మూడు పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌ | duplicate doctor arrest | Sakshi
Sakshi News home page

మూడు పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌

Published Thu, Jan 25 2018 6:04 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

duplicate doctor arrest

గుంటూరు : మూడు పెళ్లిళ్లు చేసుకున్న చిలూకూరి వీరాంజనేయులు అనే నకిలీ డాక్టర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరాంజనేయులు మూడో భార్య ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌గా నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నట్లుగా వెల్లడైంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో 9 ఏళ్ల పాటు టెక్నీషియన్‌గా వీరాంజనేయులు పని చేశారు.

అక్కడ గడించిన అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల క్లినిక్‌లు ఏర్పాటు చేశాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఏపీ మెడికల్ కౌన్సిల్ పేరుతో నకిలీ సర్టిఫికేట్ తయారు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement