
న్యూఢిల్లీ: నెలలోపు అడ్మిషన్లు ఉపసంహరించుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫీజును తిరిగి ఇవ్వకపోవడం పట్ల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అన్ని వర్సిటీలు, కళాశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము జారీచేసిన మార్గదర్శకాలను పాటించకపోతే కళాశాలలు, వర్సిటీలు.. అఫిలియేషన్, డీమ్డ్ హోదాతో పాటు యూజీసీ సాయం కోల్పోతా యని హెచ్చరించింది.
ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరంలేదని మానవ వనరుల మంత్రి జవడేకర్ చెప్పారు. ఏ విద్యా సంస్థ కూడా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను తమ వద్దే అట్టిపెట్టుకోకూడదన్నారు. స్వీయ ధ్రువీ కరణ నకలు పత్రాలు ఇస్తే సరిపోతుందని తెలిపారు. అడ్మిషన్ల గడువు ముగియడానికి 15 రోజుల ముందు విద్యార్థి ప్రవేశాన్ని ఉపసంహరించుకుంటే మొత్తం ఫీజు తిరిగి చెల్లించాలి.