balijepalli sharath babu
-
అవశేషాలు.. అవమానాలు..
నిషేధాలు ఈయూకే పరిమితం కావడం లేదు. సమీప భవిష్యత్తులోనే రష్యా నుంచి కూడా ఇలాంటి పరిస్థితి తప్పకపోవచ్చు. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆలుగడ్డలు నాణ్యతా ప్రమాణాలకు దీటుగా లేవనీ, వీటిని నిషేధించక తప్పని పరిస్థితులు ఉన్నాయనీ ఆ దేశ అధికారులు చెబుతున్నారు. బియ్యం, గోధుమ, పప్పులు, పళ్ళు కూరగాయల ఉత్పత్తిలో మన దేశానిది ప్రపంచంలోనే రెండవ స్థానం. పాలు, పంచదార, జీడిమామిడి, మసాలా దినుసులు వంటి వ్యవసాయోత్పత్తులలో మనది మొదటి స్థానం కూడా. అయినా ప్రపంచ ఎగుమతులలో మన వాటా 5 శాతానికి చేరలేక దిగాలు పడుతున్నది. ఇదంతా అవగాహనా రాహిత్యంతో తలెత్తిన పరిస్థితి కావచ్చు. కానీ ప్రపంచ దేశాలలో ఈ పరిస్థితి వల్ల భారత్ ఎగుమతులు అవమానకరమైన వాతావరణాన్ని ఎదుర్కొనవలసి వస్తున్నది. నాణ్యతా ప్రమాణాల నియంత్రణ గురించి దేశంలో కనిపిస్తున్న అవగాహనా రాహిత్యం తీవ్రమైనది. ఆహారం ద్వారా ప్రబలే వ్యాధు లకు కారణమయ్యే సూక్ష్మక్రిములు, పారిశ్రామిక రంగాలలో భద్రతా లోపాలు మన ఎగుమతులకు శాపంగా మారుతున్నాయి. వ్యవసా యోత్పత్తులను ఎగుమతి చేసే దేశాలు పాటించవలసిన పరిశుభ్రత, మాలిన్యాల నిరోధానికి సంబంధించి 2006లో ఒక చట్టాన్ని రూపొం దించారు. కానీ భారతదేశంలో చాలా చట్టాల మాదిరిగానే ఈ కీలక చట్టానికి కూడా చెదలు పట్టించారు. దీని ఫలితంగానే అంతర్జాతీయ ఎగుమతుల రంగంలో భారత్ ప్రతిష్ట మసకబారిపోతోంది. ఇటీవలి చేదు అనుభవాలు భారత్ నుంచి అత్యధికంగా తాజా కూరగాయలను దిగుమతి చేసుకునే దేశాలలో సౌదీ అరేబియా ఐదో స్థానంలో ఉంది. కానీ మన పచ్చి మిర్చి ఉత్పత్తులను మే నెల 30 నుంచి ఆ దేశం నిషేధించింది. క్రిమి సంహారక అవశేషాలు కనిపించడం వల్ల ఈ నిషేధం విధిస్తున్నట్టు భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల సాధికార సంస్థ (అపిడా)కు సౌదీ అరేబియా వివరించింది. ఇకపై ఉత్పత్తులలో క్రిమి సంహారక అవశేషాల జాడ లేకుండా చేస్తామని, నిషేధం ఎత్తివేయవలసిందని భారత్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ దేశం ఇంకా జవాబు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే అల్ఫాన్సా జాతి మామిడి, కొన్ని రకాల కూరగాయల మీద ఈ మే మాసంలోనే యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిషేధం విధించింది. ఆ ఎగుమతులలో ఫ్రూట్‌ఫ్లైస్ అనే కీటకాల జాడను కనిపెట్టి ఈయూ ఈ నిర్ణయం తీసుకుంది. అల్ఫాన్సాతో పాటు చామ దుంపలు, కాకర, పొట్ల, వంకాయ కూడా మొదటిసారి ఈయూ నిషేధానికి గురైనాయి. గుడ్డిలో మెల్ల మేలు అన్నట్టు తమ నిషేధం ఐదు శాతం తాజా పళ్లు, కూరగాయలకే వర్తిస్తుందనీ, మిగిలిన ఎగుమతులలో ప్రమాణాలు సక్రమంగానే ఉన్నాయని యూనియన్ వివరణ ఇచ్చింది. అలాంటి క్రిములు ఆ దేశాలలో కనిపించవు. కాబట్టే వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2013 సంవత్సరంలో ఎగుమతైన 207 రకాల వ్యవసాయోత్పత్తులలోనూ ఇలాంటి క్రిములను గుర్తించిన సంగతిని ఈయూ గుర్తు చేసింది. అల్ఫాన్సా మామిడి మీద నిషేధం అంటే దేశం అపారమైన నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. ఈ మామిడి రకంతో పాటు, మన తమలపాకులనూ నిషేధించే యోచనలో ఈయూ ఉన్నది. ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్న తమలపాకులలో సాల్మొనెల్లా అనే బాక్టీరియాను వారు కనుగొన్నారు. నిజానికి ఈ బాక్టీరియాను ఈయూ 2011 నుంచి గమనిస్తున్నది. ఈ కారణంగానే బంగ్లాదేశ్ నుంచి ఎగుమతయ్యే తమలపాకుల మీద ఈయూ ఇప్పటికే నిషేధాన్ని అమలు చేస్తున్నది. ఆ బాక్టీరియా ఉన్న ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులు వాంతులూ విరేచనాల బారిన పడతారు. ఇవన్నీ గమనించే కాబోలు గత సంవత్సరం ఆహార కాలుష్యానికి సంబంధించి ఈయూ 111 హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో 12 కరివేప, మిరప ఉత్పత్తులకు సంబంధించినవి. 84 హెచ్చరికలు బెండ ఉత్పత్తులకు సంబంధించినవి. వీటితో ఈయూ ఇప్పటివరకు భారత్‌కు చేసిన హెచ్చరికల సంఖ్య 257కు చేరుతుంది. అయితే 433 హెచ్చరికలను అందుకుని చైనా మొదటి స్థానంలో ఉంది. 2007లో కూడా మనం ఎగుమతి చేసిన గోరు చిక్కుడు, గోవర్గమ్లలో పెంటాక్లోరోఫినాల్ అనే క్రిమి సంహారకం అవశేషాలను ఈయూ కనుగొన్నది. నిషేధాలు ఇప్పటివి కావు 2003లో యూరప్ దేశాలలో తయారుచేసే వోస్టర్ సాస్‌లో సూడాన్-1డై అనే మలిన కారకాన్ని కనుగొన్నారు. ఇది పెద్ద దుమారం లేపింది. ఈ మలిన కార కం భారత్ నుంచి ఎగుమతి అయిన ఎండుకారం నుంచి వచ్చిందని వెల్లడైంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతుల విషయంలో జాగరూకత పాటించాలని ఆ సందర్భంలోనే సభ్య దేశాలకు ఈయూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణా మం దేశానికి అవమానకరమైనది. మన అంతర్జాతీయ ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపగలిగినది కూడా. ఈ ఉదంతం తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం బ్రాండింగ్ లేని ఆహారోత్పత్తులను నిషేధించింది. భారత ప్రభుత్వం కూడా సుగంధ ద్రవ్యాల బోర్డుకు ఎగుమతుల నమూనాలను సమర్పించడాన్ని అనివా ర్యం చేసింది. 2003లో డచ్ అధికారులు మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న ద్రాక్షలో మిథోమిల్, ఎసిఫేట్ అనే క్రిమిసంహారక అవశేషాలను కనుగొన్న తరువాత జరిపిన రభస చిన్నదేమీ కాదు. మసాలా దినుసుల ఎగుమతిలో, వినియోగంలో మనదే ప్రపంచంలో అగ్రస్థానం. కానీ అప్లటాక్సిన్ వంటి విష పదార్థం ఉనికి, నిషేధించిన రంగులను ఆహార పదార్థాల తయారీలో వినియో గించడం వంటి కారణాలతో చాలా దేశాలు మన ఎగుమతులను నిలిపివేశాయి. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లండ్ వంటి దేశాలు 1998, 2000 సంవత్సరాలలో మన ఎండు మిర్చి మీద నిషేధం విధించడానికి కారణం అప్లటాక్సిన్ అనే పదార్థమే. చేపల ఎగుమతిలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఉన్నాయి. అన్ని రకాల చేపల ఎగుమతులలోను సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుందన్న ఆరోపణ లు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను పాటించని అవిధేయ దేశంగా భారత్‌కు 1997లోనే యూరోపియన్ కమిషన్ ముద్ర వేసింది. పొంచి ఉన్న నిషేధాలు నిషేధాలు ఈయూకే పరిమితం కావడం లేదు. సమీప భవిష్యత్తులోనే రష్యా నుంచి కూడా ఇలాంటి పరిస్థితి తప్పకపోవచ్చు. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆలుగడ్డలు నాణ్యతా ప్రమాణాలకు దీటుగా లేవనీ, వీటిని నిషేధించక తప్పని పరిస్థితులు ఉన్నాయనీ ఆ దేశ అధికారులు చెబుతున్నారు. కానీ, ఇకపై తమ దేశానికి ఎగుమతులు జరగాలంటే అపిడా ధ్రవీకరణ పత్రం తప్పనిసరి అని రష్యా చెబుతోంది. మనం ఎగుమతి చేస్తున్న బ్రెడ్, ఒలిచిన రొయ్యలు, బాసుమతి బియ్యం, నువ్వులు, మిరియాలు, ధనియాలు, కారం వంటి వస్తువులు అన్నింటికీ క్రిమి సంహారక మందుల అవశేషాల బెడద పుష్కలంగా ఉంది. అరటి చిప్స్‌లో కలుపుతున్న ఎఫ్డీ అండ్ సీ పసుపు రంగు, క్రీమ్ బిస్కెట్లలో సురక్షితం కాని రంగుల వాడకం వల్ల కూడా మన ఎగుమతుల మీద వేటు పడే అవకాశాలు ఉన్నాయి. వీటికి తోడు భార లోహాల ఉనికి కొత్త బెడదగా మారనున్నది. పరిష్కారాలు మన దగ్గరే ఉన్నాయి వ్యవసాయ, ఆహారోత్పత్తులలో క్రిమి సంహారకాల ఉనికి కేవలం ఎగుమతులకు సంబంధించినదే కాదు. మన ఆరోగ్యానికి సంబంధించినదిగా కూడా పరిగణించాలి. సురక్షిత ఆహారం అనే అంశం మీద ఎలాంటి అవగాహన లేని చిన్న చిన్న వ్యాపారులతో చాలా చిక్కులు వస్తున్నాయి. మన నుంచి దిగుమతులను ఆహ్వాని స్తున్న దేశాలలో ఉన్న భద్రత, ఆరోగ్య ప్రమాణాలను మనం గౌరవించాలి. ఎగుమతుల కోసమే కాకుండా, మన ప్రజల ఆరోగ్యం కోసం కూడా ఇందుకు సంబంధించి పటిష్టమైన చట్టాలు చేయాలి. వ్యవసాయోత్పత్తులను ఎంత వృద్ధి చేశామన్నది కాదు, ఎన్ని నాణ్యతా ప్రమాణాలతో, ఆరోగ్య సూత్రాలతో ఆ వృద్ధి జరిగిందన్నదే నేటి ప్రపంచం గమనిస్తున్న అంశం. ఏ దేశమైనా దిగుమతులను ఆహ్వానించగలదు. వాటితో వచ్చే అనారోగ్యాన్ని మాత్రం కాదు. (వ్యాసకర్త వ్యవసాయ రంగ విశ్లేషకులు) బలిజేపల్లి శరత్‌బాబు -
‘మాఫీ’తో ముప్పుతిప్పలు
అప్పుల భారంతో చితికిన రైతన్నలకు రుణమాఫీ హామీ ఒక ఆశాకిరణంగా కనబడింది. అధికారంలోకి వచ్చి రుణాలు మాఫీ చేస్తాం, అప్పులు చెల్లించవద్దని టీడీపీ, టీఆర్ఎస్లు సూచించాయి. కనుకనే టీఆర్ఎస్ సర్కారు పరిమితులు విధిస్తే నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు బాబు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కమిటీపై కూడా అలాంటి వ్యతిరేకతే రావొచ్చు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గద్దెనెక్కిన ప్రభుత్వాలకు రుణమాఫీ వాగ్దానం గుదిబండగా మారింది. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు రైతు రుణాల మాఫీకి లక్ష రూపాయల పరి మితినైనా విధించారు. చంద్రబాబు మాత్రం మొత్తం రుణాలన్ని టినీ మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు. ఎన్నికలయ్యాక ఇద్దరూ రుణమాఫీపై తడబడ్డారు. 2012-13 మధ్య తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారం కుదువబెట్టి తీసుకున్న రుణాలకు ఇది వర్తించబోదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటిం చడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతులం తా తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనే ఇద్దరు రైతులు గుండెపో టుతో మరణించారు. మరో నలుగురు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉక్కిరిబిక్కిరైన తెలం గాణ సర్కారు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. చెప్పిన ట్టుగానే రుణమాఫీని కచ్చితంగా అమలుచేస్తామని కేసీఆర్ స్పష్టంగా హామీ ఇవ్వడంతో పరిస్థితి కొంతవరకూ చల్లబడింది. తెలంగాణలోని 2012-13 రుణాలు రూ. 12,000 కోట్లు మాత్రమే. అలాకా కుండా ఇంతవరకూ ఉన్న లక్షలోపు రుణాలన్నిటినీ మాఫీ చేయాలంటే అవి రూ. 26,020 కోట్లు అవుతాయి. రుణాల భారంతో చితికిన రైతన్నలకు ఎన్ని కల్లో టీఆర్ఎస్, టీడీపీల రుణమాఫీ హామీ ఆశాకిరణంగా కనబడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తాం గనుక ఎవరూ అప్పులు చెల్లించవద్దని కూడా అవి సూచించాయి. కనుకనే టీఆర్ఎస్ సర్కారు కొన్ని పరిమితులు విధింపు యత్నానికి వ్యతిరేకత వెల్లువెత్తింది. బాబు కప్పదాటు టీఆర్ఎస్కు భిన్నంగా టీడీపీ రైతు రుణాలపై ఎలాంటి పరిమితీ విధించ లేదు. అధికారంలోకి వస్తూనే రైతు రుణాలన్నిటినీ రద్దుచేస్తామని చంద్ర బాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల రుణాలనూ ప్రభుత్వాధికారులతో ఆయన లెక్కలు కట్టించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల బ్యాంకులు రూ. 37,058 కోట్ల రుణాలను రైతులకు మంజూరుచేశాయని వారు తేల్చారు. ఇందులో ఖరీఫ్ రుణాలు రూ. 22,992 కోట్లు, రబీ రుణాలు 14,065 కోట్లు. 2014 మార్చి 31నాటికి చెల్లించని అన్ని రకాల వ్యవసాయ రుణాలూ కలిపి రూ. 59,105 కోట్లని వారు చెబుతున్నారు. ఇవన్నీ 84 లక్షల 86 వేల 890 మంది రైతుల ఖాతాల కింద ఉన్నాయి. ఇందులో సన్నకారు రైతుల ఖాతాలు 72 లక్షల 13వేల 857 ఉన్నాయని... అన్ని రకాల ఇతర రుణాలనూ మినహాయించి పంట రుణా లను మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం అనుకుంటే రూ. 34,067.67 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనావేశారు. అయితే, బ్యాంకర్ల అంచనాలు వేరుగా ఉన్నాయి. అన్ని రకాల వ్యవసాయ రుణాలు రూ. 73,408 కోట్లుగా వారు చెబుతున్నారు. డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14,204 కోట్లు కలిపితే ఇది రూ. 87,612 కోట్లు అవుతుందన్నది వారి అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఇప్పటికే రూ. 15,900 కోట్లు లోటుతో ఉంది. ఇందుకు భిన్నంగా తెలంగాణకు సుమారు రూ. 7,510 కోట్లు ఆదాయ మిగులు ఉంది. అయినా సరే కేసీఆర్ రుణమాఫీకి లక్ష రూపాయల పరిమితి విధించుకున్నారు. బాబు మాత్రం ఎలా చెయ్యగలరో, ఏమి చెయ్యగలరో తగినంత స్పష్టత లేకుండా వ్యవసాయ రుణాలన్నిటినీ రద్దుచేస్తామని ప్రకటించారు. విపక్షాలు దాడి చేస్తుంటే ‘మావద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఎలా చేయాలో మాకు తెలుసు. అనుభవంలేని కొత్త పార్టీల నాయకుల దగ్గరనుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ పట్టలేదు’ అని ఆయన బింకంగా చెప్పారు. నిజంగా అలాంటి ప్రణాళిక ఉంటే ప్రమాణస్వీకారం రోజున తొలుత హామీ ఇచ్చినట్టు రుణమాఫీ ఫైలుపై కాకుండా రుణమాఫీపై కమిటీని ఏర్పాటు చేసే ఫైలుపై మాత్రమే ఆయన తొలి సంతకం ఎందుకు పెట్టవలసివచ్చిందో అర్థంకాని విషయం. సంస్కరణల ఆద్యుడు చంద్రబాబు 1995 నుండి 2004 వరకూ రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలను అమలు జరిపిన నాయకుడు. ఈ విషయంలో ఆయన దేశవిదేశాల్లో ప్రాము ఖ్యత సంపాదించుకున్నారు. హైటెక్ పద్ధతులకు పెట్టింది పేరుగా ముద్ర వేయించుకున్నారు. కానీ రైతాంగ వ్యతిరేకిగానే ఆయన మిగిలిపోయారు. అందువల్లే రాష్ట్ర ప్రజలు 2004లోనూ, 2009లోనూ ఆయనను కాదను కున్నారు. దివంగత నేత వైఎస్ 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్తు ఫైలుపై తొలి సంతకం చేయడంమాత్రమే కాదు... ఆ తర్వాత సంక్షేమరథాన్ని చాకచక్యంగా నడిపి వరసగా రెండోసారి కూడా విజయం సాధించారు. అందువల్లే తనకు ఇష్టమున్నా, లేకున్నా సంక్షే మాన్ని పట్టించుకుంటే తప్ప అధికారం దక్కబోదని గ్రహించి చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో రుణ మాఫీ గురించి ప్రకటిం చారు. బాబు పంథా తెలిసినవారు ఇప్పుడు రుణమాఫీపై కమిటీ వేయడాన్ని తాత్సారం చేయడం కోసమేనన్న అభిప్రాయంతో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటనుంచే వాగ్దా నాలకు అవరోధమనుకుంటున్న ఆర్థిక విషయాలపై టీడీపీలోని పైస్థాయి నాయకత్వంనుంచి సభ్యుల వరకూ స్వరం మార్చారు. కేంద్రంలోనూ గందరగోళం చంద్రబాబు రుణమాఫీ వ్యవహారం కేంద్రంలో కూడా పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. దీన్ని ఏదోవిధంగా ఆపించాలని బ్యాంకర్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి మొరపె ట్టుకున్నట్టు తెలుస్తున్నది. గ్రామాల్లో ఉన్న ఆర్థిక రోగాలకు రుణ మాఫీ పరిష్కారం కాదని, అది రోగ లక్షణాలకు చికిత్స చేయ డమే అవుతుందని మేధావి వర్గం వాదిస్తోంది. రుణమాఫీపై సూచనలివ్వడానికి రిటైర్డు ఐఆర్డీఏ చైర్మన్ సీఎస్ రావు అధ్యక్షతన చంద్ర బాబు కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఎన్నికల హామీలు, మొత్తం రుణాలు అంచనావేసి రాష్ట్ర ఆదాయంతో తూకంవేసి రుణాల మాఫీకి మార్గాలు సూచించవలసి ఉంది. మరోపక్క రిజర్వ్ బ్యాంకు గ్యారంటీతో వ్యవసాయ రుణాలపై పదేళ్ల మారటోరియం విధించి బ్యాంకులకు ప్రభుత్వ బాండ్లు ఇవ్వాలని బాబు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. రిజర్వ్ బ్యాంకు ఈ అభ్యర్థనను అంగీకరించడం కష్టమే. అలా చేస్తే అది తాను నిర్ణయించిన రాష్ట్రాల రుణ హద్దుల్ని తానే అతిక్రమించినట్టు అవుతుంది. పైగా ఆర్థిక బాధ్యతలు, బడ్జెట్ నిర్వహణ చట్టం-2003 కూడా అడ్డంకిగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బ్యాంకుల అప్పులు, జమల నిష్పత్తిని... 5,26,125 కోట్ల అప్పులు, 4,51,121 కోట్ల డిపాజిట్లతో 116 శాతంగా నిర్ధారించారు. బ్యాంకులు 75,044 కోట్ల క్రాస్ సబ్సిడైజేషన్ లోటు ప్రమాద సూచికను చూపుతున్నాయి. అయినా 87 వేల కోట్ల పైబడి ఉన్న రుణ మాఫీ అమలు ఏవిధంగా సాధ్యమో చెప్పాలని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రుణమాఫీ పరిమితులపై వెల్లువెత్తిన నిరసనలతో బాబుకు సంకటస్థితి ఎదురైంది. అందువల్లే కమిటీతో కాలయాపన చేయదల్చుకున్నట్టు కనబడు తోంది. దేశ స్థూల ఆదాయంలో వ్యవసాయం నుంచి వచ్చే వాటా 2009 - 10లో 14.6 శాతం ఉండగా 2012 - 13లో అది 13.7 శాతానికి క్షీణించింది. గ్రామీణ భారతంలో ఇప్పటికీ 60 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయ సంబం ధిత పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా తరహాలో అభివృద్ధి సాధ్యంకావాలంటే ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడగ లిగేలా ప్రభుత్వ పథకాలు ఉండాలని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమల స్థాపనపై దృష్టిపెట్టాలంటున్నారు. నాయకులు ఆ మార్గంలో ఆలోచిస్తారా?! (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) బలిజేపల్లి శరత్‌బాబు -
అమలే హామీకి గీటురాయి
రాజశేఖరరెడ్డి ఆశయాలతోనే ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వ్యవసాయం గురించి చేసిన ప్రస్తావనలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రైతులకు మేలు చేసిన చరిత్ర వైఎస్ఆర్కు ఉంది. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత ఉంది. ఆ నేపథ్యం, ఇప్పుడు ఇచ్చిన హామీలను బట్టి ఈ మేనిఫెస్టోను వేరుగానే చూడాలి. తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు ఎన్నికల ప్రణాళికలతో జరుగుతున్న ఎన్నికలను మొదటిసారి చూడబోతున్నాం. ఈ రెండు ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాలను చూస్తుంటే ప్రతి సృష్టి చేయబోతున్నాం అని పురాణ పురుషులు చెప్పే మాటలు గుర్తుకు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి పార్టీలు చేస్తున్న ప్రతిజ్ఞలు, ఇస్తున్న హామీలు, కురిపిస్తున్న వరాలు ఒక తంతుగా కనిపిస్తున్నాయే తప్ప, ఆచరణ సాధ్యమని అనిపించడం లేదు. ఇందుకు వైఎస్ఆర్ సీపీ మినహాయింపు అని కొన్ని కారణాలతో కచ్చితంగా చెప్పుకోగలిగినా, మొత్తం సేద్యం మీద కురిపిస్తున్న హామీలకూ, వాటి ఆచరణకూ మధ్య అగాధమే కనిపిస్తున్నది. తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్ కూడా చాలదు. ప్రతి జిల్లాకు లక్ష ఎకరాలకు కొత్తగా నీటి సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అంటే పది జిల్లాలకు కోటి ఎకరాలకు నీరు ఇస్తామని వాగ్దానం చేశారు. ఇది ఎంత వరకు సాధ్యం? ఎలా సాధ్యం? ఈ వివరణలు మేనిఫెస్టోలో కానరావు. చాలా వాగ్దానాలను ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను కూడా పట్టించుకోకుండా చేస్తున్నారని అనిపిస్తుంది. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలను చేయరాదనీ, ఉచిత తాయిలాలు ప్రకటించరాదనీ సుప్రీం కోర్టు ఇచ్చిన(జూలై, 2013) ఆదేశాలను ఉటంకిస్తూ ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలను హెచ్చరించింది. తెరాస ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టినట్టే ఉంది. ఎందుకంటే, ఒక వాగ్దానం చేస్తే, దానిని నెరవేర్చే మార్గాలను కూడా ప్రస్తావించాలని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. ఆ వాగ్దానాల అమలుకు కావలసిన నిధులు ఎలా సమకూర్చుకుంటారో వాగ్దానాలు చేసిన పార్టీలు స్పష్టం చేయవలసిందే. అయినా చేతికి ఎముక లేదన్న రీతిలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయంటే మభ్యపెట్టడానికని చెప్పక తప్పదు. తెరాసతో పాటు, టీడీపీ చేస్తున్న వాగ్దానాలలో కూడా ఆచరణకు సాధ్యం కానివే ఎక్కువ. రైతు రుణాలను మాఫీ చేస్తామని ఈ రెండు పార్టీలు కూడా చెప్పుకున్నాయి. లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని తెరాస హామీ ఇచ్చింది. ఈ పరిమితి ఎంతో తెలుగుదేశం చెప్పలేదు. గృహావసరాలకూ, పరిశ్రమలకూ 24 గంటలు, సేద్యానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తానని కూడా టీడీపీ హామీ ఇచ్చింది. తెదేపా రుణ మాఫీ హామీ ఆచరణ సాధ్యం కాదని సామాన్యులకే అర్థమవుతుంది. ఇక ప్రత్యర్థి పక్షాలకీ, ప్రజా సంఘాలకీ తెలియకుండా ఉంటుందని ఎలా అనుకుంటాం? సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, అలాంటి రుణ మాఫీ హామీ ఇచ్చినందుకు తెలుగుదేశం మీద వెంటనే చర్య తీసుకోవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర శాఖ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అన్ని రకాల వ్యవసాయ, స్వయం సేవా రుణాలను మాఫీ చేయాలంటే దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలి. అసలు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ మొత్తమే 1.6 లక్షల కోట్ల రూపాయలు పైనే. అన్నిపథకాలకు కలిపి కేటాయించిన ప్లాన్ బడ్జెట్ మొత్తమే 59,000 కోట్లు. ఈ నేపథ్యంలో రుణ మాఫీ ఎలా సాధ్యమో చెప్పాలని ఆమ్ఆద్మీ కోరుతోంది. రైతన్నలు తీసుకున్న రుణాలలో 70 శాతం ప్రభుత్వం దగ్గర నుంచి కాకుండా, వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవనీ, ఈ రుణాలను మాఫీ చేయడం ఎలాగో చెప్పాలనీ ఆమ్ ఆద్మీ పార్టీ నిలదీస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులలో ఎక్కువ మంది ఇలా ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకున్నవారే. ఇంకా కీలకమైన ప్రశ్న- పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రుణాల పేరిట తీసుకున్న మొత్తాలను ఏం చేస్తారు? డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతోనే ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వ్యవసాయం గురించి చేసిన ప్రస్తావనలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రైతులకు మేలు చేసిన చరిత్ర వైఎస్ఆర్కు ఉంది. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత కూడా ఉంది. ఆ నేపథ్యం, ఇప్పుడు ఇచ్చిన హామీలను బట్టి ఈ మేనిఫెస్టోను వేరుగానే చూడాలి. వైఎస్ కుమారుడు జగన్ ఆధ్వర్యంలో విడుదలైన మేనిఫెస్టోలో అమ్మఒడి, విద్యార్థులకు ఫీజుల మాఫీ, మహిళా స్వయం సేవా సంఘాల రుణ మాఫీ వంటి హామీల విషయంలో విభేదించడానికి ఏమీ ఉండదు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతన్నకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో రూ. 2,000 కోట్ల కార్పస్ నిధిని ఏర్పాటు చేస్తామని ఈ కొత్తపార్టీ చెబుతోంది. మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్ కూడా ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి వైఎస్ఆర్ మడమ తిప్పకుండా వ్యవహరించారు. ఐదేళ్ల పాటు ఉచితంగా విద్యుత్‌ను ఇచ్చారు. రూ. 3,000 కోట్లతో నిధి ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు కృషి చేస్తామని కూడా వైఎస్ఆర్ సీపీ హామీ ఇచ్చింది. గిట్టుబాటు ధరలు లేక నిరంతరం కుంగిపోతున్న రైతు కోసం దీనిని ఉద్దేశించారు. ధ రల స్థిరీకరణను ఎలా సాధ్యం చేయబోతున్నారో ఇప్పుడే చెప్పడం కష్టమే. అయినప్పటికీ ఈ ఆశయంతో పడిన ఒక అడుగుగా ఈ అంశాన్ని గమనించవచ్చు. తెలుగుదేశం కూడా ఇందుకు 5,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని చెప్పడం ఆహ్వానించదగినదే. గిట్టుబాటు ధరల గురించి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయడం, గిడ్డంగుల నిర్మాణం, వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు, ప్రత్యేక విత్తన చట్టం, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్లపై సబ్సిడీ వంటి అంశాలు టీడీపీ మీద పడిన రైతు వ్యతిరేక ముద్రను కొంతయినా తొలగించగలిగినవే. కానీ రైతుల సంక్షేమం విషయంలో ఆ పార్టీకి ఉన్న గత చరిత్రను బట్టి అవి అమలు కావడం మొదలయ్యే వరకు ప్రజలకు నమ్మకం కుదరదు. అమ్మఒడి, విద్యార్థి వేతనాలు, వృద్ధాప్యపు పెన్షన్ 700/- (పెంచినది), ధరల స్థిరీకరణ నిధి, రూ. 20,000 కోట్ల డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ వంటి వాటిపై వైఎస్ఆర్సీపీ ఇప్పటికే నిశ్చితాభిప్రాయంతో ఉంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే వీటికి సంబంధించిన ఫైళ్ల మీద సంతకం చేయాలని జగన్ ఆశయంగా చెబుతున్నారు. పెండింగ్‌లో లేదా అసంపూర్తిగా ఉన్న పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ వంటి భారీ మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల పనులు, కృష్ణా, గోదావరి, పెన్న నదుల పరీవాహక ప్రాంతాలలో ముఖ్యమైన డ్రైనేజీ పనులకు ప్రాముఖ్యం ఇవ్వబోతున్నట్టు కూడా వైఎస్ఆర్ సీపీ ప్రకటించింది. రైతులకు సూచనలూ సలహాల కోసం 102 సర్వీసు, రెండేసి జిల్లాలకు ఒక వ్యవసాయ కళాశాల, ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాల నియంత్రణను 102కు అనుసంధానం చేస్తూ కళాశాలలకు అప్పగింత, పశు ఆరోగ్యం కోసం 103 సర్వీసు, ప్రతి జిల్లాలో శీతల గిడ్డంగి, వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్ సౌకర్యం, సేద్యానికి ఇద్దరు మంత్రులు వంటి అంశాలు కూడా చేరడం వల్ల ఈ మేనిఫెస్టోకు ప్రత్యేకత వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోవచ్చు. కొత్త పార్టీలకు అవకాశం రావచ్చు. పార్టీ ఏదైనా రైతు సంక్షేమం మీద ఏకాభిప్రాయం ఉంటేనే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. విశ్లేషణ: బలిజేపల్లి శరత్‌బాబు (వ్యాసకర్త సాగు అంశాల విశ్లేషకులు) -
చేనుకు చేవే, భవితకు తోవ!
1970-1980 దశకాల్లో సాగు కార్యకలాపాన్ని ఉధృతం చేసుకుని గ్రామీణ కూలీల ఆవశ్యకతను గుర్తించి, రోజువారీ కూలీని పెంచుకోవడంతోపాటు ఆహారధాన్యాల ధరలను, పేదరికాన్ని కొంతమేరకయినా తగ్గించుకోగలిగాం. కానీ ఈ పట్టుదల నిబద్ధతతో కొనసాగలేదు. 1990, 2000 దశకాల్లో వ్యవసాయ అభివృద్ధి తగ్గిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక, సేవారంగాల్లో జరిగిన అభివృద్ధితో 2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం వాటా క్రమంగా 13.7 శాతానికి పడిపోయింది. ఇది మంచి పరి ణామం కాదు. ఎలాగంటే మూడో వంతు భారతీయ కుటుం బాలు గ్రామీణ ఆదాయం మీదనే ఆధారపడి ఉన్నాయి. మొత్తం జనాభాలో 800 మిలియన్ల పేదలు సుమారుగా 70 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు.దేశంలో వృద్ధి చెందుతున్న ఆదాయాలతో పాటుగా పెరుగుతున్న జనాభా డిమాండ్లను తీర్చడం, వారి ఆహార భద్రత వంటి కీలకాం శాలన్నీ ధాన్యంతో పాటుగా పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల పెరుగుదల మీదనే ఆధారపడి ఉన్నాయి. కనుకనే ఉత్పాదకత, పోటీ, వైవిధ్యంతో పాటుగా సుస్థిర వ్యవసాయ రంగం వేగంగా ఆవిర్భవించవలసిన అవసరం ఉంది. వ్యవ సాయంలో భారతదేశం అనేక విధాలుగా అగ్రగామిగా ఉంది. పాలు, అపరాలు, మసాలా దినుసులు ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే పేరుగాంచింది. అత్యధిక పశుసంపదతో పాటుగా అత్యధిక భూమి గోధుమ, వరి, పత్తి పంటల కింద సాగులో ఉన్నది కూడా ఇక్కడే. భారతదేశం వరి, గోధుమ, పత్తి, చెరకు, చేపలు, గొర్రెలు, గొర్రె మాంసం, పండ్లు, కూరగాయలు, తేయాకు ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్నది. మన దేశంలో సాగులో ఉన్న సుమారు 195 మిలియన్ హెక్టార్లలో 63 శాతం వర్షాధారంగా ఉండగా 37 శాతం భూములు నీటి పారుదల సదుపాయం కలిగి ఉన్నాయి. అదనంగా సుమారు 65 మిలియన్ హెక్టార్ల భూమి అడవులతో విరాజిల్లుతూ ఉంది. భారతదేశ సమగ్రాభివృద్ధికి, గ్రామీణ పేదల సంక్షేమానికి వ్యవసాయ రంగం ఎదుర్కోవలసిన కొన్ని సవాళ్లు ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. ఆహార భద్రతకు అనుగుణంగా.... ఆహారధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించి, 1970 దశకంలో హరిత విప్లవంతో స్వయం సమృద్ధిని సాధించుకున్నాం. కరువు కాటకాల నుంచి బయటపడ్డాం. 1970-1980 దశకాల్లో సాగు కార్యకలాపాన్ని ఉధృతం చేసుకుని గ్రామీణ కూలీల ఆవశ్యకతను గుర్తించి, రోజువారీ కూలీని పెంచుకోవడంతో పాటు ఆహారధాన్యాల ధరలను, పేదరికాన్ని కొంతమేరకయినా తగ్గించుకోగలి గాం. కానీ ఈ పట్టుదలలో నిబద్ధత కరువైంది. 1990, 2000 దశకాల్లో వ్యవ సాయ అభివృద్ధి తగ్గిపోయింది. సగటున వృద్ధి 3.5 శాతం మాత్రమే నమోదు కాగా, ధాన్యం ఉత్పత్తుల్లో పెరుగుదల 1.4 శాతం మాత్రమే. ఈ తగ్గుదల ఆందోళన కలిగించేదే. భారతదేశ వరి ఉత్పత్తులు చైనాతో పోలిస్తే మూడు వంతుల్లో ఒకటిగాను, వియత్నాం, ఇండోనేసియాతో పోల్చుకుంటే సగంగాను ఉన్నాయి. ఈ విధమైన పోలికలతో అనేక వ్యవసాయ ఉత్పత్తుల్లో మనం వెనుక బడి ఉన్నాం. విధాన రూపకర్తలు రాబోయే రోజులకు అనుగుణంగా, అధిక కాలం ఉపయోగపడేలా విధాన నిర్ణయాలు చేయవలసి ఉంది. ఉత్పాదకత, అంతర్జాతీయ పోటీకి దీటుగా, వైవిధ్యంతో ఉండేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలి. పెరగవలసిన ఉత్పాదకత మన వ్యవసాయంలో నిజమైన అభివృద్ధి సాధించడానికి దేశంలో సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ఉన్న ఉత్పాదకతను గణనీయంగా పెంచాలి. ఉత్పాదకత పెరగా లంటే నీటి లభ్యత ముఖ్యం. పట్టణాభివృద్ధి, పెరుగుతున్న పరిశ్రమల అవస రాలు వంటి వాస్తవికాంశాలను దృష్టిలో ఉంచుకుని నీటికి పోటీపడవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. అలాగే వృథాను నివారిస్తూ లక్ష్యసాధన కోసం నడుం బిగించాలి. నీటి వనరులలో సేద్యానికి సింహ భాగం అవసరం. అయితే పరిశ్రమలు, పట్టణావసరాలు నీటికి పోటీపడటం ఇటీవల పెరుగుతున్నది. ముందు ముందు నీటితో ప్రజావసరాలు మరింత విస్తరించే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అలాంటి పరిస్థితులు ఎదురైతే వ్యవసాయానికి గడ్డు పరిస్థితులు తప్పవు. అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి వినియోగం ద్వారా అధిక ఫలసాయాన్ని పొందే విధానాలను అభివృద్ధి పరచి, అమలు పరచవలసిన అవసరాన్ని ఇప్పటి నుండే గమనించాలి. భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టడం ఇకనైనా ఒక ఉద్యమంలా సాగించాలి. జలాల దుర్వినియోగంతో రాబోయే రోజుల్లో తలెత్తే సమస్యలు, పర్యావరణ సంబంధిత విపత్తుల వంటి అంశాల మీద రైతులకు, ఇతర వినియోగదారులకు సరైన అవగాహన కలిగిం చాలి. నీటి పారుదలను ఆధునీకరణ, మురుగునీటి పారుదల సదుపాయాలు, పెట్టిన ఖర్చుకు సార్థకత, కచ్చితంగా, వేగంగా ఫలితాలను ఇవ్వగలిగే పద్ధతులకు మద్దతు, పెట్టుబడుల్లో సుస్థిరత సాధించే దిశగా అమల్లో ఉన్న ప్రక్రియలు, వాటి కొనసాగింపునకు తగినన్ని వనరులు కేటాయించుకోవడం వంటివి జల వినియోగంలో తక్షణమే ఆలోచించవలసిన ఇతర కీలక విధానాలు. జల రక్షణకు కొత్త దృష్టి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధిక మోతాదులో దుర్వినియోగపరచడంతో వాటి స్థాయి ప్రమాదకరంగా పడిపోతున్నది. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో సరైన మురుగు నీటి ఉపసంహ రణ లేనందున సాగు భూములు ఉప్పు నేలలుగా మారిపోతున్నాయి. అత్యధిక ప్రాంతాల ప్రజలకు జీవనాధారమైన వర్షాధారిత ప్రాంతాల్లో సాగు భూమి కోతకు గురికాకుండా చూడాలి. మితంగా కురిసే వర్షపు నీరు వృథా కాకుండా, నేల పీల్చుకునేలా వ్యవసాయ పద్ధతులను ఇంకొన్నిచోట్ల అన్నదాతలకు అందించగలగాలి. సమగ్ర వాటర్ షెడ్ నిర్వహణా కార్యక్ర మాల వంటి వాటి అమలు ద్వారా కమ్యూనిటీలు భూవినియోగ ప్రణా ళికలు రూపొందించేటట్టు రైతులను సంసిద్ధులను చేయాలి. మారుతున్న పర్యావరణ పరిస్థితులు, దానితో శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులు, అధికంగా ఏర్పడుతున్న వరదలు, కరువు, అకాల వర్షాలు మున్ముందు పెరిగిపోగలిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాటర్ షెడ్ నిర్వహణా కార్యక్రమాలతో పాటుగా ఆటుపోట్లకు తట్టుకునే వంగడాలను, వ్యవసాయ పద్ధతులను, ప్రణాళికలను అభివృద్ధి పరచుకోవాలి. అందని రుణాలు రైతులకు గ్రామీణ రుణాలు అందని పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది మారాలి! విద్యుత్తు, నీటి పారుదల వంటి వాటితో పాటు ఇతర ఆహార సరఫరాల మీద సబ్సిడీలు తొలగించాలని యోచిస్తున్నారు. కానీ అంత కంటె ముందు రైతుకు తన పంటకు ధరలు నిర్ణయించడంలో తగినంత ప్రాధాన్యం ఇవ్వాలన్న సంగతి చూడాలి. ఈ అంశం గురించి పట్టించుకోనంత కాలం రైతుకు ఇస్తున్న అన్ని రకాల సబ్సిడీలను కొనసాగించడం అవసరమే. లేకపోతే ఆహార ఉత్పత్తులే సందిగ్ధంలో పడిపోతాయి. వ్యాపారస్తుడు ఎలాగైతే తన లాభాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయాలు చేస్తున్నాడో, సేద్యగాడు కూడా ఖర్చులన్నీ పరిగణనలోకి తీసుకుని వ్యవసాయోత్పత్తుల మీద లాభసాటిగా ధరలను నిర్ణయించుకునే స్థాయికి చేరుకోవాలి. పంటల ధరల నిర్ణయంలో రైతు పాత్రను నిర్లక్ష్యం చేయడానికి వీలులేని పరిస్థితులు నెలకొనాలి. మార్కెట్లపై నిరోధాలు కొనసాగుతున్నాయి. విత్తనాలు, రసాయనిక ఎరువుల వంటి కొన్ని ఉత్పాదకాల మీద నిరోధాలు తొలగిపోయాయి. దీనితో రైతులు గిట్టుబాటు ధరలు పొందలేక అనేక విపరీత పరిణామాలను ఎదుర్కొంటు న్నారు. ఆధునికంగా తీర్చిదిద్దిన శాస్త్రీయ మార్కెట్లకు దళారుల ప్రమేయం లేకుండా అన్నదాతకు ప్రవేశం కల్పించాలి. అది చూసి దశాబ్దాలుగా రైతును మోసాలకు గురిచేస్తున్న దళారులకు కనువిప్పు కలిగించే విధంగా ఇదంతా జరగాలి. ముఖ్యంగా రైతన్నను విద్యాధికుడిని చేయాలి. అప్పుడు మాత్రమే రైతన్న విషయావగాహన ద్వారా మోసాలను పసిగట్టగలడు. తన కష్టాలు కడతేరడానికి, ఆదాయం పెంచుకోవడానికి స్వయంగా లేక సంఘటితంగా పరిష్కార మార్గాలను కనుగొని ఫలితాలను పొందగలడు. - డా॥బలిజేపల్లి శరత్‌బాబు -
మాటా మోహనం కాదు
విశ్లేషణ: మన్మోహన్సింగ్ తన అభిప్రాయాలనూ, యూపీయే విజయాలనూ స్ఫుటంగా వినిపించాలని కృషి చేశారు. కానీ అందులో సఫలం కాలేదనే అనిపిస్తుంది. ఆ మాటలన్నీ భవిష్యత్తులో చేయబోయే ప్రభుత్వ ఏర్పాటును దృష్టిలో ఉంచుకుని చెప్పినట్టే ఉన్నాయి. మన్మోహన్సింగ్ ప్రధాని పద వి చేపట్టి పదేళ్లవుతోంది. ఈ కాలంలో మూడుసార్లు మాత్ర మే ఆయన విలేకరులతో మాట్లా డారు. జనవరి 3 నాటి సమా వేశమే మూడోదీ, బహుశా ఆఖ రిది కూడా. ఏ ప్రభుత్వాధి నేతైనా లోటుపాట్లను లేవనెత్త కుండా, కేవలం సాధించిన ప్రగ తి గురించి చెప్పుకుంటాడు. మన్మోహన్సింగ్ చేసిందీ అదే. కుంభకోణాలు, అవినీతి, ఆర్థిక, ఆహార ద్రవ్యోల్బ ణం లాంటి వైఫల్యాలను ఒక వైపు ఒప్పుకుంటూనే తమ ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి వివరించడానికి ఆయన శతధా ప్రయత్నం చేశారు. బాధ్యత రాష్ట్రాలదేనట ద్రవ్యోల్బణం లేదా అధిక ధరల ద్వారా రైతులు లాభ పడ్డారనీ, రాబోయేవి దేశానికి చాలా మంచి రోజులని ప్రధాని అభివర్ణించారు. ద్రవ్యోల్బణం మీద వచ్చిన భయాలు న్యాయమైనవేనని అంటూనే, అధిక శాతం ప్రజల ఆదాయం ద్రవ్యోల్బణం కన్నా అధికంగానూ, వేగంగానూ పెరిగిందని భాష్యం చెప్పారు. యూపీఏ ప్రభుత్వం సమ్మిళిత వృద్ధి విధానాలతో అధిక మొత్తాలను బలహీన వర్గాలకు అందించడం వల్ల ధరల భారానికి వారు గురి కాలేదని అభిప్రాయపడ్డారు. ఆహార ద్రవ్యోల్బ ణానికి కారణ ం సరఫరా తక్కువ కావడమేనని పరోక్షంగా అంగీకరించారు. ధరలను నియంత్రించవలసిన అవసరం ఉందని ఆయనా ఒప్పుకున్నారు. కానీ అది రాష్ట్రాల బాధ్యత అని వాటి మీదకు తోసేశారు. భారత్ ఆర్థికంగా ఎదుగుతున్న దేశమే. కానీ చైనా వంటి దేశంతో పోల్చు కుంటే ఇటీవలి మన ఆర్థికాభివృద్ధి కుంటుపడిన సంగతి తెలుస్తుంది. వృద్ధి రేటు గడచిన 2012-13లో కేవలం 5 శాతంగా నమోదైంది. దీనిని ప్రధాని భౌగోళిక అంశాలతో ముడిపెట్టారు. యూపీఏ మొదటి అంకంలో మొట్టమొ దటిసారిగా 9 శాతం అభివృద్ధి సాధ్యమైందని గుర్తుకు తెచ్చుకున్నారు. తరువాత తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షో భంతో గత రెండేళ్ల నుంచీ ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో మాంద్యం చోటు చేసుకున్న సంగతి కూడా ఆయన చెప్పారు. దీనితో వచ్చిన ఒడిదుడుకులకు భారత్‌కూ మిన హాయింపులేదని ఆయన అభిప్రాయం. సంస్కరణల ఫలితాల ఊసేది? కేవల ఆర్థిక ఎదుగుదలతోనే తృప్తి పడిపోకుండా, సమ్మి ళిత వృద్ధి విధానాలకూ శ్రీకారం చుట్టామని ప్రధాని వివ రించారు. అధికారంలో ఉన్నంత కాలం ఆర్థిక సంస్క రణలు కొనసాగిస్తూ, వాటికే ప్రాముఖ్యం ఇస్తూ వీలైనన్ని ప్రోత్సాహక చర్యలు చేపడతామనీ చెప్పారాయన. ఇబ్బం దులు ఉన్నప్పటికీ సంస్కరణలను అమలు చేయవలసిం దేనని ఆయన కోరిక. సంస్కరణల ద్వారానే ఆర్థికాభి వృద్ధి, వాణిజ్య వ్యవస్థలకు చేయూత, ఉద్యోగ అవకా శాలు, పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలు, పిల్లలకు భద్రత సాధ్యం కాగలవని ప్రధాని మన్మోహన్ ప్రగాఢ నమ్మకం. కానీ సంస్కరణల అమలు ద్వారా సాధించిన ప్రగతి, ఉద్యోగాల లభ్యతలు ఎంతో ఆయన చెప్పలేదు. ప్రభుత్వం మీద వచ్చిన ప్రతికూల తలో సంస్కరణల పాత్ర ఏమిటో కూడా బయట పెట్టలేక పోయారు. పెట్రో ఉత్పత్తుల మీద పూర్తిగాను, వంట గ్యాస్ మీద గణనీయంగాను సబ్సిడీ తొలగించడంతో పేద, మధ్య తరగతి వర్గాల్లో ఏర్పడుతున్న అభద్రత స్థాయిని ప్రధాని గమనించలేకపోయారని ఆయన మాట లతో అర్థమవుతుంది. ఈ సబ్సిడీల ఎత్తివేత సంస్క రణలలో భాగమే మరి. పెట్రోలియం ఉత్పత్తుల మీద ప్రభుత్వ నియంత్రణ నామమాత్రం కావడంతో పెట్రో లియం కంపెనీలు తరుచు ధరల పెంపునకు తెగబడు తున్నాయి. దీనితో నిత్యావసరాల ధరలు ఊహకందని రీతిలో ప్రభావితమవుతున్నాయి. ఈ పరిణామంతో పేద, మధ్య తరగతి వర్గాల ఆర్థిక ప్రణాళికలు ఎంతగా కకావి కలవుతున్నాయో ప్రభుత్వానికి పట్టడం లేదన్న విమర్శను ప్రధాని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. తొలి అంకం సరే... ఈ పదేళ్ల కాలంలో గ్రామీణాభివృద్ధికి సరికొత్త శైలిని ఎంచుకున్నామనీ, రైతుమిత్ర విధానంతో కనీస మద్దతు ధరలు పెంచి, రైతుల రుణ సౌకర్యం పెంచామని, గ్రామీ ణాభివృద్ధి, రహదారులు, విద్యుత్తు కోసం పెద్ద పీట వేశామని కూడా ప్రధాని ఏకరువు పెట్టారు. యూపీఏ-1 గ్రామీణ అవసరాలకు నిజమైన మద్దతు ఇచ్చిందనడంలో సందేహం లేదు. అంతకు ముందు 2004 వరకు అధికా రంలో ఉన్న ఎన్డీఏ గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యానికి గురిచే సిందనడానికీ సందేహించనక్కరలేదు. ఇండియా షైనింగ్ అనేదే ఓ డొల్ల నినాదం. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.పట్టణాభివృద్ధి, పట్టణ నిర్మాణాలు, ఐటీ పరిశ్రమ వంటి వాటికే ఎన్డీయే ప్రాముఖ్యం ఇచ్చింది. 2004 ఎన్నికల తరువాత రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టాయి. గ్రామీణ అభివృద్ధే లక్ష్యంగా రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూనే రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న ప్రయో గాలు చేసింది. చెప్పుకోదగ్గ ప్రగతినే సాధించింది. రెండో అంకమంతా హుళక్కి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ వ్యవసాయ కూలీలకు అది బతుకు దెరువు కాగలిగిందని చెప్పారు. వారికి దీని ద్వారా విద్య, ఆరోగ్యం చేరువ కావడంతో పాటు, బేరమాడగల శక్తి పెంచిందని వివరించారు. అయితే ఇక్కడ చర్చకు రావల సిన ఒక ముఖ్యమైన అంశం ఉంది. అది- యూపీఏ రెండవ అంకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణాభి వృద్ధిని కొనసాగించనే లేదు. ఇది నిజం. జులై 2013లో విడుదల చేసిన ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు 1993-94లో 40.37 కోట్లు ఉండగా, 2004-05లో 40.71కు పెరిగారు. అదే 2011-12 లో 26.93 కోట్లకు తగ్గినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 2004-05 నుం చి 2011-12 వరకు 13.8 కోట్ల ప్రజలు దారిద్య్రరేఖను దాటినట్టు చెప్పే ప్రణాళికా సంఘం గణాంకాలను ఉటంకిస్తూ ప్రధాని, 2004 నుంచి 2011 మధ్య సుమారు 14 కోట్ల మంది దారిద్య్రరేఖను అధిగమించగా, దీనికి ముందు దశాబ్దంలో 1993 నుంచి 2004 వరకు దారి ద్య్రరేఖను కొద్ది మంది కూడా దాటలేకపోయిన సంగతిని గుర్తించాలని చెప్పారు. ఇది తమ ప్రభుత్వ విధానాలతోనే సాధ్యమైందని చెప్పడం ప్రధాని ఉద్దేశం. ఆత్మస్తుతికే మొగ్గు మహాత్మాగాంధీ గ్రామీణ భద్రత చట్టం ద్వారా గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు లాభం జరి గింది. అయితే ఈ చట్టం అనేక ప్రాంతాల్లో దుర్వినియో గానికి లోనయిందని విమర్శలూ ఉన్నాయి. కేవలం అటవీ లేక ఉద్యాన సంబంధిత పనులకు, అదైనా 2 లేక 3 సంవత్సరాలకు పరిమితమైన ఈ చట్టాన్ని విస్తృతం చేయా లనీ, వ్యవసాయానికి అనుసంధానించాలనీ వినిపిస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టిందన్న విమర్శలను ప్రధాని ప్రస్తావించలేదు. సాధించిన ప్రగతిని చాటుకోవడానికే ప్రధాని ఎక్కువ సమయాన్ని కేటాయిం చారు. ప్రభుత్వ తప్పిదాల మీద అడిగిన ప్రశ్నలకు మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. అవినీతి, కుంభ కోణాల గురించి కూడా ఆయన అదే ధోరణి చూపించారు. రైతులు, గ్రామీణ ప్రజానీకానికి యూపీఏ ప్రభుత్వం తొలి అంకంలో పెద్దపీట వేసిందని ఘనంగా చెప్పారు ప్రధాని మన్మోహన్సింగ్. యూపీఏ రెండవ అంకంలో తలెత్తినట్టు చెప్పే గ్రామీణ జీవితాలు, చిన్న, సన్నకారు అన్నదాతల సమ స్యల మీద వచ్చిన ప్రశ్నలకు ప్రధాని ఎటువంటి సమా ధానం ఇవ్వలేదు. కనీస మద్దతు ధరలు తమ ప్రభుత్వం గణనీయంగా పెంచిందని చెప్పుకొచ్చారు. కానీ, ఆ లబ్ధి దళారుల పరమవుతున్న వాస్తవం ప్రధాని నోటి వెంట రాలేదు. గిట్టుబాటు ధరలు లేక, అప్పులు తీర్చలేక రైతు లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలకు రైతులు సర్వస్వం కోల్పోయిన వాస్తవం కూడా ప్రధానికి తెలియనిది కాదు. చరిత్ర మీదే నమ్మకం ప్రతిపక్షానికి రాజకీయ స్వప్రయోజనాలు తప్ప సహేతుక విధానమంటూ లేదని మన్మోహన్ విమర్శించినా, తమ హయాంలో అక్రమాలు జరగలేదని మాత్రం తాను చెప్ప డం లేదని ప్రధాని అంగీకరించక తప్పలేదు. మీడియా ప్రతిపక్షం వలలో పడిపోతుందని కూడా ప్రధాని నింద మోపారు. ప్రభుత్వ అక్రమాల మీద మీడియా వక్ర భాష్యం దాని ఫలితమేనని ఆయన అభిప్రాయం. మన్మో హన్‌సింగ్ తమ అభిప్రాయాలను, యూపీఏ విజయా లను స్ఫుటంగా వినిపించాలని తన వంతు కృషి చేశారు. కానీ అందులో సఫలం కాలేదనే అనిపిస్తుంది. ఆ మాట లన్నీ భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పినట్టే ఉన్నాయి. అయినా చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా మరోసారి అధికారంలోకి రాగల మన్న నమ్మకం కూడా ఆయన మాటలలో ధ్వనించలేదు. ఇవాళ్టి మీడియా కన్నా చరిత్ర తన మీద ఎక్కువ కనిక రంగా ఉంటుందని ఆయన విశ్వాసం. చరిత్ర ఏమి చేస్తుందో వేచి చూద్దాం! -
సేద్యంతోనే దేశ భవిత సాధ్యం
నేటి యువత వ్యవసాయాన్ని ఒక ఉపాధిగా చూడటం మాట అటుంచి, అన్నదాత దీనావస్థను దృష్టిలో ఉంచుకుని కాబోలు, ఆ వైపు చూడ్డానికి కూడా సాహసిం చడంలేదు. మరోవైపు వ్యవసాయం ఏ మాత్రం లాభసాటి కాదనీ, ఇంకా నమ్ముకుంటే జీవితాలు కునారిల్లి పోతాయనీ రైతాంగం కూడా నిర్ధారణకు వచ్చేసిన సమయం ఇది. ఇంకా, వ్యవసాయం తప్ప ఏ ఇతర వృత్తి అయినా ఫరవాలే దనే భావనను పిల్లలకు కలిగిస్తున్నారు. వ్యవసాయదారు లకు సాంఘిక మర్యాద లోపించిందన్న అభిప్రాయమూ ఉంది. ఈ పరిణామం రాబోయే తరాల మీద ప్రభావం చూపించి, భయానక సాంఘిక సమస్యగా మారుతుంది. వ్యవసాయాన్ని గాడిలో పెడితే మంచి అవకాశాలను కల్పించడమేకాక, సాంఘిక స్థాయిని తెచ్చిపెట్టే వ్యవస్థ కాగలదు. చేయవలసినదల్లా యువతను ఈ రంగం వైపు తిరిగి ఆకర్షింపచేయడానికి కావలసిన వనరులను అందు బాటులోకి తీసుకురావడమే. ఆధునిక యాంత్రీకరణతో ఎద్దులూ, దున్నపోతులతో దున్నవలసిన అవసరం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటోడ్చనక్కర లేదు. మంచి వ్యవసాయవేత్త అధిక ఫలసాయం పొందడా నికి అతి తక్కువ ప్రయాసతో, ముందస్తు సాంకేతిక సల హాలతో ప్రణాళికలు తయారు చేసుకుంటాడు. ట్రాక్టర్ దగ్గర నుంచి... ట్రాక్టర్ ప్రవేశంతో 20వ శతాబ్దపు వ్యవసాయంలో నిజమై న యాంత్రీకరణ మొదలైంది. చైన్ రంపాలు, ట్రిమ్మర్ల దగ్గర నుంచి ఎన్నో అధునాతన యంత్రాలు ప్రపంచ వ్యాప్తంగా పొలాలలో ప్రవేశించాయి. ఆధునిక యుగంలో కంప్యూటర్‌తో పనిచేసే యంత్రాలు, గ్లోబల్ పొజిషనిం గ్‌తో పర్యవేక్షించగల వ్యవస్థలు, మానవ ప్రమేయం లేకుండా సమర్థంగా పనులు చేపట్టగల వ్యవస్థలు వచ్చా యి. నానో టెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్ల ద్వారా పూర్వం సాధ్యపడని అనేక పంటల్లో హైబ్రిడ్ విధానాలను అనుసంధానం చేసుకుంటూ పంటల అభివృద్ధి జరుగు తోంది. ఆరోగ్య సమస్యలు అధికమైన నేపథ్యంలో సేంద్రీ య పంటలు, కూరగాయలు, పండ్లకు గిరాకీ పెరిగింది. శాస్త్రీయ పురోగమనంతో పర్యావరణ అనుకూల ఎరు వులు, చీడపీడల నివారణ మందులు, హార్మోనులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫుడ్ ప్రోసెసింగ్, రేడియేషన్ లేకుండా చేపట్టగలిగే సశాస్త్రీయ పద్ధతులు వచ్చాయి. జన్యుమార్పిడి ద్వారా చీడపీడలను తట్టుకునే సామర్థ్యం తోపాటు, పోషక విలువలు అధికంగా ఉన్న వంగడాల రూపకల్పన వంటి అధునాతన పద్ధతులు వాడుకలోకి వచ్చాయి. ప్రస్తుత సాంకేతికయుగంలో కూడా అధిక పాలను ఉత్పత్తి చేసే హైబ్రిడ్ పాడి పశువులు అందుబాటు లోకి వచ్చాయి. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గాడిలో పెట్టా లన్నా, ఆహార, ఆర్థిక భద్రతలకు ప్రమాదం సంభవించ కుండా అరికట్టాలన్నా యువత తక్షణం వ్యవసాయం వైపు చూడాలి. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దినదినా భివృద్ధి చెందుతున్న తరుణమిది. ఈ తరుణంలో కాస్త చదువు లేకుండా వ్యవసాయం చేయడం, అందులో కొన సాగడం కష్టం. కానీ, ఆధునిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని, వాడుకలోకి తీసుకొచ్చి, లాభపడగల ధైర్యం, తెగువ ఈనాటి చదువుకున్న యువతలో ఉన్నాయి. చదువుకున్న యువరైతుకు సామాజిక హోదాతో పాటు, తన మీద తనకు నమ్మకం ఉంటుంది. సామాజిక గుర్తింపు తనకున్న అధికారాలను ఉపయోగించుకునే చొరవను ఇస్తుంది. హక్కులను సాధించుకునే స్థాయి లభిస్తుంది. మోసానికి గురికాడు. పంటకు రావలసిన ధరను వసూలు చేసుకోగల ధైర్యం లభిస్తుంది. ఆహార భద్రత కోసం నిజమైన ఆహార భద్రత సాధ్యం కావాలంటే వ్యవసాయం లో యువత మళ్లీ కీలకపాత్ర పోషించాలి. ప్రస్తుతం వయో భారంతో ఉన్న రైతులే ప్రధానంగా వ్యవసాయం చేస్తు న్నారు. కానీ ప్రస్తుత తరుణంలో యువతను వ్యవ సాయం వైపు మరల్చడం, ప్రేరేపించడం అంత సులభం కాదు. కానీ,ప్రపంచ పరిణామాలు చూశాక అనేక రం గాల్లో అపారమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్న మన యువ తను ఆ వైపుగా నడిపించే లక్ష్యాన్ని సుసాధ్యం చేయవచ్చు నని అనిపిస్తుంది. మొదట ఉన్నత పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో వ్యవసాయం మీద అవగాహన కల్పించాలి. అమెరికాలో ఉన్నత పాఠశాల స్థాయిలోనే వ్యవసాయ పరి జ్ఞానాన్ని పాఠ్యాంశంగా బోధించడం ఎప్పుడో ఆరంభ మైంది. ఇటువంటి ప్రయోగాలతో ఆ దేశం యువతలో భావోద్వేగాలను రేకెత్తించి, వ్యవసాయోత్పత్తుల పెంపును సాధించారు. యువతను వ్యవసాయ రంగంలో సుస్థిరత తో, అంకితభావంతో ఉండేటట్టు చేయగలుగుతున్నారు. పాఠ్యాంశంగా సేద్యం ఉన్నత పాఠశాల స్థాయిలోనే వ్యవసాయం గురించి బోధించి అభివృద్ధి చెందిన దేశాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. విస్కాన్సన్ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రయోగాల గురించిన ప్రత్యేక వ్యవసాయ పాఠ్యాంశాల సంపుటిని అమెరికా వెలువరించింది. ప్రత్యేక సిబ్బందిని నియమించి పాఠాలను దేశమంతా బోధించే ఏర్పాటు కూడా ఆ దేశం చేసింది. ఇదంతా ఆషామాషీగా జరగ లేదు. ఉన్నత పాఠశాలల కోసం రూపొందించిన సుస్థిర వ్యవసాయ విద్యాబోధనల మీద మొదట అయోవా స్టేట్ యూనివర్సిటీలో లోతైన అధ్యయనం జరిపారు. ఆపై అమలు గురించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అధ్యయ నంతో విలువైన ఫలితాలను కూడా సాధించారు. వ్యవసా యాభివృద్ధికి కావలసిన ఐదు అంశాల్లో సుస్థిర వ్యవ సాయ విధానం ముఖ్యమైనదిగా అమెరికా పౌరులు భావి స్తున్నారని ఈ అధ్యయనంతో తెలిసింది. ఇప్పుడున్న అన్న దాతలతో పాటు వ్యవసాయం మీద ఆధారపడిన ఇతరు లకు కూడా ఈ రంగం లాభసాటి కాగలదని ఆ అధ్యయ నంలో తేలింది. ఇక్కడా ప్రారంభం కావాలి ఇక్కడ ఉన్నత పాఠశాల పాఠ్యాంశాలలో వ్యవసాయం అనే అంశానికి ఆచరణ యోగ్యమైన పాఠ్యాంశాలు, అభ్యా సాలు లేవు. కాబట్టి ప్రభుత్వాలు చొరవ చూపించి అలాం టి పాఠ్యాంశాలను నిపుణులతో తయారు చేయించి చేర్చా లి. మన ఆహారం ఎక్కడ నుంచి వస్తుందో కూడా తెలి యని పరిస్థితుల్లో ఉన్న మన యువతను, వైట్ కాలర్ చదువు, ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్న యువతను తట్టి లేపడం జాతీయ ప్రయోజనాల రీత్యా అత్యవసరం. వ్యవసాయం గురించి చెప్పే పాఠ్యాంశాలు కొన్ని విద్యాల యాల్లో ఐచ్ఛికాంశాలే. అది కూడా నిరాసక్తంగా బోధిస్తు న్నారు. కానీ వాటినే ప్రధానమైన పాఠ్యాంశాలుగా మార్చి, సాహసోపేతమైన వాణిజ్య అంశాలను, అపారమైన పారి శ్రామిక అవకాశాలను గురించి విద్యార్థులకు బోధించాలి. నిజానికి ఇదంతా ఈపాటికే జరిగి ఉండాలి. సుస్థిర వ్యవసాయ విధానాలకు నాంది పలికి విద్యార్థి లోకాన్ని ఆ వైపుగా నడిపించి ఉండాలి. ఇప్పటికైనా వ్యవసాయం పట్ల అగమ్యగోచరంలో కొట్టుమిట్టాడుతున్న సమాజంలో ఉత్సాహాన్ని కలిగించేలా యువరక్తాన్ని కదిలించాలి. వ్యవ సాయమంటే ప్రాణికోటికి ఆహారం అందించే వ్యవస్థగా, ఐటీ, ఉత్పత్తి రంగాలను మించి ఆదాయాన్ని ఇవ్వగల పరి శ్రమగా చూడగలిగేలా చేయాలి. దీనికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఇది సాధ్యమేనని ప్రపంచ దేశాలు చాటి చెప్పాయి. ఇందులో సఫలమైన పారిశ్రామికవేత్త లను, విద్యార్థులను ఒకచోట చేర్చాలి. విజయగాథలపై చర్చించేటట్టు చేయాలి. కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్‌లో ఉన్న నైపుణ్యాలను తమ వృత్తికి కావలసిన విధంగా మలుచు కునేలా యువతను తీర్చిదిద్దడం కష్టమైన పనేమీ కాదు. ఏ విధంగా చూసినా... మన యువత అత్యధిక శాతం ఆకలి, పేదరికం, అనారో గ్యం, అవిద్య వంటి సమస్యలతో వారి శక్తి సామర్థ్యాలను వినియోగించుకోలేకపోతున్నది. చిన్నాచితకా ఉద్యోగాల వేటలో పడి అవి కూడా దొరకని సందర్భాల్లో కొంత మం ది నేరాలకు పాల్పడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలో యువత తమకు సవాలుగా ఉన్న వ్యవసాయం లాంటి రంగాల్లో ప్రభుత్వ సహకారం, విధానాల మార్పుల ద్వారా తమ కలలను సాకారం చేసుకోగలరు. మరో ఏడేళ్లలో దేశ జనా భాలో 64 శాతం యువతరమే ఉంటుంది. ఈ అంశాన్ని పాలకులు గుర్తిస్తే దేశానికి, దాని ఆర్థిక ఆరోగ్యానికి నిజ మైన వాతావరణాన్ని సృష్టించిన వారవుతారు. - డా॥బలిజేపల్లి శరత్‌బాబు ప్రధాన శాస్త్రవేత్త నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ హైదరాబాద్ -
ప్రకృతి కక్ష... ప్రభుత్వ ఉపేక్ష
2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల సమయంలో కొన్ని జిల్లాలలో కొందరికి కంటితుడువుగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం మినహా, తాము వేసిన అంచనాల ప్రకారమైనా రైతులకు నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పం టలు సర్వం నాశనమైపోయా యి. వరి, పత్తి, మిరప, అరటి ఒకటేమిటి అన్ని పంటలూ వర్ష బీభత్సానికి నేలకొరిగాయి. వర దల పాలైనాయి. వారం రోజుల కుండపోత వర్షాలతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆరు లక్షల హెక్టార్లకుపైగా పంట నీటి మునిగింది. తెలంగాణ ప్రాం తం లోనూ పంటల మీద దాని ప్రభావం ఉంది. పత్తితో పాటు వరి, మొక్కజొన్న, చెరకు, కంది పంటలు నష్టానికి గురయ్యాయి. మంచి వర్షాలతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అసాధారణ దిగుబడులు ఇవ్వగల దని ఎదురు చూస్తున్న తెలుగు రైతు ఆశలు మొత్తంగా అడియాసలయ్యాయి. సాధారణంగా రాష్ట్ర ఆహార ఉత్ప త్తులు సాలీనా రెండు సీజన్లలో 1.90 నుంచి 2 లక్షల మెట్రి క్ టన్నుల వరకు ఉంటాయి. గత ఏడాది ఈ ఉత్పత్తులు 1.98 మెట్రిక్ టన్నులు. కోస్తాలో శ్రీకాకుళం నుంచి నెల్లూ రు జిల్లా వరకు అన్నిరకాల పంటలు విపరీతమైన నష్టానికి లోనయ్యాయి. రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదు కుంటుందని ప్రకటనలు వచ్చినా ఇప్పటి వరకు ఏమీ జర గలేదు. బీమా పరిష్కారాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు అందజేస్తామని ప్రభుత్వం చెప్పు కొస్తున్నా ఆ మాటలను అన్నదాతలు నమ్మే స్థితి లేదు. రైతు గుండె చెరువు సర్వం కోల్పోయిన రైతులు తీవ్ర నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక ఉదాహరణ: కృష్ణాజిల్లా క్రోసూరు మండలం నుంచి 36 ఏళ్ల పత్తి రైతు తలారి పెద్దినారా యణ విషం తాగి మరణించాడు. ఈ రైతు సీజన్లో పడిన మంచి వర్షాలతో తన పత్తి పంట మీద అపారమైన నమ్మ కం పెట్టుకున్నాడు. తన 4 ఎకరాల కౌలు భూమిలో పం డిన తెల్ల బంగారంతో వెతలు తీరగలవనుకున్న తరుణం లో అకాల వర్షాలు పంటను ముంచాయి. మాచర్ల మం డలం, కల్వగుంట రైతు ఉడుముల సీతారామిరెడ్డి తన 6 ఎకరాల కౌలు భూమిలో ఏపుకి వచ్చిన పత్తి, మిరప పం టలు పూర్తిగా నీట మునిగిపోగా నిస్సహాయ స్థితిలో విషం తాగి, ప్రాణం వదిలాడు. నల్లగొండ, మహబూబ్‌నగర్, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా ఆత్మహత్యల ఘోష విన బడింది. తనకున్న పొలాన్నంతా అమ్ముకుని పత్తి సాగులో పెట్టిన నల్లగొండ వాసి మల్లేష్ అనే రైతుదీ ఇలాంటి కథే. మల్లేష్లు, పెద్ది నారాయణలు, సీతారామిరెడ్డిలు పదుల సంఖ్యలోనే ఉండవచ్చు. సర్వం కోల్పోయి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినా, పంటి బిగువున బతుకీడు స్తూ, ప్రత్యామ్నాయ చర్యలైనా ఆదుకుంటాయేమోనని ఎదురు చూస్తున్నవారు వేలల్లో ఉన్నారు. కరీంనగర్ జిల్లా, లక్ష్మీపురం గ్రామవాసి ముక్కిన కేసవరెడ్డి, తూర్పు గోదా వరి జిల్లా పాటిచెరువు రైతు ఒకరు, ప్రకాశం జిల్లా వాసి షేక్ మౌలాలి, మహబూబ్‌నగర్ వాసులు సత్యనారా యణగౌడ్, ర్యాపని మల్లయ్య, నల్లగొండ జిల్లా వాసులు రెడ్డిమాను లెవన్, అవిలి మల్లయ్య, వరంగల్ జిల్లా మహిళా రైతు ఉప్పలమ్మ, పశ్చిమగోదావరి జిల్లా వాసి బల్లెం సుబ్బారావు ఇటువంటి వెతలతోనే ఇటీవల తను వులు చాలించారు. అవే వెతలు అవే అప్పుల రక్కసి కోర లను ఏంచేసి తప్పించుకోవాలో తెలియక దీపావళి రోజున కూడా ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. కళ్లుండీ చూడలేని సర్కార్ 2009లో రాజశేఖరరెడ్డి మరణం తరువాత, రాష్ట్ర ప్రభు త్వం ప్రకృతి విపత్తుల సమయంలో కొన్ని జిల్లాలలో కొందరికి కంటితుడువుగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం మినహా, తాము వేసిన అంచనాల ప్రకారమైనా రైతులకు నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. వివిధ ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీల బకాయిలు జిల్లాల వారీగా గణాంకాలు చూస్తే ఎందుకిలా చేస్తున్నారో తల బద్దలు కొట్టుకున్నా అర్థమవదు. విజయనగరం జిల్లాలో చెల్లించవలసిన 92.86 కోట్లు అతి తక్కువగాను అనంతపురంలో చెల్లించవలసిన 31,708.04 లక్షలు అత్యంత అధికంగాను, మొత్తం 69,722.40 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బకాయిలు చూస్తుంటే రైతులు ఎంత మోసానికి గురౌతున్నారో అర్థమవుతుంది. 2010, 2011 సంవత్సరాల కరువు సంబంధిత నష్టపరిహారాలను ఇంత వరకు చెల్లించలేదు. కిందటి ఏడాది నీలం తుపాను తాకిడికి సుమారు రూ.1,600 కోట్ల నష్ట జరిగినట్లు సర్కా రు అంచనా వేసినా అందులో రైతులకు చెల్లించవలసిందే ఎక్కువ ఉందన్న సంగతి నిజం. నాలుగేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపుల చరిత్ర ఇంత ఘనంగా ఉన్నా, ముఖ్య మంత్రి తాజాగా నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సి డీ అందజేస్తామని చెప్పడం రైతులను పరిహసించడాని కేనా? తీర ప్రాంతాల్లోని తుపాను పీడిత వ్యవసాయ క్షేత్రా లను దర్శించిన మెగా నాయకులు ఇన్పుట్స్ సడ్సిడీని హెక్టారుకు పదివేలకు తగ్గకుండా రైతులకు చెల్లించేటట్టు చూస్తామని, రాష్ట్రానికి అత్యధికంగా సాయం అందించేం దుకు కేంద్ర ప్రభుత్వాన్ని తామే స్వయంగా అర్థిస్తామని చెప్పడం ఇంకా వింత. జన్మలో ఇతరులకు సాయం చేసే ఆలోచన లేని ఇటువంటి నాయకులు అన్నదాతలను మభ్యపెడుతున్నారనే చెప్పుకోవాలి. సర్వం కోల్పోయిన రైతు టీవీ చానెళ్లలో వచ్చిన వాగ్దానాలను నమ్ముతాడని అనుకుంటే పొరపాటు. కారణాలు ఏవైనా వ్యాపారులతో పాటు ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తుంటే బక్క రైతుకు దిక్కెవరు? వినియోగదారుడికీ బాధ్యత ఉరుముల్లేని పిడుగుల్లా తాకుతున్న ధరాఘాతాలతో విని యోగదారులు భయభ్రాంతులవుతున్న సమయంలో దేశంలో వ్యవసాయం ఎలా సాగుతుందో ఆ భగవంతునికి కూడా అంతుబట్టేటట్టు లేదు. ఇక్కడ సామాన్య ప్రజలు, అంటే వినియోగదారులైన మనందరం విజ్ఞత ప్రదర్శిం చాలి. కూరగాయలు, ఉల్లిగడ్డల ధర రూ.50 నుంచి రూ.100 వరకు చెలరేగినా మారు మాట్లాడకుండా కొను గోలు చేస్తున్నాం. ఆ ధరల్లో సింహభాగం న్యాయంగా ఉత్పత్తిదారుడైన రైతుకు చెందాలి. కానీ 10 శాతం కూడా చెందడం లేదు. ఈ పరిణామం గురించి అతి తక్కువ మంది ప్రశ్నిస్తున్నారు, తాము చెల్లించే విలువలో ఏ మాత్రం రైతుకు చెందుతున్నదనే అవగాహన వినియోగ దారునికి లేదు. రాజకీయ నాయకులు తాము వినియోగ దారుల ప్రయోజనాల పరిరక్షణ పేరిట అటు వినియోగదా రుడినీ ఇటు రైతునీ కూడా మోసగిస్తున్నారు. కష్టంగానో నష్టంగానో ధరాఘాతాన్ని భరిస్తున్న వినియోగదారుడు, ఆ విలువలో సింహభాగం రైతుకు చెందేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే సంతోషిస్తాడు. అన్నదాతలు తమ కుటుంబాలతో సహా రక్తమాంసాలను వెచ్చిస్తుంటే, వ్యాపారులు, దళారులు ఫోన్ల ముందు కూర్చుని ఆ ప్రతి ఫలాన్ని వారికి చెందకుండా చేస్తుంటే మన వ్యవస్థ తమాషా చూడటం ఈ నాటిది కాదు. ఏ హక్కూలేని రైతాంగం ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రభుత్వం దిగి వచ్చి, చర్చలు జరుపుతుంది. విద్యార్థులు సమస్యల మీద నడుం బిగిస్తే బుజ్జగిస్తుంది. అదే రైతుల విషయంలో మధ్యవర్తులు, ప్రజా సంఘాలు లేదా సాంఘిక కార్యకర్తలు మాత్రమే మాట్లాడతారు. వారికై వారుగా నేరుగా ప్రభుత్వంతో సంప్రదించే పరిస్థితులే లేవు. మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా కూడా అన్యాయాలను ప్రశ్నించలేని బడుగు రైతులే 90 శాతం పైగా ఉన్నారు. రైతులు తాము పండిం చిన పంటలకు గిట్టుబాటు ధరలు పొందే అవకాశం, హక్కు స్వరాజ్యం వచ్చి 66 ఏళ్లు దాటినా ఇప్పటికీ లేదు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా దక్కకుండా చేయగల దళారీ వ్యవస్థ ఈ దేశంలో మాత్రమే ఉండటం రైతుకు పెద్ద శాపం. అక్షరానికి చేరువ కావాలి ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా రైతు సమస్యలకు పరి ష్కారాలు కనుగొనలేకపోవడానికి కారణాలు ఈ వ్యవస్థ లోనే ఉన్నాయి. రైతుకు వాటిల్లుతున్న నష్టాల మీద, అన్యా యాల మీద అనేక వర్గాల ప్రజలు, విద్యావంతులకే అవ గాహన కొరవడిన ప్రస్తుత సమయంలో సామాన్య ప్రజా నీకానికి ఈ అంశం మీద సామాజిక స్పృహ కలిగి ఉండ టం అసాధ్యం. అందుకే అన్నదాతలు విద్యావంతులు కావాలి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని సంఘటి తంగా తామే ప్రశ్నించనంత కాలం తమ హక్కులను సాధించుకోవడం అంత సులభం కాదు. సమాజానికి కూడా తామే ఒక ఉత్ప్రేరకం కావాలంటే తమను తాము ఉత్తేజపరచుకోవాలి. అప్పడే సమాజం స్పందిస్తుంది. చర్చ ఉద్భవిస్తుంది. తద్వారా సంస్కరణలూ పరిష్కారా లూ వెలువడతాయి, ఆత్మహత్యలు ఆగిపోగలవు. అన్నిం టికన్నా ముఖ్యంగా వ్యవసాయం రాజశేఖరరెడ్డి కోరుకు న్నట్లుగా ఒక పండుగవుతుంది. అటువంటి పండుగ రోజు లు మన రైతుకు త్వరలోనే రావాలని కోరుకుందాం. -డా॥బలిజేపల్లి శరత్‌బాబు, ప్రధాన శాస్త్రవేత్త, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, హైదరాబాద్ -
‘పతనం’ వెతలు తరగని కతలు
20 నుంచి 25 ఏళ్లలో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఈ ప్రభావం విదేశీ చదువుల కోసం వెళ్లే వాళ్లపైనే కాక మన దేశంలోనే ఉండి పెద్ద చదువులు చదువుకునే వాళ్ల మీదా పడుతోంది. ప్రస్తుత ప్రభుత్వం చేతులారా అనండి లేదా చేతులుడిగిన పరిస్థితుల ద్వారా అనండి... ఎంత సులభంగా అయితే ఈ పరిస్థితిలోకి తీసుకురాగలిగిందో నిర్ణయాత్మక దృక్పథం ఉంటే అంతే సులభంగా మనందరినీ బయటకు లాగగలదు. టోకు ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణం అంచనా వేస్తారు. ఆహార పదార్థాల్లో అత్యధికంగా పెరుగుదల సంభవించడంతో ఆగస్టు చివరకు 5.75 నుంచి 6.10 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగింది. ఇటీవలి ఒక పోల్ ప్రకారం ద్రవ్యోల్బణం 5.8 శాతంగా అంచనా వేశారు. శరవే గంగా పెరిగిన కూరగాయలు, ఆహార పదార్థాల ధరలతో ఆగస్టులో టోకు ధరల సూచీ తీవ్రంగా నష్టపోయింది. దాంతో జూలైలో 11.91 శాతంగా ఉన్న సూచి ఆగస్టులో 18.18 శాతానికి ఎగబాకింది. కానీ తయారీ పదార్థాలు, వస్తువుల ధరల్లో వృద్ధి కేవలం 2 శాతంకన్నా తక్కువగా నమోదైంది. కోర్ ద్రవ్యోల్బణంలో విశేషమైన మార్పులు జరగనప్పటికీ ఆహార పదార్థాల్లో ఏర్పడ్డ ద్రవ్యోల్బణంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు సంక్షోభంలో పడిపోయా రు. ఈ వర్గాలు తమ సంపాదనలో 50 శాతానికి పైగా ఆహారం సమకూర్చుకునేందుకే ఖర్చు చేస్తాయి. నిలకడ లేని రూపాయి విలువతో, అధిక శాతం మధ్యతరగతి జీవన సరళిలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. తగ్గిన రూపాయి విలువ వల్ల దేశం అధికంగా దిగుమతి చేసుకుం టున్న రసాయన ఎరువులు, ఖనిజాలు, వంటనూనెల వం టి వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ వస్తువులన్నీ మధ్య తరగతి వర్గాల రోజు వారీ వినియోగంలో లేకపో యినా, వాటి ధరల పెరుగుదల దేశ ఆర్థిక సమతుల్యాన్ని దెబ్బతీయగలవు. తరుగుతున్న రూపాయి, దిగుమతుల ధరలను పెంచుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం ప్రభావిత మవుతుంది. సగటు జీవితాలపై మోతమోగుతుంది. పెరిగిపోతున్న ఇంధన ధరలు, దిగజారిపోతున్న రూపా యితో పెరిగిన రవాణా ఖర్చులతో దిక్కుతోచని పరిస్థి తులు నెలకొన్నాయి. పాతాళానికి పరుగులు మూడు మాసాలుగా రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో, ముఖ్యంగా అమెరికా డాలరుతో పోల్చు కున్నప్పుడు పాతాళానికి పడిపోవడం ఇప్పటికీ కలవర పెడుతూనే ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో కొద్దిగా స్థిమితపడి డాలరు ఒకటికి 63 నుంచి 65 రూపాయల వరకు ఊగిసలాడుతూ ఉందే కాని ఒక స్థిరమైన నిష్పత్తికి చేరలేదు. అయితే మన ఆర్థికమ్రంతి చిదంబరం మాత్రం ఎప్పటిలాగానే దిగులు పడవలసిన అవసరం లేదని చెప్ప డమే వింత. మన రూపాయి విలువను తగ్గించి చూపెడు తున్నారనీ సెలవిస్తున్నారు. ఇన్ని రోజులు కుంగిపోతూ బతుకు బండి లాగుతున్న సగటు నిరుపేద, మధ్యతరగతి ప్రజానీకానికి తమ బతుకుతెరువు మీద తిరిగి నమ్మకం కలిగించే చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఇటువంటి ప్రకటనలతో అర్థమయింది. రూపాయి విలువ పతనంతో కేవలం ఎగుమతులు దిగుమతులు ప్రభావిత మవుతాయని ఒకప్పటి భావన. ఇప్పటి ప్రపంచీకరణ నేపథ్యంలో అది అందరి దైనందిన జీవితాలను ప్రభా వితం చేస్తుందని చెప్పుకోకతప్పదు. దశాబ్దం క్రితం నెల జీతం 2,200 రూపాయలతో ఇంటి బడ్జెట్ వేసుకునే వీలుండేది. చిన్న చిన్న సవరణలతో మర్యాద కోల్పోని జీవనం కొనసాగించే వాళ్లం. ప్రస్తుతం ఆకాశాన్నం టుతోన్న ధరలు ఒకవైపు, విపరీతంగా తగ్గిపోతున్న డబ్బు విలువ మరోవైపు పేద, మధ్య తరగతి ప్రజలను అడుగు వేయడానికి వీల్లేని స్థితికి తెచ్చాయి. ఎంత వ్యత్యాసం? ఒకప్పుడు కళాశాలలు వందల్లోనే ఉన్నా, తక్కువ శిక్షణ రుసుంతో మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేవి, తద్వారా చదువులు సునాయాసంగా పూర్తి చేయ గలిగేవారు. స్కూళ్ల ఫీజులు కాలేజీలకన్నా కొంత ప్రియ మే అయినా ఇప్పటి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం వెచ్చిస్తున్న అర్థరహితమైన రుసుములతో పోల్చిన ప్పుడు అత్యంత అల్పమైనవేనని చెప్పాలి. చదువుకునే వాళ్ల సంఖ్య అనేక వందల రెట్లు పెరగడంతోపాటు చదు వుల రుసుములు కూడా నక్షత్రాలను తాకాయి. దీంతో ప్రభుత్వం అణగారిన వర్గాలకు విద్యావకాశాలు కలుగజే స్తున్నప్పటికీ ఐటీ, వైద్యం వంటి వృత్తి విద్యలు మధ్య తర గతి, పేద వర్గాలకు కలగానే మిగిలిపోతున్నాయి. 20 నుం చి 25 ఏళ్లలో రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. పైచదువులు సామాన్యులకు అందని ద్రాక్షగా మారడానికి ఇదీ ఒక కారణమే. ఈ ప్రభావం విదేశీ చదువుల కోసం వెళ్లే వాళ్లపైనే కాక దేశంలోనే ఉండి పెద్ద చదువులు చదువుకునే వాళ్ల మీదా పడుతోంది. ప్రభు త్వవైద్యశాలల్లో, కుటుంబ వైద్యుల ద్వారా చౌకగా ఆరోగ్య రక్షణ అందుబాటులో ఉండేది. ప్రస్తుతం కుటుంబ ఆరో గ్యానికి వెచ్చించవలసిన మొత్తాలు పెరిగాయి. స్పెషలి స్టులు, స్టార్ ఆస్పత్రులకు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సొంతింటి సాధన ప్రతి సామాన్య మానవుడికీ నెరవేరని కలే. భూమి విలువ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేదనేది సర్వవిదితం. ఒకప్పు డు ఇండిపెండెంట్ ఇల్లు సంపాదించడంకన్నా ఒక అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడం సులువైనదిగా భావించారు. రోజు రోజుకూ పెరుగుతున్న నెలసరి చెల్లింపుల భారంతో అపార్టుమెంట్లూ అందుబాటులో లేకుండాపోయాయి. వెసులుబాటు తాత్కాలికం ఇటీవల అమెరికన్ డాలరుతో రూపాయి విలువ 67 నుం చి 68 రూపాయల దాకా పడిపోయి, స్థిరంగా లేనప్పటికీ కొంత తేరుకుంది. అయితే ఇది తాత్కాలికమేనని నిపు ణులు చెబుతున్నారు. విద్యా, సాంకేతిక, ఆర్థిక రంగాలలో అమెరికాతో సంబంధాలు పెరిగిన తరుణంలో, అక్కడి ద్రవ్యోల్బణం, డాలరు కొనుగోలు శక్తి ఆధారంగా ప్రజా జీవనశైలిపై ఒక అంచనాకు ఇప్పుడే రావడం సంద ర్భోచితం కాదు. ఇక్కడ ద్రవ్యోల్బణం సుమారుగా 10 శాతంగా ఉంటే అమెరికాలో 2 శాతానికి మించదు. పైగా అప్పుడప్పుడు ప్రతి ద్రవ్యోల్బణం కనిపిస్తుంటుంది. ద్రవ్యోల్బణం మూలంగా మన దేశంలో ధరలు రోజు రోజుకు కొండెక్కుతుంటే రూపాయి కొనుగోలుశక్తి తగ్గుతూ వస్తున్నది. కానీ భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి దశలోనే ఉన్నా, రానున్న దశాబ్దం లేదా ఆపైన కూడా ద్రవ్యోల్బణం నుంచి తప్పించుకునే అవకాశం తక్కువే. అమెరికాలో సీజన్, సమయం, అమ్మకాల ఆధారంగా మంచి కంపెనీల ద్వారా తయారైన బట్టలు తక్కువ ధరలకే లభ్యమవుతాయి. ఆహార పదార్థాలు కూడా మన దేశంతో పోల్చుకుంటే తక్కువ ధరలకే లభిస్తాయి. ముందుంది ముసళ్ల పండగ రూపాయి పతనం ఇలాగే కొనసాగినట్లయితే విదేశీ పెట్టు బడులు కుంటుపడతాయి. తద్వారా అభివృద్ధికి కావలసిన పెట్టుబడులు, నిజమైన పెట్టుబడుల మధ్య అంతరం ఏర్ప డుతుంది. ఈ పరిస్థితి సత్వరమే కాకపోయినా మున్ముం దు ఎదుర్కోవలసివస్తుంది. దీంతో ఆర్థికమాద్యంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కోల్పోయే ప్రమా దాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో తప్పని అధిక దిగుమతుల వల్ల డాలరు డిమాండ్ అధికమవడం సహజమే. మన రిజర్వు బ్యాంకు ఈ మధ్య కాలంలో రూపాయి పతనాన్ని నిరోధించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఫలితం మాత్రం శూన్యం. గత్యంతరం లేక రిజర్వు బ్యాంకుకు రెపోరేటును పెంచడం అనివార్యమవుతుంది. దీని అర్థం బ్యాంకులు ఈ వృద్ధిని ఖాతాదారులకు పంపిణీ చేయ డమే! తద్వారా అన్ని రకాల రుణాలపై భారీగా వడ్డీ రేట్లు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితిలో రిజర్వు బ్యాంకు రూపా యి ప్రతికూల సెంటిమెంట్‌ను దూరం చేయడానికి చేయ గలిగింది పెద్దగా ఏమీ లేదు. ప్రభుత్వ పెద్దలు మేల్కోవాలి ప్రభుత్వ సారథ్యం వహించే వారు, ఆర్థికవ్యవస్థను నియంత్రించేవారు కొన్ని చర్యలకైనా ఉపక్రమించాలని ఆర్థిక వ్యవస్థ గురించి కొద్దిపాటి అవగాహన ఉన్న ఎవ రైనా చెప్పవచ్చు. కొంత కష్టమే అయినా విచక్షణా రహి తంగా రాజకీయమే ధ్యేయంగా వెలువడే సంక్షేమ ప్రక టనలను అరికట్టాలి. తద్వారా ఆర్థిక లోటును కొంత వరకు సవరించుకునే అవకాశం కలుగుతుంది. ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం చేతు లారా అనండి లేదా చేతులుడిగిన పరిస్థితుల ద్వారా అనండి... ఎంత సులభంగా అయితే ఈ పరిస్థితిలోకి తీసు కురాగలిగిందో నిర్ణయాత్మక దృక్పథం ఉంటే అంతే సుల భంగా మనందరినీ బయటకు లాగగలదు.