
సాక్షి, తిరువొత్తియూరు : ఉన్నత చదువుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విరక్తి చెందిన ఓ విద్యార్థిని బంధువైన మహిళా ఎస్‌ఐ ఇంట్లో మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరూర్, పశుపతి పాళయంలో సాయుధ దళం పోలీసు క్వార్టర్స్ ఉంది. ఈ క్వార్టర్సులో ఎస్‌ఐ రాజేశ్వరి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రాజేశ్వరి ఇంటిలో ఆమె బంధువు అరవంకురిచ్చి మేట్టుపుదూర్ ప్రాంతానికి చెందిన రామలింగం కుమార్తె నవీనా (22) ఉంటుంది. అక్కడే ప్రైవేటు కళాశాలలో బీఏ చదువుతోంది. నవీన ఉన్నత చదువులు చదవాలని కోరుతున్నట్టు తెలిసింది.
ఆమె తండ్రి ఇందుకు తిరస్కరించి వివాహం చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో ఆవేదన చెందిన విద్యార్థిని మంగళవారం రాత్రి ఎస్‌ఐ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పశుపతి పాళయం పోలీసులు కేసు నమోదు చేసి నవీనా మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment