
వలకు చిక్కిన వింత చేపలు
మధిర రూరల్ : మత్స్యకారుల వలలకు వింత చేపలు చిక్కాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మధిర సమీపంలోని వైరా నది, రాయపట్నం, మధిర, చెరువుల సమీపంలోని కల్వర్టుల వద్ద మత్స్యకారులు, కొందరు యువకులు వలలు, గాలాలతో చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో రాయపట్నం సమీపంలోని చెరువు వద్ద యువకులు పెట్టిన వలలకు వింత చేపలు చిక్కాయి. వాటిని మధిరకు చెందిన సతీష్ గమనించి ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ చేపలు చాలా గట్టిగా.. రకరకాల చారలు కలిగి ఉన్నట్లు తెలిపాడు. వీటిని చూసేందుకు పలువురు పోటీపడ్డారు.