బహుళ ప్రయోజనాల.. నెట్ | Central Board of Secondary Education | Sakshi
Sakshi News home page

బహుళ ప్రయోజనాల.. నెట్

Published Thu, Oct 23 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

బహుళ ప్రయోజనాల.. నెట్

బహుళ ప్రయోజనాల.. నెట్

 ఈసారి నెట్ నిర్వహణలో కీలకమైన మార్పు.. యూజీసీ తరపున పరీక్షను ఈసారి నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పర్య వేక్షిస్తుంది.  ఇది తప్ప ఎటువంటి మార్పులు లేవు. నెట్ పరీక్షను ఈ సారి 79 ప్రధాన సబ్జెక్ట్‌లలో నిర్వహించనున్నారు.  
 
 ఆబ్జెక్టివ్‌గా:
 రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మూడు పేపర్లు.. పేపర్-1, 2, 3గా ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి.

 వివరాలు..
 పేపర్    మార్కులు    పశ్నలు    సమయం
 1    100    60 ప్రశ్నల్లో 50 సాధించాలి     75 ని.
 2    100    50 ప్రశ్నలను సాధించాలి     75 ని.
 3     150    75 ప్రశ్నలను సాధించాలి     150 ని.
 
 అర్హత మార్కులు:
 పేపర్లు, కేటగిరీల వారీగా వేర్వేరు అర్హత మార్కులను నిర్ణయించారు. ప్రతి పేపర్‌లో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన వారిని మాత్రమే తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. వివరాలు..
 కేటగిరీ    పేపర్-1    పేపర్-2    పేపర్-3
 జనరల్    40    40    75
 బీసీ    35    35    60
 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ     35    35    60
 
 ప్రయోజనాలు:
 నెట్‌లో అర్హత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్‌స్టిట్యూట్‌లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్/ సెట్ క్వాలిఫై అయి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు.. ఐదేళ్లపాటు ఫెలోషిప్ లభిస్తుంది. ఐఐటీ/ఐఐఎస్‌సీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి.. పరిగణించే అర్హతల్లో నెట్/
 జేఆర్‌ఎఫ్ అర్హతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు.
 
 ప్రిపరేషన్
 పేపర్-1: ఈ పేపర్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. దీని కోసం మెథడాలజీ, కాంప్రెహెన్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్ట్ పరిజ్ఞానం బాగా ఉన్న అభ్యర్థులు పేపర్-1పై దృష్టి పెట్టాలి. ఇందులోని 60 ప్రశ్నలలో 50 ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. గమనించాల్సిన అంశం.. అభ్యర్థులు 50 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే..మొదట ప్రయత్నించిన 50 ప్రశ్నలనే మూల్యాంకన చేస్తారు. కాబట్టి సమాధానం కచ్చితంగా తెలిసిన ప్రశ్నలనే ఎంచుకోవాలి.
 
 పేపర్-2, పేపర్-3:
 ఇవి సబ్జెక్ట్ పేపర్లే అయినప్పటికీ ప్రశ్నల క్లిష్టత స్థాయి పెరుగుతుంది. దీన్ని గుర్తించి తదనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. గత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుని ఏయే ఆధ్యాయాలకు ఎంత వెయిటేజీ ఉంటుందో గమనించి ఆ మేరకు ప్రిపరేషన్ సాగించాలి. ఒక్కొక్క అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నప్పుడే సంబంధిత అంశంపై మాక్‌టెస్ట్‌లు రాయడం ఉపయోగకరం. మాక్‌టెస్ట్‌లకు హాజరుకావడం వల్ల వేగంగా సమాధానాన్ని గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది.
 
 డిస్క్రిప్టివ్ ఓరియెంటేషన్‌తో:
 పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించనున్నప్పటికీ విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ ఓరియెంటేషన్‌తో సాగించాలి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఏ ఒక్క అంశాన్నీ విస్మరించకుండా విస్తృత స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. అప్పుడే సబ్జెక్ట్‌లో ఎంత లోతైన ప్రశ్న అడిగినా సమాధానం గుర్తించడం సాధ్యం. నెట్‌లో కనీస అర్హత మార్కులను నిర్ణయించినప్పటికీ..60 నుంచి 70 శాతం మార్కులు పొందే దిశగా కృషి చేయాలి.
 
 సెట్-నెట్:
 ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) నోటిఫికేషన్ వెలువడింది. కాబట్టి సెట్ కు సమాంతరంగా నెట్ ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే నిర్వహించే సంస్థలు వేర్వేరు తప్ప మిగతా అంశాలన్నీ దాదాపు నెట్,సెట్ విషయంలో ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా నెట్ తర్వాత సెట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్ ప్రిపరేషన్ సెట్ కూడా ఉపయోగపడుతుంది.
 
 నోటిఫికేషన్ సమాచారం
 అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు) మాస్టర్ డిగ్రీ లేదా తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్: 28 సంవత్సరాలు (డిసెంబర్ 1, 2014 నాటికి).  లెక్చరర్‌షిప్‌నకు ఎటువంటి వయోపరిమితి లేదు.
 
 రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్-రూ.450, బీసీ- రూ. 225 (నాన్‌క్రీ మిలేయర్), ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ- రూ.110. ఫీజును చలాన్ రూపంలో చెల్లించాలి.
 
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. దీంతోపాటు బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నిర్దేశించిన విధంగా కో-ఆర్డినేటింగ్ యూనివర్సిటీలకు పంపాలి.
 ఆన్‌లైన్ దరఖాస్తు, చలాన్ తీసుకునేందుకు చివరి తేదీ: నవంబర్ 15, 2014.
 
 చలాన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:

 నవంబర్ 18, 2014.
 దరఖాస్తు, అటెండెంట్ స్లిప్, అడ్మిట్ కార్డు ప్రింట్
 తీసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 19, 2014.
 కో-ఆర్డినేటింగ్ యూనివర్సిటీలో ప్రింట్ అవుట్ దరఖాస్తు, సంబంధిత సర్టిఫికెట్ల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 25, 2014.
 పరీక్ష తేదీ: డిసెంబర్ 28, 2014.
 వెబ్‌సైట్: http://cbsenet.nic.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement