క్వాలీఫయింగ్ మ్యాచ్‌లో ఆడుతున్న క్రీడాకారుడు
-
క్వాలీఫయింగ్ టోర్నీకి విశేష స్పందన
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా కేంద్రం ఖమ్మంలోని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం (నేటి) నుంచి రాష్ట్రస్థాయి అండర్–13, 15 బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించనున్నారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగే ఈ పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోటీలను నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. బుధవారం ఇక్కడి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన క్వాలీఫయింగ్ పోటీలకు మంచి స్పందన లభించింది. బాలురు 150మంది, బాలికలు 50మంది హాజరై ప్రతిభ చాటారు. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి తరలివచ్చారు. క్వాలీఫయింగ్ పోటీలను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ప్రతినిధి డాక్టర్ వి.సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు కాటమనేని రమేష్, కార్యదర్శి బాలసాని ఆనంద్, కోశాధికారి కె.శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్యదర్శులు పాటిబండ్ల యుగంధర్, నల్లమోతు రఘు, నల్లమోతు వెంకటేశ్వర్లు, ఉప్పల్‌రెడ్డి, డాక్టర్ కె.సావిత్రి పాల్గొన్నారు.