
ఈఫిల్ టవర్ నకిలీ, అసలు చిత్రాలు
ఇక్కడ రెండు ఈఫిల్ టవర్లు ఉన్నాయి.. ఒకటి ప్యారిస్‌లో.. రెండోది చైనాలోని తయాండు చెంగ్‌లో ఉంది.. ఇంతకీ ఈ రెండిట్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్?? తెలియడం లేదా.. లేటెస్ట్ ఐఫోన్‌కు కూడా వెంటనే డూప్లికేట్ తయారుచేసేసే చైనాలో.. ఈఫిల్ టవర్‌కు డూప్లికేట్ సృష్టించడం ఓ లెక్కా.. అందుకే తయాండుచెంగ్‌లో కట్టేశారు. చుట్టుపక్కల ఉన్న భవనాలను కూడా దాదాపు అరే రీతిలో నిర్మించారు. ఈఫిల్ విషయానికొస్తే.. అసలైనదాని పొడవుతో పోలిస్తే.. అందులో మూడోవంతు ఎత్తులో డూప్లికేట్ ను కట్టారు. ఇంతకీ ఒరిజినల్ ఏదో చెప్పలేదు కదూ. కుడివైపున ఉన్నది అసలైన ఈఫిల్ టవర్.