
అవార్డులు ఇలా ఇస్తారట బాసూ!
ఇపుడు దేశంలో ఎక్కడ చూసినా సినిమా అవార్డుల సీజన్ నడుస్తోంది. ఇటీవలి సినీ అవార్డులతో ఈ ఫీవర్ మరింత హీటెక్కింది. అయితే అవార్డులను సొంతం చేసుకున్నవారు సంతోషంతో పొంగిపోవడం.. రాని వారు నిరాశతో విచారపడటం మామూలే. అలాగే ఆశపడి భంగపడిన వారు విమర్శలు గుప్పించడం తెలిసిందే. విశ్వసనీయత లోపించిందనీ, అర్హత లేని వారికి అవార్డులను కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొన్ని సంస్థలు సన్మానాలు చేస్తాం... బిరుదులు, అవార్దులు ఇస్తామంటూ వెంటపడి వేధిస్తారని అనేక కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
సరిగ్గా ఇలాంటి ఫీలింగ్స్ను, క్యాచ్ చేసిన కొంతమంది యువకులు ఇలాంటి కథనంతో ఉన్న ఒక వీడియోను నెట్లో పోస్ట్ చేశారు. కొన్ని సన్మానాలు, అవార్డుల తీరు తెన్నులు, వాటి కోసం తాపత్రయపడేవాళ్ల సంఘాలు, కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలపై వ్యంగ్యంగా ఈ వీడియోను రూపొందించారు. అటు చక్కని హాస్యంతో పాటు..పదునైన మాటల మేళవించిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నటీనటుల వ్యవహారాలు, గాసిప్లు, వాటిపై మీడియా ధోరణులపై సెటైరికల్గా సాగే ఈ వీడియో ఆసక్తికరంగా మారింది. నిజమైన ప్రతిభా, పాటవాలకు ఆదరణ లభించాలంటున్న ఈ వీడియో చూస్తే ఎవరైనా నవ్వి తీరాల్సిందే.. నిజం.. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.