exam centres
-
సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16,802 సచివాలయ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 2 వేల పరీక్ష కేంద్రాల్లో పరీక్షల కోసం ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో కేవలం 16 మందినే అనుమతిస్తాం. కోవిడ్ ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ పరీక్ష కేంద్రాలు పెట్టాం. అభ్యర్థుల కోసం విశాఖ, విజయవాడలో సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. పరీక్షకు వచ్చేవారికి స్క్రీనింగ్, శానిటేషన్ ఏర్పాటు చేస్తున్నాం' అని మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వివరించారు. (రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు) -
సివిల్స్ ప్రిలిమ్స్‌పై యూపీఎస్సీ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు సవరించిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 4న జరుగుతాయని యూపీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పెద్దసంఖ్యలో అభ్యర్ధులు సివిల్స్ ప్రిలిమనరీ, ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరవుతున్న క్రమంలో వారి అభ్యర్ధన మేరకు వారి పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ తెలిపింది. అదనపు అభ్యర్ధులకు ఆయా కేంద్రాలు వసతుల పెంపు ఆధారంగా అభ్యర్ధుల పరీక్షా కేంద్రాల మార్పు అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల మార్పుకు సంబంధించిన ఆప్షన్‌ను జులై 7-13 వరకూ జులై 20-24 వరకూ రెండు దశల్లో కమిషన్ వెబ్సైట్ https://upsconline.nic.inద్వారా అందించాలని కోరింది. అభ్యర్ధులు వెబ్‌సైట్‌ను సందర్శించి పరీక్షా కేంద్రాలపై తమ ఎంపికను సమర్పించాలని కోరింది. అభ్యర్ధుల వినతులను ‘ఫస్ట్ అప్లై-ఫస్ట్ అలాట్’ పద్ధతిన పరిశీలిస్తామని స్పష్టం చేసింది. సీలింగ్ కారణంగా తాము కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని పొందలేని వారు మిగిలిన వాటి నుంచి ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. చదవండి : యూపీఎస్సీ 2020 సన్నద్ధమవుదామిలా.. -
చదివిన స్కూల్లోనే సీబీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పెండింగ్ పరీక్షల విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. విద్యార్థులు బయటి కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, తాము ప్రస్తుతం చదువుకుంటున్న స్కూల్లోనే ఈ పరీక్షలు రాయొచ్చని సూచించింది. లాక్డౌన్ కంటే ముందు నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే మొదలైంది. బోర్డు పరీక్షల ఫలితాలను జూలై మాసాంతం నాటికి వెళ్లడించేలా మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల నిర్వహణకు లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. -
జామర్ల నిబంధనలను పాటించాల్సిందే: యూజీసీ
న్యూఢిల్లీ: పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వ విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు సూచించింది. ప్రభుత్వ జామర్ విధానం ప్రకారం జామర్లు ఏర్పాటు చేయాలనుకుంటే భద్రతా కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు రాసిన లేఖలో యూజీసీ తెలిపింది. అలాగే ప్రతీ కేంద్రంలో జామర్ల పనితీరును పరీక్ష ప్రారంభానికి ముందే పరీక్షించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో తక్కు వ సామర్థ్యం గల జామర్లు ఏర్పాటు చేసేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. -
పరీక్షా కేంద్రాల్లో నిఘా
భువనేశ్వర్ : విద్యా బోధన, పరీక్షల నిర్వహణలో నిరంతరం సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తుంది. రాష్ట్ర విద్యార్థుల్ని మేధావంతులుగా ఆవిష్కరించి జాతీయ స్థాయి పోటీ, ప్రవేశ పరీక్షల్లో ఉన్నత ఫలితాల్ని సాధించేలా చేయడం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా పరీక్ష కేంద్రాల్లో పారదర్శకత పట్ల దృష్టి సారించింది. కాపీలు ఇతరేతర అక్రమాలకు చెక్ పెట్టేందుకు తాజా నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. హై స్కూల్ సర్టిఫికెటు(హెచ్ఎస్సి), +2 శ్రేణి ఆర్ట్సు, సైన్సు, కామర్సు విభాగాల వార్షిక పరీక్షా కేంద్రాల్లో ఈ మేరకు ఏర్పాటు చేసేందుకు లాంచనంగా నిర్ణయించారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి తాజా విధానం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమయింది. బోర్డుల ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాలలు–సామూహిక విద్యా విభాగం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాట్లను అనుబంధ నిర్వాహక సంస్థలు చేస్తాయని విభాగం కార్యదర్శి ప్రదీప్త మహాపాత్రో మంగళవారం తెలిపారు. రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు(బీఎస్ఈ), ఉన్నత మాధ్యమిక విద్యా మండలి(సీహెచ్ఎస్ఈ) వర్గాలకు ఆదేశాల్ని జారీ చేసినట్టు ఆయన వివరించారు. ఈ సంస్థలు ఖరారు చేసిన పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు. మాల్ ప్రాక్టీసు నివారణ పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీసు నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షల నిర్వహణలోపారదర్శకత చోటు చేసుకుని విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల్ని కాపీ రహిత కేంద్రాలుగా ప్రకటించడమే ధ్యేయంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు యోచన కార్యాచరణలో పెడుతున్నట్టు కార్యదర్శి వివరించారు. విభాగం ఆదేశాల మేరకు రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు(బీఎస్ ఈ), ఉన్నత మాధ్యమిక విద్యా మండలి(సీహెచ్ఎస్ఈ) రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనివార్యంగా పేర్కొన్నారు. -
అక్కడేం జరుగుతోంది..!
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో అధికారుల కళ్లు రాయచోటి పరీక్షా కేంద్రాలపైనే ఉన్నాయి. గత కొనేళ్ల నుంచి ఇక్కడి కేంద్రాల్లో కాపీయింగ్ జోరుగా సాగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు సంఘటనలు రుజువు కూడా అయ్యాయి. రాయచోటిలో పరీక్షల సమయానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సిండికేట్ అవుతాయని, పరీక్ష విధులకు వచ్చే సిబ్బంది, స్క్వాడ్ సభ్యులను మెయింటెయిన్ చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని అరికట్టాలని డీఈఓ శైలజ ఈ సారి పది పరీక్షలకు డైట్ ప్రిన్సిపాల్ చంద్రయ్యను స్పెషల్ అధికారిగా నియమించారు. ఆయన ప్రతి సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. రాయచోటి పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.ఒక్కో సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. అయినా అక్కడక్కడ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈనెల 15 నుంచి 20వ తేదీనాటికి పరీక్ష విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలతో 8మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించగా... 21వ తేదీ బుధవారం ఒక్కరోజే 9 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు చీప్ సూపరింటెండెంట్లు,, ఒక డిపార్టుమెంట్ అధికారిని పరీక్షల విధుల నుంచి తొలగించారు. మొత్తంగా పరీక్షలు జరిగిన ఆరు రోజుల్లో 20 మందిని తొలగించారంటే పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతోంది.విద్యాశాఖ అధికారులు పరీక్షల నిర్వహణకు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. -
ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ పరీక్ష
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ వి ద్యార్థులకు నెల్లూరు నగరంలో ‘ట్రాఫి క్ పరీక్ష’ తప్పడం లేదు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉదయం 7.30 నుంచే పరీక్ష కేంద్రాలకు బయలు దేరుతున్నారు. గురువారం నగరంలో చాలా కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు జరుగుతుండటంతో కారులు, బస్సులు, ఇతర వాహనాలతో నగర రోడ్లు రద్దీగా మారాయి. దీంతో మినీబైపాస్ పూర్తిగా ట్రాఫిక్‌తో స్తంభించింది. స్థానిక మాగుంట లేవుట్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ దిగ్భంధనంలో వందలాది మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఓ వైపు పరీక్ష సమయం దగ్గర పడుతుండటం, మరోవైపు ట్రాఫిక్ ఒక అడుగు ముందుకు కదలకపోవడంతో విద్యార్థులు తమ తమ పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆందోళన పడ్డారు. పరీక్ష కేంద్రాలకు నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించకపోవడంతో విద్యార్ధులతో తల్లిదండ్రులు గుండెలు గుప్పెట్లో పెట్టుకుని ప్రత్యామ్నాయం కోసం పాకులాడారు. దీనికి తోడు నగరంలోని ప్రతి రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులతో గుంతలు తవ్వేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ముసుకుని పోవడంతో వారి వ్యథ వర్ణణాతీతంగా మా రింది. నగరంలో ట్రాఫిక్ పరిస్థితిని అంచనా వేసి క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించలేదు. దీంతో రెండు కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పట్టింది. దీనికి తోడు ట్రాఫిక్ కంట్రోల్ కోసమంటూ నగరంతో పాటు మినీబైపాస్ పొడవునా సర్కిళ్లలో అడ్డంగా డివైడర్ రాళ్లు పెట్టి దూరంగా వచ్చి మలుపు తిరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. వాహనాలు అడ్డదిడ్డంగా వస్తుండటంతో ట్రాఫిక్ ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నడుచుకుంటూ చిన్న వీధుల్లో నుంచి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. శుక్రవారం రోజు పరీక్ష సమయానికి ట్రాఫిక్‌ను సరిదిద్దుతారో లేక గాలికి వదులుతారోనన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షకు750 మంది విద్యార్థులు గైర్హాజరు ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా జనరల్‌కు సంబంధించి 26,894 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 26,177 మంది హాజరయ్యారు. 717 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 1,216 మందికి 1,183 మంది హాజరు కాగా 33 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ 3 కేంద్రాలను పరిశీలించగా ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్ అధికారులు 53 కేంద్రాలను తనిఖీ చేశారు. ఉర్దూ, సంస్కృతం పేపర్లలోఅచ్చు తప్పులు ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఉర్దూ ప్రశ్నపత్రంలో రెండు అచ్చు తప్పులు వచ్చాయి. సంస్కృతంలో ఒక అచ్చు తప్పు వచ్చింది. దీనిని వెంటనే సరిదిద్దిన అధికారులు డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించి వాక్యాలను సరిచేశారు. సరైన వెలుతురు లేక ఇబ్బందులు కొన్ని ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో వెలుతురు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కార్పొరేట్ కళాశాలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. భవనాలకు సరిపడా కిటికీలు లేకపోవడం కారణంగా కనిపిస్తుంది. లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది. వెలుతురుతోపాటు చాలా పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు లేవు. అప్పుడే ఎండలు వేసవికాలాన్ని తలపిస్తున్నాయి. ఉష్ణోగ్రత పెరగడంతో సరైన గాలి రాక విద్యార్థులు నరకయాతన పడ్డారు. -
‘టెట్’ కష్టాలు!
అనంతపురం ఎడ్యుకేషన్: రాయదుర్గానికి చెందిన ఎం. అలేఖ్య టెట్ పేపర్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అమ్మాయికి ఒంగోలులో టెట్ కేంద్రం వేశారు. తండ్రి రమణ ప్రభుత్వ టీచరుగా పని చేస్తున్నారు. ఆయన కూతురును తీసుకుని ఒంగోలుకు వెళ్లి పరీక్ష రాయించాలంటే రెండు రోజులు సెలవు పెట్టాలి. పైగా వేలాది రూపాయలు ఖర్చు. ♦ అనంతపురం నగరానికి చెందిన బి.మదన ప్రతాప్‌రెడ్డి పేపర్–1 పరీక్షకు దరఖాస్తు చేశాడు. దరఖాస్తు సమయంలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఆప్షన్ ఇచ్చారు. కానీ ఇవేవీ లేకుండా బెంగళూరు నగరంలో కేంద్రం వేశారు. ♦ యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన కేతిరెడ్డి ప్రతాప్‌రెడ్డి అనే అభ్యర్థి టెట్ పేపర్–2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్లైన్లో హాల్‌టికెట్ కనిపించడం లేదు. పుట్టినరోజు, దరఖాస్తు ఐడీ నంబరు, ఆధార్‌నంబరు నమోదు చేసినా ‘డిటైల్స్ నాట్‌ఫౌండ్) అని వస్తోంది. దీంతో ప్రతాప్‌రెడ్డి ఆందోళన చెందుతున్నాడు. ♦ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షను తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి 1వ తేదీ వరకు టెట్ 1, 2, 3 పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసలే ఆన్‌లైన్‌పై అవగాహన లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతుంటే... సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలు కేటాయించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇక మరికొందరు తమ హాల్‌టికెట్లు ఆన్లైన్లో కనిపించడం లేదని వాపోతున్నారు. రాయదుర్గం పట్టణంలోనే సుమారు వందమంది అభ్యర్థులు పేపర్–1, 2, 3 పరీక్షలు రాస్తుంటే వీరిలో 80 మందికిపైగా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కేంద్రాలు వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థినులకు తప్పని ఇక్కట్లు సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు పడిన మహిళా అభ్యర్థినులు తీవ్ర ఇక్కట్లు పడనున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లులు ప్రయాణ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. దీనికితోడు ఖర్చు కూడా భారీగా వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలతో పాటు మన రాష్ట్రంలో సుదూర ప్రాంతాల్లో కేంద్రాలకు మహిళా అభ్యర్థులు వెళ్లాలంటే కచ్చితంగా తోడుగా కుటుంబీకులను తీసుకెళ్లాలి. అందులోనూ ముందు రోజు వెళ్లాల్సి ఉంటుంది. పోను,రాను ప్రయాణం, భోజన, వసతి ఖర్చులన్నీ కలిపితే వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇవన్నీ తలచుకుని ఆర్థిక ఇబ్బందులున్న కొందరు పరీక్ష రాసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. కాగా టెట్ నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. హాల్‌టికెట్లు రాని కొందరు ఇక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. -
పరీక్ష హాల్లో తలతిప్పారో.. డైరెక్ట్ జైలుకే
బీజింగ్: ఎట్టకేలకు చైనా ఓ భారీ మార్పుకు స్వీకారం చుట్టింది. తమ దేశంలో జరుగుతున్న పరీక్షల్లో మోసాలకు పాల్పడుతున్న విద్యార్థులను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంది. గత ఏడేళ్లుగా ఈ అంశంపై సుదీర్ఘ పరిశీలనలు జరిపిన చైనా చివరకు పోలీసులకు చెందిన ప్రత్యేక టీంల కనుసన్నల్లో పరీక్షలు జరపాలని నిర్ణయించింది. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఉన్నత చదువులకోసం మరో వారం రోజుల్లో జరిగే పరీక్షలకు స్వాట్(ఎస్డబ్ల్యూఏటీ) అనే పోలీసు టీంలను పరీక్షల నిర్వహణకోసం రంగంలోకి దించింది. పరీక్ష పేపర్లు కూడా ఈ టీమే అందించనుంది. ఒక్కో పరీక్ష కేంద్రానికి ఎనిమిదిమంది ప్రత్యేక పోలీసు అదికారులను కూడా నియమిస్తుంది. పరీక్ష పేపర్లు ఇచ్చిన అనంతరం ఈ స్వాట్ టీం ప్రతి విద్యార్థిని సీసీటీవీ కెమెరా ద్వారా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఎవరైన అనుమానాస్పద కదలికలకు పాల్పడినా.. కాపీయింగ్‌కు దిగినా వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. ఇటీవల కూడా తొమ్మిదిమంది నకిలీ పరీక్ష పత్రాలను వీధుల్లో అమ్ముతూ పట్టుబడటంతో చైనా తాజాగా ఈ చర్యలకు ఉపక్రమించింది. -
నేటి నుంచి పది పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో మంచి నీటి సౌకర్యం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 162 పరీక్ష కేంద్రాలలో 35, 642 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 18,135 బాలురు కాగా 17,507 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా టేబుళ్లు ఏర్పాటు చేసి.. హాల్‌టికెట్ నంబర్లు వేశామని డీఈఓ డీఈఓ బండ్లపల్లె ప్రతా్ప్రెడ్డ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ముందుగా చేరుకోవాలని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్టు తప్ప ఏ విధమైన కాగితాలు తీసుకెళ్లరాదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు ఉండకూడదన్నారు. అలా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పిడితే చర్యలు తప్పవన్నారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిద్ధంగా ఉందన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం..
-
అక్ర‘మార్కుల’కు అడ్డుకట్ట పడేనా
యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 41,395 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఓ వైపు పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. మరోవైపు చూచిరాతలను నిర్వహించేందుకు కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వ్యూహరచన సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్ర ‘మార్కుల’కు అడ్డుకట్ట వేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. వైవీయూ, న్యూస్‌లైన్: వైవీయూ పరిధిలోని 73 డిగ్రీ కళాశాలల్లో 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశా రు. గత కొన్నేళ్లుగా పరీక్షా కేంద్రాలుగా ఉన్న కొన్ని సెంటర్లను రద్దు చేయడంతో జీర్ణించుకోలేని యాజమాన్యాలు విద్యార్థులతో ఆందోళనలు సైతం నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ కళాశాలలు లేకపోవడంతో సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాయచోటి పట్టణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం ప్రభుత్వ కళాశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో సుండుపల్లె, గాలివీడు, సిద్దవ టం తదితర మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినప్పటికీ కాపీయిం గ్‌కు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. దీనికి తోడు ఈసారి సుండుపల్లెకు సెల్ఫ్సెంటర్ ఏర్పాటుతో పాటు గాలివీడులోని రెండు కళాశాలలను కుండమార్పిడి విధానంలో కేంద్రా లు కేటాయించారు. దీంతో యాజమాన్యాల మధ్య అవగాహనతో కాపీయింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని గట్టి నిఘా ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని భావి స్తున్న అధికారులపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల లాబీయింగ్ ఒత్తిడి పనిచేస్తుందో.. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలన్న వైవీయూ అధికారుల సంకల్పం నెరవేరుతుందో వేచి చూడాలి. హైపవర్ కమిటీలు ఏర్పాటు డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు విశ్వవిద్యాలయ అధికారులతో కూడిన 10 హైపవర్ కమిటీలను ఏర్పాటు చేశారు. మంగళవారం హైపవర్ కమిటీ బృందాలతో వీసీ శ్యాంసుందర్ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎటువంటి కాపీయింగ్ ఆస్కారం ఇవ్వకూడదని సూచించారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల విభాగం నియంత్రణాధికారి ఆచార్య జి. సాంబశివారెడ్డి తెలిపారు. -
ఎన్నికల ‘పరీక్ష’
సాక్షి, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఈనెల 27 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యా శాఖ ఏర్పాట్లు చేపట్టింది. అటు ఎన్నికలు.. ఇటు పరీక్షల నిర్వహణ అధికార యంత్రాంగానికి తలనొప్పిగా పరిణమించింది. పరీక్ష కేంద్రాలు.. పోలింగ్ కేంద్రాలు ఒకటే కావడం గందరగోళానికి తావిస్తోంది. జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న తొమ్మిది పురపాలక సంఘాల్లో ఆ బాధ్యతను ఉపాధ్యాయులే నిర్వహించాల్సి ఉంది. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నిర్వహణకు ఎంపిక చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఐదేసి మంది చొప్పున విధులకు హాజరవుతారు. ఇందుకోసం దాదాపు 3వేల మందికిపైగా ఉపాధ్యాయులు అవసరం. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తూనే.. పరీక్ష విధులకు సంబంధించి ప్రశ్నపత్రాలను తీసుకెళ్లేందుకు, ఇతరత్రా పనులకు ఉపాధ్యాయులు ఒక రోజు సమావేశం కావాల్సి ఉంటుంది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలోని ఉపాధ్యాయులను పోలింగ్ అధికారులుగా, సహాయ పోలింగ్ అధికారులుగా, పోలింగ్ సిబ్బందిగా నియమిస్తారు. అందుకోసం వీరు ఈనెల 28నే ఎన్నికల అధికారులకు రిపోర్ట్ చేయాల్సి ఉంది. 29న పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం.. 30న ఎన్నికలు నిర్వహించి, లెక్కింపు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. 30న ఆదివారం కావడంతో పురపాలక సంఘాల పరిధిలోని పదో తరగతి పరీక్షల కేంద్రాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నా ఇబ్బంది తలెత్తదు. అయితే పోలింగ్ కేంద్రాలను ఈనెల 27నే ఎన్నికల అధికారులకు అప్పగించాల్సి ఉండటం సమస్యకు కారణమవుతోంది. వాస్తవానికి పోలింగ్ కేంద్రాలు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్తాయి. అధికారులు తరచూ వీటిని తనిఖీ చేస్తూ అవసరమైన ఏర్పాట్లు చేపడుతుంటారు. ఇదే సమయంలో గుర్తించిన పదో తరగతి పరీక్షల కేంద్రాల్లోనూ ఈనెల 25 నుంచే అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి ఉంది. ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు జంబ్లింగ్ విధానంలో జరిగే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపడతారు. ఇటు పరీక్షల నిబంధనలు ఉల్లంఘించినా, అటు ఎన్నికల విధులను విస్మరించినా చట్టప్రకారం తీవ్ర పరిణామాలు తప్పవని అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఎన్నికలు, పరీక్షల విధులు ఒక్కరే నిర్వర్తించాల్సి వస్తే పరిస్థితి ఏమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం నిబంధనల ప్రకారం పరీక్ష, పోలింగ్ కేంద్రాలను మార్చే వీల్లేదు. సమస్య తీవ్రతను రాష్ట్ర కమిటీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. 29న జరిగే పరీక్షను వాయిదా వేసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన కీలక సమయంలో ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి రావడం ఇబ్బందికరం. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలి. - తులసిరెడ్డి, వైఎస్ఆర్టీఎఫ్, జిల్లా అధ్యక్షులు -
ప్రశాంతం ‘పరీక్ష’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీలో భాగంగా ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైటెక్ కాపీయింగ్ ముఠా పట్టుబడటం అధికారులను కలవరపర్చినా.. పరీక్ష సాఫీగా సాగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమనే నిబంధన అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రాలు సుదూరంలో ఉండటంతో ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు అభ్యర్థులు ఎదుర్కొన్న అవస్థలు వర్ణనాతీతం. కొద్ది మంది శనివారం రాత్రే ప్రయాణం కాగా.. మరికొందరు ఆదివారం తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిన బస్సుల్లో ఇక్కట్లకు లోనయ్యారు. అభ్యర్థుల సంఖ్యకు తగిన బస్సులను నడపటంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. వెళ్లే సమయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. నిల్చొనేందుకు స్థలం లేక బస్సు టాపుపై ప్రయాణించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. వీఆర్వో పోస్టులకు సంబంధించి 75,807 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 66,811 మంది(83.13 శాతం) హాజరయ్యారు. జిల్లాలోని 244 సెంటర్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. సరిగ్గా 10 గంటలకే పోలీసులు గేట్లు మూసేశారు. నంద్యాలలోని గురురాజ ఇంగ్లిష్ మీడియం సెంటర్‌కు అహోబిలం గ్రామానికి చెందిన ఓ అభ్యర్థి ఒక్క నిమిషం ఆలస్యంగా చేరుకోగా పోలీసులు అనుమతించలేదు. కోచింగ్ తీసుకున్నాను.. బస్సు జాప్యం వల్ల ఆలస్యమైందని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. జిల్లాలో ఇలాంటి అభ్యర్థులు చాలా మంది ఈ నిబంధనతో పరీక్ష రాయలేకపోయారు. వీఆర్ఏకు సంబంధించి 5,546 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,958 మంది(89.40 శాతం) మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు కర్నూలులోనే 17 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, జేసీలు వీఆర్వో పరీక్షను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి డోన్‌లో 2 సెంటర్లు, చిన్నటేకూరు సమీపంలోని కొట్టం ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ కన్నబాబు కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ కళాశాల, విజయదుర్గ డిగ్రీ కళాశాల, మాంటిస్సోరి, ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఉస్మానియా కళాశాల, అరబిక్ కళాశాల, కోల్స్, టౌన్‌మోడల్ కళాశాలలను తనిఖీ చేశారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు కూర్మానాథ్, నరసింహులు, రాంసుందర్రెడ్డిలు తమ పరిధిలోని వివిధ సెంటర్లను పరిశీలించారు. అంతా ప్రశాంతం: కలెక్టర్ జిల్లాలో వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగలేదన్నారు. నిర్వహణలో అధికారులంతా జవాబుదారీతనం, సమన్వయంతో పని చేయడం వల్ల పరీక్షను పకడ్బందీగా నిర్వహించగలిగామని వెల్లడించారు.