అచ్యుతాపురం (విశాఖ జిల్లా) : వేట సమయంలో గుండెపోటు రావడంతో ఓ మత్స్యకారుడు సముద్రంలోనే హఠాన్మరణం చెందాడు. విశాఖ జిల్లా పూడిమడకకు చెందిన వాసుపల్లి నూకరాజు (40) తోటి మత్స్యకారులతో కలసి వేటకు వెళ్లాడు. గుండెపాటు రావడంతో పడవలోనే కుప్పకూలిపోయాడు. దీంతో తోటి మత్స్యకారులు మంగళవారం పూడిమడక తీరానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.