‘పతనం’ వెతలు తరగని కతలు
20 నుంచి 25 ఏళ్లలో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఈ ప్రభావం విదేశీ చదువుల కోసం వెళ్లే వాళ్లపైనే కాక మన దేశంలోనే ఉండి పెద్ద చదువులు చదువుకునే వాళ్ల మీదా పడుతోంది. ప్రస్తుత ప్రభుత్వం చేతులారా అనండి లేదా చేతులుడిగిన పరిస్థితుల ద్వారా అనండి... ఎంత సులభంగా అయితే ఈ పరిస్థితిలోకి తీసుకురాగలిగిందో నిర్ణయాత్మక దృక్పథం ఉంటే అంతే సులభంగా మనందరినీ బయటకు లాగగలదు.
టోకు ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణం అంచనా వేస్తారు. ఆహార పదార్థాల్లో అత్యధికంగా పెరుగుదల సంభవించడంతో ఆగస్టు చివరకు 5.75 నుంచి 6.10 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగింది. ఇటీవలి ఒక పోల్ ప్రకారం ద్రవ్యోల్బణం 5.8 శాతంగా అంచనా వేశారు. శరవే గంగా పెరిగిన కూరగాయలు, ఆహార పదార్థాల ధరలతో ఆగస్టులో టోకు ధరల సూచీ తీవ్రంగా నష్టపోయింది. దాంతో జూలైలో 11.91 శాతంగా ఉన్న సూచి ఆగస్టులో 18.18 శాతానికి ఎగబాకింది. కానీ తయారీ పదార్థాలు, వస్తువుల ధరల్లో వృద్ధి కేవలం 2 శాతంకన్నా తక్కువగా నమోదైంది. కోర్ ద్రవ్యోల్బణంలో విశేషమైన మార్పులు జరగనప్పటికీ ఆహార పదార్థాల్లో ఏర్పడ్డ ద్రవ్యోల్బణంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు సంక్షోభంలో పడిపోయా రు. ఈ వర్గాలు తమ సంపాదనలో 50 శాతానికి పైగా ఆహారం సమకూర్చుకునేందుకే ఖర్చు చేస్తాయి. నిలకడ లేని రూపాయి విలువతో, అధిక శాతం మధ్యతరగతి జీవన సరళిలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.
తగ్గిన రూపాయి విలువ వల్ల దేశం అధికంగా దిగుమతి చేసుకుం టున్న రసాయన ఎరువులు, ఖనిజాలు, వంటనూనెల వం టి వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ వస్తువులన్నీ మధ్య తరగతి వర్గాల రోజు వారీ వినియోగంలో లేకపో యినా, వాటి ధరల పెరుగుదల దేశ ఆర్థిక సమతుల్యాన్ని దెబ్బతీయగలవు. తరుగుతున్న రూపాయి, దిగుమతుల ధరలను పెంచుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం ప్రభావిత మవుతుంది. సగటు జీవితాలపై మోతమోగుతుంది. పెరిగిపోతున్న ఇంధన ధరలు, దిగజారిపోతున్న రూపా యితో పెరిగిన రవాణా ఖర్చులతో దిక్కుతోచని పరిస్థి తులు నెలకొన్నాయి.
పాతాళానికి పరుగులు
మూడు మాసాలుగా రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో, ముఖ్యంగా అమెరికా డాలరుతో పోల్చు కున్నప్పుడు పాతాళానికి పడిపోవడం ఇప్పటికీ కలవర పెడుతూనే ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో కొద్దిగా స్థిమితపడి డాలరు ఒకటికి 63 నుంచి 65 రూపాయల వరకు ఊగిసలాడుతూ ఉందే కాని ఒక స్థిరమైన నిష్పత్తికి చేరలేదు. అయితే మన ఆర్థికమ్రంతి చిదంబరం మాత్రం ఎప్పటిలాగానే దిగులు పడవలసిన అవసరం లేదని చెప్ప డమే వింత. మన రూపాయి విలువను తగ్గించి చూపెడు తున్నారనీ సెలవిస్తున్నారు.
ఇన్ని రోజులు కుంగిపోతూ బతుకు బండి లాగుతున్న సగటు నిరుపేద, మధ్యతరగతి ప్రజానీకానికి తమ బతుకుతెరువు మీద తిరిగి నమ్మకం కలిగించే చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఇటువంటి ప్రకటనలతో అర్థమయింది. రూపాయి విలువ పతనంతో కేవలం ఎగుమతులు దిగుమతులు ప్రభావిత మవుతాయని ఒకప్పటి భావన. ఇప్పటి ప్రపంచీకరణ నేపథ్యంలో అది అందరి దైనందిన జీవితాలను ప్రభా వితం చేస్తుందని చెప్పుకోకతప్పదు. దశాబ్దం క్రితం నెల జీతం 2,200 రూపాయలతో ఇంటి బడ్జెట్ వేసుకునే వీలుండేది. చిన్న చిన్న సవరణలతో మర్యాద కోల్పోని జీవనం కొనసాగించే వాళ్లం. ప్రస్తుతం ఆకాశాన్నం టుతోన్న ధరలు ఒకవైపు, విపరీతంగా తగ్గిపోతున్న డబ్బు విలువ మరోవైపు పేద, మధ్య తరగతి ప్రజలను అడుగు వేయడానికి వీల్లేని స్థితికి తెచ్చాయి.
ఎంత వ్యత్యాసం?
ఒకప్పుడు కళాశాలలు వందల్లోనే ఉన్నా, తక్కువ శిక్షణ రుసుంతో మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేవి, తద్వారా చదువులు సునాయాసంగా పూర్తి చేయ గలిగేవారు. స్కూళ్ల ఫీజులు కాలేజీలకన్నా కొంత ప్రియ మే అయినా ఇప్పటి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం వెచ్చిస్తున్న అర్థరహితమైన రుసుములతో పోల్చిన ప్పుడు అత్యంత అల్పమైనవేనని చెప్పాలి. చదువుకునే వాళ్ల సంఖ్య అనేక వందల రెట్లు పెరగడంతోపాటు చదు వుల రుసుములు కూడా నక్షత్రాలను తాకాయి. దీంతో ప్రభుత్వం అణగారిన వర్గాలకు విద్యావకాశాలు కలుగజే స్తున్నప్పటికీ ఐటీ, వైద్యం వంటి వృత్తి విద్యలు మధ్య తర గతి, పేద వర్గాలకు కలగానే మిగిలిపోతున్నాయి. 20 నుం చి 25 ఏళ్లలో రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది.
పైచదువులు సామాన్యులకు అందని ద్రాక్షగా మారడానికి ఇదీ ఒక కారణమే. ఈ ప్రభావం విదేశీ చదువుల కోసం వెళ్లే వాళ్లపైనే కాక దేశంలోనే ఉండి పెద్ద చదువులు చదువుకునే వాళ్ల మీదా పడుతోంది. ప్రభు త్వవైద్యశాలల్లో, కుటుంబ వైద్యుల ద్వారా చౌకగా ఆరోగ్య రక్షణ అందుబాటులో ఉండేది. ప్రస్తుతం కుటుంబ ఆరో గ్యానికి వెచ్చించవలసిన మొత్తాలు పెరిగాయి. స్పెషలి స్టులు, స్టార్ ఆస్పత్రులకు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సొంతింటి సాధన ప్రతి సామాన్య మానవుడికీ నెరవేరని కలే. భూమి విలువ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేదనేది సర్వవిదితం. ఒకప్పు డు ఇండిపెండెంట్ ఇల్లు సంపాదించడంకన్నా ఒక అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడం సులువైనదిగా భావించారు. రోజు రోజుకూ పెరుగుతున్న నెలసరి చెల్లింపుల భారంతో అపార్టుమెంట్లూ అందుబాటులో లేకుండాపోయాయి.
వెసులుబాటు తాత్కాలికం
ఇటీవల అమెరికన్ డాలరుతో రూపాయి విలువ 67 నుం చి 68 రూపాయల దాకా పడిపోయి, స్థిరంగా లేనప్పటికీ కొంత తేరుకుంది. అయితే ఇది తాత్కాలికమేనని నిపు ణులు చెబుతున్నారు. విద్యా, సాంకేతిక, ఆర్థిక రంగాలలో అమెరికాతో సంబంధాలు పెరిగిన తరుణంలో, అక్కడి ద్రవ్యోల్బణం, డాలరు కొనుగోలు శక్తి ఆధారంగా ప్రజా జీవనశైలిపై ఒక అంచనాకు ఇప్పుడే రావడం సంద ర్భోచితం కాదు. ఇక్కడ ద్రవ్యోల్బణం సుమారుగా 10 శాతంగా ఉంటే అమెరికాలో 2 శాతానికి మించదు. పైగా అప్పుడప్పుడు ప్రతి ద్రవ్యోల్బణం కనిపిస్తుంటుంది. ద్రవ్యోల్బణం మూలంగా మన దేశంలో ధరలు రోజు రోజుకు కొండెక్కుతుంటే రూపాయి కొనుగోలుశక్తి తగ్గుతూ వస్తున్నది. కానీ భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి దశలోనే ఉన్నా, రానున్న దశాబ్దం లేదా ఆపైన కూడా ద్రవ్యోల్బణం నుంచి తప్పించుకునే అవకాశం తక్కువే. అమెరికాలో సీజన్, సమయం, అమ్మకాల ఆధారంగా మంచి కంపెనీల ద్వారా తయారైన బట్టలు తక్కువ ధరలకే లభ్యమవుతాయి. ఆహార పదార్థాలు కూడా మన దేశంతో పోల్చుకుంటే తక్కువ ధరలకే లభిస్తాయి.
ముందుంది ముసళ్ల పండగ
రూపాయి పతనం ఇలాగే కొనసాగినట్లయితే విదేశీ పెట్టు బడులు కుంటుపడతాయి. తద్వారా అభివృద్ధికి కావలసిన పెట్టుబడులు, నిజమైన పెట్టుబడుల మధ్య అంతరం ఏర్ప డుతుంది. ఈ పరిస్థితి సత్వరమే కాకపోయినా మున్ముం దు ఎదుర్కోవలసివస్తుంది. దీంతో ఆర్థికమాద్యంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కోల్పోయే ప్రమా దాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో తప్పని అధిక దిగుమతుల వల్ల డాలరు డిమాండ్ అధికమవడం సహజమే. మన రిజర్వు బ్యాంకు ఈ మధ్య కాలంలో రూపాయి పతనాన్ని నిరోధించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఫలితం మాత్రం శూన్యం. గత్యంతరం లేక రిజర్వు బ్యాంకుకు రెపోరేటును పెంచడం అనివార్యమవుతుంది. దీని అర్థం బ్యాంకులు ఈ వృద్ధిని ఖాతాదారులకు పంపిణీ చేయ డమే! తద్వారా అన్ని రకాల రుణాలపై భారీగా వడ్డీ రేట్లు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితిలో రిజర్వు బ్యాంకు రూపా యి ప్రతికూల సెంటిమెంట్‌ను దూరం చేయడానికి చేయ గలిగింది పెద్దగా ఏమీ లేదు.
ప్రభుత్వ పెద్దలు మేల్కోవాలి
ప్రభుత్వ సారథ్యం వహించే వారు, ఆర్థికవ్యవస్థను నియంత్రించేవారు కొన్ని చర్యలకైనా ఉపక్రమించాలని ఆర్థిక వ్యవస్థ గురించి కొద్దిపాటి అవగాహన ఉన్న ఎవ రైనా చెప్పవచ్చు. కొంత కష్టమే అయినా విచక్షణా రహి తంగా రాజకీయమే ధ్యేయంగా వెలువడే సంక్షేమ ప్రక టనలను అరికట్టాలి. తద్వారా ఆర్థిక లోటును కొంత వరకు సవరించుకునే అవకాశం కలుగుతుంది. ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం చేతు లారా అనండి లేదా చేతులుడిగిన పరిస్థితుల ద్వారా అనండి... ఎంత సులభంగా అయితే ఈ పరిస్థితిలోకి తీసు కురాగలిగిందో నిర్ణయాత్మక దృక్పథం ఉంటే అంతే సుల భంగా మనందరినీ బయటకు లాగగలదు.