కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కష్టమే!
యూజీసీ నిబంధనల ప్రకారం అది కుదరదు: కడియం
ఏం చేయాలన్నది తరువాత నిర్ణయిస్తాం
అన్ని వర్సిటీల్లో కామన్ అకడమిక్ కేలండర్ అమలు
డిగ్రీలో 6 నెలల ప్రాజెక్టు వర్క్.. పూర్తికాగానే ఉపాధి లభించేలా చర్యలు
వర్సిటీలకు రూ.1,000 కోట్ల బడ్జెట్ ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ సాధ్యం కాదు. యూజీసీ జారీ చేసిన జీవో 14 ప్రకారం ఇది కష్టం. అయితే దీనిపై ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తాం. ప్రభుత్వపరంగా విధాన నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది..’’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో స్థితిగతులు, నియామ కాలు, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై బుధవారం సచివాలయంలో ఆయా వర్సిటీ ల వీసీలతో కడియం సమీక్ష సమావేశం నిర్వ హించారు. యూజీసీ నిబంధనల ప్రకారం జాతీయ స్థాయిలో నియామక నోటి ఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, సర్వీసుకు వెయిటేజీ మాత్రమే ఉందని కడియం స్పష్టం చేశారు. నియామకాల సమయంలో దీనిపై చర్చిస్తా మని తెలిపారు. అయితే వర్సిటీల్లో ప్రస్తుతం ఎంత మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు, వారి నియామక ప్రక్రియ ఏమిటి, నిబంధ నలు ఏం చెబుతున్నాయి, క్రమబద్ధీ కరణ విషయంలో ఏం చేయాలన్న దానిని వీసీలు సమీక్షించి నివేదిక ఇవ్వాలని సూచించారు.
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు వర్క్
వర్సిటీల్లో సంప్రదాయ కోర్సులే కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సు ల ను రూపొందించాలని వీసీలకు కడియం సూచించారు. సాధారణ డిగ్రీ కోర్సుల్లోనూ 6 నెలల పాటు ప్రాజెక్టు వర్క్/శిక్షణ ఇచ్చేలా సర్టి ఫికెట్ కోర్సును ప్రవేశపెట్టాలని.. తద్వారా విద్యార్థి కోర్సు పూర్తి చేయ గానే ఉపాధి లభిం చేలా చర్యలు చేప ట్టాలని చెప్పారు. ప్రభుత్వం వన్‌టైమ్ గ్రాంటు ఇస్తుందని, భవిష్యత్తులో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధార పడకుండా సొంత వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. కానిస్టేబుల్, ఇంజనీర్ల పరీక్షలు నిర్వహించడం ద్వారా జేఎన్టీయూ హెచ్ వనరులను సమకూర్చుకున్నట్లు ఇతర యూనివర్సిటీలు చేయాలని చెప్పారు. ఒక్కో యూనివర్సిటీ ఒక్కోలా కాకుండా అన్నింటిలో కామన్ అకడమిక్ కేలండర్ అమలు చేయాలని... యూనివర్సిటీల్లో అన్ని సర్వీసులను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. బీఎడ్ రెండో దశ కౌన్సెలింగ్‌పై ప్రశ్నించగా.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని, 11 కొత్త కాలేజీలు తమకు ప్రవేశాలు వద్దని రాసిస్తే, కౌన్సెలింగ్ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
వర్సిటీలకు రూ.1,000 కోట్లు
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావాలని, ఇందుకోసం వర్సిటీలకు రూ.1,000 కోట్ల బడ్జెట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని కడియం వెల్లడించారు. వర్సిటీల అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. పాత యూనివర్సిటీల్లో మరమ్మతులు, పెయిం టింగ్, కొత్త యూనివర్సిటీలకు అదనపు గదులు, మౌలిక సదుపాయాలు కల్పించేం దుకు చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశిం చారు. వర్సిటీల్లో రిటైర్మెంట్ వయసు పెంపుపైనా చర్చించామని, అంతకంటే ముందు వర్సిటీల్లో పదోన్నతులు కల్పించా లని వీసీలను ఆదేశించారు. తర్వాత ఏర్పడే ఖాళీల భర్తీపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అయితే గతంలో యూని వర్సిటీల్లో ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టినందున... ప్రస్తుతమున్న విద్యార్థుల సంఖ్యతో బోధన–బేధనేతర సిబ్బందిని హేతుబద్ధీకరణ చేయాలని ఆదేశించారు.