‘ఉన్నత’ పాఠాలు ఇక సమున్నతం | New curriculum in degree courses | Sakshi
Sakshi News home page

‘ఉన్నత’ పాఠాలు ఇక సమున్నతం

Published Wed, Oct 30 2019 4:58 AM | Last Updated on Wed, Oct 30 2019 8:49 AM

New curriculum in degree courses - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని మరింత పటిష్టపర్చి.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఆయా కోర్సుల్లోని పాఠ్యాంశాలకు మరింత పదునుపెడుతోంది. అన్ని రంగాల్లో మార్పులు శరవేగంగా జరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా యువతనూ సిద్ధం చేసేలా పలు డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలకు కొత్త రూపునిచ్చింది. నిపుణుల కమిటీ సూచనలతో కొత్త అంశాలను ప్రకటించింది. ఆయా కోర్సుల్లో చదివే వారికి భవిష్యత్తులో ఏయే నైపుణ్యాలు అలవడాలి, కోర్సుల లక్ష్యం ఏమిటన్న వాటిని ముందుగానే నిర్దేశించుకుని ఆ ఫలితాలు వచ్చేలా పాఠ్యాంశాలను కూర్చి.. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్యప్రణాళిక’లు విడుదల చేసింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచే కొత్త పాఠ్యాంశాలు అమల్లోకి తెస్తోంది. 

మహత్తర లక్ష్యం
విద్యార్థుల్లో నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంచి వారు చదువులు ముగించి విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చేసరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా కోర్సులను తీర్చిదిద్దింది. ఉన్నత విద్య పూర్తిచేసిన యువత సమాజాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా కోర్సుల సిలబస్‌లలో మార్పులు చేసింది. గత ఏడాది జూలై 26 నుంచి మూడు రోజుల పాటు దేశంలోని అన్ని యూనివర్సిటీల ఉప కులపతులతో ఉన్నత విద్యాకోర్సుల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై యూజీసీ జాతీయస్థాయి సదస్సు నిర్వహించింది. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలను డిగ్రీ స్థాయిలో అమలు చేయించాలని ఈ సదస్సులో తీర్మానించారు. పాఠ్య ప్రణాళికలను, మెరుగైన విధానాలను ప్రవేశపెట్టేలా సబ్జెక్టుల వారీగా నిపుణులతో కమిటీలను నియమించి కసరత్తు చేయించింది. ఈ కమిటీలు జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చా గోషు్టలు నిర్వహించి, పలు వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులను యూజీసీకి నివేదించాయి. 

వెబ్‌సైట్‌లో పాఠ్య ప్రణాళికలు 
నిపుణుల కమిటీలిచ్చిన నివేదికల ఆధారంగా యూజీసీ పలు డిగ్రీకోర్సుల్లో అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలు విడుదల చేసింది. ఫిజిక్స్, ఇంగ్లి‹Ù, మేథమేటిక్స్, బోటనీ, ఆంథ్రోపాలజీ, హ్యూమన్‌ రైట్స్, క్రిమినాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్‌ కోర్సులకు సంబంధించిన కొత్త పాఠ్య ప్రణాళికలను యూజీసీ ప్రకటించింది. తాజాగా ఎల్రక్టానిక్‌ సైన్స్, హిందీ, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ అంశాలపై పాఠ్యప్రణాళికలను తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. వీటిని‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీసీ.ఏసీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో యూనివర్సిటీలు సందర్శించవచ్చని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్‌ రజనీష్‌ జైన్‌ ఒక వెబ్‌ నోట్‌ విడుదల చేశారు. అభ్యాస ఫలిత ఆధారిత పాఠ్య ప్రణాళికలను అనుసరించి ఆయా వర్సిటీలు తమ పాఠ్యాంశాలను సవరించుకోవాలని యూనివర్సిటీల ఉప కులపతులకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికను ‘ఎల్‌ఓసీఎఫ్‌యూజీసీఎట్‌దరేటాఫ్‌జీమెయిల్‌.కామ్‌’కు లేదా ‘నీతుతులసీ.యూజీసీ.జీఓవీ.ఐఎన్‌’కు మెయిల్‌ చేయాలని సూచించింది. 

వర్సిటీలలో సబ్జెక్టుల వారీగా సమీక్షలు 
యూజీసీ ప్రకటించిన ‘లెర్నింగ్‌ అవుట్‌ కమ్‌ బేస్డ్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌ వర్క్‌’ను అనుసరించి రాష్ట్రంలోని ఆయా సబ్జెక్టుల పాఠ్యాంశాలపై సమీక్ష జరిగేలా చర్యలు చేపడుతున్నాం. మన రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో పలు సంస్కరణల దిశగా ఉన్నత విద్యామండలి ద్వారా ముందుకు వెళ్తున్నాం. వీటిపై నిపుణుల కమిటీని నియమించాం. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నాం. విద్యార్థులు తమకు నచి్చన కోర్సులు చేస్తూనే.. మరికొన్ని కోర్సులను ఇతర విద్యాసంస్థల ద్వారా అభ్యసించేలా కొత్త విధానాలకు శ్రీకారం చుట్టనున్నాం. 
– ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement