కన్నకొడుకే కాలయముడు | son murder her dad in khammam | Sakshi
Sakshi News home page

కన్నకొడుకే కాలయముడు

Published Tue, Sep 20 2016 11:25 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

హత్య జరిగిన మొదటి భార్య ఇంటిని పరిశీలిస్తున్న టూటౌన్‌సీఐ రాజిరెడ్డి, గార్ల-బయ్యారం సీఐ రవి, రంగయ్య మృతదేహం,  పెద్ద కుమారుడు విజయ్‌ - Sakshi

హత్య జరిగిన మొదటి భార్య ఇంటిని పరిశీలిస్తున్న టూటౌన్‌సీఐ రాజిరెడ్డి, గార్ల-బయ్యారం సీఐ రవి, రంగయ్య మృతదేహం, పెద్ద కుమారుడు విజయ్‌

  • బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి దారుణహత్య
  • బయ్యారంలో కిడ్నాప్‌, ఖమ్మంలో హతమార్చిన పెద్ద కొడుకు
  • మొదటి భార్య, మరో తనయుడిపై ఆరోపణలు
  •  
    తండ్రి అనే కనికరం కూడా లేకుండా కన్నకొడుకే పాశవికంగా ప్రవర్తించాడు. ఆస్తిపై ఆశనో, ఉద్యోగంపై మోజో కానీ..కిడ్నాప్‌‌ చేసి మరీ అంతమొందించాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. జిల్లాకేంద్రంలోని బుర్హాన్‌పురంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి హత్యతో ఆ ప్రాంతవాసులు భయాందోళన చెందారు. ఈ ఘటనలో ఆరోపణలెదుర్కొంటున్న వారిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. 
     
    ఖమ్మం క్రైం: బయ్యారంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న పెసర రంగýయ్య(53)ను మొదటి భార్య పెద్ద కొడుకు విజయ్‌ మంగళవారం మెడకు చీర బిగించి హత్య చేశాడు. బయ్యారంలో సోమవారం తండ్రిని కిడ్నాప్‌ చేసి ఖమ్మం బుర్హాన్‌పురంలోని తన ఇంటికి తరలించి..ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. టూ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
    • మొదటి భార్య కొడుకే..
    వరంగల్‌ జిల్లా గూడూరు మండలం గోవిందాపురంనకు చెందిన పెసర రంగýన్నకు ఖమ్మం బుర్హాన్‌పురంలో నివసిస్తున్న పుష్పతో మొదటి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు విజయ్, అజయ్‌. కాపురంలో కలతలతో 18 ఏళ్ల క్రితమే వీరు విడిపోయారు. అప్పటి నుంచి రంగయ్య మహబూబాబాద్‌లో ఉంటూ..బయ్యారంలో లైన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నల్లగొండ జిల్లా సూర్యపేట ఎలకారంనకు చెందిన శ్రీదేవి భర్త చనిపోవడంతో 8 ఏళ్ల క్రితం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి తేజశ్రీ అనే కూతురుంది. మొదటి భార్యకు, రంగయ్యకు మధ్య గొడవలతో మహబూబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో పెద్ద కొడుకు విజయ్‌ గతంలో నాలుగుసార్లు హత్యాయత్నం చేశాడు. గతంలో ఇతడిపై, మొదటి భార్య పుష్ప, ఆమె తండ్రి గోపిశెట్టి పెద్దమల్లయ్య, సోదరుడు శ్రీనివాస్‌లపై కేసులు నమోదయ్యాయి.
    ===========================
    • స్నేహితులతో కలిసి ఘాతుకం..
     సోమవారం విజయ్‌ ఖమ్మానికి చెందిన ఇద్దరు స్నేహితులు జమీల్, సతీష్‌లను తీసుకొని ఇన్నోవా వాహనంలో బయ్యారం వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న రంగయ్యను బలవంతంగా వాహనంలో ఎక్కించుకోని ఖమ్మంలోని విజయ్‌ ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఇంట్లో తండ్రిని విజయ్‌ దారుణంగా కొట్టాడు. తనను కొట్టొద్దని ఎంత ప్రాథేయపడ్డా కనికరించకుండా..చీరతో మెడకు ఉరివేసి హత్య చేశాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో టూటౌన్‌ పోలీస్‌ స్టేష్‌న్‌కు వెళ్లి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మిం చేప్రయత్నం చేశాడు. అప్పటికే బయ్యారంలో కిడ్నాప్‌ అయినట్లు రెండో భార్య శ్రీదేÐవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అనుమానంతో విజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్యచేసినట్లు ఒప్పుకొని..వివరాలు కక్కాడు. టూటౌన్‌ సీఐ రాజిరెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక బృందం కిడ్నాప్‌కు సహకరించిన జమీల్, సతీష్‌లను అదపులోకి తీసుకొని, కిడ్నాప్‌కు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బయ్యారంలో కిడ్నాప్‌ కేసు నమోదుకావడంతో గుండాల సీఐ, గార్ల-బయ్యారం ఇన్‌చార్జ్‌ సీఐ రవికుమార్‌ మంగళవారం ఖమ్మం వచ్చి..హత్య జరిగిన ఇంటిని పరిశీలించారు. 
    • మొదటి భార్య, చిన్న కొడుకు పరారీ..
    మృతుడి మొదటి భార్య పుష్ప. ఆమె చిన్న కుమారుడు అజయ్‌ పరారీలో ఉన్నారు. ఈ హత్యలో వారి పాత్రపైనా అనుమానంతో విచారణ చేస్తున్నట్లు గార్లబయ్యారం సీఐ రవికుమార్, టూటౌన్‌ సీఐ రాజిరెడ్డి తెలిపారు. ఈ హత్య వెనుక వీరి కుటుంబంతో అనుబంధం ఉన్న ఒకరి హస్తం ఉందని రెండో భార్య శ్రీదేవి, మృతుని సోదరుడు మధుసూదన్‌ ఆరోపించారు. మొదటి భార్య పుష్పకు ఖమ్మంలో రూ.కోటి విలువ గల భవనాన్ని తన భర్త ఇచ్చాడని, జీతంలో సగం చెల్లిస్తున్నాడని అయినా..ఈ ఘోరానికి ఒడిగట్టారని తెలిపారు. పెద్ద కుమారుడు విజయ్‌, భార్య పుష్ప, చిన్న కుమారుడు అజయ్, పుష్ప తండ్రి పెద్దమల్లయ్య, సోదరుడు శ్రీనివాస్‌లు కలిసి ఈ హత్య చేశారని వీరు ఆరోపించారు. 
    • బయ్యారంలో కలకలం..
    బయ్యారం: ఇక్కడ బీఎస్‌ఎన్‌ఎల్‌ లైన్‌మన్‌గా పనిచేస్తున్న పి.రంగయ్యను సోమవారం బయ్యారంలో కిడ్నాప్‌ చేయడంతో స్థానికంగా కలకలం నెలకొంది. విధులు ముగించుకుంటున్న క్రమంలో వాహనంలో వెంబడించి..కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని తెలియడంతో స్థానికంగా చర్చ జరిగింది. బయ్యారంలోనే కేసు కూడా నమోదు కావడంతో..ఉద్యోగి ఆచూకీపై ఉత్కంఠ నెలకొన్న క్రమంలో హతమయ్యాడని తెలిసి ఇక్కడి వారు భయాందోళన చెందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement