higher studies
-
‘అటానమస్’లోనూ ఏపీ అదుర్స్!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్య కళాశాలలకు స్వయం ప్రతిపత్తి సాధనలో రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోని అత్యధిక సంఖ్యలో అటానమస్ కళాశాలలు కలిగిన మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత 165 స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలతో ఏపీ మూడో స్థానంలో నిలుస్తోంది. ఏపీ తర్వాతే తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు, ఫలితాలు, సమగ్ర మౌలిక వసతుల కల్పనల ద్వారా ఏపీ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఎక్కువ కళాశాలలు అటానమస్ హోదాను పొందుతున్నాయి. ఈ స్వయం ప్రతిపత్తి కళాశాలలు వర్సిటీలతో సంబంధం లేకుండా సొంత పాఠ్యాంశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు.. ప్రశ్నపత్రాల నిర్వహణ, ఫలితాల విడుదల వంటి విద్యా సంబంధ, పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛగా పనిచేస్తాయి. యూజీసీ కంటే ముందుచూపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2023లో కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అనుబంధ కళాశాలలకు స్వయం ప్రతిపత్తిని అనుమతించడానికి విశ్వవిద్యాలయాల కోసం ప్రత్యేక నిబంధనలు తెచ్చింది. కానీ, చాలా రాష్ట్రాలు వాటిని అనుమలు చేయడం లేదు. అంతకుముందే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రతి కళాశాలకు న్యాక్ గుర్తింపుతో పాటు.. మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సంస్కరణలు తెచ్చారు. ఇందుకు అనుగుణంగా కాలేజీలకు అక్రిడిటేషన్ వచ్చేలా సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయించారు. దీని ద్వారా అన్ని కాలేజీలు న్యాక్ అక్రిడిటేషన్, ఏ గ్రేడ్‌తో పాటు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టారు. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, అటానమస్ కాలేజీలు, పరిశ్రమల ప్రముఖలతో పాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేశారు. న్యాక్‌లో గుర్తింపు పొందిన కళాశాలలను స్వయం ప్రతిపత్తి దిశగా తీసుకెళుతున్నారు. వీసీలతో యూజీసీ చర్చలు.. 2035 నాటికి దేశంలోని అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని భావిస్తోంది. అయితే చాలా వర్సిటీలు అనుబంధ కళాశాలలను ఆ దిశగా ప్రోత్సహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూజీసీ స్వయం ప్రతిపత్తి అజెండాను ముందుకు తీసుకెళ్లడంపై విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చలు జరపాలని యూజీసీ యోచిస్తోంది. 2023లో నిబంధనలు ప్రవేశపెట్టినప్పటి నుంచి స్వయం ప్రతిపత్తి హోదా కోసం యూజీసీకి 590 కళాశాలలు దరఖాస్తులు చేసుకున్నాయి. వీటిలో 460కి పైగా దరఖాస్తులను కమిషన్ పరిశీలించి ఆమోదించింది. ‘స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలకు ఇప్పటికే ఉన్న కోర్సులను పునర్నిర్మించడానికి, రీడిజైన్ చేయడానికి స్వేచ్ఛనిస్తుంది. వారు పరిశ్రమ అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకోవచ్చు. విశ్వవిద్యాలయాల మాదిరిగా బోధన–అభ్యాస ప్రక్రియలను, ఫలితాల ఆధారిత అభ్యాసాన్ని ఆవిష్కరించొచ్చు. విద్యాసంస్థలు విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి కొత్త పద్ధతులను రూపొందించొచ్చు. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను ఆఫర్ చేయొచ్చు’ అని యూజీసీ చైర్మన్, మామిడాల జగదీశ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. -
పిల్లల చదువు కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది!
నేను సావరీన్ గోల్డ్ బాండ్లలో (ఎస్‌జీబీలు) ఇన్వెస్ట్ చేశాను. కాల వ్యవధి ముగిసిన తర్వాత వీటిని విక్రయించాలా..? లేక ఆ మొత్తం నా ఖాతాలో జమ అవుతుందా? – వేదవ్యాస్ విశ్వరూప్ ఎస్‌జీబీల కాల వ్యవధి ఎనిమిదేళ్లు. గడువు ముగియడానికి నెలరోజుల ముందు బాండ్ల మెచ్యూరిటీ తేదీ గురించి ఇన్వెస్టర్లకు సమాచారం వస్తుంది. గడువు ముగిసిన తర్వాత ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టే రోజున ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. గడువు ముగిసిన రోజు నాటి ముందు మూడు రోజుల బంగారం సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఇండియా బులియన్ అండ్ జ్యుయెలర్స్ అసోసియేషన్ ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ధరలను ఇందుకు ప్రామాణికంగా పరిగణిస్తారు. ఆ ప్రకారం ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేస్తారు. ఎస్జీబీ సర్టిఫికెట్‌లోనూ బ్యాంక్ ఖాతా వివరాలు నమోదై ఉంటాయి. ఒకవేళ సార్వభౌమ బంగారం బాండ్లను ట్రేడింగ్ ఖాతా ద్వారా సెకండరీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే అవి డీమ్యాట్ ఖాతాలో ఉంటాయి. కనుక మెచ్యూరిటీ ముగిసిన అనంతరం డీమ్యాట్ ఖాతాకు అనుసంధానమైన ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఎస్‌జీబీల ట్రేడింగ్ ధర హెచ్చు, తగ్గులుగా ఉండొచ్చు. అయినప్పటికీ గడువు తీరే నాటి ముందు మూడు పనిదినాల సగటు ధర ప్రకారమే చెల్లింపులు చేస్తారు. బంగారంలో పెట్టుబడులకు ఎంతో సౌకర్యవంతమైన మార్గం ఎస్‌జీబీలు అని తప్పక చెప్పాలి. పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ ఇందులో లభిస్తుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే వచ్చే లాభంపై ఎలాంటి పన్ను లేదు. పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – శరవణన్ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్లకు పైగా కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరలతో ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. కనుక మీరు పెట్టుబడి మొత్తాన్ని ఒకే సారి కాకుండా.. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి.. అక్కడి నుంచి ప్రతి నెలా సిప్ రూపంలో మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. -
ప్రణాళికతోనే కెరీర్ బంగారం
మనీష్ అరోరా (46) ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ‘ఆద్య’ ఉంది. ఆమెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలన్నది అరోరా కల. కుమార్తెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ఆద్య రెండు నెలల క్రితమే యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్(చికాగో)లో సైకాలజీలో అండర్‌గ్రాడ్యుయేషన్ సీటు సంపాదించింది. అందుకు కావాల్సిన వ్యయాలను అరోరా ముందు చూపుతో సమకూర్చుకున్నారు. ఆద్య చదివే కోర్స్ వ్యయం భారీగా ఉన్న ప్పటికీ, ముందస్తు స్పష్టత అరోరాకు మార్గాన్ని చూపించింది. తమ పిల్లలకు వీలైనంతలో అత్యుత్తమ విద్యను అందించాలని అధిక శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఆచరణలో అంత సులభం కాదు. ప్రణాళికతోనే ఇది సాధ్యం. కెరీర్ ఆప్షన్లు, చేయాల్సిన కోర్స్‌లు, అయ్యే వ్యయం, కాల వ్యవధి ఇలా పలు అంశాలపై స్పష్టత, ప్రణాళికతోనే విజయం సాధించగలరు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కథనమే ఇది. బోలెడు ఆప్షన్లు గతంతో పోలిస్తే ఉన్నత విద్యలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులు చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు భిన్నమైన కోర్సులు ఎంపిక చేసుకుంటుంటే, విదేశీ విద్య కోసం వెళ్లే వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా నూతన తరం కోర్సులకు సంబంధించి కెరీర్ ఆప్షన్లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫైనాన్స్, డేటా అనలైటిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, కాగ్నిటివ్ సైన్స్, మెరైన్, సైకాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ ఇవన్నీ ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్లుగా మారుతున్నాయి. ‘‘గేమ్ డిజైనింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)కు ఆదరణ పెరుగుతోంది. ఎక్కువ శాతం కెరీర్ ఆప్షన్లు సోషల్ మీడియా నుంచి ఉంటున్నాయి. వీడియో ఎడిటింగ్‌కు సైతం డిమాండ్ పెరుగుతోంది’’అని మ్నెమోనిక్ ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ అడ్మిషన్స్ సంస్థ అధినేత శిరీష్ గుప్తా తెలిపారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, డేటా సైన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, కంటెంట్ తయారీ వంటివన్నీ బంగారం వంటి అవకాశాలను తెచ్చి పెడుతున్నాయి. ‘‘వచ్చే పదేళ్ల కాలానికి సంబంధించి 85 శాతం ఉద్యోగాలు ఇంకా ఆవిష్కృతం కావాల్సి ఉంది. సంప్రదాయ ఉద్యోగాల నుంచి నిరంతరం మారాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీతో సంబంధం లేని ఉద్యోగం దాదాపు ఉండకపోవచ్చు. అది రిటైల్ అయినా లేక ఈ కామర్స్ అయినా కృత్రిమ మేథ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుంది’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ సహ వ్యవస్థాపకురాలు నీతి శర్మ తెలిపారు. అంటే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగై పోతాయని అనుకోవద్దు. అస్థిరతలు వద్దనుకునే వారు ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు వెళుతుండడాన్ని గమనించొచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, పరిశోధకులు, చరిత్రకారుల అవసరం భవిష్యత్తులోనూ ఉంటుంది. కానీ, ఆటోమేషన్, ఏఐ కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పుగా మారడం ఖాయం. లోగో, గ్రాఫిక్ డిజైనింగ్ పనులు ఆటోమేషన్‌కు మారుతున్నాయి. ట్రాన్స్‌లేటర్లు, టెలీ మార్కెటర్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. యంత్రాలు అంత సులభంగా చేయలేని నైపుణ్యాలు, కోర్సులను చేసే దిశగా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని గుప్తా సూచించారు. విద్య, ఉపాధిలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సాయంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే మెరుగైన విద్యా అవకాశాల కోసం విదేశాలకు పంపించడాన్ని కూడా పరిశీలించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొదటి పుట్టిన రోజు నుంచే.. పిల్లల ఉన్నత విద్యకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు ఉన్న సులభ మార్గం వారి మొదటి పుట్టిన రోజు నుంచి ఆరంభించడమే. దీనివల్ల పెట్టుబడులు వృద్ధి చెందడానికి తగినంత సమయం మిగిలి ఉంటుంది. నెలవారీ పరిమిత మొత్తంతో పెద్ద నిధిని సమకూర్చుకోగలరు. ఇందుకు గాను ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌ను ముందే సంప్రదించి తమకు అనుకూలమైన (తగిన) ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కేవలం ఉన్నత విద్య అనే కాకుండా వారి వివాహాలకు సంబంధించి కూడా విడిగా ప్రణాళిక అవసరం. భారీ ఖర్చులకు సంబంధించి ముందు నుంచే ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలవారీ బడ్జెట్‌పై పెద్ద భారం పడదు. పెట్టుబడుల్లో అధిక శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. 10–15 ఏళ్ల కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కొంత మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలకు) వంటి సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలి. పిల్లల ఉన్నత విద్యకు మిగిలి ఉన్న కాల వ్యవధి, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రాబడులు అనే అంశాల ఆధారంగా నిపుణులు వివిధ సాధనాలను సూచిస్తుంటారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్య ఆగిపోకూడదు. అందుకని మెరుగైన కవరేజీతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో పిల్లలను కూడా భాగం చేయడం, లేదంటే వారి పేరిట ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ఎంతో అవసరం. స్కాలర్ షిప్/విద్యారుణం దేశ, విదేశీ యూనివర్సిటీలు చాలా వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆఫర్ చేస్తున్నాయి. యూనివర్సిటీ వెబ్సైట్లను సందర్శించి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. విదేశాల్లోనూ చాలా యూనివర్సిటీలు స్కాలర్షిప్లు, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. పేరొందిన ట్రస్ట్‌లు కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు తమ వంతు ఇన్వెస్ట్ చేస్తూనే, మరోవైపు స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఉన్న మార్గాలను తెలుసుకుని ఉండడం మంచిది. కొన్ని యూనివర్సిటీలు ప్రొఫెషనల్ డిగ్రీలకు అనుబంధంగా అప్రెంటిషిప్ అవకాశం కలి్పస్తున్నాయి. దీనివల్ల ప్రత్యక్ష అనుభవంతోపాటు కొంత ఆర్థిక మద్దతు లభించినట్టు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు యూనివర్సిటీ కోర్సులకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్‌లు అనుబంధంగా ఉన్నాయి. ఉన్నత విద్యా కోర్సులకు సరిపడా సమకూర్చుకోలేని వారు విద్యా రుణాన్ని కూడా పరిశీలించొచ్చు. చిన్న మొత్తం అయితే ఎలాంటి ష్యూరిటీ అవసరం పడదు. పెద్ద మొత్తంలో రుణం తీసుకునేట్టు అయితే ఆస్తుల తనఖా, గ్యారంటీలను బ్యాంకులు కోరొచ్చు. ఇందుకు కూడా ముందుగానే సిద్ధమవ్వాలి. విద్యా రుణాలపై వడ్డీ రేటు 9–15 శాతం మధ్య ఉంది. పిల్లల విద్య పూర్తయి, ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. చాలా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు కోర్సు ఫీజులో 80–90 శాతం వరకు రుణంగా ఇస్తున్నాయి. పిల్లలు చదువుకుంటూనే పార్ట్‌టైమ్ అవకాశాలను వినియోగించుకోవడం మరొక మార్గం. పెరిగిపోతున్న వ్యయాలు అధిక ద్రవ్యోల్బణం, ప్రత్యేకమైన కోర్సులకు డిమాండ్, ఇందుకు మెరుగైన వసతుల కల్పన కారణంగా దేశ, విదేశాల్లో కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు రూ.50వేలకే పూర్తయ్యే ఎంబీఏ కోర్స్ నేడు రూ.5 లక్షలకు చేరడం ఇందుకు ఓ నిదర్శనం. ఐఐఎంలలో ఫీజులు రూ.17 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉన్నాయి. గతంలో ఇవి రూ.6 లక్షల స్థాయిలోనే ఉండేవి. ఐఐటీలోనూ కోర్సు ఫీజు రూ.6–10 లక్షలకు చేరింది. గతంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో ఫీజుల పెరుగుదల 100 శాతానికి పైనే ఉంటోంది. విదేశాల్లోనూ ఫీజుల పెరుగుదల ఇదే మాదిరిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా డాలర్ మారకం రేటు అధికంగా ఉండడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ‘‘దశాబ్దం క్రితం విదేశాల్లో ఏడాది విద్యా వ్యయాలు రూ.25–30 లక్షల మధ్య ఉండేవి. ఇప్పుడు రూ.50 లక్షలకు చేరాయి’’అని గుప్తా తెలిపారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫీజు దశాబ్దం క్రితం రూ.కోటి స్థాయిలో ఉంటే, ఇప్పుడు అది రెట్టింపైంది. కేవలం ట్యూషన్ ఫీజుల వల్లే కాకుండా, జీవన వ్యయాలు కూడా పెరిగిపోవడం ఈ భారాన్ని మరింత పెంచుతోంది. కాకపోతే విదేశీ విద్యకు సంబంధించి నూరు శాతం స్కాలర్షిప్ పొందే అవకాశం కాస్త ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం సొంతం చేసుకోవాలంటే విదేశీ విద్యా ప్రవేశానికి మూడేళ్ల ముందు నుంచే తమ ప్రొఫైల్‌పై పని చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘నూతనతరం కోర్సులు అయితే సాధారణంగా ఏటా రూ.5–10 లక్షల మధ్య ఫీజు ఉంటుంది. ఢిల్లీలోని పెర్ల్ అకాడమీలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ యూఐ/యూఎక్స్ (యూజర్ ఇంటర్ఫేజ్/యూజర్ ఎక్స్‌పీరియెన్స్) కు ఏటా రూ.7 లక్షల ఫీజు ఉంది’’అని గుప్తా వెల్లడించారు. కోర్సుకు సంబంధించి ట్యూషన్ ఫీజు కేవలం ఒక భాగమే. పిల్లల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు కోసం తల్లిదండ్రులు అదనంగా ఖర్చు చేయక తప్పదు. కాలం చెల్లిన కరిక్యులమ్ నేపథ్యంలో, పిల్లలకు సమాంతరంగా నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుందని గుప్తా అంటున్నారు. తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశానికి దూరంగా, ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తే అప్పుడు వారి జీవనం కోసం మరింత వ్యయం చేయాల్సి వస్తుంది. ఇక విదేశాలకు పంపించే వారిపై ఈ భారం మరింత పెరుగుతుంది. వసతి, ఆహారం, లాండ్రీ, ఇంటర్నెట్, మొబైల్, వస్త్రాలు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జీవనం, రవాణా వ్యయాలు, యుటిలిటీలు (విద్యుత్, టెలిఫోన్), ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అరిజిత్ సేన్ పేర్కొన్నారు. భయపెట్టే అంచనాలు చారిత్రకంగా చూస్తే గడిచిన దశాబ్ద కాలంలో కోర్సుల ఫీజులు నూరు శాతానికి పైగా పెరిగాయి. భవిష్యత్తులోనూ ఇదే తరహా పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘కోర్సుల ఫీజుల పెరుగుదల వచ్చే దశాబ్దం పాటు ఇదే మాదిరిగా ఉంటుంది. జీడీపీ 6 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వెళితే, దీనికి అనుగుణంగా సగటున పెరిగే కుటుంబాల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, విద్యా వ్యయం 10 శాతం చొప్పున పెరుగుతూ వెళ్లినా.. ఫీజులు, విద్యా రుణాలు భారంగా మారతాయి’’అని నీతి శర్మ పేర్కొన్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి ప్రత్యామ్నాయాల రూపంలో రవాణా, జీవన వ్యయాల వంటివి ఆదా చేసుకునే అవకాశం ఉందని శర్మ వివరించారు. ‘‘ప్రతిష్టాత్మక కాలేజీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ చేసేందుకు ఇప్పుడు ఏటా రూ.12–15 లక్షల వరకు ఖర్చవుతోంది. విద్యా ద్రవ్యోల్బణం 10–12 శాతం ఉంటుందన్న అంచనా ఆధారంగా వచ్చే పదేళ్లలో ఇది రూ.40 లక్షలకు చేరొచ్చు. ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీకి నేడు రూ.కోటి అవుతుంటే పదేళ్ల తర్వాత రూ.3 కోట్లు వ్యయం చేయాల్సి రావచ్చు’’అని అరిజిత్ సేన్ తెలిపారు. అనుసరణీయ మార్గాలు.. ఖరీదుగా మారుతున్న ఉన్నత విద్య కోసం తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. కాలేజీ ప్రవేశానికి రెండేళ్ల ముందు నుంచే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. విదేశాలకు పంపించేట్టు అయితే అక్కడి జీవన పరిస్థితులు, సంస్కృతి, దరఖాస్తు ప్రక్రియ, ఎదురయ్యే సవాళ్లపై అవగాహన తెచ్చుకోవాలి. కనుక ఈ విషయంలో నిపుణుల సాయం తప్పనిసరి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ చదువులకు సంబంధించి ప్రస్తుత వ్యయాలు. తమ పిల్లల ఉన్నత విద్యకు ఇంకా ఎన్నేళ్ల కాల వ్యవధి మిగిలి ఉంది? ఎలాంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవాలి, అక్కడి ప్రస్తుత ఫీజులు, తమ పిల్లలు కాలేజీ ప్రవేశం పొందే నాటికి ఎంత మేర పెరగొచ్చనే విషయాలపై స్పష్టత అవసరం. దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు సేవలు అందిస్తున్నాయి. కోర్స్ వ్యయం, ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు, రవాణా వ్యయాలు, స్కాలర్షిప్ ఉన్న అవకాశాలు, మెరుగైన విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలను వారి నుంచి తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలు కాలేజీకి వచ్చే నాటికి వారి ఆసక్తులు ఎలా ఉంటాయన్నది ముందే గుర్తించడం అసాధ్యం. కనుక భవిష్యత్‌లో వారు ఏ కోర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తారన్నది ముందుగా తెలియదు. అందుకని ఖరీదైన కోర్స్‌కు సంబంధించి సన్నద్ధం కావడం మంచిది. -
అంతర్గత ప్రతిభకే అందలం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో మూల్యాంకన విధానం పూర్తిగా మారబోతోంది. సంప్రదాయ పద్ధతులకు ఇక స్వస్తి పలకనున్నారు. మార్కులే కొలమానం కాకుండా, విద్యార్థిలోని నిజమైన ప్రతిభను వెలికి తీసి, దాని ఆధారంగా అతని క్రెడిట్స్ నిర్ణయిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పోస్టు– గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తును ఓయూ మొదలు పెట్టింది. అధ్యాపకులకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులను కూడా ముందుగానే సమాయత్తం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఓయూ పరిధిలో పీజీ కోర్సులు చేసే దాదాపు 30 వేల మంది సరికొత్త మూల్యాంకన పరిధిలోకి వస్తారు. కొత్త మూల్యాంకన విధానంపై ఉన్నత విద్యా మండలి గత ఏడాది ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) చేత అధ్యయనం చేయించింది. ఈ సంస్థ ఇచ్చిన సిఫారసులను మండలి ఆమోదించి అమల్లోకి తెస్తోంది. ప్రతిభకు అన్నివిధాలా పరీక్ష ఇప్పటివరకూ ఏడాది మొత్తం చదివిన విద్యకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో వచ్చే మార్కులే ప్రతిభకు కొలమానాలు. కొత్త విధానంలో విద్యార్థి అంతర్గత నైపుణ్యాన్ని గుర్తిస్తారు. ఈ ప్రక్రియలో బోధకులు అత్యంత కీలకంగా మారనున్నారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ ఏడాది పొడవునా అతను అనుసరించే విధానాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో అటెండెన్స్‌కు సైతం కొన్ని మార్కులుంటాయి. ప్రతి చాప్టర్లో పాఠాన్ని విద్యార్థి ఏమేర అర్థం చేసుకున్నాడో గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం విద్యార్థులకు అధ్యాపకులు కొన్ని ప్రశ్నలు వేస్తారు. సబ్జెక్టుపై పట్టు కోసం తరగతి గదిలో స్వల్పకాలిక చర్చలు నిర్వహిస్తారు. నెలవారీ పరీక్షలూ నిర్వహిస్తారు. విద్యార్థి తాను చదివే సబ్జెక్టుల్లో ఎక్కడ ప్రతిభ కలిగి ఉన్నాడు? ఎక్కడ వెనుకబడ్డాడు? అనేది గుర్తించి మార్కులు వేస్తారు. మరోవైపు అనుభవ పూర్వక విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థి థియరీ కాకుండా, ప్రాక్టికల్‌గా తన ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మెరుగైన ఫలితాలిస్తాయని పారిశ్రామిక రంగం కోరుకునే నిపుణులు తయారయ్యే వీలుందని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ప్రతిభను వెలుగులోకి తేవడానికే : ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్య మండలి ఛైర్మన్) మూల్యాంకన విధానంలో మార్పుల వల్ల విద్యార్థి కేవలం థియరీకే పరిమితం అయ్యే అవకాశం లేదు. అతనిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నత విద్య చేసినా, ఉపాధి కోసం వెతుక్కునే పరిస్థితి ఉండకూడదనే ఈ సరికొత్త విధానం అనుసరిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందుకెళ్ళాం. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అధ్యాపకులనూ సన్నద్ధం చేశాం : ప్రొఫెసర్ రవీందర్ (ఓయూ వీసీ) ఈ ఏడాది పీజీ కోర్సుల్లో కొత్త మూల్యాంకన విధానం అమలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా అధ్యాపకులను సన్నద్ధం చేశాం. క్లాసులు ప్రారంభమైనప్పట్నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది. సిసలైన ప్రతిభ వెలికి తీసే విధానం కాబట్టి విద్యార్థులకూ మేలు జరుగతుంది. -
సమున్నతం!
సాక్షి, అమరావతి: పునాది బాగుంటేనే ఓ భవనమైనా, చదువులైనా పది కాలాల పాటు పటిష్టంగా ఉంటాయి! ప్రాథమిక స్థాయి నుంచి విద్యారంగ సంస్కరణలను చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇందుకోసం నాలుగేళ్లలో రూ.65 వేల కోట్లకుపైగా వెచ్చించడం చదువులకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఉన్నత విద్యలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తూ తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు భోజన, వసతి ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది. ఇంటర్ తర్వాత ఏ విద్యార్థి చదువుకూ ఆటంకం కలుగకుండా 2019 జూన్ నుంచి ఈ ఏడాది జూలై వరకు దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు మొత్తం రూ.14,912.43 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ.10,636.67 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయగా విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన కింద మరో రూ.4275.76 కోట్లు అందించింది. ఇక జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా మరో రూ.132.41 కోట్లను 1,858 మంది విద్యార్థులకు అందచేసి ఉన్నత చదువులకు అండగా నిలిచింది. మరోవైపు ఇంజనీరింగ్‌తో పాటు సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదివిన వారికి చక్కటి ఉపాధి, ఉద్యోగాలు లభించేలా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టింది. తొలిసారిగా ప్రైవేట్ వర్సిటీల్లో 35 శాతం సీట్ల కోటా ప్రైవేట్ వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఆ వర్సిటీల్లో 35 శాతం సీట్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తద్వారా పేద మెరిట్ విద్యార్థులకు వాటిల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించింది. 27 వేల సంస్థల్లో ఇంటర్న్‌షిప్ గతంలో డిగ్రీ చేతికొచ్చినా తగినన్ని నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగం, ఉపాధి లభిస్తుందన్న నమ్మకం లేదు. దీన్ని సరిదిద్ది నూతన బోధనా విధానాలపై శిక్షణ కార్యక్రమాలతోపాటు ఎడెక్స్ లాంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థల ద్వారా సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇంటర్న్‌షిను తప్పనిసరి చేసింది. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్‌షి అమలు చేస్తుండగా నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ (ఆనర్స్) కోర్సులు చదివే వారికి ఏడాది ఇంటర్న్‌షి ప్రవేశపెట్టారు. మూడేళ్లలో డిగ్రీ కోర్సు నుంచి బయటకు వచ్చేవారికి 10 నెలల ఇంటర్న్‌షి తప్పనిసరి చేసింది. జిల్లాకు ఒక డిగ్రీ కాలేజీని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతోంది. ఇంటర్న్‌షి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని 27,119 సంస్థలను గుర్తించారు. వీటిలో ఏపీ జెన్కో, హ్యుందాయ్, కియా మోటార్స్, విప్రో, అమర్‌రాజా బ్యాటరీస్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెంబ్‌కార్ప్ ఎనర్జీ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మైలాన్ లేబోరేటరీస్ లిమిటెడ్ లాంటి ప్రముఖ సంస్థలున్నాయి. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ లాంటి కోర్సులు చదివిన 2,91,022 మంది విద్యార్థులు తమ సర్టిఫికేషన్‌ను పూర్తి చేయడం విశేషం. కమ్యూనిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్ కోసం యునిసెఫ్‌కు అనుబంధంగా ఐదు లక్షల మంది విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేశారు. భారీగా ప్లేస్‌మెంట్స్ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ అందించేందుకు నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్‌తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో లక్ష మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, సేల్స్‌ఫోర్స్ వంటి కంపెనీల్లో వర్చువల్ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఎడ్యుస్కిల్, సేల్స్‌ఫోర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి కోర్సులు పూర్తి చేశారు. లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. వీటివల్ల ప్లేస్‌మెంట్స్ గణనీయంగా పెరిగాయి. క్యాంపస్ ఎంపికల్లో 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందగా 2022–23లో ఈ సంఖ్య 1.20 లక్షలకు పెరగడం విశేషం. నైపుణ్యాలకు పదును విద్యార్థులను ఉత్తమ రీతిలో తీర్చిదిద్దాలంటే అధ్యాపకులకు నైపుణ్యాలపై శిక్షణ అవసరం. ఇందుకోసం 400 మంది అధ్యాపకులకు వరంగల్‌లోని ఎన్ఐటీలో మరో వెయ్యి మంది అధ్యాపకులకు ఆన్లైన్ ద్వారా ఈ–కంటెంట్‌పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు నచ్చిన సమయంలో కోరుకున్న సబ్జెక్టును చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వీడియో పాఠాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సమస్యలకు పరిష్కారాలు, ప్రశ్నాబ్యాంకు లాంటి వనరులను అందుబాటులో ఉంచుతున్నారు. 3,146 వీడియోలను సిద్ధం చేసి ఎల్ఎంఎస్కు జోడించారు. న్యాక్ అక్రిడిటేషన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల ద్వారా కళాశాలల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు డిపార్ట్మెంట్ అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్‌ను ప్రభుత్వం చేపట్టింది. బడ్జెట్లో భారీగా నిధులు యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రత్యేక శిక్షణ సంస్థలనూ నెలకొల్పుతున్నారు. ఇందుకోసం 2022–23 బడ్జెట్లో రూ.969.91 కోట్లు కేటాయించడం గమనార్హం. 2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదగాలన్న యూజీసీ లక్ష్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల్లో విద్యలో సంస్కరణలను అమలు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఆనర్స్) ప్రవేశపెట్టింది. 144 కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూములను ఏర్పాటు చేసి అధునాతన విధానాల్లో బోధించేలా చర్యలు తీసుకుంది. ఐసీటీ ఆధారిత బోధన, అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు 56 కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములను నెలకొల్పారు. ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సులు రాష్ట్రంలో 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 111 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 1,022 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం 3,65,563 సీట్లుండగా 2 లక్షల నుంచి 2.5 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కాలేజీ విద్యను పటిష్టం చేయడంలో భాగంగా ప్రమాణాలు పాటించని విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 30 మంది కన్నా తక్కువ చేరికలున్న కాలేజీలకు ముందుగా నోటీసులిచ్చి ఆ తర్వాత మూసివేతకు, కోర్సుల రద్దుకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఇతర కాలేజీలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలని నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. యూజీసీ కంటే ముందే ఉమ్మడి పీజీసెట్ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూఈటీ)ని యూజీసీ అమల్లోకి తెచ్చింది. దీనిద్వారా విద్యార్థులకు బహుళ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పడంతో పాటు ఫీజుల వ్యయమూ తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ కంటే ముందే అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు 2021లోనే కామన్ ఎంట్రెన్స్ టెస్టును అమల్లోకి తెచ్చింది. యూజీసీ ఆలోచనలను ఏడాది ముందుగానే అమల్లోకి తెచ్చింది. విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ అందరి కంటే ఒక అడుగు ముందే ఉంది. జాతీయ సగటుకు మించి జీఈఆర్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తుండడంతో మన రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. 2020–21లో దేశంలో సగటు జీఈఆర్ 27.3 శాతం ఉండగా రాష్ట్రంలో 37.2 శాతంగా నమోదైంది. కాలేజీల్లో ఎస్సీ విద్యార్థుల చేరికల పెరుగుదలలో జాతీయ స్థాయిలో కంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉంది. చదువుల వ్యయంతోపాటు ఇంటర్న్‌షిప్, స్కిల్ కోర్సులను అందిస్తుండటంతో జీఈఆర్ గణనీయంగా పెరిగింది. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు యువతుల వివాహ వయసు 18 ఏళ్లు నిండడంతో పాటు 10వ తరగతి చదవడం తప్పనిసరి అనే నిబంధన విధించడంతో బాలికల విద్యా రేటు పెరిగింది. ఈ పథకాలతో ప్రయోజనం పొందిన 50 శాతానికి పైగా యువతులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారే కావడం గమనార్హం. -
ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనివ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసు కెళ్ళేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రాల పరిధి లోని ఉన్నత విద్య పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేయాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ఈ నిర్ణ యం తీసుకున్నట్టు పేర్కొంది. కీలక మైన ఉన్నత విద్య లో ప్రమాణాలు మెరుగవ్వాలంటే, బోధన, పాఠ్య పుస్తకాలు స్థానిక భాషల్లోనే ఉండాలని కేంద్రం జరిపిన అధ్యయ నాల్లో వెల్లడైంది. దీనివల్ల సబ్జెక్టుపై విద్యా ర్థులకు పట్టు లభిస్తుందని, పలితంగా విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసేలోగా మార్కెట్ అవసరాలకు అనువైన నైపుణ్యాన్ని సంపాదిస్తాడని ఎన్ఈపీ–2020లో పేర్కొన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుగా పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో తర్జుమా చేయా లని భావించారు. దీనికోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీ) ఆర్టిఫీషి యల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా ‘అనువాదిని’ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలూ ఉపయోగించుకుని డిగ్రీ, ఇంజనీరింగ్‌తో పాటు అన్ని రకాల ఉన్నత విద్య పాఠ్యపుస్తకాలను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో తర్జుమా చేయాలని సూచించింది. అయితే, ఇంగ్లిష్, స్థానిక భాషను ఎంచుకోవడం విద్యార్థి ఐచ్ఛికమే. తెలుగు మీడియం ఉంటే ప్రత్యేక తరగతి బోధన చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాల తర్జుమాకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటూ యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీలో మొదలైంది... ఇంజనీరింగ్‌పై త్వరలో నిర్ణయం ఎన్ఈపీ–2020లో భాగంగా స్థానిక భాషల్లో పుస్తకాల ప్రచురణపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. తెలుగు అకాడమి ద్వారా పుస్తకాల తర్జుమా చేయిస్తున్నాం. సాంకే తిక విద్యకు సంబంధించిన పుస్తకాలపై త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి, నిర్ణయం తీసుకుంటాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) ప్రత్యేక బోధకులుండేలా చూడాలి.. స్థానిక భాషలో బోధన అంశాన్ని ముందుకు తెచ్చేటప్పుడు కాలేజీల్లో బోధకుల సంఖ్య పెంచాలి. ఇంగ్లిష్, తెలుగు మీడియాలను వేర్వేరుగా బోధించడం ఒకే అధ్యాపకుడికి సాధ్యం కాదు. దాని వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. – డాక్టర్ వి బాలకృష్ణ, సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) -
చదువుల తల్లులు
సాక్షి, అమరావతి: దేశంలో ఉన్నత చదువుల్లో మహిళల చేరికలు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. పదేళ్ల క్రితం అంతంతమాత్రంగా ఉన్న చేరికలు ప్రస్తుతం భారీగా వృద్ధి చెందాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు బీఏ, బీకాం, ఎంఏ, ఎంకాం వంటి కోర్సులకే పరిమితమైన అమ్మాయిలు ఇప్పుడు స్టెమ్ (సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సులకు పెద్దపీట వేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో 2016లో 8 శాతంగా ఉన్న మహిళల చేరికలు 2021లో 20 శాతానికి పెరగడం విశేషం. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో కూడా వీరి చేరికలు 23 శాతంగా ఉండడం గమనార్హం. ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మహిళల చేరికలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించడం ఇందుకు దోహదపడింది. 2017లో ఐఐటీల్లో చేరిన మహిళలు 995 మంది ఉండగా 2021 నాటికి ఈ సంఖ్య 3 వేలకు చేరుకుంది. ఐఐటీ, ఎన్ఐటీల్లోనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ స్టెమ్ కోర్సులకే అమ్మాయిలు ప్రాధాన్యమిస్తున్నారు. జాతీయ ఉన్నత విద్యా సర్వే నివేదిక ప్రకారం.. 2016–17లో స్టెమ్ కోర్సుల్లో చేరిన మహిళలు 41 లక్షలుగా ఉండగా 2020–21లో అది 44 లక్షలకు చేరింది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో కన్నా మనదేశంలో స్టెమ్ కోర్సులు అభ్యసిస్తున్న మహిళలు ఎక్కువ కావడం విశేషం. మనదేశంలో స్టెమ్ కోర్సులు చేస్తున్న మహిళలు 43 శాతం కాగా అమెరికాలో 34 శాతం, బ్రిటన్‌లో 38 శాతం, కెనడాలో 31 శాతం మాత్రమే. 2 కోట్లకు పైగా ఉన్నత విద్యార్థినులు కాగా కొద్దికాలం క్రితం విడుదలైన ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదిక ప్రకారం.. 2020–21లో ఉన్నత విద్యలో పురుషులు, మహిళల మొత్తం చేరికలు 4.14 కోట్లుగా ఉన్నాయి. 2019–20లో ఈ మొత్తం చేరికలు 3.85 కోట్లు కాగా ఏడాదిలో 30 లక్షల మంది అదనంగా చేరారు. వీరిలో 2019–20లో ఉన్నత విద్యలో చేరిన మహిళలు 1.88 కోట్లు ఉన్నారు. 2020–21లో ఈ సంఖ్య 2.01 కోట్లకు పెరిగింది. 2014–15 నాటి మహిళల చేరికల సంఖ్యతో పోలిస్తే దాదాపు 44 లక్షల మంది అదనంగా చేరారని ఐష్ నివేదిక పేర్కొంది. 2014లో పురుషులు, మహిళల మొత్తం చేరికల సంఖ్యలో మహిళలు 45 శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు మొత్తం చేరికల్లో మహిళలు 49 శాతంగా ఉండడం విశేషం. పాఠశాల విద్యలోనూ బాలికల సంఖ్య జంప్.. పాఠశాల విద్యలోనూ బాలికల చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2021–22 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) గణాంకాల ప్రకారం.. దేశంలో పాఠశాల విద్యలో (ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు) బాలికలు 12,73,35,252 మంది ఉన్నారు.కరోనా సమయంలో మొత్తం చేరికలు తగ్గిన నేపథ్యంలో బాలికల సంఖ్య కూడా కొంత తగ్గింది. ఆ తర్వాత మళ్లీ వారి చేరికలు పెరుగుతూ వస్తున్నాయి. -
కష్టంగా మారిన అమెరికా ప్రయాణం.. ఏకంగా రూ.1.5 లక్షలకు చేరిన..
సాక్షి, హైదరాబాద్: అమెరికా..అమెరికా అంటూ విద్యార్థులు అమెరికా తరలిపోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఉన్నత చదువు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య కొంత తగ్గింది. ప్రస్తుతం పరిస్థితులు మారడం, కోవిడ్ నిబంధనల సడలింపుతో ఈ విద్యా సంవత్సరంలో ఎమ్మెస్, ఇతర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. అమెరికా కూడా ప్రస్తుతం ఒక్క స్టూడెంట్ వీసాలు తప్ప సాధారణ వీసాలు అంత త్వరగా జారీ చేయడం లేదు. సాధారణ వీసా కోసం కనీసం రెండు, మూడు నెలల పాటు నిరీక్షించవలసి వస్తోంది. దీంతో సాధారణ ప్రయాణికులు, పర్యాటకులు అమెరికాకు వెళ్లడం కష్టంగా మారింది. విద్యార్థుల రద్దీని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచేశాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికాకు రూ.75 వేల వరకు టికెట్ ధర ఉంటే ఇప్పుడది ఏకంగా రూ.1.5 లక్షలకు చేరింది. కొన్ని సంస్థలు రూ.2 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నాయి. అయినప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు అమెరికాకు పోటెత్తినట్లు తరలిపోతున్నారని, టికెట్లు దొరకడం కష్టంగా మారిందని ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్లైట్ చార్జీ లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, విద్యార్థుల రద్దీ తగ్గేవరకు మరో మూడు నెలలపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. రెట్టింపైన విద్యార్ధులు ప్రస్తుతం అన్ని రకాల ఆంక్షలు తొలగిపోయి అమెరికాలోని విశ్వవిద్యాలయాలు తెరుచుకోనున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్ధులు తమ అమెరికా కలను సాకారం చేసుకొనేందుకు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అమెరికాలో వర్క్ పర్మిట్లకు అవకాశం ఉండటంతో ఆ దేశానికే ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈసారి సుమారు 30 వేల మందికి పైగా విద్యార్ధులు అమెరికా వెళ్లే క్రమంలో ఉన్నట్లు అంచనా. ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా ఇంతకాలం వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణానికి సమాయత్తమవుతున్నారు. దీంతో టికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ రద్దీకి తగిన విమానాలు అందుబాటులో లేవు. కోవిడ్ అనంతరం అన్ని ఎయిర్‌లైన్స్ విమాన సేవలను పునరుద్ధరించినప్పటికీ విమానాల సంఖ్యను కుదించారు. గతంలో వారానికి ఏడు ఫ్లైట్లు నడిపిన ఎయిర్‌లైన్స్ ఇప్పుడు నాలుగు మాత్రమే నడుపుతున్నాయి. సిబ్బంది కొరత వంటి అంశాలు విమానాల సంఖ్య తగ్గడానికి కారణమని ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. హైదరాబాద్–చికాగో ఒక్కటే హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే ఫ్లైట్లు చాలా తక్కువ. ఎయిర్ ఇండియా మాత్రమే హైదరాబాద్ – చికాగో ఫ్లైట్ నడుపుతోంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఖతార్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లు ఖతార్, లండన్ మీదుగా విమానాలను నడుపుతున్నాయి. ఇత్తేహాద్ సంస్థ అబుదాబి మీదుగా న్యూయార్క్‌కు నడుపుతోంది. దీంతో చాలామంది ఢిల్లీ, ముంబయిల నుంచి అమెరికాకు బయలుదేరుతున్నారు. వివిధ నగరాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్లలో కొంత మేరకు చార్జీలు తక్కువ ఉన్నప్పటికీ బ్రేక్ జర్నీలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. చాలావరకు ఎయిర్‌లైన్స్ రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి జెడ్డా మీదుగా అమెరికాకు విమానాలు నడుపుతున్న సౌదీ ఎయిర్‌లైన్స్‌లో మాత్రం చార్జీలు కొంత తక్కువగా ఉన్నట్టు తెలిసింది. వన్‌వే చార్జీ రూ.లక్ష వరకు ఉన్నట్లు అంచనా. కానీ జెడ్డాలో ఏకంగా 13 గంటల పాటు నిరీక్షించాల్సివస్తోంది. పెరిగిన టికెట్ ధరలను భారంగా భావించే విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు ఈ ఎయిర్‌లైన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇలా ప్రయాణించే వారు ఆ 13 గంటలు జెడ్డాలో పర్యటించేందుకు వీలుగా సౌదీ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక అనుమతితో కూడిన వీసాలు ఇస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. డిమాండ్‌కు తగ్గ విమానాల్లేవు టికెట్ ధరలు పెరగడానికి, డిమాండ్‌కు తగ్గట్లుగా విమానాలు అందుబాటులో లేకపోవడమే కారణం. ప్రయాణికుల భర్తీ రేషియో వంద శాతం ఉంటే హైదరాబాద్ నుంచి 50 శాతంసీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో సహజంగానే టికెట్ ధరలు పెరుగుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించినా టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. కనీసం 3 నెలల ముందే టికెట్లు తీసుకుంటే మంచిది. – వాల్మీకి హరికిషన్, వ్యవస్థాపకులు, వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజమ్ సొల్యూషన్స్ -
కెరీర్‌పైనే గురి!
పెళ్లా...? కెరీరా...? గతంలో అమ్మాయిలంతా ఎటూ తేల్చుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా కెరీర్‌కే మొగ్గు చూపుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్న తర్వాతే ఏడడుగులు నడవాలని నిర్ణయించుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందని...జీవితం హాయిగా సాగుతుందని భావిస్తున్నారు. అందువల్లే విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న అనంతపురంజిల్లా అమ్మాయిల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇరవై ఏళ్లకు పెళ్లి, పాతికేళ్లకు పిల్లలు, ఇరవై ఎనిమిదేళ్లకు కెరీర్ ముగించి గృహిణిగా స్థిరపడడం...ఇది గతం. కానీ ఇప్పుడు అమ్మాయిలు కెరీర్‌ను సవాల్‌గా తీసుకుంటున్నారు. చదువు పూర్తికావాలి, ఆ తర్వాత ఉద్యోగం.. అప్పుడే పెళ్లి.. 90 శాతం మంది అమ్మాయిల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. భర్త సంపాదన మీద నేను ఆధారపడటం కాదు తన సంపాదన కూడా కుటుంబానికి ముఖ్యం కావాలి అంటున్నారు. 24 ఏళ్ల వరకూ చదువులు, ఉద్యోగాలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న తీరు వారిలో నిండిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. పెళ్లిచేసుకుని భర్త వెంట అమెరికా, కెనడా వంటి దేశాలకు డిపెండెంట్ వీసాకింద వెళ్లడం కంటే...తానే అమెరికాలో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుని వెళితే.. మంచిది కదా అనే ఆలోచనతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. కెరీర్ సవాల్‌గా తీసుకుని.. అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు అమెరికా వెళ్తున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఎంబీబీఎస్ కోర్సులో గతంలో ఓపెన్ కేటగిరీలో 30 శాతం కంటే మించని అమ్మాయిల సీట్లు... ఇప్పుడు 60 శాతానికి వెళ్లాయి. అమెరికాలో రమారమి 30కిపైన ప్రధాన యూనివర్సిటీల్లో అనంతపురం జిల్లా అమ్మాయిలు చదువుతున్నట్టు తేలింది. ఇక ఏటా విదేశాలకు విద్యా, ఉద్యోగావకాశాలకోసం వెళ్తున్న వారిలో దాదాపు 40 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. ఒకప్పుడు ఇంజినీరింగ్, ఎంటెక్ కోర్సులకు జిల్లా దాటి వెళ్లని వారు... ఇప్పుడు దేశంలోని ప్రతిష్టాత్మక నిట్లు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీపడుతున్నారు. దీన్ని బట్టి కెరీర్‌ను ఎంత సవాల్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ ఇప్పుడు మార్పు వచ్చింది. ఇరవై ఏళ్లకే పెళ్లి చేసి బాధ్యతలు దించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు ఎవరికీ లేదు. అమ్మాయిల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు స్వేచ్ఛనిస్తున్నారు. ముందు ఎదగాలి జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్నదే ఇప్పుడు అందరి లక్ష్యం. అందుకే నేను కూ డా బీఫార్మసీ... ఆ తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేశా. పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నా. ఉన్నత చదువుతో సమాజంలో ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక భద్రత లభిస్తుంది. ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. మా నాన్న కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తూ చదివిస్తున్నా రు. –ఎన్. సుశీల, ఎంఫార్మసీ, ఎస్కేయూ. స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలి సమాజం పురోగతి చెందాలంటే లింగ వివక్ష, అసమానతలు ఉండకూడదు. మహిళలు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఆర్థిక, సమాజ, రాజకీయ సాధికారిత సాధిస్తున్నారు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలోనూ ఇలాంటి అంశాలపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. – డాక్టర్ వరలక్ష్మి దేవి, పరీక్షల విభాగం సమన్వయకర్త, ఎస్కేయూ మంచి ఉద్యోగంతో గుర్తింపు అమ్మాయిలు గతంలో మాదిరిగా ఒకరిపై ఆధారపడకూడదు. తల్లిదండ్రులకు భారం అనిపించకూడదు. ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగం సాధిస్తే మనకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎప్పుడైతే స్వతంత్రంగా స్థిరపడతామో అప్పు డు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. – బి.హిమవర్షిణి, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్, మైక్రాన్ టెక్నాలజీ -
బంజారాహిల్స్: చదువుల కోసం తల్లి రూ. 60 వేలు ఇవ్వలేదని..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం డబ్బులు కావాలని తల్లిని అడగగా ఆర్థిక ఇబ్బందులతో ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నంబర్–10లోని నూర్‌నగర్‌లో నివసించే కె.ధనలక్ష్మి రోడ్డు పక్కన టిఫిన్లు విక్రయించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమె కూతురు కె.దివ్యసత్యసాయిశ్రీ (21) నెల రోజులుగా తాను చదువుకుంటానని రూ. 60 వేలు కావాలంటూ తల్లి మీద ఒత్తిడి తీసుకొస్తోంది. చదవండి: పక్కా ప్లాన్.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య ఇడ్లీలు అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్న తన వద్ద అంత డబ్బు లేదని.. ఆర్థికంగా చితికిపోయామని.. అప్పు కూడా తెచ్చే పరిస్థితి లేదని తల్లి చెప్పింది. దీంతో తాను ఇక ఉన్నత చదువులు చదవలేమోనని భావించిన దివ్య గత నెల 31న రాత్రి 7.30 గంటలకు మస్కిటో రిప్లెంట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాధితురాలిని మొదట విన్ ఆస్పత్రిలో చేర్చి ఈ నెల 7వ తేదీన పంజగుట్ట నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పందుల దొంగల ముఠా.. బొలేరోతో ఢీకొట్టి.. ఎంత పనిచేశారంటే.. -
కెనడాలో తెలంగాణ విద్యార్థి బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకుంటే విగతజీవిగా వస్తున్నాడని తెలుసుకుని ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నాయి. చేతికొచ్చిన కొడుకు బలవన్మరణం చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. తెలంగాణకు చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో నల్గొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లిలో విషాదం నిండింది. ఆకుతోటపల్లికి చెందిన నారాయణరావు, హైమావతి కుమారుడు ప్రవీణ్ రావు 2015లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. ఏమైందో ఏమోగానీ గురువారం తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ఈ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని చెప్పారు. ఉదయం భవనంపై నుంచి దూకి ప్రవీణ్ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రవీణ్‌మృతి చెందాడు. దీనిపై అక్కడి పోలీసులు విచారణ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో అతడి మృతదేహం స్వదేశానికి రానుంది. అయితే ప్రవీణ్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తెలియడం లేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: పోలింగ్ కేంద్రంలో జవాన్ ఆత్మహత్య -
విద్యార్థులంతా స్వదేశంలోనే చదువుకునేలా ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కల్పించేందుకు, కోవిడ్–19 కారణంగా విదేశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు సైతం ఇక్కడ చదువు కొనసాగించే అవకాశం కల్పించే లక్ష్యంతో రూపొందించే కార్యక్రమానికి మార్గదర్శకాలను తయారుచేయడం కోసం మానవ వనరుల శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ సారథ్యంలోని ఈ కమిటీ, ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో మరింత మందిని చేర్చుకునే అవకాశాలపై సైతం సిఫారసులు చేయనుంది. ఈ కమిటీ 15 రోజుల్లోగా తన రిపోర్టు అందించాల్సి ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న అనేక మంది విద్యార్థులు కోవిడ్ –19 కారణంగా యిప్పుడు భారత్‌లోనే చదువుకోవాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్‌కి తిరిగి వచ్చే విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతోంది’’అని ‘‘స్టే ఇన్ ఇండియా అండ్ స్టడీ ఇన్ ఇండియా’’కార్యక్రమంలో హెచ్చార్డీ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ చెప్పారు. గత ఏడాది 7.5 లక్షల మంది విద్యార్థులు తమ చదువుకోసం విదేశాలకు వెళ్ళారని ఆయన చెప్పారు. ‘‘ఈ ప్రతిభావంతులైన విద్యార్థులందర్నీ మన దేశంలోనే చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టాలి’’అలాగే ప్రభుత్వం ప్రణాళికలో పేర్కొన్నట్లు ప్రముఖ విద్యాలయాలన్నింటిలోనూ 2024 కల్లా సీట్ల సామర్థ్యాన్ని 50 శాతం పెంచాలనీ, 2024కి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను 50కి పెంచాలని మంత్రి నిశాంక్ అన్నారు. -
పేదలకు ఇంగ్లిష్ మీడియం అందకుండా కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద, బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య దక్కుతుందనే దుగ్ధతో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సంపన్న వర్గాలవారు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ.. బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో విద్య అందకుండా అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. తద్వారా పేదలకు సమానత్వం దక్కకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బలహీనవర్గాల పిల్లలు అభివృద్ధి చెందకూడదనేలా వీరి వైఖరి ఉందని ధ్వజమెత్తారు. మెరుగైన ఉపాధి అవకాశాలు పొందడానికి ఇంగ్లిష్ మాధ్యమం దోహదపడుతుందన్నారు. ఎనిమిదో శతాబ్దంలో సంస్కృతంలో బోధించేవారని.. నాడు కింది స్థాయి వర్గాలకు సంస్కృత బోధన ఉండేది కాదని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను న్యాయస్థానాలు గౌరవించాలని, గతంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడంపై సర్వే నిర్వహించామన్నారు. ఇందులో ఎక్కువమంది ఇంగ్లిష్ మాధ్యమాన్ని కోరుకున్నారన్నారు. ఉన్నతవిద్య అభివృద్ధికి ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి ఇంగ్లిష్ మీడియంలో చదివితేనే వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందుతారని, కాస్త దృష్టి పెడితే తెలుగు భాష కంటే ఇంగ్లిష్ నేర్చుకోవడమే సులువని జస్టిస్ ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. పేదరికంతో చాలామంది తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను పెంచి.. ఇంగ్లిష్‌లో బోధిస్తామని తెలిపారు. ఉన్నత విద్య అభివృద్ధి చెందాలంటే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టోలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు. తాను ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసించి ఉంటే సుప్రీంకోర్టు జడ్జినయ్యే అవకాశం ఉండేదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష అత్యవసరమన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు, పాఠశాలలు వారికయ్యే ఖర్చులను మాత్రమే విద్యార్థులు వద్ద ఫీజులుగా వసూలు చేయాలని కోరారు. కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా ఫీజులను వేర్వేరుగా నిర్ణయిస్తామని, వీటి నియంత్రణపై ప్రతిపాదనల్ని ఫిబ్రవరి నాటికి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. -
వంచన బడ్జెట్!
-
ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాం
సాక్షి, అమరావతి: సంక్షేమం, సమతుల అభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం వల్లే రాష్ట్రం ప్రగతిబాట పట్టిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఐదేళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం అనేక సవాళ్లను అధిగమించి ప్రగతి బాట పట్టిందన్నారు. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.26 లక్షల కోట్లతో, మొదటి నాలుగు నెలలకు సంబంధించి రూ. 76816.85 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంగళవారం ఆయన శాసనసభకు సమర్పించారు. 2019– 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించామని, 2018– 19 కేటాయింపులతో పోల్చితే ఇది 18.38 శాతం ఎక్కువని వివరించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 11.45 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన యనమల సరిగ్గా 1.22 గంటలకు జైహింద్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ‘దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి వరుసగా మూడేళ్లు రెండంకెల వృద్ధి సాధిస్తుందని మనం ఊహించామా? 70 ఏళ్ల ఆంధ్రుల కల, రాష్ట్రం జీవనాడి అయిన పోలవరం డ్యామ్ శరవేగంగా పూర్తవుతుందని, దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ఊహించామా? ఇవన్నీ ఈరోజు నిజంగానే సాధించాం’ అని యనమల పేర్కొన్నారు. ఉన్నత విద్యకు పెద్దపీట.. సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల పట్ల తమ ప్రభుత్వం పూర్తి జాగరూకతతో ఉందని యనమల చెప్పారు. జాతీయ స్థాయిలో వంద అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఆరు మన రాష్ట్రానికి చెందినవే కావడం ఉన్నత విద్యకు తాము ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు. 2019 – 20 బడ్జెట్లో మానవ వనరుల విభాగానికి రూ. 29,955 కోట్లు కేటాయించామని, ఇది మొత్తం బడ్జెట్లో 11.5 శాతమని తెలిపారు. అమరావతిని ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి రూ. 1.09 లక్షల కోట్లు ఖర్చు అమరావతి నిర్మాణానికి రూ. 1,09,023 కోట్లు అవుతుందని అంచనా వేయగా మొదటి దశలో రూ. 39,875 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని యనమల చెప్పారు. తమ ప్రభుత్వ కృషి వల్ల రాష్ట్రం విద్యుత్తు లోటు నుంచి మిగులు రాష్ట్రంగా మారిందన్నారు. ‘తల్లి గర్భం నుంచి జీవితాంతం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం ఇది. పురుషులతో మహిళలు పోటీపడే సమాజం ఏర్పాటే మా లక్ష్యం. అందుకే పసుపు కుంకుమ కింద ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాం. ఇప్పుడు మరోమారు 93.81 లక్షల మందికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ.9,381 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. రూ. 24 వేల కోట్ల రుణ భారం నుంచి రైతులను విముక్తులను చేశాం. ఆఖరి రెండు వాయిదాలను త్వరలో జమ చేస్తాం’ అని యనమల పేర్కొన్నారు. పెట్టుబడి రహిత సహజ సేద్యం (జెడ్బీఎన్ఎఫ్)లో రాష్ట్రం అగ్రగామిగా ఉందని ప్రకటించారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి పి.నారాయణ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. యనమల బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు... ►రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే మరో పథకానికి రూ. 5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నా. ►కనీస మద్దతు ధరలు లేని సమయంలో రైతును ఆదుకునేందుకు విపణి ప్రమేయ నిధి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లకు పెంపు. ►పశువుల బీమా కోసం బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయింపు. ►ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ యువతకు ప్రస్తుతం నెలకు రూ. 1000 చొప్పున ఇస్తున్న నిరుద్యోగ భృతి రూ. 2000కి పెంపు. ఈ పథకం కింద 4.3 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు ప్రకటన. ►వెనుకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు రూ. 3,000 కోట్లు. జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధుల పంపిణీ. ►అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్షిప్ రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంపు. ►ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 2019 – 20 కేటాయింపులు 28 శాతం పెంచి రూ. 14,367 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటన. ఎస్టీ సబ్‌ప్లాన్ 33 శాతం పెంచి రూ. 16,226 కోట్లు కేటాయింపు ప్రతిపాదన. ►ఆరోగ్య శాఖ బడ్జెట్ రూ. 8,463 కోట్ల నుంచి రూ. 10,032 కోట్లకు పెంపు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి కేటాయింపులు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 1,200 కోట్లకు పెంపు. -
లక్ష్యాన్ని చేరుకోలేకపోయా.. క్షమించండి
కొందుర్గు(షాద్‌నగర్): ఉన్నత చదువులు చదివించడానికి తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేక ఇంటర్‌తోనే విద్యను ఆపేయాలనుకున్న సమయంలో విద్య నేర్పే గురువులు ముందుకొచ్చి వారి ఖర్చులతో ఉన్నత చదువులు చదివించారు. గురువులు ఆశించిన లక్ష్యం చేరుకోక ముందుగానే ఆ యువకుడు తనను క్షమించాలని కోరుతూ సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిరుమలదేవునిపల్లి గ్రామానికి చెందిన ఉప్పల బుచ్చయ్య, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు శ్రీధర్, శ్రీకాంత్‌తోపాటు కూతురు సరిత ఉన్నారు. వీరు శ్రీధర్‌ను ఇంటర్ వరకు చదివించారు. అనంతరం ఆర్థిక పరిస్థితుల రీత్యా చదువు మాన్పించాలని భావించారు. అప్పట్లో శ్రీధర్ గురువులు శ్యామ్‌సుందర్, మంజుల సహాయమందించి శ్రీధర్‌ను పీజీ వరకు చదివించారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించాలని సూచించారు. ప్రస్తుతం శ్రీధర్ హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ ఫార్మా కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ (కెమిస్ట్రీ) విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్లుగా ఈ ఉద్యోగం నుంచి వచ్చే డబ్బులతో తల్లిదండ్రులను పోషిస్తూ, తమ్ముడు శ్రీకాంత్‌ను చదివిస్తున్నాడు. మనస్తాపంతో ఆత్మహత్య.. ఈ నెల 18న రాత్రి శ్రీధర్ విధులు ముగించుకొని కంపెనీ నుంచి బయలుదేరి జీడిమెట్లలోనే ఉంటున్న అద్దె ఇంటికి బైక్‌పై వెళుతున్నాడు. దారిలో ఓ మహిళకు బైక్ తగలడంతో ఆమె కాలు విరిగింది. బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శ్రీధర్‌ను పోలీసులు మందలించారు. మరుసటిరోజు మహిళ కాలు బాగుచేయించడానికి రూ.2 లక్షలు ఇవ్వాలని మహిళ తరఫు బంధువులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీధర్ మనస్తాపానికి గురయ్యాడు. తన అద్దె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, గురువులు తన ను క్షమించాలని కోరుతూ, అమ్మనాన్నల బాగోగు లు చూసుకోవాలని తమ్ముడు శ్రీకాంత్‌కు సూచిస్తూ సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ మృతికి పోలీసులే కారణమా.. శ్రీధర్ ఆత్మహత్యకు పోలీసులే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని పోలీసులు బాధించారని, దెబ్బలు కూడా కొట్టారని తెలిపారు. వారి భయంతోనే శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. -
పేదింటి విద్యార్థులకు..పెద్ద చదువులు
పశ్చిమ గోదావరి, నిడమర్రు : గ్రామీణ ప్రాంతాల్లోని పేదింటి విద్యార్థులకు పెద్దింటి చదువులు అందించాలనే ఉన్నత లక్ష్యంతో దివంగత వైస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నవే ట్రిపుల్ ఐటీ కళాశాలలు. ఈ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కేంద్రాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల సమీకృత బీటెక్ డిగ్రీ విద్యా కార్యక్రమంలో 2018–19 సంవత్సరానికి మొదటి సంవత్సరంలో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు 1,581 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ సాధించిన వారు తక్కువగానే ఉన్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న ప్రతీ ప్రభుత్వ విద్యార్థికి సీటు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీరితో పాటు 10 జీపీఏ గ్రేడ్ పాయిట్స్కు దిగువున ఉన్న గ్రేడ్స్ సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులందరూ ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కేంద్రాల్లో అభ్యసించేందుకు అవసరమైన దరఖాస్తులు జూన్ 8వ తేదీ వరకూ ఆన్లైన్లో స్వీకరిస్తారు. ప్రవేశ అర్హతలు ఇలా.. అభ్యర్థులు తొలి ప్రయత్నంలోనే 2018లో ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షల్లో ఏపీ/తెలంగాణ రాష్ట్రాల్లో రెగ్యులర్ విద్యార్థిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సీబీఎస్ఈలో పది చదివినవారు కూడా అర్హులే. వయోపరిమితి 2018 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయోపరిమితిలో 21 ఏళ్ల వరకూ సడలింపు ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఇలా.. ⇔ అభ్యర్థులు కేవలం ఏపీఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ⇔ మీ సేవా కేంద్రాల నుంచి ఆర్జీయూకేటీ వెబ్సైట్ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ⇔ ఓసీ, బీసీలకు రూ.150, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 ఏపీఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు రుసుం చెల్లించాలి. ⇔ అప్లికేషన్‌తోపాటు సర్వీస్ చార్జి కింద ఆన్లైన్ సెంటరుకు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ⇔ దరఖాస్తుతోపాటు పదో తరగతి హాల్ టికెట్ ⇔ పది పరీక్షల్లో సాధించిన గ్రేడ్ పాయింట్స్ ఏవరేజ్(జీపీఏ) సర్టిఫికెట్ ⇔ ఇతర రిజర్వేషన్లు ఉంటే(స్పోర్ట్/ఎన్సీసీ/క్యాప్/దివ్యాంగ) వాటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ⇔ 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు. రిజర్వేషన్ కోటాలు ఇలా ⇔ ఒక్కో కళాశాలలో 85 శాతం సీట్లు స్థానికంగానూ, మిగిలిన 15 శాతం సీట్లు మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ⇔ ప్రతీ వంద మంది విద్యార్థుల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ–ఏ 7 శాతం, బీసీ–బీ 10 శాతం, బీసీ–సీ 1 శాతం, బీసీ–డీ 7 శాతం, బీసీ–ఈ 4 శాతం ⇔ సీట్లలో ప్రత్యేక కోటాకింద దివ్యాంగులకు 3 శాతం, సైనిక ఉద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటాకింద 0.5 శాతం సీట్లు భర్తీ చేస్తారు. ⇔ నూటికి 33.33 శాతం సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. ఫీజుల విరాలు ⇔ ఏపీ/తెలంగాణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు కింద ప్రతీ ఏటా రూ.36 వేలు చొప్పున చెల్లించాలి. తెల్లకార్డు ఉన్న వారు/ఫీజ్ రీయంబర్స్‌మెంట్‌కు అర్హులైనవారు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. ⇔ ఫీజు రీయంబర్స్మెంట్ పొందాలంటే విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.లక్షలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థి కుటుంబాలకైతే రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలి. ⇔ రిజిస్ట్రేషన్ ఫీజుకింద ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చొప్పున చెల్లించాలి. ⇔ కాషన్ డిపాజిట్ కింద అన్ని కేటగిరి అభ్యర్థులూ రూ.2 వేలు చెల్లించాలి. ⇔ ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి పిల్లలకు ఏడాదికి ట్యూషన్ ఫీజుకింద రూ.1.36 లక్షలు చెల్లించాలి ⇔ విదేశీ/ఎన్ఆర్ఐ విద్యార్థులకు ఏడాదికి రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సినవి ⇔ ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించినప్పటి రసీదు, టెన్త్ హాల్ టికెట్, మార్కుల లిస్ట్, నివాస ధ్రువీకరణ పత్రం, బీసీ/ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులు కుల« ధ్రువీకరణ పత్రాలు, ⇔ దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్, సైనికోద్యోగుల పిల్లలకు సంబంధిత అధికారి జారీచేసిన సర్టిఫికెట్ ⇔ ఎన్సీసీ/స్పోర్ట్ కోటా అభ్యర్థులైతే వాటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి. ఎంపిక ఇలా.. ⇔ టెన్త్ పరీక్షల్లో సాధించిన విద్యార్థుల గ్రేడ్ల వారీగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గ్రేడ్ పాయింట్స్ సమానమైతే వారి ఎక్కువ జీపీఏ సాధించిన(గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లీషు, సోషల్) సబ్జెక్ట్ వారీగా సాధించిన గ్రేడ్ పాయిట్స్ పరిగణనలోకి తీసుకుంటారు. ⇔ ఈ గ్రేడ్ పాయింట్స్‌లోనూ పోటీఉంటే, పుట్టిన తేదీ ప్రకారం వయసులో పెద్దవారిని ఎంపిక చేస్తారు. ⇔ నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జెడ్పీ, మున్సిపల్ పాఠశాలు, ఏపీ మోడల్స్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు, కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో టెన్త్ చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏను అదనంగా కలిపి కౌన్సెలింగ్‌లో ప్రతిభను నిర్ధారిస్తారు. ⇔ ఎంపికైన అభ్యర్థులకు ఆరేళ్లపాటు ల్యాప్‌టాప్, ప్రతీ ఏటా మూడు జతల డ్రస్సులు, రెండు జతల షూలు, హాస్టల్లో అవసరమైన అన్నింటిని ప్రభుత్వమే సమకూర్చుతుంది. ముఖ్యమైన తేదీలు... ⇔ ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జూన్ 8 ⇔ పీహెచ్/క్యాప్/ఎన్సీసీ/స్పోరŠట్ప్ విద్యార్థులు పోçస్టులో పంపిన ⇔ ధ్రువీకరణ పత్రాల కాపీలు స్వీకరించుటకు ఆఖరి తేదీ: జూన్ 11 ⇔ పీహెచ్/క్యాప్/ఎన్సీసీ/స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ : జూన్ 18, 19 ⇔ స్పెషల్ కేటగిరి సెలక్షన్ లిస్ట్ ప్రకటన (ఫేజ్–1) జూన్ 29 ⇔ ఇతర రాష్ట్రాలు, ఇంటర్నేషనల్ విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ అడ్మిషన్స్ జులై 6,7 ⇔ స్పెషల్ కేటగిరి సెలక్షన్ లిస్ట్ ప్రకటన (ఫేజ్–2) జులై 16 ⇔ ట్రిఫుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్/అడ్మిషన్స్ జులై 21 నుంచి 23 వరకూ ⇔ ట్రిఫుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు: జులై 24 నుంచి 31 వరకూ ⇔ ట్రిఫుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ 2018–19 ట్రిపుల్ ఐటీ బ్యాచ్ తరగతుల ప్రారంభం: ఆగస్టు 1 -
విద్యార్థికి పరీక్ష !
సాధారణంగా ఏ విద్యార్థి అయినా తాను చదువుతున్న కోర్సు పూర్తికాగానే ఎలాంటికోర్సులు చేయాలో నిర్ణయించుకునే ఉంటారు. ఉన్నత విద్య చదవాలనుకొనే వారు తాముచదువుతున్న కోర్సు చివరి సంవత్సరంలో అడుగుపెట్టినప్పటి నుంచే అందుకు తగిన విధంగా ప్రణాళిక రూపొందించుకొని సిద్ధ్దమవుతారు. అయితే ఎస్వీయూ అధికారుల నిర్లక్ష్యం,రాష్ట్ర ఉన్నత విద్యామండలి అత్యుత్సాహం ఫలితంగా విద్యార్థుల ప్రణాళిక చెదిరింది.గుండె దడ మొదలైంది. భవిష్యత్‌పై భయం పట్టుకుంది. కెరీరా? ఉన్నత విద్య..చుదవుతున్న కోర్సు పూర్తి చేయడమా అన్న సందేహంతో డోలాయానంలో ఉన్నారు. యూనివర్సిటీక్యాంపస్: డిగ్రీ విద్యార్థులకు తమ కెరీర్‌పై సందిగ్ధత పట్టుకుంది. ఎటు వెళ్లాలో నిర్ధారించుకోలేకపోతున్నారు. జిల్లాలో సుమారు 150 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 30 వేల మంది డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఇప్పటివరకు డిగ్రీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించలేదు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎప్పటి నుంచి మొదలవుతాయో తెలీని పరిస్థితి. బుధవారంతోదరఖాస్తు గడువు ముగియనుంది. ఈ దశలో డిగ్రీ పూర్తయిన వారు పీజీ లేదా బీఈడీ, ఎల్ఎల్బీ, ఎంసీఏ, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటారు. ఈ నెల 19 నుంచి వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలు మొదలుకానున్నాయి. 19న ఎడ్‌సెట్, లాసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి మే 2న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఖరారు కాని షెడ్యూల్.. ఎస్వీయూ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ 6వ సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న దశలో షెడ్యూల్ ప్రకటించలేదు. 25 నుంచి డిగ్రీ పరీక్షలు మొదలవుతాయని సమాచారం. డిగ్రీ పరీక్షల షెడ్యూల్ మధ్యలో ఐసెట్ ఉంటుంది. డిగ్రీ పరీక్షలు మొదలు కాక ముందే ఎడ్‌సెట్, లా సెట్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో డిగ్రీ పరీక్షలకు సిద్ధం కావాలా? లేక ప్రవేశ పరీక్షలకు తయారుకావాలా అని తల పట్టుకుం టున్నారు. సాధారణంగా డిగ్రీ విద్యార్థులు చివరి సంవత్సర పరీక్షలు పూర్తయ్యాక పీజీ, బీఈడీ, ఎల్ఎల్బీ తదితర ఉన్నత కోర్సుల ప్రవేశ పరీక్షలు రాస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారుల అత్యుత్సాహం వల్ల డిగ్రీ పరీక్షలు రాయకమునుపే ఉన్నత చదువుల ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఇలా నిర్వహించటం ఇదే మొదటిసారి అని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఒకే రోజు రెండు ప్రవేశ పరీక్షలు.. రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎడ్‌సెట్ ఈ నెల 19న జరగనుంది. లా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ లాసెట్ కూడా ఈనెల 19న నిర్వహిస్తారు. దీనివల్ల రెండు పరీక్షలకు హాజ రయ్యే వారికి ఇబ్బంది తప్పదు. దీనిపై ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార స్వామి దృష్టికి తీసుకెళ్లగా ఎడ్‌సెట్ ఉదయం, లా సెట్ సాయంత్రం ఉంటాయన్నారు. విద్యార్థులు ఒక పూట ఒకటి, మరోటి మధ్యాహ్నం రాయవచ్చన్నారు. ఈ షెడ్యూల్ రెండు నెలల క్రిందటే ప్రకటించామన్నారు. ఇప్పటివరకు అభ్యంతరాలు రాలేదన్నారు. పీజీ ప్రవేశ ప్రకటనలు విడుదల.. జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, కుప్పంలోని ద్రవిడ విశ్వ విద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిíఫికేషన్లు విడుదలయ్యాయి. ఎస్వీయూలో నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు సాగుతున్నాయి. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పీజీ కోర్సులో చేరడానికి దరఖాస్తు తుది గడువు మే 5. మే 20 న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ లోపు డిగ్రీ పరీక్షలు ముగిసే అవకాశం లేదు. ద్రవిడ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి తుదిగడువు మే 31. ప్రవేశ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు. -
చదువుల తల్లి ముద్దుబిడ్డ
కాసుల తల్లి కటాక్షం లేకున్నా.. చదువుల తల్లి ముద్దుబిడ్డగా ఎదిగాడు. ఉన్నత విద్య అభ్యసనకు ఆర్థిక స్థోమత లేకున్నా.. చిన్నాచితక పనులు చేసుకుంటూ పీజీ వరకు చదువుకున్నాడు. బోధనా వృత్తిలో స్థిర పడాలనుకుని నిర్ణయించుకుని అందుకోసం అహర్నిశం శ్రమించాడు. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్టిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించి విజయకేతనాన్ని ఎగురవేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులపై కొందరు నమ్మకం లేకుండా మాట్లాడుతున్న ప్రస్తుత రోజుల్లో అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అనూహ్య స్థానాలకు ఎదిగిన మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద విజయగాథ ఇది. వివరాల్లోకి వెళితే.. తనకల్లు: తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన ఆదిరెడ్డి, గిరిజమ్మ దంపతులకు మూడు ఎకరాల పొలం ఉంది. కరువు ప్రాంతం కావడంతో నీటి వనరులు లేక పంట సాగుకు చాలా ఇబ్బంది పడుతున్న నిరుపేద రైతు దంపతులకు మహేశ్వరరెడ్డి, మంజునాథరెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు తమలా ఇబ్బందులు పడకుండా ఉండాలని భావించిన తల్లిదండ్రులు.. వారికి చదువులు చెప్పించాలని భావించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోని మండల పరి షత్ ప్రాథమిక పాఠశాలల్లో పూర్తి చేసుకున్న మంజునాథరెడ్డి.. తర్వాత పదో తరగతి వరకు చిత్తూరు జిల్లా మొలకలచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదో తరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై.. అక్కడే ఇంటర్మీడియట్ చ దుకున్నాడు. అనంతరం కదిరిలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 2005–08లో యూ జీ, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ., పూర్తి చేశాడు. ఆ సమయంలో బోధనావృత్తిపై మక్కువ పెంచుకున్న అతను 2011–12లో బీఎడ్., పరీక్షలో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్‌తో మెరిసాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హత పట్టుదలతో చదువుల్లో రాణించిన మహేశ్వరరెడ్డి... ఈ మూడేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించారు. బోధనావృత్తిపై ఉన్న మక్కువతో ఆయా ఉద్యోగాల్లో చేరేందుకు అతను విముఖత చూపించారు. సీఎస్ఐఆర్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో 39వ ర్యాంక్‌ని సాధించారు. 2016లో ఎఫ్‌సీఐలో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జోనల్ స్థాయిలో మూడో ర్యాంక్‌ను పొందారు. ఓసీ అభ్యర్థులకు ప్రభుత్వ కొలువులు దక్కవనే ఆత్మనూన్యతతో నలిగిపోతున్న పలువురికి ఆదర్శంగా నిలుస్తూ నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించినా.. బాధ్యతలు స్వీకరించకుండా లెక్చరర్ కావాలనే తపనతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయూష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (చెన్నై)గా విధుల్లో చేరారు. డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో (వృక్షశాస్త్రం) మూడో ర్యాంక్ సాధించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. బోధనావృత్తిలో కొనసాగే అవకాశం దక్కడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందంటూ మంజునాథరెడ్డి పేర్కొన్నారు. -
చెప్పినా వినలేదు.. చివరికి శవమైంది..!
సాక్షి, తిరువొత్తియూరు : ఉన్నత చదువుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విరక్తి చెందిన ఓ విద్యార్థిని బంధువైన మహిళా ఎస్ఐ ఇంట్లో మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరూర్, పశుపతి పాళయంలో సాయుధ దళం పోలీసు క్వార్టర్స్ ఉంది. ఈ క్వార్టర్సులో ఎస్ఐ రాజేశ్వరి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రాజేశ్వరి ఇంటిలో ఆమె బంధువు అరవంకురిచ్చి మేట్టుపుదూర్ ప్రాంతానికి చెందిన రామలింగం కుమార్తె నవీనా (22) ఉంటుంది. అక్కడే ప్రైవేటు కళాశాలలో బీఏ చదువుతోంది. నవీన ఉన్నత చదువులు చదవాలని కోరుతున్నట్టు తెలిసింది. ఆమె తండ్రి ఇందుకు తిరస్కరించి వివాహం చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో ఆవేదన చెందిన విద్యార్థిని మంగళవారం రాత్రి ఎస్ఐ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పశుపతి పాళయం పోలీసులు కేసు నమోదు చేసి నవీనా మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. -
సరికొత్తగా ‘విద్యానిధి’
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించే నిరుపేదలకు శుభవార్త. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకంలో పలు సవరణలు చేసింది. ఎక్కువమంది విద్యార్థులు లబ్ధిపొందేలా కఠినతర నిబంధనలను సడలించింది. దాదాపు 10 కేటగిరీల్లో మార్పులు చేసింది. బీసీ సంక్షేమ శాఖతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షే మ శాఖలు అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకాలకు తాజా నిబంధనలు వర్తించనున్నాయి. వార్షికాదాయం 3 లక్షలకు పెంపు.. విద్యార్థి కుటుంబ వార్షికాదాయాన్ని రూ.2 లక్షల పరిమితి నుంచి రూ.3 లక్షలకు పెంచింది. తల్లిదండ్రులతో పాటు విద్యార్థి పనిచేసినట్లు నివేదిస్తే అతని వార్షికాదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఉద్యోగాల్లో చేరిన పలువురు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా వారి వార్షికాదాయాన్ని పరిగణించి రూ.2 లక్షలకు మించడంతో ఎంపిక చేయలేదు. ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వెజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) పరీక్షలో 6.5 పాయింట్లు తప్పనిసరి రావాలి. మెజారిటీ అభ్యర్థులు 6 పాయింట్లు సాధిస్తూ పథకానికి అర్హత సాధించలేకపోతున్నారు. దీంతో 6 పాయింట్లకు కుదించింది. టొఫెల్–6 పాయింట్లు, జీఆర్ఈ–260, జీమ్యాట్‌లో– 500 మార్కులు సాధించాలి. వెయిటేజీ కీలకం.. విద్యానిధి పథకానికి తాజాగా వెయిటేజీ నిబంధన తీసుకొచ్చారు. గతంలో ఇంటర్వ్యూకు ప్రాధాన్యం ఉండేది. డిగ్రీలో వచ్చిన మార్కులకు 60 శాతం, జీఆర్ఈ/జీమ్యాట్కు మార్కులకు 20 శాతం, ఐఈఎల్టీఎస్/టోఫెల్లో వచ్చిన పాయింట్లకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. గతంలో ఏడు దేశాలకే పరిమితమైన విద్యానిధి పథకాన్ని పది దేశాల్లోని యూనివర్సిటీలకు పెంచారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా దేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీల్లో సీట్లు సాధిస్తేనే పథకం వర్తిస్తుంది. కాలేజీలు, యూనివర్సిటీల వివరాలు ప్రభుత్వం త్వరలో ఖరారు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ అమలు చేసే విద్యానిధి పథకంలో ఈబీసీలకు 5 శాతం సీట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పేద విద్యార్థులకు హీరో చేయూత..!
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. నిరు పేదలుచ అనాథలకు తన దేవి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. 2017-18 సంవత్సరానికి గానూ సుగాలి జాతికి చెందిన 15 మంది పేద విద్యార్థులకు లయోలా కళాశాలో సీట్లు ఇప్పించి, వారి చదువుకు ఖర్చునంతా తన దేవి ట్రస్ట్ ద్వారా అందించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మా అబ్బాయి సొంత ప్రతిభతోనే చదివాడు
ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: మా అబ్బాయి సొంత ప్రతిభతోనే ఉన్నత చదువులు చదువుకున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పిల్లలు కేవలం చదువులకే పరిమితం కాకుండా వినూత్నంగా ఆలోచించాలని సీఎం సూచించారు. విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన విద్యార్థులతో ఆయన బుధవారం విజయవాడలోని ఎ–కన్వెన్షన్ సెంటర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పాలనలో అవినీతి జరగనివ్వనని, లంచాలు తీసుకునే వారిని బజారుకీడుస్తానని హెచ్చరించారు. ఇండియాకు యంగ్ దేశంగా పేరుందని, దేశానికి యువతే పెద్ద సంపదని తెలిపారు. పిల్లలు మట్టిలో మాణిక్యాలని, ప్రపంచాన్ని జయించే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. ప్రపంచంలోని ఉత్తమ విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకొస్తామని తెలిపారు. విద్యకు వయస్సుతో సంబంధం లేదన్నారు. తాను నిరంతర విద్యార్థినని, నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని పేర్కొన్నారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తీసుకున్నామని తెలిపారు. టెక్నాలజీని వినియోగించడంలో మనమే నంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. యువత కేవలం ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా చేయాలని సూచించారు. అమెరికాలో తెలుగువారే ఎక్కువ విజయాలు సాధిస్తున్నారన్నారు. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే ప్రపంచమే అరచేతిలో ఉన్నట్టని, సెల్‌ఫోన్ ద్వారా స్కాలర్షిప్ స్టేటస్ చూసుకునే అవకాశం జ్ఞాన భూమి యాప్ ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు. టీ అమ్ముకునే వ్యక్తి మన దేశానికి ప్రధాని అయ్యారని, యువత అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాను బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని, విజన్ ప్రకారమే పనలు చేస్తానని తెలిపారు. నేడు మంత్రివర్గ సమావేశం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం వెలగపూడి సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఉదయానికి మార్చినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది. -
నాకు పెళ్లొద్దు..చదువుకుంటా..!
నల్లగొండ జిల్లాలో పోలీసులను ఆశ్రయించిన ఓ యువతి తిరుమలగిరి: ‘ఇప్పుడే నాకు పెళ్లొద్దు.. ఉన్నతస్థాయి చదువులు పూర్తి చేయాలని ఉంది’ అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం ఈటూరుకు చెందిన బోడ సోమయ్య, అబ్బసాయమ్మ కూతురు లలిత ఈ ఏడాది డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది. ఇటీవల మండలంలోని మామిడిపల్లికి చెందిన ఓ యువకుడితో లలితకు వివాహం జరిపించాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో లలిత శుక్రవారం తిరుమలగిరి పోలీసులను ఆశ్రయించింది. ఏఎస్ఐ లచ్చయ్య యువతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి చదువు పూర్తయిన తరువాత వివాహం జరిపించాలని సూచించారు. -
పెద్ద చదువులు చదువుతా
స్కూల్కెళ్లి పెద్ద పెద్ద చదువులు చదవాలని ఉంది. యాక్టర్ మహేష్‌బాబును కలవాలని ఉంది. ఎప్పుడూ ఇంట్లోనే పడుకుని ఉండటం చాలా కష్టంగా ఉంది. అమ్మ కూడా లేదు. ఈ వయసులో నానమ్మను చాలా బాధ పెడుతున్నాను. - సహన