
సాక్షి, గుంటూరు: రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు పరుస్తున్నామని..పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కలిగిన అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నామని..కొంతమంది పోలీసులను నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెడ్‌జోన్లలో డ్రోన్లు ద్వారా నిఘా పెట్టామని పేర్కొన్నారు.
(ఉలిక్కిపడ్డ సిక్కోలు.. అసలు ఏం జరిగింది?)
నరసరావుపేటలో ఒక ప్రముఖ వైద్యునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని.. ఆయనతో పాటు ఆసుపత్రి సిబ్బంది, 167 మంది ఔట్ పేషెంట్లను కూడా క్వారంటైన్‌కు తరలించామని వెల్లడించారు. పొందుగుల చెక్‌పోస్టు దగ్గర కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి ఉన్నవారినే ఏపీలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. లాక్‌డౌన్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment