Original certificates
-
స్టాఫ్‌నర్స్ ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్‌నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మేంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తం స్టాఫ్‌నర్స్ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాశారు. వారిలో నుంచి 8,892 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినట్లు ఆయన వివరించారు. శనివారం (30వ తేదీ) నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పారు. వెరిఫికేషన్ ఎక్కడంటే.. ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్), 120/పీ, సెయింట్ మైకేల్స్ కాలనీ, అభ్యుదయన గర్, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికె ట్లు, డాక్యుమెంట్లతోపాటు వాటికి సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. అలాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్ పీడీఎఫ్‌ను వెంట తీసుకొని రావాలి. ఎవరెవరు ఏయే సర్టిఫికెట్లు తేవాలంటే.. ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ అందించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తారు. ఈడబ్ల్యూఏఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు తాజా ఆదాయ ధ్రువీకరణపత్రం తీసుకురావాలి. స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేసే వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్ తీసుకురావాలి. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ తీసుకురావాలి. స్థానికతను తెలిపే సర్టిఫికెట్లు, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకొని రావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తేకుంటే అభ్యర్థిత్వం రద్దు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాకపోవడం లేదా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. ప్రొవిజినల్ జాబితా ఎంపిక జాబితా కాదని గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, 7,094 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వచ్చిన వారిలో అనర్హులుండి, పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, తమ వద్ద ఉన్న అర్హుల జాబితా నుంచి మరికొందరిని పిలుస్తామని ఆయన తెలిపారు. నిర్ణీత రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయం... ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఆరో తేదీ వరకు ప్రతి రోజూ మూడు సెషన్లలో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ నిర్వహిస్తారు. ప్రతీ సెషన్లో 400 నుంచి 500 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ మేర కు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మొదటి సెషన్: ఉదయం 9.15 నుంచి 11.15 గంటల వరకు రెండో సెషన్: మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మూడో సెషన్: మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు -
పీఏసీఎల్ కేసులో రిఫండ్స్ షురూ
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్‌లో నష్టపోయిన ఇన్వెస్టర్లు మార్చి 20లోగా ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ తాజాగా స్పష్టం చేసింది. తద్వారా అర్హతగల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. రూ. 15,001–17,000 మధ్య క్లెయిము చేస్తున్న ఇన్వెస్టర్లకు ఒరిజనల్ పత్రాల పరిశీలన తదుపరి రిఫండ్లను చేపట్టనున్నట్లు వివరించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ఇన్వెస్టర్లు ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసి ఉంటుందని వెబ్సైట్లో సెబీ పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత కమిటీ పీఏసీఎల్ ఆస్తుల విక్రయం, ఇన్వెస్టర్ల రిఫండ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇప్పటికే రిఫండ్ల ప్రాసెస్‌ను దశలవారీగా చేపట్టింది. అర్హతగల ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పీఏసీఎల్ రిజిస్టర్డ్ పత్రాలు దాఖలు చేయవలసిందిగా తెలియజేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు 2016లో సెబీ కమిటీ ఏర్పాటైంది. ఒరిజనల్ సర్టిఫికెట్ల దాఖలును 2023 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20వరకూ అనుమతిస్తారు. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో పీఏసీఎల్ (పెరల్ గ్రూప్) పబ్లిక్ నుంచి రూ. 60,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఈ నిధులను 18ఏళ్లపాటు చట్టవిరుద్ధ పథకాల ద్వారా సమీకరించినట్లు సెబీ గుర్తించింది. -
ప్రయివేట్ కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్ : పాసైన ఇంటర్ విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు వారికి తిరిగి ఇవ్వాల్సిందేనని ప్రయివేట్ కళాశాలలకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా కొన్ని ప్రయివేట్ కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా దగ్గర పెట్టుకోవడాన్ని సవాల్ చేస్తూ నికేశ్ అనే విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విద్యార్థి ఫీజులు చెల్లించినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు దగ్గరుంచుకోవడాన్ని తప్పుబట్టింది. వెంటనే విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఒకవేళ ఫీజులు చెల్లించకపోయినా సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాల్సిందేనని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఒరిజినల్స్’ అవసరంలేదు
ఖమ్మంక్రైం: పోలీస్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సిన అవసరం లేదని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగానే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోని రావాలన్నారు. పార్టు–2 అప్లికేషన్ అడ్మిట్ కార్డుతో పాటు ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబం«ధించిన జిరాక్స్‌కాపీలను ఈవెంట్స్‌కు తీసుకురావాలన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంచినీటి సదుపాయం, అంబులెన్స్‌తోపాటు ప్రాథమిక వైద్య పరీక్షల కోసం వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. ఏడోరోజు ఈవెంట్స్‌కు 1152మంది మహిళా అభ్యర్థులు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు మురళీధర్, శ్యామ్‌సుందర్, తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
ఒరిజినల్స్, ఫీజు తిరిగి ఇచ్చేయాల్సిందే
న్యూఢిల్లీ: నెలలోపు అడ్మిషన్లు ఉపసంహరించుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫీజును తిరిగి ఇవ్వకపోవడం పట్ల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అన్ని వర్సిటీలు, కళాశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము జారీచేసిన మార్గదర్శకాలను పాటించకపోతే కళాశాలలు, వర్సిటీలు.. అఫిలియేషన్, డీమ్డ్ హోదాతో పాటు యూజీసీ సాయం కోల్పోతా యని హెచ్చరించింది. ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరంలేదని మానవ వనరుల మంత్రి జవడేకర్ చెప్పారు. ఏ విద్యా సంస్థ కూడా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను తమ వద్దే అట్టిపెట్టుకోకూడదన్నారు. స్వీయ ధ్రువీ కరణ నకలు పత్రాలు ఇస్తే సరిపోతుందని తెలిపారు. అడ్మిషన్ల గడువు ముగియడానికి 15 రోజుల ముందు విద్యార్థి ప్రవేశాన్ని ఉపసంహరించుకుంటే మొత్తం ఫీజు తిరిగి చెల్లించాలి. -
అడ్మిషన్ వద్దనుకుంటే ఫీజు వెనక్కివ్వాలి
న్యూఢిల్లీ: విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకున్నప్పుడు వారు కట్టిన ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉన్నత విద్యా కళాశాలలు తిరిగి వెనక్కు ఇవ్వాల్సిందేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. లేకపోతే కళాశాలల గుర్తింపు, అనుమతులను రద్దు చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లకు సూచనలు చేశామనీ, విద్యార్థులను వేధించే కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని అధికారి వెల్లడించారు. ఈ నిబంధనలు డీమ్డ్ వర్సిటీలుసహా ఏఐసీటీఈ, యూజీసీ నియంత్రణలో ఉండే అన్ని కళాశాలలకు వర్తిస్తాయన్నారు. -
ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు!
-
ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు!
ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడి ‘ఇంజనీరింగ్’ విద్యార్థులకు సూచనలు సీటు, కాలేజీ మార్చుకోవాలనుకుంటే రెండో దశ వరకు ఆగండి కాలేజీల్లో ముందుగా ఫీజులు చెల్లించవద్దు బ్యాంకు చలానా మాత్రమే చెల్లించాలి అడ్మిషన్లలో కాలేజీలు ఇబ్బంది పెట్టకుండా చర్యలు హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని.. మొదటి దశ ప్రవేశాల్లో సీటు వచ్చినా, రెండో దశ ప్రవేశాలు పూర్తయ్యే వరకు కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని, స్పెషల్ ఫీజుల వంటివి చెల్లించొద్దని ఇంజనీరింగ్ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ సూచించారు. రెండో దశ కౌన్సెలింగ్‌కు వెళతామంటే సర్టిఫికెట్లు, డబ్బు తిరిగి ఇవ్వడం లేదనే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పారు. తమకు కేటాయించిన సీటును విద్యార్థులు వెబ్సైట్లో ‘యాక్సెప్టెన్సీ’ బటన్ నొక్కి కన్ఫర్మ్ చేస్తే చాలని, అడ్మిషన్ నంబర్ కూడా వచ్చేస్తుందని తెలిపారు. దానిని కాలేజీ యాజమాన్యం నిరాకరించడానికి వీల్లేని విధంగా ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇదివరకు విద్యార్థి కాలేజీలో రిపోర్టు చేశాక కాలేజీ వారే ధ్రువీకరించే విధానం ఉండగా.. ఈసారి దానిని మార్చేశామన్నారు. ప్రవేశాల విషయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను శ్రీనివాస్ వెల్లడించారు. ఫీజులు ఇస్తేనే అడ్మిషన్‌ను, సీటును కన్ఫర్మ్ చేస్తామంటూ కాలేజీలు చేసే వసూళ్లకు దీంతో అడ్డుకట్ట పడనుంది. ఆయన చేసిన సూచనలు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ►మొదటి దశలో సీటు వచ్చిన విద్యార్థుల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు అలాట్మెంట్ లెటర్‌ను (అందులో జీరో ఫీజు వస్తుంది) వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఆ పక్కనే స్టూడెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుంది. దానిని నొక్కితే చాలు విద్యార్థి అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది, అడ్మిషన్ నెంబర్ కూడా వస్తుంది. ►రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైనా.. కామన్ ఫీజు మినహా మిగతా ఫీజు చెల్లించాల్సిన వారు, ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి రాని వారు తమ సీటు అలాట్మెంట్ లెటర్‌తో పాటు చలానా ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నిర్ణీత ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచీల్లో చెల్లించాలి. చలానా చెల్లించారంటే వారి సీటు కన్ఫర్మ్ అయినట్టే. వారు కూడా అడ్మిషన్ నంబర్ కావాలంటే వెబ్సైట్లో స్టూడెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్‌ను నొక్కితే చాలు. వారు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఓకే చేయలేకపోయినా.. ఆ సాకుతో వారి సీటును కాలేజీలు నిరాకరించ డానికి వీల్లేదు. ►కాలేజీ స్పెషల్ ఫీజుల వంటివాటిని ఆ కాలేజీలో, ఆ కోర్సులో చేరాలనుకుంటేనే ముందుగా చెల్లించాలి. లేదంటే రెండో దశ కౌన్సెలింగ్ అయ్యే వరకు చెల్లించవద్దు. ►ఇక రెండో దశ ప్రవేశాల కోసం ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అందరూ అర్హులే. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోనివారికి 29న దానిని చేపట్టే అవకాశముంది. స మొదటిదశలో సీటు వచ్చినవారు రెండో దశ వెబ్ఆప్షన్లు ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొదటి దశలో సీటు వచ్చినదాని కంటే మంచి కాలేజీలను ఎంచుకోవాలి. ఎందుకంటే రెండో దశలో సీటు కేటాయింపు జరిగితే.. మొదటి దశలో వచ్చిన సీటు దానంతట అదే రద్దయిపోతుంది. ఒకవేళ సీటు రాకపోతే మొదటి దశ సీటు ఉండిపోతుంది. -
రేపటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం, కొత్తగూడెంలో కేంద్రాలు ఖమ్మం: బీఎడ్‌లో చేరే విద్యార్థుల కోసం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని క్యాంప్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుధాకర్, కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్‌ల్లోని నిర్దేశిత కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. కొత్తగూడెం, ఖమ్మం కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్‌లను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. ఎడ్‌సెట్ హాల్‌టికెట్, ర్యాంక్‌కార్డు, డిగ్రీ, ఇంటర్మీడియెట్, టెన్త్ క్లాస్ మెమోలు, స్టడీ సర్టిఫికెట్లు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డిగ్రీ టీసీ వెంట తీసుకురావాల్సిందిగా వివరించారు. -
సర్టిఫికెట్లు లేకున్నా కౌన్సెలింగ్‌కు అనుమతి
వెరిఫికేషన్ కేంద్రాలకు మౌఖిక ఆదేశాలు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు ఊరట ‘సాక్షి’ కథనానికి స్పందన హైదరాబాద్ : పీజీ ఈసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకున్నా వెరిఫికేషన్‌కు హాజరుకావచ్చు. అయితే.. బీటెక్‌లో అన్ని సబ్జెక్టులు పాసైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని వెరిఫికేషన్ కేంద్రంలో సమర్పించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ అందని కారణంగా పలు ఇంజనీరింగ్ కాలేజ్‌లు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని కారణంగా గేట్, పీజీ ఈసెట్ ర్యాంకర్లు ఈనెల 6నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్‌కు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై ఈనెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బీటెక్ పాసైనట్లు ధ్రువీకరణ పత్రం తెచ్చిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కౌన్సెలింగ్ కేంద్రాలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. పాసైనట్లు ధ్రువీకరణ ఇలా.. పీజీ ఈసెట్ వెరిఫికేషన్ కేంద్రాలకు వె ళ్లే అభ్యర్థులు విద్యార్హతల పత్రాలు కళాశాల్లోనే ఉన్నట్లైతే.. తమ వద్దే ఉన్నట్లుగా ప్రిన్సిపాల్ ఇచ్చే కస్టోడియన్ లెటర్‌ను వెరిఫికేషన్ అధికారులకు చూపవచ్చు. అదే లెటర్లో బీటెక్ అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులైనట్లుగా పేర్కొనాలి. లేదా పాస్ సర్టిఫికెట్ల జిరాక్సుప్రతులపై అటెస్టేషన్ చేసి ఇచ్చినా అనుమతిస్తారు. అలా కుదరని పక్షంలో.. సంబంధిత యూనివర్సిటీల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ల నుంచి సదరు విద్యార్థి బీటెక్ ఉత్తీర్ణులైనట్లు ధ్రువపత్రం (కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో జిరాక్సు ప్రతిని అటెస్టేషన్ చేయించి) తెచ్చినా సరిపోతుంది. ఆర్జేయూకేటీ పరిధిలోని బీటెక్ పాసైన వారికి కూడా ఈ తరహా లెటర్లు ఇవ్వాలని ఆయా సంస్థల డెరైక్టర్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. లెటర్లు తెచ్చినా చాలు: పీజీ ఈసెట్ కన్వీనర్ బీటెక్ పాసైన అభ్యర్థులకు సీఎంఎం జిరాక్సు ప్రతులపై అటెస్టేషన్ చేసి ఇవ్వాలని అన్ని యూనివర్సిటీల కంట్రోలర్లకు సూచించాం. కళాశాలల్లో ప్రిన్సిపాల్ నుంచి కస్టోడియన్ లెటరు తెచ్చినా అనుమతిస్తున్నాం. -
మోడల్ స్కూళ్లకు విద్యార్థుల ఎంపిక
కర్నూలు(ఓల్డ్‌సిటి), న్యూస్‌లైన్ : కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో మంగళవారం విద్యార్థుల ఎంపికకు సంబంధించి లక్కీడిప్ తీశారు. జిల్లాలోని 32 మండలాల్లో ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో మంగళవారం 16 పాఠశాలలకు సంబంధించి విద్యార్థులను, బుధవారం 16 పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ముందే ప్రకటించారు. దీంతో మంగళవారం ఉదయం సి.బెళగల్, కల్లూరు, గూడూరు, మిడ్తూరు, ఓర్వకల్లు, బనగానపల్లి, ఆస్పరి, మంత్రాలయం, మండలాల పాఠశాలల ఎంపిక చేపట్టారు. ఒక్కో మండలం ఎంపికను ఒక్కో గదిలో నిర్వహించారు. మధ్యాహ్నం నందవరం, పత్తికొండ, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు, మద్దికెర, గోనెగండ్ల మండలాల విద్యార్థులకు లక్కీడిప్ నిర్వహించారు. సి.బెళగల్ మండల మోడల్ స్కూల్ లక్కీడిప్ కార్యక్రమాన్ని అదనపు జాయింగ్ కలెక్టర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మోడల్ స్కూల్‌కూ 80 సీట్లు కేటాయించగా 16 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచినట్లు తెలిపారు. 80 మందిలో అనివార్యకారణాలతో ఎవరైనా హాజరు కాకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న 16 మందికి అవకాశం కల్పిస్తారన్నారు. సెలెక్ట్ అయిన విద్యార్థులు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 లోపు పాఠశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ అందజేయాలని లేక పోతే ఆ విద్యార్థి సీటు క్యాన్సిల్ అవుతుందని తెలిపారు. ఏపీ మోడల్ స్కూళ్లు గతేడాది ప్రారంభించగా అప్పుడు తక్కువ దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ సంవత్సరం ప్రతి మండలానికి 80 సీట్లు ఉండగా 200కుపైగా అప్లికేషన్స్ రావడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఏపీ మోడల్స్కూల్లో వచ్చిన ఫలితాలు పట్లా అశోక్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్దపాడు ఏపీ మోడల్ స్కూలు పాఠశాల ప్రిన్సిపాల్ జాస్మిన్, తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు తప్పని తిప్పలు కౌన్సెలింగ్ నిర్వహించే ఏపీ మోడల్ స్కూలు నగరశివారులో ఉండడం వ ల్ల జిల్లా నలుమూలల నుంచి వచ్చిన తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారికి కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉండడంతో చిన్న పిల్లలు ఎండలో నడవలేక తీవ్ర అవస్థలు పడ్డారు. జిల్లాలో మొత్తం 52 మండలాలు ఉండగా కేవలం 32 మండలాలకే మోడల్ స్కూళ్లు పెట్టారని, మిగిలిన మండలాల్లోనూ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కల్లూరు మండలానికి సంబంధించిన లక్కీడిప్‌లో స్వల్ప గందరగోళం చోటు చేసుకుంది. బాలికల జనరల్‌లో ఒకే నంబర్ రెండు సార్లు రిపీట్ కావడంతో గుర్తించిన తల్లిదండ్రలు ఆందోళనకు దిగారు. వెంటనే అదనపు సంయుక్త కలెక్టర్ అశోక్‌కుమార్ చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.