సాక్షి, న్యూఢిల్లీ : యూపీఎస్‌సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు సవరించిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 4న జరుగుతాయని యూపీఎస్‌సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పెద్దసంఖ్యలో అభ్యర్ధులు సివిల్స్ ప్రిలిమనరీ, ఐఎఫ్‌ఎస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరవుతున్న క్రమంలో వారి అభ్యర్ధన మేరకు వారి పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు యూపీఎస్‌సీ తెలిపింది. అదనపు అభ్యర్ధులకు ఆయా కేంద్రాలు వసతుల పెంపు ఆధారంగా అభ్యర్ధుల పరీక్షా కేంద్రాల మార్పు అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల మార్పుకు సంబంధించిన ఆప్షన్‌ను జులై 7-13 వరకూ జులై 20-24 వరకూ రెండు దశల్లో కమిషన్ వెబ్‌సైట్ https://upsconline.nic.inద్వారా అందించాలని కోరింది. అభ్యర్ధులు వెబ్‌సైట్‌ను సందర్శించి పరీక్షా కేంద్రాలపై తమ ఎంపికను సమర్పించాలని కోరింది. అభ్యర్ధుల వినతులను ‘ఫస్ట్ అప్లై-ఫస్ట్ అలాట్’ పద్ధతిన పరిశీలిస్తామని స్పష్టం చేసింది. సీలింగ్ కారణంగా తాము కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని పొందలేని వారు మిగిలిన వాటి నుంచి ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. చదవండి : యూపీఎస్సీ 2020 సన్నద్ధమవుదామిలా..
Comments
Please login to add a commentAdd a comment