అచ్యుతాపురం (విశాఖపట్నం) : మూడు ముళ్లు వేయడానికి మూడు గంటల ముందు పెళ్లి కొడుకు పరారైన ఘటన విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో గురువారం చోటుచూసింది. మండలంలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన రాము నాయుడు(27).. మాటూరుకు చెందిన ఓ యువతి(20)ని ప్రేమించాడు. ఏడాదిపాటు సజావుగా సాగిన వీరి ప్రేమయణం చివరకు పెళ్లి పీటల వరకు వెళ్లింది. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సమక్షంలో పెళ్లి జరపనున్నట్లు అందరికి పెళ్లి పత్రికలు పంచారు.
ఈ క్రమంలో గురువారం మరి కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పెళ్లి కూతురు తల్లి వద్ద వేయి రూపాయలు తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆడపెళ్లి వారు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గతంలో ఈ పెళ్లిని పెద్దలు నిరాకరించడంతో యువకుడే ప్రాధేయపడి మరీ యువతి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించడం కొసమెరుపు.
మూడు గంటల్లో పెళ్లి: పెళ్లికొడుకు పరార్
Published Thu, Nov 26 2015 6:27 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM
Advertisement
Advertisement