రెండో రోజు కొనసాగిన ఐటీ దాడులు
Published Wed, Sep 21 2016 11:02 PM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM
ఖమ్మం గాంధీచౌక్ : ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ సెంటర్‌లో ఉన్న జ్యూయలరీ దుకాణాల్లో రెండో రోజు బుధవారం ఆదా య పన్ను శాఖ దాడులు నిర్వహించింది. గాంధీచౌక్ సెంటర్‌లోని మూడు ప్రముఖ జ్యూయలరీ దుకాణాల్లో మంగâýæవారం ఆదా య పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో దాడులకు దిగారు. నలుగురు బృందంతో కూడిన అధికారులు మూడు దుకాణాల్లో ఆస్తులు తదితర ఆదాయ వివరాలను తనిఖీ లు చేశారు. ఈ దుకాణాలు అధిక ఆదాయాన్ని పొందుతూ అందుకు సబందించి ఆదాయ పన్నులను చెల్లించడం లేదని, అక్ర మ ఆస్తులను కలిగి ఉన్నాయని బావించిన ఐటీ శాఖ ఈ దాడులకు పూనుకుంది. మంగ ళవారం మధ్యాహ్నం నుంచి ఆయా దుకాణాల్లోనే ఉండి తనిఖీలు చేశారు. మంగ ళవారం రాత్రి, బుధవారం ఉదయం వరకు కూడా తనిఖీలు చేశారు. అయి తే దాడుల అంశాలను ఆదాయపన్ను శాఖ అధికారులు బయటకు పొక్కనివ్వలేదు. జ్యూయలరీ దుకాణాల్లో జరిగిన దాడులతో జిల్లాలోని వ్యాపార, వాణిజ్య, పరిశ్రమ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆదాయ పన్నుల వ్యవహారంలో ఖమ్మం జిల్లా వెనకబడి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. వ్యాపార, వాణి జ్య వర్గాలు ఆదాయాలకు సంబందించి పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించటం లేదని ఆ శాఖ గుర్తించింది. దీంతో ఆ శాఖ దాడు లు నిర్వహిస్తుందని, దాడులు ముమ్మరం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వ్యా పార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఖమ్మం నగరంలోని జ్యూయలరీ దుకా ణాలపై ఐటీ దాడులు జరగటం వివిధ వర్గాల ప్రజల్లో ఆందోâýæన కలిగిస్తోంది.
Advertisement
Advertisement