ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య | Higher education in local languages | Sakshi
Sakshi News home page

ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య

Published Wed, Jul 19 2023 2:13 AM | Last Updated on Wed, Jul 19 2023 2:13 AM

Higher education in local languages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనివ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసు కెళ్ళేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రాల పరిధి లోని ఉన్నత విద్య పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేయాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ఈ నిర్ణ యం తీసుకున్నట్టు పేర్కొంది.

కీలక మైన ఉన్నత విద్య లో ప్రమాణాలు మెరుగవ్వాలంటే, బోధన, పాఠ్య పుస్తకాలు స్థానిక భాషల్లోనే ఉండాలని కేంద్రం జరిపిన అధ్యయ నాల్లో వెల్లడైంది. దీనివల్ల సబ్జెక్టుపై విద్యా ర్థులకు పట్టు లభిస్తుందని, పలితంగా విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసేలోగా మార్కెట్‌ అవసరాలకు అనువైన నైపుణ్యాన్ని సంపాదిస్తాడని ఎన్‌ఈపీ–2020లో పేర్కొన్నారు.

దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుగా పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో తర్జుమా చేయా లని భావించారు. దీనికోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీ) ఆర్టిఫీషి యల్‌ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీ ఆధారంగా ‘అనువాదిని’ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలూ ఉపయోగించుకుని డిగ్రీ, ఇంజనీరింగ్‌తో పాటు అన్ని రకాల ఉన్నత విద్య పాఠ్యపుస్తకాలను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో తర్జుమా చేయాలని సూచించింది.

అయితే, ఇంగ్లిష్, స్థానిక భాషను ఎంచుకోవడం విద్యార్థి ఐచ్ఛికమే. తెలుగు మీడియం ఉంటే ప్రత్యేక తరగతి బోధన చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాల తర్జుమాకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటూ యూజీసీ  మార్గదర్శకాలు విడుదల చేసింది. 

డిగ్రీలో మొదలైంది... ఇంజనీరింగ్‌పై త్వరలో నిర్ణయం 
ఎన్‌ఈపీ–2020లో భాగంగా స్థానిక భాషల్లో పుస్తకాల ప్రచురణపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. తెలుగు అకాడమి ద్వారా పుస్తకాల తర్జుమా చేయిస్తున్నాం. సాంకే తిక విద్యకు సంబంధించిన పుస్తకాలపై త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి, నిర్ణయం తీసుకుంటాం. – ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్‌)

ప్రత్యేక బోధకులుండేలా చూడాలి.. 
స్థానిక భాషలో బోధన అంశాన్ని ముందుకు తెచ్చేటప్పుడు కాలేజీల్లో బోధకుల సంఖ్య పెంచాలి. ఇంగ్లిష్, తెలుగు మీడియాలను వేర్వేరుగా బోధించడం ఒకే అధ్యాపకుడికి సాధ్యం కాదు. దాని వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి.     – డాక్టర్‌ వి బాలకృష్ణ,     సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement