తిక్కిరెడ్డిపాలెంలో నకిలీ కారంపొడి బస్తాలు
తిక్కిరెడ్డిపాలెంలో నకిలీ కారంపొడి బస్తాలు
Published Wed, Nov 30 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
ప్రత్తిపాడు : ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం శివారులోని డొంకలో నకిలీ కారంపొడి బస్తాలు ప్రత్యక్షమయ్యాయి. తిక్కిరెడ్డిపాలెం నుంచి యనమదల వెళ్లేదారిలో ఉన్న డొంకలో సుమారు 40 నుంచి 50 బస్తాలు పడేసి వాటికి నిప్పు పెట్టారు. ఒక్కో బస్తా సుమారు యాభై కేజీల వరకు ఉంటుంది. పూర్తిగా కాలకపోవడంతో ఉదయం పొలాలకు వెళ్లే రైతులు నకిలీ కారం బస్తాలను గమనించారు. నిన్న ఇక్కడ బస్తాలు లేవని, రాత్రి ఎవరో ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ పడేసి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. పడవేసిన బస్తాలు రంపపుపొట్టును తలపించేలా ఉన్నాయి.
Advertisement
Advertisement