achutapuram
-
‘భూత్’ బంగ్లా సర్కార్!
మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్ర బాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే! ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొలకెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తు న్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేక పోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి.దేశంలోని ప్రస్తుత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఫోర్–ఓ (4.0) వెర్షన్. పదిహేనేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్‌లైన్‌తో తిరిగారు. ఇంతటి అనుభవశాలి ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షో భానికి లోనవుతున్నవి. విజ్ఞత విలుప్తమైపోతున్నది. ఆయన జనంలోకి వెళితే ఈయన జ్వరపీడితుడవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది.విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సంద ర్భాన్నే తీసుకుందాము. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి.మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయా లంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవు తారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొల కెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తున్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. రెండున్నర మాసాల్లోనే ‘95 మోడల్’ చూపెట్టిన చిన్న ఝలక్ మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం.పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేట్ గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. అందుకే ‘రైతు భరోసా’ ఆగిపోయింది. ‘విద్యా దీవెన’, ‘విద్యా కానుక’లు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్లాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసు కున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేదల బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఈ ’95 మోడల్ వచ్చీరాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్‌ను అటకెక్కించారు. ఇంగ్లిషు మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.పేదలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన ‘95 మోడల్’ భూతంగా పరిగణిస్తున్నది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకనూ దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్ చేయడం, దుష్ప్రచారానికి ఒడి గట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 1848లో కార్ల్ మార్క్స్ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ‘యూరోప్‌ను కమ్యూనిస్టు భూతం వెంటాడుతున్నది’ అనే వాక్యంతో ప్రారంభమైంది. కమ్యూనిస్టు భావజాలాన్ని భూతంగా భావించే నాటి పాలక ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికగా మార్క్స్ ఈ వాక్యాన్ని రాశారు.ఇప్పుడూ అంతే! ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బయ్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణ గారిన జీవితాలనూ, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట! దాన్నిప్పుడు ప్రైవేట్ పెట్టు బడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట! దయ్యాలు వేదాలు వల్లించడమంటే అచ్చంగా ఇదే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేస్తున్నారు.ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజ కీయమో, ఎవరిది దయ్యాలు – భూతాల రాజకీయమో తేల్చడా నికి ఇంకో చర్చ కూడా ఉన్నది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించినది కాదు. ఎమ్మెల్యేలను గెలిపించిందీ ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి, ఎమ్మెల్యేలను ‘వైస్రాయ్’లో నిర్బంధించి, మీడియాతో కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసు కుని దొడ్డిదారిన అధికార పీఠమెక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవలసి వచ్చింది.అయినా తలొగ్గ కుండా జనంలోకి వెళ్లారు. అలవికాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చినవారా? దొడ్డి దారిన ప్రవేశించిన వారా?ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నాలుగో దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు. కాళ్లావేళ్లా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో 68 శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఆ తర్వాత తీరిగ్గా నాలుగు రోజుల సమయం తీసుకొని 81 శాతం పోలైనట్టు ప్రకటించింది. ఇది అసాధార ణమని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ) అనే సంస్థ వాదిస్తున్నది. గతంలో ఎన్నడూ ఈ తేడా ఒక శాతం కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5 శాతంగా నమోదైంది. ఈవీ ఎమ్ల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కార ణమని వీఎఫ్‌డీ ఆరోపిస్తున్నది. ఎన్డీఏ మౌత్‌పీస్‌గా పనిచేసే ఓ జాతీయ చానల్ కూడా నిన్న ప్రసారం చేసిన ఒక సర్వే వివరాల్లో చంద్రబాబుకు 44 శాతం ప్రజల మద్దతున్నట్టు తేల్చింది. కూటమికి పడిన 56 శాతం ఓట్లలో ఇది 12 శాతం కోత. వీఎఫ్‌డీ చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్ సరిపోతున్నది.వీఎఫ్‌డీ ఈ వ్యవహారంపై ఒక సమగ్రమైన రిపోర్టును విడుదల చేసి, నెలరోజులు దాటినా ఇప్పటివరకూ ఎన్నికలసంఘం స్పందించలేదు. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కార ణంగా కేంద్రంలోనూ, ఏపీ, ఒడిషాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకూ, లెక్కించిన ఓట్లకూ కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలయినట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లలో దయ్యాలు, భూతాలు దూరితేనే సాధ్యమవుతుంది.ఆ దయ్యాలూ, భూతాలు ఎట్లా దూరాయన్న రహస్యం విజేతలకు మాత్రమే తెలుస్తుంది.వారికి అనుబంధంగా పని చేసిన ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు, అనుమానం ఉన్న నియో జకవర్గాల్లో 5 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతున్నది. ఈవీఎమ్‌లపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అను మానాలకు తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈఅంశంపై నోటికి తాళం వేసుకున్నది. కచ్చితంగా ఏదో జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎమ్‌ల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలూ, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీట్ పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగు తున్నాయి.vardhelli1959@gmail.comవర్దెల్లిమురళి -
అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి: వైఎస్ జగన్
అనకాపల్లి, సాక్షి: అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అచ్యుతాపురం ఘటన బాధాకరం. ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హోం మంత్రి పర్యవేక్షణకు వెళుతున్నాను అన్న మాటే లేదు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు. ఎంత మంది చనిపోయారో తెలియదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం కనిపించింది. కలెక్టర్ కమిషనర్ ఎప్పుడు వెళ్లారనేది చాలా బాధ కలిగించే విషయం. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారు... ఇలాంటి ఘటనే మా హయాంలో జరిగింది. అదీ కోవిడ్ సమయంలో. ఎల్జీ పాలీమర్స్ ఘటనలో 24 గంటల్లోపే పరిహారం ఇప్పించాం. కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదే. అప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు. నేనే ఉదయం 11 గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లాను. గంట్లలోనే రూ.30 కోట్లు పరిహారం సొమ్ము పంపించాం. గతంలో ఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలా స్పందించలేదు. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోంది. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలి. .. పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలి. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇప్పటివరకు ఒక రూపాయి ముట్టలేదు. ఇవ్వాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోండి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేను వచ్చి స్వయంగా ధర్నా చేస్తాను. బాధితులకు అండగా ఉంటాను... చంద్రబాబు ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయాను. ఇష్యూను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రభుత్వం అనేది బాధ్యతతో వ్యవహరించాలి. పరిశ్రమలపై పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్‌పార్టీ కంపెనీలు అడిట్లు, సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. కానీ, గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయడం మానేశారు. సూపర్ పిక్స్ అమల మీద వీరి దృష్టి లేదు. వీళ్ల ధ్యాస అంతా రెడ్ బుక్ అమలుపైనే. రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ.. ఇలాంటి వాటి మీద పెట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవికావు. కార్మికులు చనిపోయేవారు కాదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోంది. .. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. ఇంటి వద్దకు వచ్చే పెన్షన్, ఉచిత రేషన్ ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడం లేదు. పిల్లలకు సంబంధించి ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడి కింద ఒక్క రూపాయి సాయం ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు. స్కూల్స్, ఆస్ప్రతులు, పరిశ్రమలు.. అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. కొట్టడం, చంపడం ఆస్తుల ధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వ పాలనలో కనిపిస్తుంది’’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Atchutapuram: ఒక్కరోజు ఆగినా బతికేది!
సాక్షి, కాకినాడ: సోదరుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన హారిక మరొక రోజు కాకినాడలోనే ఉండి ఉంటే మృత్యువు ఒడికి ఆమె చేరి ఉండేది కాదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన చర్లపల్లి హారిక (22) కథ ఎవరికైనా గుండెలు పిండేసే విధంగా ఉంటుంది.కడు పేదరికంలో పుట్టి చదువుల తల్లిగా ఎదిగి ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందిన హారిక కు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. సోదరుడు కూడా చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో తల్లి అన్నపూర్ణ, నానమ్మ సంరక్షణలో పెరిగింది.చక్కటి విద్యాభ్యాసంతో మెరిట్ విద్యార్థినిగా పేరు గడించింది. రాఖీ సందర్భంగా పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది , మరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యువు ఒడికి చేరింది. భవన శిధిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలిసి వేస్తుంది. -
YS Jagan: అచ్యుతాపురం సెజ్ బాధితులకు జగన్ పరామర్శ
అనకాపల్లి, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధితులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. శుక్రవారం ఉదయం అనకాపల్లికి వెళ్లిన ఆయన.. ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితుల వివరాలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న జగన్.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వాళ్లకు ధైర్యం చెప్పారు. అలాగే.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఆస్పత్రిలోనే 18 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. పోలీసుల ఓవరాక్షన్అంతకు ముందు.. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన అనకాపల్లి వెళ్తుండగా పోలీసులు అతి ప్రదర్శించారు. జగన్ కాన్వాయ్ వెంట వైఎస్సార్సీపీ నేతలెవరూ వెళ్లకుండా వాళ్ల వాహనాల్ని అడ్డుకున్నారు. ఆప్యాయ పలకరింపుజగన్ రాక సమాచారంతో విశాఖ ఎయిర్‌పోర్టుకు, అనకాపల్లిలోని ఆస్పత్రి వద్దకు భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్లందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఇక ఆస్పత్రిలో సిబ్బందిని పలకరించిన జగన్.. సిబ్బంది కోరడంతో సెల్ఫీలు కూడా దిగారు. జగన్ ఒత్తిడికి తలొగ్గి.. అచ్యుతాపురం బాధితుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఘటన జరిగిన వెంటనే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. జగన్‌తో పాటు బాధిత కుటుంబాల ఒత్తిడి మేరకు నిన్న సీఎం చంద్రబాబు కోటిరూపాయల పరిహారం ప్రకటన చేశారు. అలాగే బాధితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు రాగా.. విశాఖలోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తోంది ప్రభుత్వం. చంద్రబాబుది అనైతిక పాలన: వైఎస్ జగన్ -
పాలక పార్టీ తీరు బాధాకరం.. ఇంత నిర్లక్ష్యం తగదు: బొత్స
విశాఖపట్నం, సాక్షి: ‘‘ఒక్కరోజులో మా బతుకులు తలకిందులైపోయాయి. మా వాళ్ల శవాల్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. ప్రమాదం జరిగాక.. మా లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరూ వచ్చింది లేదు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నుంచి స్పందన లేదు’’ అంటూ అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధిత కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి.గురువారం వైఎస్సార్సీపీ నేతలు కింగ్ జార్జ్ ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాల ఆవేదన విని.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చలించిపోయారు. ‘‘అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం. కానీ, పాలక పార్టీ తీరు బాధాకరం. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఇంత నిర్లక్ష్యం తగదు. బాధితులకు భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఘటనకు బాధ్యులు అయిన యాజమాన్యం మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. .. సీఎం చంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదు?. మా పార్టీ డిమాండ్‌ను ఇప్పటికే అధినేత వైఎస్జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. మా ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్ ఘటనలో కోటి రూపాయల పరిహారం ఇచ్చింది. కానీ, ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఎన్ని కోట్లు ఇచ్చినా.. పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ, బాధిత కుటుంబాలకు పరిహారంతోనే ఆదుకోవాలి. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదు. రేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు’’ అని బొత్స తెలిపారు. -
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఘోర ప్రమాదం... ఎసైన్షియా ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్... 18 మంది దుర్మరణం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
ఏపీలో పెట్టుబడుల పరుగులు..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మరో రూ.1,624 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటనలో పలు ఐటీ, ఫార్మా కంపెనీల ప్రారం¿ోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఐజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 4,160 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక సీఎం సోమవారం ప్రారంభించే, భూమి పూజ నిర్వహించే యూనిట్ల వివరాలివీ.. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్.. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో ఇన్ఫోసిస్ ఒక కొత్త డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. సుమారు రూ.41 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ సెంటర్‌ను భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్ డిజైన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్ వర్క్‌ప్లేస్‌గా రూపొందించారు. దాదాపు వెయ్యిమంది ఈ సెంటర్ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, అధునాతన కేఫ్టేరియా, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో ఈ సెంటర్‌ను నిరి్మంచారు. దీని ప్రారంభోత్సవం అనంతరం ఇన్ఫోసిస్, వివిధ కంపెనీల ఐటీ ప్రతినిధులతో సీఎం సంభాషిస్తారు. . విశాఖలోని ఇన్ఫోసిస్ కార్యాలయం ఇజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఫార్మా, బయోటెక్ ఉత్పత్తులకు సంబంధించి రూ.300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిరి్మంచిన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఇజియా (ఈయూఐజీఐఏ) యూనిట్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ.421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిరి్మంచిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు. దీని ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఇదే కంపెనీ మరో 15 ఎకరాల్లో రూ.407.40 కోట్లతో ఏర్పాటుచేసే యూనిట్ నిర్మాణ పనులకు కూడా సీఎం భూమిపూజ చేస్తారు. విశాఖపట్నంలోని రిషికొండలో ఐటీ సెజ్ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్.. ఇక అచ్యుతాపురం ఏపీ సెజ్‌లోని లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్–2 ఫార్ములేషన్ బ్లాక్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రూ.460 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ యూనిట్ ద్వారా 1,200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీంతోపాటు రూ.407.40 కోట్లతో లారస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమకు కూడా సీఎం భూమిపూజ చేస్తారు. బీచ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ కొనుగోలు చేసిన ప్రత్యేక వాహనాల్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఇలా.. సోమవారం ఉదయం ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం హెలికాప్టర్లో అనకాపల్లి జిల్లా పరవాడకు చేరుకుంటారు. రాంకీ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఇజియా (ఈయూఐజీఐఏ) స్టెరిలీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నూతన యూనిట్‌ను ప్రారంభిస్తారు. ►అక్కడి నుంచి హెలికాప్టర్లో అచ్యుతాపురం సెజ్‌కు చేరుకుని లారెస్ ఫార్మా ల్యాబ్‌లో యూనిట్–2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్పీఎల్ యూనిట్–2ని ప్రారంభిస్తారు. ►హెలికాప్టర్ ద్వారా విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడకు బయల్దేరతారు. ►ఈ నేపథ్యంలో.. మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా అధికారులతో కలిసి ఆదివారం రుషికొండ ఐటీ సెజ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. బీచ్ యంత్రాలు ప్రారంభించే ప్రాంతంతో పాటు హెలిప్యాడ్‌ను సందర్శించిన మంత్రి.. అక్కడి ఏర్పాట్లు గురించి ఆరా తీశారు. -
మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడని పారిశ్రామికవేత్తలు తాను సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాన్ని గుర్తించే గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభిస్తోందన్నారు. పరిశ్రమలకు ఎలాంటి సహాయం, సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వాలు బకాయిపడ్డ వివిధ ప్రోత్సాహకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని గుర్తు చేశారు. వచ్చే నెలలో విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా నెలకొల్పిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) మొదటి దశ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి టైర్‌పై సంతకం చేసిన అనంతరం రెండో దశ ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మరో 8 పరిశ్రమలకు కూడా సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అనంతరం ఇటీవల వివాహం జరిగిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడు సూర్య, లక్ష్మీ సౌందర్యరాశి దంపతులను మర్రిపాలెంలోని వారి స్వగృహంలో సీఎం జగన్ ఆశీర్వదించారు. ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... 15 నెలల వ్యవధిలోనే ఉత్పత్తి ఆరంభం ప్రపంచంలో టాప్ 5–6 స్థానాల్లో ఉన్న జపాన్ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరం. రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుకు 2020 సెప్టెంబరులో మన దగ్గరకు వచ్చారు. అక్కడనుంచి చకచకా అన్ని రకాలుగా తోడ్పాటు అందించాం. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కాగా కేవలం 15 నెలల వ్యవధిలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తి దశలోకి వచ్చింది. మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకోవడంతో రెండో దశకు కూడా నాంది పలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు రెండో దశ ప్లాంట్‌కు శంకుస్ధాపన జరుగుతోంది. రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగస్టు 2023లోగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. తొలిదశలో రూ.1250 కోట్లతో దాదాపు 1,200 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2,000 మందికి ఉపాధి ఇక్కడే అందుబాటులోకి వస్తుంది. భరోసా కల్పించే బాధ్యత మనదే.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా అక్కడ మన యువతకు మెరుగైన ఉద్యోగాలు లభించడం చాలా అవసరం. ఆ ప్రాంతంలో చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు ఇప్పించగలిగితే పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా చేయాల్సినవన్నీ చేస్తూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైనా పరిశ్రమ ఏర్పాటైతే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశాం. మనవైపు నుంచి కూడా వారికి సహాయ, సహకారాలు అందాలి. ఎవరైనా ఏపీకి రావడానికి సంతోషపడాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే గొడవ పడకుండా పరిష్కరించుకునేలా అడుగులు వేయాలి. అప్పుడే ఆ పారిశ్రామికవేత్తలకు నమ్మకం, విశ్వాసం పెరిగి పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. తద్వారా మన యువతకు పుష్కలంగా ఉద్యోగాలు లభిస్తాయి. మనవాళ్లు చాలా మంచివాళ్లు.. బాగా కష్టపడి పనిచేస్తారు... ఎటువంటి సమస్యలూ సృష్టించరు.. అని పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగితే రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి. ఆ బాధ్యత మన భుజాలపైనే ఉంది. రానున్న రెండేళ్లల్లో మరో 1.64 లక్షల ఉద్యోగాలు ఈ మూడేళ్ల వ్యవధిలోనే అతి భారీ, భారీ పరిశ్రమల విభాగంలో 98 పరిశ్రమలు రూ.39,350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 60,541 మందికి గత మూడేళ్లలో ఉద్యోగాలు లభించాయి. ఇదే సమయంలో మరో 31,671 ఎంఎస్ఎంఈలు రూ.8,285 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా మరో 1,98,521 మందికి ఉద్యోగాలు లభించాయి. రాబోయే ఒకటి రెండేళ్లలో మరో 56 అతి భారీ, భారీ పరిశ్రమలు దాదాపు రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా మరో 1,64,155 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. పారిశ్రామికవేత్తల ఓటుతో నంబర్ వన్‌గా.. ఇవాళ రాష్ట్రంలో పారిశ్రామిక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నాం. తొలిసారిగా ఈదఫా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్టిఫికేషన్ తీరు కూడా మార్చారు. ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఇస్తున్నారు. అలా నిబంధనలు మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్ 1 ర్యాంకు సాధిస్తోంది. ప్రతి అడుగులోనూ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. పాత బకాయిలు పిలిచి మరీ చెల్లించాం.. గతంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. చిన్న పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితుల్లో కూరుకుపోయాయి. రాష్ట్రంలో దాదాపు లక్షకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉండగా పది లక్షల మందికి పైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకుని మరీ పాత బకాయిలను చెల్లించడంతోపాటు ఏటా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. చేయి పట్టుకుని ప్రోత్సహిస్తూ ఈ మూడేళ్లలో రూ.1,463 కోట్లు ఎంఎస్ఎంఈలకు ఇచ్చాం. ఇలా ప్రభుత్వం ప్రతి దశలోనూ ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తోంది కాబట్టే 2021–22లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు 11.43 శాతం సాధించాం. దేశంలో చూస్తే అది కేవలం 8.9 శాతమే ఉంది. దేశంతో పోలిస్తే రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. పది శాతం ఎగుమతులే లక్ష్యం... ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా నాలుగు కొత్త పోర్టులతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. తద్వారా ఎగుమతుల్లో రాష్ట్ర వాటా భారీగా పెరగనుంది. 2021–22లో రాష్ట్ర ఎగుమతుల విలువ 19.3 బిలియ¯న్ డాలర్లు ఉంది. మొత్తం దేశం ఎగుమతుల్లో ఇది 4.58 శాతం. ఈ పోర్టులు పూర్తైన తరువాత ఏపీ నుంచి ఎగుమతులు 10 శాతానికి పెంచేలా అడుగులు వేస్తున్నాం. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3 పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలోనే ఏర్పాటవుతున్నాయి. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్ – బెంగళూరు కారిడార్లున్న రాష్ట్రం ఏపీ మాత్రమే. గతంలో మన రాష్ట్రం వైపు చూడని వారు కూడా ఇప్పుడు మనవైపు చూస్తున్నారు. మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. గతంలో సెంచరీ ఫ్లైవుడ్ బజాంకాల పేరు విన్నారా? ఈరోజు బజాంకాలు వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచరీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. బంగూర్ల పేరు గతంలో విన్నారా? ఎప్పుడూ రాష్ట్రంవైపు చూడని వారు ఇవాళ రాష్ట్రంలో శ్రీసిమెంట్స్ ఫ్యాక్టరీని స్థాపిస్తున్నారు. ఆదిత్యా బిర్లా ఏపీకి వచ్చి వారి ప్లాంట్‌ను ప్రారంభించడం గతంలో చూశారా? ఈరోజు ఆదిత్య బిర్లా మన రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వారి ప్లాంట్‌ను ప్రారంభించారు. గతంలో అదానీ.. అదానీ అని పేరుకు మాత్రమే అనేవారు. అదానీ సంస్ధ గతంలో ఏపీలో ఎప్పుడూ అడుగులు ముందుకు వేయలేదు. జగన్ సీఎం అయిన తర్వాతే అదానీలు ముందడుగు వేశారు. ప్రతి పెద్ద పరిశ్రమకు చెందిన వారంతా ఏపీవైపు చూసేలా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెబుతున్నాం. మీరు పరిశ్రమ స్థాపించండి.. అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఏపీలో తొలి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు తమ సంస్థ మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ఏపీలోనే చేపట్టామని ఏటీసీ సీవోవో అనిల్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందుతున్నాయని ధన్యవాదాలు తెలియచేశారు. అధికారులు ఫోన్ చేసి మరీ మీకు లైసెన్స్ మంజూరైందని తెలియచేశారని చెప్పారు. సీఎం జగన్‌ను యువత ఎంతో అభిమానిస్తోందన్నారు. వచ్చే ఏడాది తమ ప్లాంట్ రెండో దశ ప్రారంభానికి రా>వాలని సీఎంను ఆహ్వానించారు. నూతన ప్లాంట్‌తో లక్ష్యాన్ని సాధిస్తాం ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, అందుకు అచ్యుతాపురం ప్లాంట్ ఎంతో దోహదం చేస్తుందని ఏటీసీ సీఈవో నితిన్ పేర్కొన్నారు. మొదటి దశ ప్లాంట్‌లో రోజుకు 69 టన్నుల రబ్బర్ వినియోగిస్తున్నామని, రెండో దశ ప్లాంట్ పూరైత్తే 132 టన్నులకు చేరుకుంటుందని తెలిపారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఏపీకి మరిన్ని జపాన్ కంపెనీలు! పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తామని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టాగా మషయూకి వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చదవండి: కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్‌కు ఆహ్వానం -
అచ్యుతాపురంసెజ్‌కు పారిశ్రామిక శోభ.. 16వ తేదీన 16 పరిశ్రమలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోంది. వైఎస్ జగన్ సర్కారు చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో భారీ, మధ్య తరహా, చిన్న పరిశ్రమలు అనేకం వస్తున్నాయి. తద్వారా భారీగా పెట్టుబడులు రావడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కూడా లభిస్తోంది. అదే ఒరవడిలో విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఈ నెల 16న మూడు భారీ పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభంతోపాటు మరో 13 పరిశ్రమలకు భూమి పూజ జరగనుంది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీతో పాటు ఫార్మా, ఇథనాల్ యూనిట్లు ఉత్పత్తికి సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏటీసీ టైర్ల యూనిట్‌ను 16న ప్రారంభించనున్నారు. ఇదే సందర్భంలో మిగతా రెండు యూనిట్లలో ఉత్పత్తితోపాటు మిగతా పరిశ్రమల భూమిపూజకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏటీసీ టైర్స్ రూ.2,350 కోట్లతో హాఫ్ హైవే టైర్ల తయారీ పరిశ్రమను అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసింది. సుమారు రూ.1,152 కోట్ల పెట్టుబడులతో తొలిదశ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమైంది. అలాగే రూ.60 కోట్లతో ఫార్మాసూటికల్, రూ.84 కోట్లతో బయోఫ్యూయల్ ప్లాంట్ కూడా నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు యూనిట్ల ద్వారా రూ.1,295.39 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడంతో పాటు 1,974 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇదే సెజ్‌లో ఏర్పాటవుతున్న వివిధ రంగాలకు చెందిన మరో 13 యూనిట్ల ద్వారా రూ.1,132.34 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. 3,686 మందికి ఉపాధి లభించనుంది. బల్క్ డ్రగ్స్, పండ్ల ప్రాసెసింగ్ యూనిట్, పారిశ్రామిక ఆక్సిజన్ తయారీ, ఫెర్రో అల్లాయిస్ వంటి కంపెనీలు వీటిలో ఉన్నాయి. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అచ్యుతాపురంలో 1,900 ఎకరాల్లో ఏపీ సెజ్ పేరుతో ఈ పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సెజ్‌లో 20కిపైగా యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.5,000 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతోంది. చదవండి: మార్పును పట్టుకుందాం.. -
గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫ్యాక్టరీ తెరవకూడదని ఆదేశించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకైన ఘటనపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గతంలో జరిగిన విష వాయువు లీకేజీపై విచారణ జరుగుతుండగా మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. జరిగిన ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. విషవాయువు లీకేజీ సంఘటనలో గాయపడిన బాధితులను ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చదవండి: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీక్ సీడ్స్ యూనిట్లో 121 మంది అస్వస్థతకు గురైనట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని అయిదు ఆసుపత్రుల్లో జాయిన్ చేశామని, బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. జరిగిన ప్రమాదంపై నమూనాలను ఐసీఎమ్ఆర్కు పంపుతున్నట్లు చెప్పారు. జరిగిన తప్పు పునరావృతం కాకుండా సీడ్స్ కంపెనీ చూసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుత ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిశ్రమలు అన్నింటిపైన సేఫ్టీ అడిట్ జరుగుతుందని వెల్లడించారు. రెండు నెలల క్రితం ఇదే కంపెనీలో ప్రమాదం జరిగిందని గుర్తుచేసిన మంత్రి దీనిపై కమిటీ వేశామని, ఇంకా విచారణ జరుగుతుందన్నారు. గత ప్రమాదంలో క్లోరిఫైపాలిష్ అనే రసాయనాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, దీనిపై సీడ్స్ కంపెనీకి నోటీసులు కూడా జారీ చేశామన్నారు. -
అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీక్
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువులు లీకై బ్రాండిక్స్ సీడ్స్–2 కంపెనీలో పనిచేసే 100 మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రెండో షిఫ్ట్‌లో సుమారు 2 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు టీ బ్రేక్ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో ఉద్యోగినులకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. వాంతులు, వికారంతో అనేకమంది స్పృహ తప్పి పడిపోయారు. అక్కడి వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. 45 మందిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. మిగతా ప్లాంట్లలో సిబ్బందిని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించండి: మంత్రి అమర్నాథ్ అచ్యుతాపురం ఘటనపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నా«థ్ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టితో మాట్లాడారు. గ్యాస్ లీక్‌కు కారణాలను తెలుసుకున్నారు. తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: విశాఖ తీరంలో అరుదైన జీవి.. రాలిన ఆకులా చదునైన శరీరం, ఇదే ప్రత్యేకత -
సముద్రంలో మత్స్యకారుడి గల్లంతు
అచ్యుతాపురం (విశాఖపట్నం) : సముద్రంలో దరివేటకు వెళ్లిన యువకుడు పడవ బోల్తా కొట్టి గల్లంతయ్యాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటాలయ్య(21) వేటకు వెళ్లి పడవ బోల్తా కొట్టడంతో గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన తోటి జాలరులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మూడు గంటల్లో పెళ్లి: పెళ్లికొడుకు పరార్
అచ్యుతాపురం (విశాఖపట్నం) : మూడు ముళ్లు వేయడానికి మూడు గంటల ముందు పెళ్లి కొడుకు పరారైన ఘటన విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో గురువారం చోటుచూసింది. మండలంలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన రాము నాయుడు(27).. మాటూరుకు చెందిన ఓ యువతి(20)ని ప్రేమించాడు. ఏడాదిపాటు సజావుగా సాగిన వీరి ప్రేమయణం చివరకు పెళ్లి పీటల వరకు వెళ్లింది. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సమక్షంలో పెళ్లి జరపనున్నట్లు అందరికి పెళ్లి పత్రికలు పంచారు. ఈ క్రమంలో గురువారం మరి కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పెళ్లి కూతురు తల్లి వద్ద వేయి రూపాయలు తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆడపెళ్లి వారు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గతంలో ఈ పెళ్లిని పెద్దలు నిరాకరించడంతో యువకుడే ప్రాధేయపడి మరీ యువతి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించడం కొసమెరుపు. -
750 లీటర్ల నాటుసారా స్వాధీనం
అచ్యుతాపురం (విశాఖపట్నం జిల్లా) : అచ్యుతాపురం మండలం పూడిమడకలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 750 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేట సాగిస్తూ మత్స్యకారుడు హఠాన్మరణం
అచ్యుతాపురం (విశాఖ జిల్లా) : వేట సమయంలో గుండెపోటు రావడంతో ఓ మత్స్యకారుడు సముద్రంలోనే హఠాన్మరణం చెందాడు. విశాఖ జిల్లా పూడిమడకకు చెందిన వాసుపల్లి నూకరాజు (40) తోటి మత్స్యకారులతో కలసి వేటకు వెళ్లాడు. గుండెపాటు రావడంతో పడవలోనే కుప్పకూలిపోయాడు. దీంతో తోటి మత్స్యకారులు మంగళవారం పూడిమడక తీరానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. -
విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
హత్య చేయడం తప్పుకాదట.. వీడియో తీయడం తప్పా!
హత్య చేయడం తప్పు కాదు గానీ, ఆ హత్య చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడితే, దాన్ని వీడియో తీయడం తప్పని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్-8 అనేది ఒక అంశం మాత్రమేనని, కానీ తాను తప్పు చేసిన తర్వాత చంద్రబాబుకు ఆ సెక్షన్ గురించి గుర్తుకొచ్చినట్లుందని ఆయన అన్నారు. విశాఖజిల్లా అచ్యుతాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని వెళ్తూ మార్గం మధ్యలో నక్కపల్లి వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగారు. పాయకరావుపేట నియోజవకర్గ సమస్యలపై పార్టీ నేతలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు ఇచ్చిన వినతిపత్రాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే... రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్న ఏకైక పార్టీ మాదే రాష్ట్ర విభజనలో చంద్రబాబు పాలు పంచుకున్నారు రాష్ట్రాన్ని విభజించాలని పార్లమెంటులో ఆయన ఎంపీలందరూ సంతోషంగా చేతులు ఊపారు చంద్రబాబూ.. రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో మేం ఏ పార్టీకి మద్దతిస్తే నీకేంటి? పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలుచేయాలని కేంద్రాన్ని నాలుగుసార్లు కలిశాం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ చట్టంలోని సెక్షన్ -8పై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు లంచాలు తీసుకున్న డబ్బులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారు కరప్షన్ మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే -
నాలుగు రోజుల్లో ఇచ్చారో సరే.. లేకుంటే!
ధవళేశ్వరం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. 22 మంది చనిపోయినా వీళ్లను పరామర్శించేందుకు చంద్రబాబు రాలేదని, పోనీ వచ్చిన మంత్రి ఏదో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల పరిహారం ప్రకటించినా, ఇంతవరకు అందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన 22 మంది కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన ఏమన్నారంటే.. ఇప్పటికి ప్రమాదం సంభవించి 18 రోజులు అవుతున్నా, ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు, ఎందుకిలా మోసం చేస్తున్నారు? అప్పుడు మంత్రులు పబ్లిసిటీ కోసం వచ్చి సాయం ప్రకటించారు. పబ్లిసిటీ వచ్చే కార్యక్రమం ఉంటే చంద్రబాబు అక్కడికెళ్లి 5 లక్షలు అందిస్తారు. వీళ్లూ మనుషులే. వీళ్లూ బాధితులే.. కానీ 5 లక్షలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నాం వాళ్లకు ఇష్టం లేకుంటే తగ్గిస్తారు, లేకపోతే అది కూడా ఇవ్వరు 2 లక్షలు ప్రకటించినా.. ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదు ప్రభుత్వం దారుణంగా పనిచేస్తోంది. ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. మరో నాలుగు రోజుల్లో కుటుంబ సభ్యులకు సహాయం అందకపోతే ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తాం, కలెక్టరేట్లను ముట్టడిస్తాం. ఇక్కడకు రాబట్టి కనీసం వీళ్లకు సాయం చేయలేదని తెలిసింది. రోడ్లు సరిగా ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆ కుటుంబంలో మిగిలిన కుర్రాడు చెప్తున్నాడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్న ఏకైక పార్టీ మాది విభజనకు మొట్టమొదటిగా పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు ఓటేసి మద్దతు తెలిపారు ఆ రోజు చంద్రబాబుకు సిగ్గులేదు.. బుద్ధిలేదు రాష్ట్ర విభజనలో చంద్రబాబు పాలు పంచుకున్నారు రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో రాజకీయంగా మేము ఏ పార్టీకి మద్ధతు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు? రాజకీయం చేయడం కోసం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు ఏకంగా లంచాలు తీసుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు హత్యచేసిన ఒక వ్యక్తి పట్టుబడితే వీడియోలు తీయడం తప్పంటున్నారు..కానీ హత్య చేయడం తప్పు కాదంటున్నారు మనిషి జన్మలో పుట్టిన రాక్షసుడు చంద్రబాబు నాయుడు పునర్విభజన చట్టంను పూర్తిగా అమలు చేయాలని కేంద్రాన్ని నాలుగుసార్లు కలిశాం విభజన చట్టంలోని సెక్షన్-8 అనేది ఒక అంశం.. సెక్షన్-8 అమలు చంద్రబాబుకు తాను తప్పు చేశాక గుర్తొకొచ్చింది కరెప్షన్ మహారాజా ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే -
విశాఖలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన
-
విశాఖ జిల్లాలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్ : విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఆయన విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ చేరుకున్న ఆయన అచ్యుతాపురం బయల్దేరి వెళ్లారు. ఇటీవలి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 21మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ధవళేశ్వరం మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి అక్కడ నుంచి నేరుగా తుని చేరుకుంటారు. సముద్రంలో గల్లంతైన ఏడుగురు పెరుమాళ్లపురం, హుకుంపేట మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపట్నం, రామన్నపాలెంలో ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలను ఓదారుస్తారు. ఆరోజుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాకినాడలో బస చేస్తారు. జూలై 3న కాకినాడలోని పరాడపేట, ఉప్పలంక, పగడాలపేటలో ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలను ఓదారుస్తారు. అదేరోజు రంపచోడవరం నియోజకవర్గం వెళ్లి, అక్కడ సూరంపాలెం పెళ్లిబృందం ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు. అదేరోజు హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.