మాటా మోహనం కాదు | Manmohan singh fails to present UPA victories | Sakshi
Sakshi News home page

మాటా మోహనం కాదు

Published Fri, Jan 10 2014 4:20 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

మాటా మోహనం కాదు - Sakshi

మాటా మోహనం కాదు

విశ్లేషణ: మన్మోహన్‌సింగ్ తన అభిప్రాయాలనూ, యూపీయే విజయాలనూ స్ఫుటంగా వినిపించాలని కృషి చేశారు. కానీ అందులో సఫలం కాలేదనే అనిపిస్తుంది. ఆ మాటలన్నీ భవిష్యత్తులో చేయబోయే ప్రభుత్వ ఏర్పాటును దృష్టిలో ఉంచుకుని చెప్పినట్టే ఉన్నాయి.
 
 మన్మోహన్‌సింగ్ ప్రధాని పద వి చేపట్టి పదేళ్లవుతోంది. ఈ కాలంలో మూడుసార్లు మాత్ర మే ఆయన విలేకరులతో మాట్లా డారు. జనవరి 3 నాటి సమా వేశమే మూడోదీ, బహుశా ఆఖ రిది కూడా. ఏ ప్రభుత్వాధి నేతైనా లోటుపాట్లను లేవనెత్త కుండా, కేవలం సాధించిన ప్రగ తి గురించి చెప్పుకుంటాడు. మన్మోహన్‌సింగ్ చేసిందీ అదే. కుంభకోణాలు, అవినీతి, ఆర్థిక, ఆహార ద్రవ్యోల్బ ణం లాంటి వైఫల్యాలను ఒక వైపు ఒప్పుకుంటూనే తమ ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి వివరించడానికి ఆయన శతధా ప్రయత్నం చేశారు.
 
 బాధ్యత రాష్ట్రాలదేనట
 ద్రవ్యోల్బణం లేదా అధిక ధరల ద్వారా రైతులు లాభ పడ్డారనీ, రాబోయేవి దేశానికి చాలా మంచి రోజులని ప్రధాని అభివర్ణించారు. ద్రవ్యోల్బణం మీద వచ్చిన భయాలు న్యాయమైనవేనని అంటూనే, అధిక శాతం ప్రజల ఆదాయం ద్రవ్యోల్బణం కన్నా అధికంగానూ, వేగంగానూ పెరిగిందని భాష్యం చెప్పారు. యూపీఏ ప్రభుత్వం సమ్మిళిత వృద్ధి విధానాలతో అధిక మొత్తాలను బలహీన వర్గాలకు అందించడం వల్ల ధరల భారానికి వారు గురి కాలేదని అభిప్రాయపడ్డారు. ఆహార ద్రవ్యోల్బ ణానికి కారణ ం సరఫరా తక్కువ కావడమేనని పరోక్షంగా అంగీకరించారు.

 

ధరలను నియంత్రించవలసిన అవసరం ఉందని ఆయనా ఒప్పుకున్నారు. కానీ అది రాష్ట్రాల బాధ్యత అని వాటి మీదకు తోసేశారు. భారత్ ఆర్థికంగా ఎదుగుతున్న దేశమే. కానీ చైనా వంటి దేశంతో పోల్చు కుంటే ఇటీవలి మన ఆర్థికాభివృద్ధి కుంటుపడిన సంగతి తెలుస్తుంది. వృద్ధి రేటు గడచిన 2012-13లో కేవలం 5 శాతంగా నమోదైంది. దీనిని ప్రధాని భౌగోళిక అంశాలతో ముడిపెట్టారు. యూపీఏ మొదటి అంకంలో మొట్టమొ దటిసారిగా 9 శాతం అభివృద్ధి సాధ్యమైందని గుర్తుకు తెచ్చుకున్నారు. తరువాత తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షో భంతో గత రెండేళ్ల నుంచీ ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో మాంద్యం చోటు చేసుకున్న సంగతి కూడా ఆయన చెప్పారు. దీనితో వచ్చిన ఒడిదుడుకులకు భారత్‌కూ మిన హాయింపులేదని ఆయన అభిప్రాయం.
 
 సంస్కరణల ఫలితాల ఊసేది?
 కేవల ఆర్థిక ఎదుగుదలతోనే తృప్తి పడిపోకుండా, సమ్మి ళిత వృద్ధి విధానాలకూ శ్రీకారం చుట్టామని ప్రధాని వివ రించారు. అధికారంలో ఉన్నంత కాలం ఆర్థిక సంస్క రణలు కొనసాగిస్తూ, వాటికే ప్రాముఖ్యం ఇస్తూ వీలైనన్ని ప్రోత్సాహక చర్యలు చేపడతామనీ చెప్పారాయన. ఇబ్బం దులు ఉన్నప్పటికీ సంస్కరణలను అమలు చేయవలసిం దేనని ఆయన కోరిక. సంస్కరణల ద్వారానే ఆర్థికాభి వృద్ధి, వాణిజ్య వ్యవస్థలకు చేయూత, ఉద్యోగ అవకా శాలు, పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలు, పిల్లలకు భద్రత సాధ్యం కాగలవని ప్రధాని మన్మోహన్ ప్రగాఢ నమ్మకం. కానీ సంస్కరణల అమలు ద్వారా సాధించిన ప్రగతి, ఉద్యోగాల లభ్యతలు ఎంతో ఆయన చెప్పలేదు. ప్రభుత్వం మీద వచ్చిన ప్రతికూల తలో సంస్కరణల పాత్ర ఏమిటో కూడా బయట పెట్టలేక పోయారు. పెట్రో ఉత్పత్తుల మీద పూర్తిగాను, వంట గ్యాస్ మీద గణనీయంగాను సబ్సిడీ తొలగించడంతో పేద, మధ్య తరగతి వర్గాల్లో ఏర్పడుతున్న అభద్రత స్థాయిని ప్రధాని గమనించలేకపోయారని ఆయన మాట లతో అర్థమవుతుంది. ఈ సబ్సిడీల ఎత్తివేత సంస్క రణలలో భాగమే మరి. పెట్రోలియం ఉత్పత్తుల మీద ప్రభుత్వ నియంత్రణ నామమాత్రం కావడంతో పెట్రో లియం కంపెనీలు తరుచు ధరల పెంపునకు తెగబడు తున్నాయి. దీనితో నిత్యావసరాల ధరలు ఊహకందని రీతిలో ప్రభావితమవుతున్నాయి. ఈ పరిణామంతో పేద, మధ్య తరగతి వర్గాల ఆర్థిక ప్రణాళికలు ఎంతగా కకావి కలవుతున్నాయో ప్రభుత్వానికి పట్టడం లేదన్న విమర్శను ప్రధాని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు.
 
 తొలి అంకం సరే...
 ఈ పదేళ్ల కాలంలో గ్రామీణాభివృద్ధికి సరికొత్త శైలిని ఎంచుకున్నామనీ, రైతుమిత్ర విధానంతో కనీస మద్దతు ధరలు పెంచి, రైతుల రుణ సౌకర్యం పెంచామని, గ్రామీ ణాభివృద్ధి, రహదారులు, విద్యుత్తు కోసం పెద్ద పీట వేశామని కూడా ప్రధాని ఏకరువు పెట్టారు. యూపీఏ-1 గ్రామీణ అవసరాలకు నిజమైన మద్దతు ఇచ్చిందనడంలో సందేహం లేదు. అంతకు ముందు 2004 వరకు అధికా రంలో ఉన్న ఎన్డీఏ గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యానికి గురిచే సిందనడానికీ సందేహించనక్కరలేదు. ఇండియా షైనింగ్ అనేదే ఓ డొల్ల నినాదం. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.పట్టణాభివృద్ధి, పట్టణ నిర్మాణాలు, ఐటీ పరిశ్రమ వంటి వాటికే ఎన్డీయే ప్రాముఖ్యం ఇచ్చింది. 2004 ఎన్నికల తరువాత రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టాయి. గ్రామీణ అభివృద్ధే లక్ష్యంగా రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూనే రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న ప్రయో గాలు చేసింది. చెప్పుకోదగ్గ ప్రగతినే సాధించింది.
 
 రెండో అంకమంతా హుళక్కి
 మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ వ్యవసాయ కూలీలకు అది బతుకు దెరువు కాగలిగిందని చెప్పారు. వారికి దీని ద్వారా విద్య, ఆరోగ్యం చేరువ కావడంతో పాటు, బేరమాడగల శక్తి పెంచిందని వివరించారు. అయితే ఇక్కడ చర్చకు రావల సిన ఒక ముఖ్యమైన అంశం ఉంది. అది- యూపీఏ రెండవ అంకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణాభి వృద్ధిని కొనసాగించనే లేదు. ఇది నిజం.
 
 జులై 2013లో విడుదల చేసిన ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు 1993-94లో 40.37 కోట్లు ఉండగా, 2004-05లో 40.71కు పెరిగారు. అదే 2011-12 లో 26.93 కోట్లకు తగ్గినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 2004-05 నుం చి 2011-12 వరకు 13.8 కోట్ల ప్రజలు దారిద్య్రరేఖను దాటినట్టు చెప్పే ప్రణాళికా సంఘం గణాంకాలను ఉటంకిస్తూ ప్రధాని, 2004 నుంచి 2011 మధ్య సుమారు 14 కోట్ల మంది దారిద్య్రరేఖను అధిగమించగా, దీనికి ముందు దశాబ్దంలో 1993 నుంచి 2004 వరకు దారి ద్య్రరేఖను కొద్ది మంది కూడా దాటలేకపోయిన సంగతిని గుర్తించాలని చెప్పారు. ఇది తమ ప్రభుత్వ విధానాలతోనే సాధ్యమైందని చెప్పడం ప్రధాని ఉద్దేశం.
 
 ఆత్మస్తుతికే మొగ్గు
 మహాత్మాగాంధీ గ్రామీణ భద్రత చట్టం ద్వారా గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు లాభం జరి గింది. అయితే ఈ చట్టం అనేక ప్రాంతాల్లో దుర్వినియో గానికి లోనయిందని విమర్శలూ ఉన్నాయి. కేవలం అటవీ లేక ఉద్యాన సంబంధిత పనులకు, అదైనా 2 లేక 3 సంవత్సరాలకు పరిమితమైన ఈ చట్టాన్ని విస్తృతం చేయా లనీ, వ్యవసాయానికి అనుసంధానించాలనీ వినిపిస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టిందన్న విమర్శలను ప్రధాని ప్రస్తావించలేదు. సాధించిన ప్రగతిని చాటుకోవడానికే ప్రధాని ఎక్కువ సమయాన్ని కేటాయిం చారు. ప్రభుత్వ తప్పిదాల మీద అడిగిన ప్రశ్నలకు మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. అవినీతి, కుంభ కోణాల గురించి కూడా ఆయన అదే ధోరణి చూపించారు. రైతులు, గ్రామీణ ప్రజానీకానికి యూపీఏ ప్రభుత్వం తొలి అంకంలో పెద్దపీట వేసిందని ఘనంగా చెప్పారు ప్రధాని మన్మోహన్‌సింగ్.
 
 యూపీఏ రెండవ అంకంలో తలెత్తినట్టు చెప్పే గ్రామీణ జీవితాలు, చిన్న, సన్నకారు అన్నదాతల సమ స్యల మీద వచ్చిన ప్రశ్నలకు ప్రధాని ఎటువంటి సమా ధానం ఇవ్వలేదు. కనీస మద్దతు ధరలు తమ ప్రభుత్వం గణనీయంగా పెంచిందని చెప్పుకొచ్చారు. కానీ, ఆ లబ్ధి దళారుల పరమవుతున్న వాస్తవం ప్రధాని నోటి వెంట రాలేదు. గిట్టుబాటు ధరలు లేక, అప్పులు తీర్చలేక రైతు లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలకు రైతులు సర్వస్వం కోల్పోయిన వాస్తవం కూడా ప్రధానికి తెలియనిది కాదు.
 
 చరిత్ర మీదే నమ్మకం
 ప్రతిపక్షానికి రాజకీయ స్వప్రయోజనాలు తప్ప సహేతుక విధానమంటూ లేదని మన్మోహన్ విమర్శించినా, తమ హయాంలో అక్రమాలు జరగలేదని మాత్రం తాను చెప్ప డం లేదని ప్రధాని అంగీకరించక తప్పలేదు. మీడియా ప్రతిపక్షం వలలో పడిపోతుందని కూడా ప్రధాని నింద మోపారు. ప్రభుత్వ అక్రమాల మీద మీడియా వక్ర భాష్యం దాని ఫలితమేనని ఆయన అభిప్రాయం. మన్మో హన్‌సింగ్ తమ అభిప్రాయాలను, యూపీఏ విజయా లను స్ఫుటంగా వినిపించాలని తన వంతు కృషి చేశారు. కానీ అందులో సఫలం కాలేదనే అనిపిస్తుంది. ఆ మాట లన్నీ భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్పినట్టే ఉన్నాయి. అయినా చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా మరోసారి అధికారంలోకి రాగల మన్న నమ్మకం కూడా ఆయన మాటలలో ధ్వనించలేదు. ఇవాళ్టి మీడియా కన్నా చరిత్ర తన మీద ఎక్కువ కనిక రంగా ఉంటుందని ఆయన విశ్వాసం. చరిత్ర ఏమి చేస్తుందో వేచి చూద్దాం!   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement