యూజీసీ సభ్యుడిగా సీనియర్ విద్యావేత్త ప్రొఫెసర్ జి.గోపాల్‌రెడ్డిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది.
సాక్షి, న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సభ్యుడిగా సీనియర్ విద్యావేత్త ప్రొఫెసర్ జి.గోపాల్‌రెడ్డిని నియ మించాలని కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖ నిర్ణయించింది. రెండు మూడ్రో జుల్లో ఉత్తర్వులు వెలువడుతా యని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గోపాల్‌రెడ్డితో పాటు ప్రొఫెసర్ సుష్మా యాదవ్‌ను కూడా యూజీసీ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయించింది. ఉస్మానియా వర్సిటీతో అనుబంధమున్న గోపాల్ రెడ్డికి పొలిటికల్ సైన్స్‌లో 30ఏళ్లకు పైగా బోధనా అనుభవం ఉంది.