
న్యూఢిల్లీ: పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వ విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు సూచించింది. ప్రభుత్వ జామర్ విధానం ప్రకారం జామర్లు ఏర్పాటు చేయాలనుకుంటే భద్రతా కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు రాసిన లేఖలో యూజీసీ తెలిపింది. అలాగే ప్రతీ కేంద్రంలో జామర్ల పనితీరును పరీక్ష ప్రారంభానికి ముందే పరీక్షించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో తక్కు వ సామర్థ్యం గల జామర్లు ఏర్పాటు చేసేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment