నెట్ దరఖాస్తులు ఈనెల 17 నుంచి తీసుకునేందుకు సీబీఎస్‌ఈ చర్యలు చేపట్టింది
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ప్రధాన అర్హతగా పరిగణనలోకి తీసుకునే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్) దరఖాస్తులు ఈనెల 17 నుంచి తీసుకునేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) చర్యలు చేపట్టింది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ఫారాల్లో ఏమైనా తప్పులు దొర్లితే వచ్చే నెల 22 నుంచి 29 వరకు సవరించుకోవచ్చని పేర్కొంది. పరీక్షను 2017 జనవరి 22న నిర్వహించనున్నట్లు వివరించింది.