
కరోనా వైరస్‌పరమైన ఆర్థిక సమస్యలను గట్టెక్కేందుకు గత రెండు నెలల్లో దాదాపు 12 లక్షల మంది వేతనజీవులు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి సుమారు రూ. 3,360 కోట్ల మేర నిధులను ఉపసంహరించుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీ కింద ఈపీఎఫ్‌వో 12 లక్షల క్లెయిమ్స్‌ను సెటిల్ చేసినట్లు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక కష్టాలు అధిగమించేందుకు 2.2 కోట్ల మంది నిర్మాణ రంగ కార్మికులకు రూ. 3,950 కోట్లు చెల్లించినట్లు మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment