withdrawals
-
ఏటీఎం నగదు ఉపసంహరణ మరింత భారం
ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించేవారికి త్వరలో ఛార్జీలు పెంచనున్నాయి. ఏటీఎం లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యోచిస్తోంది. ఇది ఏటీఎం ద్వారా చేసే నగదు ఉపసంహరణలను మరింత ఖరీదైనవిగా చేస్తుంది. ఐదు లావాదేవీల ఉచిత పరిమితి ముగిసిన తర్వాత చేసే నగదు లావాదేవీలకు గరిష్ట రుసుమును రూ.21 నుంచి రూ.22కు పెంచాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫారసు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏటీఎం ద్వారా చేసే నగదు లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజు(ఇతర బ్యాంకు ఏటీఎం ద్వారా చేసే లావాదేవీలు) రూ.17 నుంచి రూ.19కి, నగదు రహిత లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కు పెరగవచ్చని సమాచారం.పెరుగుదల ఎందుకు?ద్రవ్యోల్బణం, అధిక రుణ వ్యయాలు, రవాణా, నగదు భర్తీకి సంబంధించిన ఖర్చుల కారణంగా బ్యాంకులు ఛార్జీలు పెంచుతున్నాయి. ఏటీఎం ఆపరేటర్లకు, ముఖ్యంగా మెట్రోయేతర ప్రాంతాల్లో నిర్వహణ ఖర్చులను భరించడానికి, ఏటీఎం సేవల సుస్థిరతకు సాయపడడానికి ఈ పెంపు అవసరమని బ్యాంకులు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఇంటర్ చేంజ్ ఫీజులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు.ఇదీ చదవండి: ప్రభుత్వ డివైజ్‌ల్లో ఏఐ టూల్స్ నిషేధం!వినియోగదారులపై ప్రభావంఈ సిఫార్సులను ఆర్బీఐ ఆమోదిస్తే వినియోగదారులు ఉచిత పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలకు చెల్లించే ఫీజు పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి తరచూ నగదు ఉపసంహరించుకునే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ప్రతిపాదిత ఫీజుల పెంపు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్బీఐ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ పెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయి. -
ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ నిబంధనలు
ముంబై: ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్స్పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) పాటించాల్సిన లిక్విడ్ అసెట్స్ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ రేటింగ్ పొందాలని హెచ్ఎఫ్సీలకు సూచించింది. పబ్లిక్ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. -
Russia-Ukraine war: రష్యా పీఛేముడ్!
మైకోలైవ్: ఉక్రెయిన్‌తో పోరులో రష్యాకు అవమానకరమైన రీతిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎనిమిదిన్నర నెలల యుద్ధంలో స్వాధీనం చేసుకున్న ఏకైక ప్రాంతీయ రాజధాని ఖెర్సన్‌ను కూడా వదిలేసుకుంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి ఖెర్సన్ నగరం సహా నీపర్ నది పశ్చిమ తీరం నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. మిలటరీ సామగ్రిని కూడా వెనక్కి తరలించినట్లు వెల్లడించింది. తాజా పరిణామాన్ని అధ్యక్షుడు పుతిన్ ఇబ్బందికరంగా భావించడం లేదని, ఖెర్సన్ ఇప్పటికీ తమదేనని రష్యా అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఖెర్సన్, మరో మూడు ప్రాంతాలు తమవేనంటూ నెల క్రితం రష్యా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. రష్యా ఆర్మీ పూర్తి స్థాయి ఉపసంహరణకు కనీసం మరో వారం పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా ఆర్మీ వెళ్లిపోయిన ఖెర్సన్‌లో పౌరులు ఉక్రెయిన్ జాతీయ జెండాలను ఎగురవేసి, హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఖెర్సన్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి కష్టతరంగా ఉందంటూ అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొనడం గమనార్హం. ఇటీవల తమ ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపైకి రష్యా దాడులు కొనసాగుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. రష్యా బలగాలు దొంగచాటున దాడులకు పాల్పడే ప్రమాదముందని, ఖెర్సన్‌ను ల్యాండ్మైన్లతో మృత్యునగరంగా మార్చేశారని ఉక్రెయిన్ అధికారులు అంటున్నారు. ఖెర్సన్‌పై పట్టుసాధించిన ఉక్రెయిన్ ఆర్మీ రష్యా ఆక్రమణలోని క్రిమియా తదితర దక్షిణ ప్రాంతాలపైకి దృష్టి సారించనుంది. ఉక్రెయిన్ సైన్యానికి, సరఫరాల రవాణాకు తీరప్రాంత ఖెర్సన్ ఒబ్లాస్ట్ రాజధాని ఖెర్సన్ నగరం వ్యూహాత్మకంగా చాలా కీలకంగా మారింది. -
గోగ్రా నుంచి మూడు రోజుల్లో సైన్యం వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సైన్యాన్ని వెనక్కి ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ నెల 12 సోమవారం వరకు గడువు ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి గత రెండేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న గోగ్రా–హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర్నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టామని భారత్, చైనా ప్రకటించిన ఒక్క రోజు తర్వాతే భారత్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వచ్చేవారం ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర అంశాలను కూడా పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బగాచి చెప్పారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మొదలైన సైన్యం ఉపసంహరణ సోమవారంతో ముగియాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తున్నటు చెప్పారు. 2020 జూన్ గల్వాన్‌లోయలో ఘర్షణలు జరగడానికి ముందు ఎలా ఉండేదో అలా ఉండేలా ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటాయన్నారు. -
రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్/ఆధార్
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా తెరవడానికి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పాన్/ఆధార్ నంబర్ ఇవ్వడడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించుకున్నా బ్యాంకుకు పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే, బ్యాంకు, పోస్టాఫీసులో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరవాలన్నా వీటిని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ సెహగల్ అన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీలు రూ.20 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీలను ఆదాయపన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపాజిట్లు, ఉపసంహరణకు పాన్‌ను తీసుకోవడం అంటే వ్యవస్థలో నగదును గుర్తించే విషయంలో ప్రభుత్వానికి సాయంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అనుమానిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను కఠినతరం చేస్తుంది’’అని సెహగల్ వివరించారు. -
వారిని విడుదల చేయండి!
న్యూయార్క్: సీఏఏ ఆందోళనల్లో అరెస్టైన 18మంది విద్యార్ధులను బేషరతుగా విడుదల చేయాలని ప్రవాస భారతీయ ప్రముఖులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రిపబ్లిక్‌డే సందర్భంగా బుధవారం వీరంతా ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ 18 విద్యార్ధులను అక్రమంగా నిర్భంధించారని, వీరిపై అన్ని కేసులను పూర్తిగా ఉపసంహరించాలని ప్రకటనలో కోరారు. ఈ 18మందిలో షర్జీల్ ఇమామ్ సహా 13మంది ముస్లింలున్నారు. ప్రకటనకర్తల్లో ఆస్ట్రేలియాలో ఎంపీగా ఎన్నికైన డేవిడ్ షోబ్రిడ్జి, ఆమ్నెస్టీకి చెందిన గోవింద్ ఆచార్య సహా పలు దేశాలకు చెందిన హక్కుల గ్రూపులు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, భారతీయ ముస్లింల అంతర్జాతీయ సమాఖ్య, దలిత్ సొలిడిటరీ ఫోరమ్ తదితరాలున్నాయి. -
సెన్సెక్స్.. రోలర్ కోస్టర్; +416 నుంచి –545కు..
ముంబై: కీలక ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకటనకు ముందు స్టాక్ మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకుంది. అమెరికాతో సహా ఇదే వారంలో పలుదేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ సమీక్ష సమావేశాల నేప థ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు. అలాగే ఒమిక్రాన్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఈ పరిణామాలతో మార్కెట్ సోమవారం భారీ పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 503 పాయింట్లు నష్టపోయి 58,283 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 17,368 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఒక ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తి డిని ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అధిక విక్రయాలు జరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2743 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1351 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. గరిష్టం నుంచి 960 పాయింట్ల పతనం సెన్సెక్స్ ఉదయం 317 పాయింట్ల లాభంతో 59,104 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు పెరిగి 17,619 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 416 పాయింట్లు పెరిగి 59,203 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు ర్యాలీ చేసి 17,511 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్‌లోనూ యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ గత ముగింçపుతో పోలిస్తే 545 పాయింట్లు కోల్పోయింది. వెరసి ఇంట్రాడే గరిష్టం(59,203) నుంచి 960 పాయింట్లు పతనమై 58,243కు చేరింది. అమ్మకాలు ఎందుకంటే...? ► అమెరికా ఫెడ్ రిజర్వ్‌తో పాటు ఈ వారంలో యూరోపియన్ యూనియన్ బ్యాంక్(ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌లు పరపతి సమీక్ష గణాంకాలు వెల్లడి కానున్నాయి. వడ్డీరేట్లు, బాండ్ల క్రయ, విక్రయాలు, ద్రవ్యవిధానంపై ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తమ వైఖరిని ప్రకటించనున్నాయి. ఇప్పటికే యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి వచ్చాయి. ► ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి కర్ఫ్యూలు, సరిహద్దుల మూసివేతతో సప్లై చైన్ దెబ్బతింది. ఫలితంగా అమెరికా నవంబర్ ద్రవ్యోల్బణం 39 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. దేశీయంగానూ ఇవే కారణాలతో ద్రవ్యోల్బణం పెరగవచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపునకు మొగ్గుచూపాయనే సంగతి తెలిసిందే. ► బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. కట్టడి చర్యలను మరింత కఠినం చేస్తే ఆర్థిక రికవరీ ఆగిపోవచ్చని ఆందోళనలు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. ► విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.8,879 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇందులో రూ.7,462 కోట్ల ఈక్విటీ మార్కెట్ నుంచి, డెట్ మార్కెట్ నుంచి రూ.1,272 కోట్లు, హైబ్రిడ్ ఫండ్స్ నుంచి రూ.145 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ, బ్యాంకింగ్ షేర్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. రూ. లక్ష కోట్ల సంపద మాయం సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోవడంతో రూ. లక్ష కోట్ల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.266 లక్షల కోట్లకు దిగివచ్చింది. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లను కోల్పోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► పేటిఎం యాప్ ద్వారా గత రెండు నెలల్లో వర్తకులకు చేసిన మొత్తం చెల్లింపుల విలువ(జీఎంవీ) రెట్టింపు అయినప్పటికీ.., పేటీఎం షేరు 1% నష్టపోయి రూ.1555 వద్ద స్థిరపడింది. ► బోర్డు సమావేశానికి ముందుకు ఈజీమైట్రిప్ షేరు పదిశాతం ర్యాలీ చేసి రూ.1039 వద్ద ముగిసింది. ► ఎంకే బ్రోకరేజ్ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించినా., స్టార్ హెల్త్ షేరు ఒకశాతం క్షీణించి రూ.897 వద్ద నిలిచింది. -
భారత్–చైనామధ్య 13వ దఫా చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో భారత్, చైనా ఆదివారం 13వ దఫా చర్చలు జరపనున్నాయి. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లలోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తూర్పు లద్దాఖ్ ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్లో 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయని వెల్లడించాయి. భారత బృందానికి లెహ్‌లోని 14 కారప్స్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నాయకత్వం వహించనున్నారు. డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల విషయం ప్రస్తుతానికి పక్కనబెట్టి, మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని చర్చల సందర్భంగా భారత్ ప్రతినిధులు పట్టుబట్టే అవకాశం ఉంది. 12వ విడత చర్చలు జూలై 31వ తేదీన జరిగాయి. ఫలితంగా కీలకమైన గోగ్రా పాయింట్ నుంచి రెండు దేశాల ఆర్మీ ఉపసంహరణ పూర్తయింది. చైనా మోహరింపులు ఆందోళనకరం ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా మిలటరీ మోహరింపులు కొనసాగించడం, మౌలిక వసతులను పెంచుకోవడం ఆందోళన కలిగించే అంశమని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. ఇండియాటుడే కాంక్లేవ్‌లో శనివారం ఆయన మాట్లాడారు. శీతాకాలం ఆసాంతం బలగాల మోహరింపులను చైనా కొనసాగించాలని చూస్తే, పాకిస్తాన్ వైపు ఎల్వోసీ (నియంత్రణ రేఖ) వెంబడి వంటి పరిస్థితికి దారితీయవచ్చని భావిస్తున్నామన్నారు. ఆ దేశ మిలటరీ పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ)కదలికలపై ఓ కన్నేసి ఉంచామన్నారు. చైనా సైన్యానికి సరితూగే స్థాయిలో భారత్ కూడా బలగాల మోహరింపులను కొనసాగిస్తుందని, ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రపంచమంతటా కోవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతుండటం, దక్షిణ చైనా సముద్రంలో ఒక వైపు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా..మరో వైపు భారత్‌తో ప్రతిష్టంభనను ఎందుకు కొరుకుంటోందనేది అర్థం కాని విషయమన్నారు. ఏదేమైనప్పటికీ తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభనతో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. కశ్మీర్లో పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ.. అఫ్గాన్ ఉగ్రవాదులు కశీ్మర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చెలాయించిన సమయంలోనూ అక్కడి ఉగ్రమూకలు కశీ్మర్‌లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు, ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు మన బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి, ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు కశీ్మర్లో పౌరులను లక్ష్యంగా చేసుకోవడంతో సంబంధం ఉన్నట్లు భావించడం లేదని తెలిపారు. లోయలో అశాంతిని ప్రేరేపించాలని కుట్రపన్నిన ఉగ్రమూకలు చివరి ప్రయత్నంగా అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నాయన్నారు. స్వేచ్ఛా నౌకాయానమే కీలకం: రాజ్‌నాథ్ భారతదేశ అభివృద్ధి స్వేచ్ఛా నౌకాయానంతోనే ఎక్కువగా ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎంతోకాలం నుంచి సముద్రంతోనే మనకు సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. మన వాణిజ్యం, ఆరి్థక వ్యవస్థ, మన పండుగలు, సంస్కృతి సముద్రంతోనే సాన్నిహిత్యం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, సముదప్రాంతానికి సంబంధించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం’ అని శనివారం జరిగిన భారత తీర రక్షక దళం(ఐసీజీ) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సముద్రయాన భద్రత లేకుండా, దేశానికి సమగ్ర రక్షణ వ్యవస్థను సాధించడం అసాధ్యమన్నారు. -
అనుకున్న సమయానికే ఉపసంహరణ
వాషింగ్టన్: ముందుగా అనుకున్నట్లే ఆగస్టు 31 నాటికి అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా మరోమారు ప్రకటించింది. ఐసిస్–కే కారణంగా తరలింపు ప్రక్రియ ప్రమాదకరంగా మారినా, అనుకున్న సమయానికే పూర్తి చేయాలని యూఎస్ నిర్ణయించింది. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, తమ దళాలు ప్రమాదంలో ఉన్నాయని, అయితే బలగాలు అఫ్గాన్‌లో ఉన్నంత కాలం ప్రమాదంలో ఉన్నట్లేనని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. తరలింపులో ఇది అత్యంత ప్రమాదకరమైన భాగమన్నాయి. కాబూల్ విమానాశ్రయంపై ఐసిస్–కే ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే! ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో తరలింపు వాయిదా వేయాలన్న ప్రతిపాదనేదీ రాలేదని, డెడ్‌లైన్ కల్లా ప్రక్రియ పూర్తి చేస్తామని మిలటరీ అధ్యక్షుడికి స్పష్టం చేసిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్‌సాకీ చెప్పారు. తరలింపు ప్రక్రియ ప్రస్తుతం తిరోగామి దిశలో (రెట్రోగ్రేడ్) ఉందన్నారు. అంటే రోజులు గడిచే కొద్దీ అఫ్గాన్‌లో ఉండే బలగాలు తగ్గుతూ వస్తుంటాయని, ఉన్న వారితోనే సురక్షితంగా అఫ్గాన్‌నుంచి బయటపడే ప్రక్రియ పూర్తి చేయాలని వివరించారు. తాలిబన్లను నమ్మలేం తాలిబన్లపై తమకు నమ్మకం లేదని, కానీ ప్రస్తుతం వారితో పనిచేయడం మినహా వేరే మార్గం లేదని సాకీ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌లో చాలా భూ భాగం తాలిబన్ల అధీనంలో ఉందని, విమానాశ్ర యం కూడా వారి స్వాధీనంలోనే ఉందని, అందువల్ల వారి సహకారంతో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు సుమారు 1,09,200 మందిని అఫ్గాన్ విమానాశ్రయం నుంచి తరలించామని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం 12 గంటల వ్యవధిలో 4,200 మందిని 12 యుద్ధ విమానాల్లో దేశం దాటించామని తెలిపాయి. జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 1,14,800 మందిని అఫ్గాన్ సరిహద్దులు దాటించామని వెల్లడించాయి. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా వీసాలున్న అర్హులైన అఫ్గాన్ పౌరులను దేశం దాటించే వరకు రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలని అధ్యక్షుడు బైడెన్ ఆదేశించినట్లు సాకీ తెలిపారు. పౌరుల తరలింపు పూర్తి శనివారానికి అఫ్గాన్‌లోని తమ పౌరులను తరలించే ప్రక్రియ పూర్తి అవుతుందని బ్రిటన్ ప్రకటించింది. దీంతో కేవలం కొన్ని మిలటరీ దళాలు మాత్రమే అఫ్గాన్‌లో ఉంటాయని, అవి కూడా ఆగస్టు 31కి స్వదేశానికి చేరతాయని బ్రిటన్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ నిక్‌కార్టర్ చెప్పారు. ఎంత ప్రయత్నించినా అందరినీ దేశం దాటించడం కుదరదని, నిజానికి ఇలాంటి ముగింపును తాము ఊహించలేదని తెలిపారు. ఆగస్టు 13 నుంచి దాదాపు 14,543 మందిని బ్రిటన్ కాబూల్ నుంచి తరలించింది. ఇంకా 100–150 మంది బ్రిటిష్ పౌరులు అఫ్గాన్‌లోనే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
Nifty: 15 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ నష్టపోయింది. డెరివేటివ్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ అంశం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫైనాన్షియల్ అసెట్స్ విలువలు అనూహ్యంగా పెరిగిపోవడం భారత్ వంటి ఈక్విటీ మార్కెట్లకు ప్రమాదమని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) హెచ్చరించింది. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 338 పాయింట్లు పతనమైన 49,565 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 15వేల దిగువన 14,906 వద్ద ముగిసింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. మెటల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. కమోడిటీ ధరలను అదుపులో పెట్టేందుకు చర్యలను తీసుకుంటామని చైనా ప్రకటనతో మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఆర్థిక, ప్రైవేట్ రంగ షేర్లలోనూ చెప్పుకొదగిన స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 406 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు చొప్పున నష్టాన్ని చవిచూశాయి. నష్టాల మార్కెట్లోనూ స్మాల్ క్యాప్ షేర్లు రాణించాయి. ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడ్ అవుతున్న చిన్న షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఓ దశలో 23,093 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరకు 22,980 వద్ద ముగిసింది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.876 కోట్ల షేర్లు అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.71 కోట్ల ఈక్విటీలను కొన్నారు. ‘‘ప్రపంచ ప్రతికూలతలు సూచీలను నష్టాల బాటపట్టించాయి. నిఫ్టీ సూచీ 15 వేల స్థాయిని కోల్పోయినప్పటికీ.. 14,900 స్థాయిని నిలుపుకోవడం కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా భావించాలి. ఇన్వెస్టర్లు దిద్దుబాటుకు ఆస్కారం లేని నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవాలి’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► మార్చి క్వార్టర్లో నికర లాభం ఆరు రెట్లు పెరగడంతో భాష్ షేరు ఏడుశాతానికి పైగా లాభపడి రూ.15846 వద్ద ముగిసింది. ► కరోనా వ్యాధిని నిర్ధారించే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కిట్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో సిప్లా షేరు 2% లాభంతో రూ.924 వద్ద స్థిరపడింది. ► మెరుగైన క్యూ4 ఫలితాలతో శక్తి పంప్స్ షేరు 15 శాతం లాభపడి రూ.712 వద్ద నిలిచింది. ► టాటా స్టీల్, హిందాల్కో, సెయిల్, జేఎస్పీఎల్ షేర్లు 4–6% క్షీణించడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ శాతం 3% నష్టపోయింది. -
చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం
బీజింగ్: కొన్ని నెలలుగా వివాదాస్పదంగా మారిన చైనా, భారత్ దేశాల సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగ్యాంగ్ సొ సరస్సు దక్షిణ, ఉత్తర సరిహద్దుల నుంచి చైనా, భారత్ బలగాల ఉపసంహరణ బుధవారం ప్రారంభమైందని చైనా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే, చైనా చేసిన ఈ ప్రకటనపై భారత్ స్పందించలేదు. ‘ప్యాంగ్యాంగ్ సొ సరస్సుకు దక్షిణ, ఉత్తర తీరాల వద్ద ఉన్న చైనా, భారత్ దేశాల ఫ్రంట్‌లైన్ దళాల ప్రణాళికాబద్ధ ఉపసంహరణ ఫిబ్రవరి 10న ప్రారంభమైంది’ అని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి, సీనియర్ కల్నల్ వూ క్విన్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కోర్ కమాండర్ స్థాయిలో జరిగిన తొమ్మిదవ విడత చర్చల సందర్భంగా కుదిరిన ఏకాభిప్రాయం మేరకు చైనా, భారత్ బలగాల ఉపసంహరణ ప్రారంభమైందన్నారు. -
మీ బలగాలను ఉపసంహరించుకోవాల్సిందే..
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకోవాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి తేల్చిచెప్పింది. ఇరు దేశాల మధ్య శుక్రవారం కమాండర్ స్థాయి అధికారుల చర్చలు జరిగాయి. సైనికుల ఉపసంహరణపై రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలోని చుషూల్‌లో ఉదయం 9.30 గంటలకు మొదలైన ఈ సంప్రదింపులు రాత్రి 7 గంటలకు ముగిశాయి. సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న చర్చల పరంపరలో ఇవి ఎనిమిదో దఫా చర్చలు కావడం విశేషం. ఎనిమిదో దఫా చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు. ఈ చర్చలు ఫలప్రదంగా సాగినట్లు అధికారులు తెలిపారు. యుద్ధావకాశాలు తోసిపుచ్చలేం: రావత్ తూర్పులద్దాఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసానికి పాల్పడుతోందని, అయితే భారత్ బలగాలు దాన్ని దీటుగా ఎదుర్కోవడంతో ఊహించని ఎదురుదెబ్బలు డ్రాగన్ దేశానికి తప్పడంలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని, యుద్ధానికి దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన వెల్లడించారు. చైనా, పాకిస్తాన్ కుమ్మౖక్కై ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతు న్నాయని, ఇది భారత ప్రాదేశిక సమగ్రతకు ప్రమాదంగా పరిణమించిందని తెలిపారు. -
భారీగా వెనక్కి మళ్లిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 1.5 బిలియన్ డాలర్లు (రూ.11,250 కోట్లు) వెనక్కి తీసుకున్నారు. మార్నింగ్ స్టార్ నివేదిక ప్రకారం చూస్తే.. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగింది. అయితే, ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో వెనక్కి వెళ్లిపోయిన నిధులతో చూస్తే చాలా తక్కువే. మార్చి క్వార్టర్ లో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా ఫోకస్డ్ ఫండ్స్, ఈటీఎఫ్ ల నుంచి ఏకంగా 5 బిలియన్ డాలర్లు (రూ.37,500 కోట్లు) ఉపసంహరించుకున్నారు. దీంతో 2020లో జూన్ నాటికి మొత్తం 6.5 బిలియన్ డాలర్లు (రూ.48,750 కోట్లు) భారత్ నుంచి వెళ్లిపోయినట్టు అయింది. 2019 పూర్తి సంవత్సరంలో ఇన్వెస్టర్లు 5.9 బిలియన్ డాలర్లనే వెనక్కి తీసుకోగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఇంతకంటే అధికంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో ప్రధానంగా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్, ఫోకస్డ్ ఈటీఎఫ్ ల ద్వారానే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. ► జూన్ త్రైమాసికంలో వెనక్కి వెళ్లిపోయిన పెట్టుబడులు.. ఇండియాఫోకస్డ్ ఫండ్స్ నుంచి 698 మిలియన్ డాలర్లు, ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఈటీఎఫ్ ల నుంచి 776 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్ లోకి వచ్చే పెట్టుబడులు సాధారణంగా దీర్ఘకాల విధానంతో ఉంటాయి. అదే ఆఫ్ షోర్ ఈటీఎఫ్ ల పెట్టుబడులు స్వల్పకాల విధానంతో కూడినవి. ► ఈ రెండు విభాగాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ 2018 ఫిబ్రవరి నుంచి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్ నుంచి 14.5 బిలియన్ డాలర్లు (రూ.1,08,750 కోట్లు) బయటకు వెళితే, ఇండియా ఫోకస్డ్ ఈటీఎఫ్ ల నుంచి ఇదే కాలంలో 4.2బిలియన్ డాలర్లు (రూ.31,500 కోట్లు) వెనక్కి తీసుకోవడం గమనార్హం. అంటే దీర్ఘకాల పెట్టుబడులే ఎక్కువగా బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. భారత్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అప్రమత్త ధోరణిని ఇది తెలియజేస్తోందని మార్నింగ్ స్టార్ నివేదిక తెలియజేసింది. ► ఈ స్థాయిలో నిధులు వెనక్కి వెళ్లడం ఊహించనిదేనని, భారతదేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, కరోనా వైరస్ చూపే ప్రభావంపై అనిశ్చిత పరిస్థితులను ఇందుకు కారణంగా పేర్కొంది. ► కరోనాపై భారత్ ఏ విధంగా పైచేయి సాధిస్తుందన్న దాని ఆధారంగానే భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని తెలిపింది. ► ఈ రెండు రకాల ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో 13 శాతం పెరిగి 33.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు భారీగా కోలుకోవడం ఆస్తుల విలువ పెరిగేందుకు దోహదపడింది. -
పీఎఫ్ నుంచి 3 వేల కోట్ల విత్‌డ్రాయల్స్..
కరోనా వైరస్‌పరమైన ఆర్థిక సమస్యలను గట్టెక్కేందుకు గత రెండు నెలల్లో దాదాపు 12 లక్షల మంది వేతనజీవులు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి సుమారు రూ. 3,360 కోట్ల మేర నిధులను ఉపసంహరించుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీ కింద ఈపీఎఫ్‌వో 12 లక్షల క్లెయిమ్స్‌ను సెటిల్ చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఆర్థిక కష్టాలు అధిగమించేందుకు 2.2 కోట్ల మంది నిర్మాణ రంగ కార్మికులకు రూ. 3,950 కోట్లు చెల్లించినట్లు మంత్రి వివరించారు. -
ఎన్పీఎస్ నుంచి ఉపసంహరణ
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) చందాదారులకు ‘పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ’(పీఎఫ్ఆర్డీఏ) వెసులుబాటు కల్పించింది. ఎన్పీఎస్ చందాదారులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకోవాల్సి వస్తే ఖర్చుల కోసం ఎన్పీఎస్ నిధి నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. కాగా, ఏపీవై చందాదారులకు ఇది వర్తించదు. ఈపీఎఫ్‌వో..ఉపసంహరణ రూ.280 కోట్లు కాగా, ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతించడంతో.. ఇప్పటి వరకు రూ.280 కోట్ల విలువకు సంబంధించి 1.37 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్‌వో శుక్రవారం ప్రకటించింది. ఈపీఎఫ్ నిధిలో చందాదారుని వాటా మొత్తం నుంచి 75 శాతం లేదా మూడు నెలల మూలవేతనం, కరువు భత్యం ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. -
‘బేర్’ బాజా!
ఈ ఏడాది మరో రేట్ల తగ్గింపు లేదని, ప్రస్తుత రేట్ల తగ్గింపు ‘తగ్గింపు సైకిల్’కు ఆరంభంగా పరిగణించకూడదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో గురువారం మన స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. కీలక పరిశ్రమలు, ద్రవ్యలోటు, వాహన విక్రయాల గణాంకాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్ల దిగువకు పతనమైంది. 138 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 463 పాయింట్లు క్షీణించి 37,018 పాయింట్ల వద్దకు చేరింది. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈ స్థాయిలకు పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ రెండు సూచీలకు ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ముడి చమురు ధరలు చెప్పుకోదగిన స్థాయిలో పడిపోయినా, మన మార్కెట్ పతనం ఆగలేదు. అయితే చివర్లో కొన్ని బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ 787 పాయింట్లు డౌన్... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. ఎన్ఎస్ఈ వీక్లీ ఆప్షన్ల ముగింపు కారణంగా మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్787 పాయింట్లు, నిఫ్టీ 204 పాయింట్ల వరకూ నష్టపోయాయి. ట్రేడింగ్ చివరి గంటలో కొంత నష్టాల రికవరీ జరిగింది. ఇంధన, వాహన షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం, హిందుస్తాన్ యూని లివర్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఈ రికవరీ కారణంగా సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,900 పాయింట్లపైన ముగియగలిగాయి. నికాయ్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► వేదాంత షేర్ 5.5% నష్టంతో రూ.145 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 600కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐషర్ మోటార్స్, బ్లూడార్ట్, ఎౖMð్స డ్ ఇండస్ట్రీస్, వీఎస్టీ టిల్లర్స్, కేర్ రేటింగ్స్, ఎస్కార్ట్స్, ఆర్తి ఇండస్ట్రీస్, వేదాంత, టాటా మోటార్స్, హిదాల్కో, బయోకా న్, ఓకార్డ్, గెయిల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తదతర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► ఓపెన్హీమర్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినప్పటికీ, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 4 శాతం మేర నష్టపోయి రూ.347 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ భారీ పతనంలోనూ 16 షేర్లు ఏడాది గరిష్ట స్థాయికి ఎగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, వైభవ్ గ్లోబల్ ఈ జాబితాలో ఉన్నాయి. 1.6 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో రూ.1.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.6 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.1,39,87,400 కోట్లకు తగ్గింది. తాజా బడ్జెట్ నుంచి చూస్తే, రూ.13.70 లక్షల కోట్లు సంపద ఆవిరైంది. రెండు నెలల్లో 9 శాతం డౌన్ ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది జూన్ 3న రికార్డ్ స్థాయి, 12,103 పాయింట్లను తాకింది. అప్పటి నుంచి కేవలం రెండు నెలల్లో 11,000 పాయింట్లకు (9%) పడిపోయింది. ఈ రెండు నెలల కాలంలో వాహన, బ్యాంక్, ఇంధన, మౌలిక, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 13%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 16% చొప్పున క్షీణించాయి. అంతేకాకుండా నిఫ్టీ 500 సూచీలోని 300కు పైగా షేర్లు 50–90 శాతం రేంజ్లో పతనమయ్యాయి. కాక్స్ అండ్ కింగ్స్, జెట్ ఎయిర్వేస్, సింటెక్స్ ప్లాస్టిక్స్, రిలయన్స్ క్యాపిటల్, డీహెచ్ఎఫ్ఎల్, జైన్ ఇరిగేషన్ , రిలయన్స్ ఇన్ఫ్రా, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పతనానికి కారణాలు ఇవీ.... ► ఫెడ్ కామెంట్స్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో రేట్లు 2.0–2.25 శాతం రేంజ్లో ఉన్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఫెడ్ రేట్లను తగ్గించింది. అయితే ఈ తగ్గింపు, రేట్ల తగ్గింపు సైకిల్‌కు ఆరంభం కాదని ఫెడ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. దీంతో సమీప భవిష్యత్తులో మరో రేట్ల పెంపు ఉండకపోవచ్చని ఫెడ్ సంకేతాలిచ్చినట్లయింది. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న తాజా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగియడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ► గణాంకాల నిరుత్సాహం: ఈ ఏడాది జూన్‌లో ఎనిమిదికీలక పరిశ్రమల వృద్ధి 0.2 శాతం తగ్గింది. సిమెంట్ ఉత్పత్తి, చమురు సంబంధిత రంగాల్లో మందగమనం చోటు చేసుకోవడం దీనికి కారణం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ద్రవ్యలోటు 61.4 శాతానికి (రూ.4.32 లక్షల కోట్లు) చేరింది. ఈ గణాంకాలు ఇన్వెస్టర్లలో నిరుత్సాహాన్ని నింపాయి. ► ఉత్తేజాన్నివ్వని వాహన విక్రయాలు: ఈ ఏడాది జూన్‌లో వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని కంపెనీలు వెల్లడించిన గణాంకాలు పేర్కొన్నాయి. ► కొనసాగుతున్న విదేశీ నిధుల ఉపసంహరణ: సంపన్నులపై విధించిన అదనపు పన్ను భారం విదేశీ ఇన్వెస్టర్లకు కూడా వర్తిస్తుంది. ఈ పన్ను విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు స్పష్టం చేయడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. బడ్జెట్ నుంచి ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు 300 కోట్ల డాలర్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని అంచనా. మన స్టాక్ మార్కెట్ జోరుకు కీలకమైన విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటంతో మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,870 కోట్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇదే ఎఫ్‌పీఐల అత్యధిక పెట్టుబడుల ఉపసంహరణ. సూపర్ రిచ్ పన్నుతో కినుక వహించిన విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. నిధుల ఉపసంహరణ కొనసాగుతుందని నిపుణులంటున్నారు. ► రూపాయి పతనం: డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు నష్టపోయింది. రూపాయి విలువ గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక దశలో 69.20కు పడిపోయింది. -
ఒరిజినల్స్, ఫీజు తిరిగి ఇచ్చేయాల్సిందే
న్యూఢిల్లీ: నెలలోపు అడ్మిషన్లు ఉపసంహరించుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫీజును తిరిగి ఇవ్వకపోవడం పట్ల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అన్ని వర్సిటీలు, కళాశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము జారీచేసిన మార్గదర్శకాలను పాటించకపోతే కళాశాలలు, వర్సిటీలు.. అఫిలియేషన్, డీమ్డ్ హోదాతో పాటు యూజీసీ సాయం కోల్పోతా యని హెచ్చరించింది. ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరంలేదని మానవ వనరుల మంత్రి జవడేకర్ చెప్పారు. ఏ విద్యా సంస్థ కూడా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను తమ వద్దే అట్టిపెట్టుకోకూడదన్నారు. స్వీయ ధ్రువీ కరణ నకలు పత్రాలు ఇస్తే సరిపోతుందని తెలిపారు. అడ్మిషన్ల గడువు ముగియడానికి 15 రోజుల ముందు విద్యార్థి ప్రవేశాన్ని ఉపసంహరించుకుంటే మొత్తం ఫీజు తిరిగి చెల్లించాలి. -
పీఎఫ్‌పై మరో 5 బ్యాంకులతో ఈపీఎఫ్‌వో జట్టు
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ బకాయిల స్వీకరణ, పీఎఫ్ విత్‌డ్రాయల్స్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో మరో అయిదు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వీటిలో ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న సంస్థలు అగ్రిగేటర్ విధానంలో కాకుండా పీఎఫ్ బకాయిలను ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించి నేరుగా ఈపీఎఫ్‌వో ఖాతాలోకే జమచేయొచ్చు. వసూళ్లు, చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడగలవని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. ఈపీఎఫ్‌వోకు వ్యయం దీనివల్ల ఏటా రూ. 125 కోట్లకు తగ్గనుంది. ఈ ఒప్పందాలు లేకపోతే.. ఈపీఎఫ్‌వో అగ్రిగేటర్ విధానంలో స్వయంగా బకాయిలను వసూలు చేసుకుని, చెల్లింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతీ లావాదేవీ వ్యయం సుమారు రూ. 12 మేర ఉంటోంది. వివిధ బ్యాంకుల్లో ఖాతాలున్న సభ్యులకు చెల్లింపులు జరిపేందుకు ఏటా తమకు రూ. 350 కోట్ల మేర లావాదేవీ వ్యయాలు అవుతున్నాయని.. ఎస్బీఐతో పాటు పీఎన్బీ తదితర బ్యాంకులతో టైఅప్ కారణంగా ఇది ఇప్పటికే రూ. 175 కోట్లకు తగ్గిందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు. తాజాగా మరో అయిదు బ్యాంకులతో ఒప్పందాల వల్ల లావాదేవీ వ్యయాలు మరో రూ. 50 కోట్ల దాకా తగ్గుతాయన్నారు. ఇంకో ఏడు బ్యాంకులతో కూడా చర్చలు జరుపుతున్నామని, అవి కూడా ఫలవంతమైతే వ్యయాలు ఏటా కేవలం కొన్ని కోట్లకు మాత్రమే పరిమితం కాగలవని జాయ్ చెప్పారు. -
వర్గపోరుతో నిధుల వాపస్
రూ.3.20 కోట్ల సబ్‌ప్లాన్ నిధులు వెనక్కి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల విభేదాలే కారణం దళితవాడల అభివృద్ధిపై చిత్తశుద్ధి కరువు ఆ నిధులు మళ్లీ తెచ్చుకోవడం కష్టమే కదిరి : కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వర్గాలకు చెందిన కౌన్సిలర్ల మధ్య విభేదాల నేపథ్యంలో దళితవాడల అభివృద్ధి కోసం మంజూరైన రూ.3.20 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ నిధులు తమ వార్డులోనే ఖర్చు చేయాలని ఒక వర్గం.. కాదు తమ వార్డులోనే వెచ్చించాలంటూ మరో వర్గం వారు పోటీపడ్డారు. ఆఖరుకు ఎక్కడా ఖర్చు చేయకుండానే వచ్చిన నిధులన్నీ తిరుగుముఖం పట్టాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్ చంద్రశేఖర్ (36వ వార్డు) గతంలో తన పదవికి రాజీనామా సమర్పించారు. కొందరు నచ్చజెప్పడంతో ఆఖరుకు తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తల్లి నారాయణమ్మ పేరుమీద అనధికారికంగా ఏర్పడిన కాలనీకే ఎక్కువ మొత్తంలో సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని కౌన్సిల్ ఆమోదం కోసం అజెండా సిద్ధం చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు సొంత పార్టీ కౌన్సిలర్లు సైతం కొందరు వ్యతిరేకించడంతో కౌన్సిల్ ఆమోదం పొందలేదు. ఎస్సీ, ఎస్టీలున్న చోటే ఖర్చు చేయాలి వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆ వర్గాల ప్రజలు ఎక్కువ శాతం నివాసమున్న ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలనే నిబంధనలున్నాయి. అయితే.. ఎస్సీ, ఎస్టీలు లేని వార్డుల్లోనూ ఆ నిధులు ఖర్చు చేయడానికి మునిసిపల్ పాలకులు ప్రయత్నించారు. తద్వారా ‘స్వామి భక్తి’ని చాటుకోవాలని వారు ప్రయత్నించగా కథ అడ్డం తిరిగింది. సబ్‌ప్లాన్ ని«ధుల కేటాయింపు విషయంలో పారదర్శకత లేకపోవడాన్ని ప్రతి కౌన్సిల్లోనూ మెజార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో ఆ అం«శం ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గడువు ముగిసిపోవడంతో నిధులు వాపసు వెళ్లిపోయాయి. అభివృద్ధికి నోచుకోని దళితవాడలెన్నో.. కదిరి మునిసిపాలిటీ పరిధిలో రాజీవ్‌గాంధీనగర్, కుటాగుళ్ల, అమీన్‌నగర్, నిజాంవలీ కాలనీ, పాత హరిజనవాడతో పాటు ఎస్సీ, ఎస్టీలు ఎక్కువమంది నివాసమున్న కాలనీలు, వీధులు చాలానే ఉన్నాయి. ఆయా ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. సబ్‌ప్లాన్ నిధులు వెచ్చించినట్లయితే రోడ్లు, వీధిదీపాలు, మురుగుకాలువలు పూర్తయ్యేవి. అయితే.. ఆ ఇద్దరు నేతల అనుచరుల కొట్లాట కారణంగా అభివృద్ధి కుంటుపడింది. ఈ పరిస్థితి ఎన్నడూ లేదు–రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్, కదిరి మంజూరైన నిధులు ఖర్చు చేయకుండా వాపసు వెళ్లిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ శాతం మంది ఉన్న చోట ఖర్చు చేయడానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కానీ టీడీపీలోని గ్రూపుల కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది. వచ్చిన నిధులు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి. నిధుల వాపసు వాస్తవమే– భవానీప్రసాద్, మునిసిపల్ కమిషనర్, కదిరి సబ్‌ప్లాన్ నిధులు సుమారు రూ.3.20 కోట్లు వాపసు వెళ్లిపోయిన మాట వాస్తవమే. ఈ అంశంపై చాలా సార్లు కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టాం. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక చివరకు నిధులు వాపసు వెళ్లాయి. మళ్లీ ఆ నిధులు తెచ్చుకోవడం కష్టమే! -
పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్ ఎలా?
నేను 2000 సంవత్సరంలో ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతా ప్రారంభించాను. అప్పటి నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేస్తూ వచ్చాను. ఇటీవలే మెచ్యూరిటీ కావడంతో ఈ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించాను. ఇప్పుడు నాకు డబ్బులు అవసరమయ్యాయి. పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన నిబంధనలు ఏవిధంగా ఉన్నాయి? తెలియజేయండి. - హరినాధ్, వరంగల్ ప్రజా భవిష్య నిధి(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్-పీపీఎఫ్) ఖాతా మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఈ మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా ఈ ఖాతాను కొనసాగించవచ్చు. పొడిగించిన తర్వాత కూడా మీరు ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఖాతా బ్యాలెన్స్‌లో 60 శాతం మొత్తాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాను పొడిగించిన మొదటి ఏడాది నుంచి ఈ సొమ్ములను ఒకటి లేదా ఒకటికి మించిన ఇన్స్టాల్మెంట్స్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఏడాదికి ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు. ఇక ఇన్వెస్ట్చేయకుండానే ఈ ఖాతాను పొడిగించిన పక్షంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో కూడా ఏడాదికి ఒక్క విత్డ్రాయల్నే అనుమతిస్తారు. మీ ఖాతా నుంచి పూర్తిగా మీ సొమ్ములను ఉపసంహరించుకునేదాకా మిగిలిన బ్యాలెన్స్‌పై మీకు వడ్డీ వస్తుంది. నేను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఫరెవర్ యంగ్ పెన్షన్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ తీసుకొని రెండున్నరేళ్లయింది. ఇప్పటిదాకా రూ.1,25,000 ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ పాలసీ పనితీరు సరిగ్గా లేదు. దీనిని సరెండర్ చేయమంటారా? కొనసాగించమంటారా? - శోభన్, హైదరాబాద్ మ్యాక్స్ లైఫ్ ఫరెవర్ యంగ్ పెన్షన్ ప్లాన్ అనేది బీమా కవర్‌తో కూడిన రిటైర్మెంట్ ప్లాన్. మీరు తీసుకున్నది సరైన ఇన్వెస్ట్మెంట్ పథకం కానప్పుడు. మీకు నష్టాలు వచ్చినా సరే, ఆ పథకం నుంచి వైదొలగడం సరైన నిర్ణయమే. బీమా కవర్‌తో కూడిన ఎలాంటి రిటైర్మెంట్ ప్లాన్ అయినా అది సరైన పథకం కాదు. అలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమూ కాదు. ఇలాంటి పాలసీల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి. పారదర్శకత ఉండదు. ఈ తరహా పాలసీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే రాబడులను ఇవ్వలేవు. ఈ పాలసీతో పోల్చుకుంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ గ్యారంటీడ్ మొత్తాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ పాలసీ సరెండర్‌కు సంబంధించిన విషయాలను చూస్తే, ఫండ్ విలువలో మూడో వంతును ఏకమొత్తంగా మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా మొత్తం ఫండ్ విలువతో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్‌కు లాక్-ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంది. మీరు ఐదేళ్లకు ముందే ఈ పాలసీని సరెండర్ చేసినప్పటికీ, మీరు పాలసీ తీసుకున్న ఐదేళ్ల వరకూ ఈ పాలసీ లాక్ అయి ఉంటుంది. మీ రిటైర్మెంట్ జీవితంలో కావలసిన ఆదాయం కోసం దీర్ఘకాల పెట్టుబడి వ్యూహం అవసరం. మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త అయితే, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ట్రాక్ రికార్డ్‌ను బట్టి మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని, ప్రతి నెలా కొంత మొత్తం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇప్పటికే స్టాక్ మార్కెట్‌తో పరిచయం ఉండి ఉన్నట్లయితే ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్డ్ ఫండ్ అయినా, ఈక్విటీ ఫండ్ అయినా సరే, సిప్ విధానాన్ని ఎంచుకోండి. ఇలా చేస్తే, మీ కొనుగోళ్లు యావరేజ్ అయి. మీకు మంచి రాబడులు వస్తాయి. మీరు మరో మూడేళ్లలో రిటైరవుతారనగా, ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని ఉపసంహరించుకొని పెన్షన్ కోసం క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 56 సంవత్సరాలు. మరో నాలుగేళ్లలో రిటైరవుతున్నాను. 20 శాతం ఆదాయపు పన్ను ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను. ఏడాదికి రూ.50,000 చొప్పున మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. మరో ఆరేళ్ల పాటు నాకు ఈ డబ్బులు అవసరం లేదు. నాకు పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా కావాలి. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి? - గంగాధర్, విజయవాడ మీరు ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. పన్ను ప్రయోజనాలు కూడా కావాలనుకుంటున్నారు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా వస్తాయి. ఈ ఫండ్స్ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో తక్కువ లాక్-ఇన్ పీరియడ్ (3 సంవత్సరాలు) ఇన్వెస్ట్మెంట్ సాధనం ఇదే. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పీఎఫ్ లో మరో రగడ
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) వ్యవహారంలో రోజుకో వివాదం రగులుతోంటే..తాజాగా మరో సరికొత్త విధానం అమలుకు సంస్థ రంగం చేసింది. పీఎప్ ముందస్తు ఉపసంహరణల నిరోధకం కోసం అంటూ చేపట్టిన 'ఒక ఉద్యోగికి ఒక భవిష్యనిధి ఖాతా పథకాన్ని' ఈ మే ఒకటి నుంచి అమల్లోకి తీసుకు రానుంది. దీనిద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడాలని సంస్థ భావిస్తోంది. దీంతో ఉద్యోగులు.. ఉద్యోగం మారిన ప్రతిసారి పీఎఫ్ ఖాతా తెరవాల్సిన అవసరముండదని, పీఎఫ్ సొమ్ము విత్ డ్రాయల్ తెరపైకి రాదని సంస్థ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సుదీర్ఘంగా పీఎఫ్ అకౌంట్ నిర్వహిస్తే వచ్చే లాభాలను కల్పించడానికే ఈ నిర్ణయ తీసుకున్నట్టు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ చెబుతోంది. ఏప్రిల్ 21 న జరిగిన ఈపీఎఫ్ వో అంతర్గత సమావేశంలో మాట్లాడిన కమిషనర్ వీపీ జోయ్ ఈ విషయాన్నిఈ విషయాన్ని ధృవీకరించారు. మే 1 వతేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈపీఎఫ్ సేవలు మెరుగ్గా ఉంటే ..ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఈపీఎఫ్ లో చేరడానికి ఉత్సాహం చూపుతారన్నారు. పీఎఫ్ ఖాతాల నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని యజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవన్నారు. అటు ప్రావిడెంట్ ఖాతాల నిర్వహణలోకి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వామ్యం చేసే దిశగా ఈపీఎఫ్ సంస్థ ఆలోచిస్తోంది. మున్సిపాలిటీల్లోని ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాతాలు ఉండాలనే అభిప్రాయంతో ఆమేరకు చర్యలకు ఉపక్రమించింది. పీఎఫ్ ఖాతా నిర్వహణ, పింఛన్ వంటవి వాటిని ఉద్యోగులకు అనుకూలంగా, మారిస్తే ఫీఎఫ్ ఖాతాలను సుదీర్ఘ కాలంగా కొనసాగిస్తారని ఈఫీఎఫ్ సంస్థ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే 58 సంవత్సరాలలోపు పీఎఫ్ విత్డ్రాయల్స్పై నిషేధం విధించాలని ఆలోచన చేసింది. అయితే దేశ వ్యాప్తంగా దీనిపై ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో పునరాలోచనలో పడ్డ ఈఫీఎఫ్ సంస్థ ప్రత్యామ్నాయ పరిష్కారాలను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఒక ఉద్యోగికి ఒకే పీఎఫ్ ఖాతా అన్న విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంతో గుర్రుగా ఉన్న ఉద్యోగులు దీనిపై ఎలా స్పందించనున్నారో చూడాలి. -
బ్యాంకుల్లోనూ క్యాష్ కటకట!
♦ శ్రీకాకుళం జిల్లాలో విచిత్ర పరిస్థితి ♦ డిపాజిట్లను మించిపోయిన విత్‌డ్రాలు ♦ ఏటీఎంలు ఖాళీ, క్యూ కడుతున్న జనం ♦ మరికొన్నాళ్లు తప్పదంటున్న బ్యాంకర్లు ♦ ఆర్బీఐ నుంచి నగదు వస్తేనే పరిస్థితి కొలిక్కి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జేబులో డబ్బులు లేకపోవటం చూశాం. చేతిలో చిల్లిగవ్వ లేదనటం విన్నాం. కానీ బ్యాంకులో డబ్బు లేదనటం ఎక్కడైనా చూశారా? ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఒక్క బ్యాంకు కాదు... ఒక బ్రాంచి కాదు. దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల సంగతైతే చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటీఎం ముందూ జనాల బారులే. ఎంత లైన్లున్నా చాలా చోట్ల ఖాళీ ఏటీఎంలే కనిపిస్తున్నాయి. దీనికి కారణమేంటంటే చెల్లింపులకు సరిపడా డిపాజిట్లు లేవు. పెపైచ్చు ఫిబ్రవరి నెలలో విత్‌డ్రాయల్స్ విలువ చాలా ఎక్కువగా ఉంది. పక్షం రోజులుగా జిల్లా వ్యాప్తంగా జాతరలు, తీర్థాలతో పాటు వివాహాలూ భారీగా జరుగుతుండటంతో ఏటీఎంల వద్ద జనం డబ్బు కోసం క్యూ కడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఇవ్వాల్సి రావడం విత్‌డ్రాయల్స్ అధికమయ్యాయి. డబ్బు తీసుకున్న కొనుగోలుదారులు వాటిని ఇతర ప్రాంతాల్లో జమ చేస్తుండటం, స్థానికంగా డిపాజిట్లు తగ్గటం వంటివి పరిస్థితికి ఆజ్యం పోస్తున్నాయి. రెండు వారాల నుంచీ ఇదే పరిస్థితి... శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 281 బ్యాంకులు, 240 వరకు ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. బ్యాంకును బట్టి ఒక్కో ఏటీఎంలో వారం నుంచి నెలరోజుల వ్యవధిలో కనీసం రూ.10 నుంచి 20 లక్షల వరకు పెడుతుంటారు. ఖరీఫ్ చివర్లో మొదలైన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఫిభ్రవరి 15 నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. నెలాఖరు నాటికి సుమారు రూ.150 కోట్ల అవసరం వచ్చింది. ఫిబ్రవరిలో ఫించన్ల చెల్లింపులు రూ.30 కోట్ల మేర జరిగాయి. ట్రెజరీల నుంచి వచ్చే బిల్లుల ఆధారంగా జీతాలకూ కనీసం రూ.20 నుంచి రూ.30 కోట్లు కావాలి. వివిధ ప్రాంతాల నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తాలు ఆన్లైన్లోనే వస్తుంటాయి. పేమెంట్ల మొత్తాన్ని, డిపాజిట్ల మొత్తాన్ని సగటున లెక్కించి సొమ్ము అవసరమైన పక్షంలో ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నారు. అలా ఒక్క ఫిబ్రవరిలోనే విజయవాడ నుంచి ఎస్బీఐ సుమారు 80 కోట్ల రూపాయలు తెప్పించింది. ఆ మొత్తాన్ని 50-80 ఏటీఎంలలో సర్దేసరికి ఖాళీ అయిపోయింది. రోజుకు జిల్లా వ్యాప్తంగా ఒక్క ఎస్బీఐలోనే రూ.10 కోట్ల డిపాజిట్లు ఉంటున్నాయి. కారణాలు తెలియరాలేదు గానీ... ఫిబ్రవరిలో ఈ మొత్తం తగ్గింది. దీంతో క్యాష్ కోసం జనం కిటకిటలాడాల్సి వచ్చింది. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా... ఫిబ్రవరిలో మరీ ఎక్కువయింది. శివారు ప్రాంతాల ఏటీఎంలలోనూ రద్దీ కని పించింది. ప్రైవేట్ బ్యాంకులు, ఏటీఎంల పరిస్థితీ అంతే. ఇతర బ్యాంకులపై ఎస్బీఐ ఆధారపడినా... అది కొంతవరకే ఉపయోగపడింది. ఆర్బీఐ నుంచి నిధులు రాకపోవడమే... నగదుకు కొరత వస్తే బ్యాంకులు ఆర్బీఐ నుంచి తెప్పిస్తుంటాయి. చెల్లింపులకు సరిపడా డిపాజిట్లు లేకపోయినా, తక్కువ చెల్లింపులు, ఎక్కువ పేమెంట్ల సమయంలో తమకు నిధులు అవసరమంటూ లేఖలు రాస్తాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో ఆంధ్రాబ్యాంకు రూ.40 నుంచి రూ.50 కోట్ల కోసం రిక్వెస్ట్ లెటర్లు పంపింది. ఎస్బీఐ కూడా రూ.100 కోట్లు కావాలని కోరింది. సమయానికి ఆర్బీఐ నుంచి డబ్బులు రాకపోవడంతో బ్యాంకులు చేతులెత్తేశాయి. ఎస్బీఐ ఏటీఎంలలో నిత్యం రూ.8 కోట్లు పెడుతుంటామని, ఈ సారి పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోవడం, బ్యాంకు వద్ద డబ్బు లేకపోవడంతో ఆర్బీఐపైనే ఆధారపడాల్సి వచ్చిందని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ మేరీ సగయా ‘సాక్షి’కి చెప్పారు. మార్చి మొదటి వారంలో ఆర్బీఐ నుంచి నిధులొస్తాయని, పరిస్థితి సర్దుమణుగుతుందని ఆమె చెప్పారు. ‘‘ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాల్ని ఏటీఎంలలో సర్దాం. కొన్నాళ్లుగా నగదుకు ఇబ్బంది ఉన్న మాట నిజమే’’ అన్నారామె. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉంద ని, దీన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్ళామని లీడ్ బ్యాంకు మేనేజరు ఎల్.రామిరెడ్డి చెప్పారు. త్వరలోనే సమస్య నుంచి బయటపడతామన్నారు. -
ఏటీఎమ్ రెండుసార్లకు మించి వాడితే కోతే!
రెండుసార్లు దాటితే రూ.20 చార్జ్ న్యూఢిల్లీ: నగరాల్లో ఏటీఎం వినియోగ నియమ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చనుంది. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ (హోమ్ బ్యాంక్) ఏటీఎం కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం (థర్డ్‌పార్టీ) ద్వారా నగదు ఉపసంహరణ ఇక నెలకు రెండుసార్లు మాత్రమే ఉచితం కానుంది. మూడవసారి ఈ ఉపసంహరణ జరిగితే అదనపు చార్జీల భారం భరించకతప్పదు. ఈ వినియోగ చార్జీ రూ.20 వరకూ ఇప్పటివరకూ ఈ నెలవారీ ‘ఉచిత’ పరిమితి ఐదు సార్లు వరకూ ఉండేది. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతాలకు తాజా నిబంధన వర్తించదు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎం వివరాలను తెలియజేయాలని సైతం బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణ, లావాదేవీలు వంటి అంశాలకు సంబంధించి వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో థర్డ్‌పార్టీ ఏటీఎంల వినియోగం సంఖ్యను రెండుకి తగ్గించాలని గత కొంత కాలంగా బ్యాంకులు చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఆర్బీఐ తాజా చర్య తీసుకుంది. -
ఏటీఎమ్ రెండుసార్లకు మించి వాడితే కోతే!