటనలకు పాల్పడకుండా గట్టి భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే..అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల మధ్య అడవిబిడ్డలైన ఆదివాసీలు వణికిపోతున్నారు. ఉనికిని చాటుకునేందుకు చేసే చర్యలతో ఎలాంటి ఆపదను ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. -
వైఎస్సార్సీపీని బలోపేతం చేయాలి
రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటేశ్వరావు ఖమ్మం మామిళ్లగూడెం : వైఎస్సార్సీపీని బలోపేతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఖమ్మం నగర కమిటీతోపాటు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేశారు. నగర అధ్యక్షుడిగా తుమ్మ అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జమలాపురం రామకృష్ణ, యువజన సంఘం అధ్యక్షుడిగా ఆదూరి రాజవర్దన్రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా శుక్రవారం ముస్తఫానగర్‌లో జరిగిన సమావేశంలో మందడపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంతోపాటు డివిజన్ అధ్యక్షుల ప్రతిపాదనలు కూడా జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర కమిటీకి పంపామని, అందులోభాగంగా కొన్ని మండల కమిటీల ప్రతిపానలు కూడా పంపామని తెలిపారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయడంతోపాటు, పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సూచించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలయ్యేవిధంగా చూడాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, ఇంటింటికీ నల్లా కనెక్షన్, డబుల్ బెడ్రూం లాంటివి ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదని విమర్శించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి జమలాపురం రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకట్రామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, నగర నాయకులు కొవ్వూరి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, భువనగిరి వెంకటరమణ పాల్గొన్నారు. -
ఖమ్మంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
క్వాలీఫయింగ్ టోర్నీకి విశేష స్పందన ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా కేంద్రం ఖమ్మంలోని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం (నేటి) నుంచి రాష్ట్రస్థాయి అండర్–13, 15 బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించనున్నారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగే ఈ పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోటీలను నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. బుధవారం ఇక్కడి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన క్వాలీఫయింగ్ పోటీలకు మంచి స్పందన లభించింది. బాలురు 150మంది, బాలికలు 50మంది హాజరై ప్రతిభ చాటారు. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి తరలివచ్చారు. క్వాలీఫయింగ్ పోటీలను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ప్రతినిధి డాక్టర్ వి.సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు కాటమనేని రమేష్, కార్యదర్శి బాలసాని ఆనంద్, కోశాధికారి కె.శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్యదర్శులు పాటిబండ్ల యుగంధర్, నల్లమోతు రఘు, నల్లమోతు వెంకటేశ్వర్లు, ఉప్పల్‌రెడ్డి, డాక్టర్ కె.సావిత్రి పాల్గొన్నారు. -
గోపాల గోపాల
-
జయహో
-
ఖమ్మంలో బైక్ రేసింగ్
పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు ఖమ్మం అర్బన్ : ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో భాగంగా కొంతమంది యువకులు బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం. నగరంలోని మధురానగర్ రోడ్డులో నూతనంగా ఓ హోటల్ నిర్వహకులు యువకులకు వివిధ పోటీలను నిర్వహించారని, అందులో భాగంగానే కొంతమంది బైక్ రేసింగ్ నిర్వహించారని తెలిసింది. మొదటిస్థానం సాధించినవారికి రూ.5 వేలు ఇచ్చినట్లు సమాచారం. పోటీల్లో పాల్గొన్న ఓ యువకుడు కిందపడిపోయి తీవ్ర గాయాలపాలైనట్లు తెలిసింది. పోటీల్లో మెడికోలు, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మమతా రోడ్డులో బైక్ రేసింగ్ నిర్వహించడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవడంతో స్థానికులు 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో అర్బన్ పోలీసులు సంఘటనా స్థనాలనికి చేరుకుని కొంతమంది యువకులను అదపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అర్బన్ సీఐ శ్రీధర్‌ను వివరణ కోరగా బైక్ రేసింగ్‌లు జరిగినట్లు తమకు సమాచారం లేదన్నారు. కొంతమంది యువకులు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతుంటే గుర్తించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ముంచెత్తె..
వాజేడులో 13.9 సెం.మీ వర్షం జలకళను సంతరించుకున్న వాగులు పల్లెలకు నిలిచిపోయిన రాకపోకలు నీటిలోనే వరి నార్లు, పంట చేలు సాక్షిప్రతినిధి, ఖమ్మం వరుస వర్షాలతో వాగులు వంకలు జలకళను సంతరించుకున్నాయి. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా.. పంట చేలు నీటమునిగాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల జిల్లాలో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం గురువారం సాయంత్రానికి 33 అడుగులకు చేరింది. పరీవాహక గ్రామాల్లోని వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వాజేడులో అత్యధికంగా 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాచలంతోపాటు కొత్తగూడెం, పినపాక, ఖమ్మం నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 18 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 50,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇదే మండలం ఆర్.కొత్తగూడెం–కుర్నవల్లి మధ్య చింతగుప్ప దగ్గర చింతవాగు, పెదమిడిసిలేరు దగ్గర వాగులు పొంగి పొర్లుతున్నాయి. వెంకటాపురం మండలం పాత్రాపురం దగ్గర పాలెంవాగు, వెంకటాపురం వద్ద కంకలవాగు, ఆలుబాక వద్ద దిమ్మెలవాగు, వెంకటాపురం దగ్గర రాచవాగు పొంగి ప్రవహిస్తుండటంతో మండలంలో సుమారు 100 ఎకరాల వరి పంట నీటమునిగింది. అలాగే పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో వాజేడు గ్రామం వద్ద ఉన్న దొంగలవాగు, పేరూరు దగ్గర మర్రివాగు, మొరుమూరు కాలనీ వద్ద అల్లివాగు పొంగి పొర్లుతున్నాయి. దుమ్ముగూడెం మండలం గౌరారం వద్ద వాగు పొంగటంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పినపాక నియోజకవర్గంలోని గుండాల, అశ్వాపురం మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుండాల మండలంలోని కిన్నెరసాని, గల్లేరువాగు, మల్లన్నవాగు, ఏడుమెలికలవాగు, దున్నపోతులవాగుల ఉధృతితో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అశ్వాపురం మండలం గొందిగూడెం వద్ద ఇసుక వాగు, తుమ్మలచెరువు వద్ద గుండాల వాగు, లోతువాగు, గొల్లగూడెంలో నేలవాగు ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పినపాక మండలంలో 200 ఎకరాల్లో వరి నారు నీట మునిగింది. పోతిరెడ్డిపల్లి, ఏడూళ్ల బయ్యారం, సీతంపేట, జానంపేట గ్రామాల్లో వరి నారు మునిగిపోవడంతో రైతులు నష్టపోయారు. పాల్వంచలోని కిన్నెరసానికి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం కిన్నెరసాని ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు నీటిమట్టం 405.1 అడుగులకు చేరింది. బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు 2 గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం –––––––––––––––––––––––––––––––– మండలం వర్షపాతం(సెం.మీ.లలో) –––––––––––––––––––––––––––––––– వాజేడు 13.9 వెంకటాపురం 10.9 మణుగూరు 10 దుమ్ముగూడెం 9.4 చర్ల 7 అశ్వాపురం 6.4 బూర్గంపాడు 3.8 కొత్తగూడెం 3.7 భద్రాచలం 3.3 పాల్వంచ 3 –––––––––––––––––––––––––––––––––– -
ఈ–నామ్‌ను సమర్థంగా నిర్వహించాలి
వరంగల్ రీజియన్ మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు ఖమ్మం వ్యవసాయం: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ–నామ్(ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్)ను ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేశామని, దానిని సమర్థంగా నిర్వహించాలని వరంగల్ రీజియన్ మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి.శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం మార్కెట్ కార్యాలయంలో వర్తక సంఘం ప్రతినిధులతో ఈ–నామ్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధానం వల్ల పంట ఉత్పత్తులకు పోటీ ధర లభిస్తుందన్నారు. మన రాష్ట్రంలో 44 రెగ్యులేటెడ్ మార్కెట్లలో ఈ పద్ధతిని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన సరకును ఏ ప్రాంతం నుంచైనా కొనుగోలు చేసుకునే వీలుంటుందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఈ–నామ్ నిర్వహణకు ప్రస్తుత మార్కెట్ స్థాయి సరిపోదని, 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగి ఉండాలని అన్నారు. దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నున్నా కోదండరాములు, మాటేటి రామారావు మాట్లాడుతూ ఈ–నామ్ వ్యవస్థతో కమీషన్ వ్యాపారుల వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.