► 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
► 3,553 మంది అభ్యర్థుల దరఖాస్తు
► పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్ : ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు ఈ నెల 7న జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో జరుగుతాయని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. 3,553 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్.. జేసీ–2 సయ్యద్ ఖాజామొíß ద్దీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. యూపీఎస్సీ నిర్దేశించిన నియమావళిని పరీక్షల వి««దlులను నిర్వర్తిస్తున్న అధికారులు కచ్చితంగా పాటించాలన్నారు.
జిల్లాలో పరీక్ష నిర్వహించడం ఇది రెండవసారన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 72 పట్టణాల్లో 2,655 కేంద్రాల్లో 11.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ముందుగానే పరిశీలించి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దారులను ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అదికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జీ డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి, అదనపు ఎస్పీ పి.మల్యాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాలు ఇవే ..
యూపీఎస్‌సీ పరీక్షలు తొమ్మిది కేంద్రాల్లో జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. జేఎన్‌టీయూ (సెంటర్–ఎ), జెన్‌టీయూ (సెంటర్–బి), కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశా, ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల, ఎస్‌ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాల, కేఎస్‌ఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్ కళాశాల, కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎస్‌కేయూ), ప్రభుత్వ జూనియర్ కళాశాల. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 26 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎస్‌ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాలలో ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్
జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యలు ఉంటే 08554–275811కి ఫోన్ చేసి చెప్పాలి. అభ్యర్థులకు ఎటువంటి సమాచారం కావాలన్నా 011–23385271, 011–23381125, 011–23098543 నంబర్లలో లేదా ఠీఠీఠీ.upటఛి.జౌఠి.జీn సంప్రదివచ్చవచ్చు.
7న సివిల్స్ ప్రిలిమినరీ
Published Tue, Aug 2 2016 11:54 PM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
Advertisement