సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మరో రూ.1,624 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటనలో పలు ఐటీ, ఫార్మా కంపెనీల ప్రారం¿ోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఐజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 4,160 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక సీఎం సోమవారం ప్రారంభించే, భూమి పూజ నిర్వహించే యూనిట్ల వివరాలివీ..
ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్..
విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో ఇన్ఫోసిస్ ఒక కొత్త డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. సుమారు రూ.41 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ సెంటర్‌ను భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఇది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్ డిజైన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్ వర్క్‌ప్లేస్‌గా రూపొందించారు. దాదాపు వెయ్యిమంది ఈ సెంటర్ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, అధునాతన కేఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో ఈ సెంటర్‌ను నిరి్మంచారు. దీని ప్రారంభోత్సవం అనంతరం ఇన్ఫోసిస్, వివిధ కంపెనీల ఐటీ ప్రతినిధులతో సీఎం సంభాషిస్తారు.
.
విశాఖలోని ఇన్ఫోసిస్ కార్యాలయం
ఇజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్..
ఫార్మా, బయోటెక్ ఉత్పత్తులకు సంబంధించి రూ.300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిరి్మంచిన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఇజియా (ఈయూఐజీఐఏ) యూనిట్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్..
యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ.421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిరి్మంచిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు. దీని ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఇదే కంపెనీ మరో 15 ఎకరాల్లో రూ.407.40 కోట్లతో ఏర్పాటుచేసే యూనిట్ నిర్మాణ పనులకు కూడా సీఎం భూమిపూజ చేస్తారు.
విశాఖపట్నంలోని రిషికొండలో ఐటీ సెజ్
లారస్ ల్యాబ్స్ లిమిటెడ్..
ఇక అచ్యుతాపురం ఏపీ సెజ్‌లోని లారస్ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్–2 ఫార్ములేషన్ బ్లాక్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రూ.460 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ యూనిట్ ద్వారా 1,200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీంతోపాటు రూ.407.40 కోట్లతో లారస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమకు కూడా సీఎం భూమిపూజ చేస్తారు. బీచ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ కొనుగోలు చేసిన ప్రత్యేక వాహనాల్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
సీఎం పర్యటన ఇలా..
సోమవారం ఉదయం ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం హెలికాప్టర్‌లో అనకాపల్లి జిల్లా పరవాడకు చేరుకుంటారు. రాంకీ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఇజియా (ఈయూఐజీఐఏ) స్టెరిలీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నూతన యూనిట్‌ను ప్రారంభిస్తారు.
►అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అచ్యుతాపురం సెజ్‌కు చేరుకుని లారెస్ ఫార్మా ల్యాబ్‌లో యూనిట్–2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్‌ఎస్పీఎల్ యూనిట్–2ని ప్రారంభిస్తారు.
►హెలికాప్టర్ ద్వారా విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడకు బయల్దేరతారు.
►ఈ నేపథ్యంలో.. మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా అధికారులతో కలిసి ఆదివారం రుషికొండ ఐటీ సెజ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. బీచ్ యంత్రాలు ప్రారంభించే ప్రాంతంతో పాటు హెలిప్యాడ్‌ను సందర్శించిన మంత్రి.. అక్కడి ఏర్పాట్లు గురించి ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment