పరిశ్రమలకు ‘పని’కొచ్చే చదువు | Industries 'work' receive education | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు ‘పని’కొచ్చే చదువు

Published Thu, Oct 8 2015 12:33 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM

పరిశ్రమలకు ‘పని’కొచ్చే చదువు - Sakshi

పరిశ్రమలకు ‘పని’కొచ్చే చదువు

సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో పరిశ్రమల అనుసంధాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడమే ధ్యేయంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దేశీయ ఉత్పత్తి రంగాల్లో నైపుణ్యాలు కలిగిన యువత అవసరం ఎక్కువగా ఉన్నందున, దానికి అనుగుణంగా విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల సిలబస్‌ను మార్చాలని నిర్ణయించింది.

నైపుణ్యాలు కలిగిన మానవ నవరులను అందించాలంటే యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అనుసంధానం అవసరమని గుర్తించింది. ఇందుకోసం విశ్వ విద్యాలయాల్లో యూనివర్సిటీ-పరిశ్రమల అంతర్గత అనుసంధాన కేంద్రాలను(యూనివర్సిటీ-ఇండస్ట్రీ ఇంటర్-లింకేజీ సెంటర్స్) ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు జూలై 27న జరిగిన కమిషన్ సమావేశంలో మార్గదర్శకాలను ఆమోదించింది. మార్గదర్శకాల్లోని వివిధ అంశాలు, విశ్వవిద్యాలయాల్లో యూఐఎల్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై మరిన్ని సలహాలు, సూచన లను స్వీకరిస్తోంది.

త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఈ పథకాన్ని అమలు చేసే యూనివర్సిటీలకు యూజీసీ నిధులను ఇవ్వనుంది. రెండేళ్లపాటు(12వ పంచవర్ష ప్రణాళిక ముగిసే వరకు) యూజీసీ సహకారం అందిస్తామని పేర్కొంది. ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునే యూనివర్సిటీలు యూజీసీకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను యూజీసీ నిపుణుల కమిటీ పరిశీలించి యూఐఎల్ కేంద్రాలను మంజూరు చేస్తుంది.
 
 పరిశ్రమలు ఏం చేస్తాయంటే..

 
  పరిశ్రమలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలి.
  నైపుణ్యాల పెంపునకు సహకరించాలి.
  పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వాలి.
  ప్రత్యేక విభాగాలు, నిర్వహణలో సహకారం అందించాలి.
  పరిశోధనల్లో భాగస్వామ్యం కల్పించాలి. స్కాలర్‌షిప్‌లు అందజేయాలి.
  యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహకారం అందించాలి.
 
 యూఐఎల్ కేంద్రాలు
ఏం చేయాలంటే...
  విద్యార్థుల్లో విజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధికి పక్కా చర్యలు చేపట్టేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
  అకడమిక్ కార్యక్రమాలను నిర్ణయించాలి.
  అత్యున్నత విద్యార్హత లు కలిగిన ఫ్యాకల్టీని నియమించాలి.
  నాణ్యమైన పరిశోధనలకు పెద్దపీట వేయాలి.
  నైపుణ్యాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు పరిశ్రమలతో సంప్రదించి ఒప్పందాలు చేసుకోవాలి.
  పరిశ్రమల అవసరాల మేరకు సిలబస్, బోధనలో మార్పులు చేయాలి.
  ఉపాధి అవకాశాలు లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి.  
  పరిశ్రమల సందర్శన, శిక్షణలు, స్టైపెండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ నిర్వహించాలి.
  సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించే చర్యలు చేపట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement