
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) చందాదారులకు ‘పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ’(పీఎఫ్‌ఆర్‌డీఏ) వెసులుబాటు కల్పించింది. ఎన్‌పీఎస్ చందాదారులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకోవాల్సి వస్తే ఖర్చుల కోసం ఎన్‌పీఎస్ నిధి నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. కాగా, ఏపీవై చందాదారులకు ఇది వర్తించదు.
ఈపీఎఫ్‌వో..ఉపసంహరణ రూ.280 కోట్లు
కాగా, ఉద్యోగుల భవిష్యనిధి నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతించడంతో.. ఇప్పటి వరకు రూ.280 కోట్ల విలువకు సంబంధించి 1.37 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్‌వో శుక్రవారం ప్రకటించింది. ఈపీఎఫ్ నిధిలో చందాదారుని వాటా మొత్తం నుంచి 75 శాతం లేదా మూడు నెలల మూలవేతనం, కరువు భత్యం ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment