కడప ఎడ్యుకేషన్: నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో మంచి నీటి సౌకర్యం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 162 పరీక్ష కేంద్రాలలో 35, 642 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 18,135 బాలురు కాగా 17,507 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా టేబుళ్లు ఏర్పాటు చేసి.. హాల్‌టికెట్ నంబర్లు వేశామని డీఈఓ డీఈఓ బండ్లపల్లె ప్రతా్‌ప్‌రెడ్డ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ముందుగా చేరుకోవాలని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్టు తప్ప ఏ విధమైన కాగితాలు తీసుకెళ్లరాదన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు ఉండకూడదన్నారు. అలా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పిడితే చర్యలు తప్పవన్నారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు సిట్టింగ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిద్ధంగా ఉందన్నారు.
నేటి నుంచి పది పరీక్షలు
Published Thu, Mar 26 2015 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM
Advertisement
Advertisement