ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిïÙల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) రెండు వారాల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలైన టీకాలను కనిపెట్టడం ఎలా అన్నదానిపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్–వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్‌ను పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్, కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నాయి. అసలైన టీకాలను ఎలా గుర్తించాలో చూద్దాం..
కోవిషీల్డ్
► లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
► వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
► ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది.
► జనరిక్ పేరు బోల్డ్ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది.
► సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి.
► వయల్‌పై లేబుల్ అతికి ఉన్నచోట ఎస్‌ఐఐ లోగో కనిపిస్తుంది.
► ఎస్‌ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది.
► లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు.
► మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది.
కోవాగ్జిన్
► లేబుల్‌పై డీఎన్‌ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది.
► లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment