‘ఇప్పుడే నాకు పెళ్లొద్దు.. ఉన్నతస్థాయి చదువులు పూర్తి చేయాలని ఉంది’ అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది.
నల్లగొండ జిల్లాలో పోలీసులను ఆశ్రయించిన ఓ యువతి
తిరుమలగిరి: ‘ఇప్పుడే నాకు పెళ్లొద్దు.. ఉన్నతస్థాయి చదువులు పూర్తి చేయాలని ఉంది’ అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం ఈటూరుకు చెందిన బోడ సోమయ్య, అబ్బసాయమ్మ కూతురు లలిత ఈ ఏడాది డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది.
ఇటీవల మండలంలోని మామిడిపల్లికి చెందిన ఓ యువకుడితో లలితకు వివాహం జరిపించాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో లలిత శుక్రవారం తిరుమలగిరి పోలీసులను ఆశ్రయించింది. ఏఎస్‌ఐ లచ్చయ్య యువతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి చదువు పూర్తయిన తరువాత వివాహం జరిపించాలని సూచించారు.