- పొంగుతున్న వాగులు
- నిండిన చెరువులు, ప్రాజెక్టులు
- పంటలు దెబ్బతింటాయేమోనని
- రైతుల ఆందోళన
- గుండాల మండలంలో అత్యధికంగా 9.22 సెం.మీ. వర్షపాతం
ఖమ్మం వ్యవసాయం:
జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గడిచిన నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులు నిండటంతో వరద నీటిని కిందకు వదులుతున్నారు. పాలేరు రిజర్వాయర్‌లోకి కూడా నీరు చేరుతోంది. బయ్యారం పెద్ద చెరువులోకి ఇల్లెందు, వరంగల్ జిల్లా కొత్తగూడ ప్రాంతాల నుంచి మసివాగు, పందిపంపుల వాగుల ద్వారా నీరు వస్తోంది. శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో శనివారం సగటున 2.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో భారీగా, నాలుగు మండలాల్లో సాధారణానికి మించి, 18 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 13 మండలాల్లో చిన్నపాటి వర్షం కురిసింది. అత్యధికంగా గుండాల మండలంలో 9.22 సెం.మీల వర్షపాతం నమోదైంది.
సాధారణాన్ని మించిన వర్షపాతం
సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 164 మి.మీ.లు. 24వ తేదీ నాటికి 131.0 మి.మీ. వర్షపాతం నమోదు కా వాలి. ఇప్పటికే 240.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే, సాధారణానికన్నా అధికంగా 83.3 శాతం నమో దైంది. జిల్లా వర్షపాతాన్ని పరిశీలిస్తే.. రెండు మండలాల్లో వర్షపాతం వెనకబడింది. 27 మండలాల్లో సాధారణ, 12 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
రైతుల్లో ఆందోâýæన
ప్రస్తుత వర్షాలతో నీరు నిల్వ ఉన్నట్టయితే పంటలు దెబ్బతింటాయేమోనని రైతులు ఆందోâýæన చెందుతున్నారు. భద్రాచలం ప్రాంతంలో ముందుగా సాగు చేసిన పత్తి చేలల్లో నీటి నిల్వ కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదమేర్పడింది. కొన్నిచోట్ల ఇప్పటికే బాగా పెరిగిన పత్తి, మొక్కజొ కూడా నేలవాలింది. నల్ల భూముల్లో వేసిన పత్తి, మిర్చికి అధిక తేమతో ప్రమాదముంది. మరిన్ని వర్షాలు పడితే నష్టం ఎక్కువగా ఉంటుందేమోనని రైతులు భయపడుతున్నారు. ఈ వర్షాలతో వరికి మాత్రం ఎలాంటి ఢోకా లేదు. అంతేకాదు, రబీ సాగుకు అనుకూలంగా కూడా.