వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొక్కు నరేష్ అనే విద్యార్థి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2015 (నెట్)లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మంగళవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో తెలుగు విభాగంలో 350 మార్కులకు గాను 234 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు.
నరేష్ ఒకటి నుంచి 10వ తరగతి వరకు నల్లపురెడ్డిపల్లిలో.. ఇంటర్, డిగ్రీ పులివెందుల బీకేఆర్‌ఎం కళాశాలలో చదివాడు. తిరుపతి ఓరియంటల్ పీజీ కళాశాలలో ఎంఏ తెలుగు పూర్తి చేశాడు. గ్రామీణ నేపథ్యం, తెలుగు భాష పట్ల ఉన్న అభిమానమే తనను ఈ ర్యాంకు సాధించేలా చేసిందన్న నరేష్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు రెండు సార్లు, నెట్‌లో ఇప్పటి వరకు నాలుగు సార్లు అర్హత సాధించడం విశేషం. తల్లిదండ్రులు కె. నరసింహులు, లక్ష్మీదేవిలు వ్యవసాయం చేసుకుంటూ నరేష్ విద్యాభ్యాసానికి సంపూర్ణ సహకారం అందించారు.
నెట్లో పులివెందుల విద్యార్థికి టాప్ ర్యాంక్
Published Thu, Oct 1 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement
Advertisement